సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1912వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయితండ్రి దయతో చేకూరిన ఆరోగ్యం
2. బాబాని తలుచుకుంటే ఏదైనా అవుతుంది

సాయితండ్రి దయతో చేకూరిన ఆరోగ్యం
 
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయిభక్తురాలిని. మాది కడప జిల్లా. మా నాన్నకి ప్రోస్టేట్ సమస్య ఉంది. దానితో సరిగా కూర్చోలేక, బైక్ నడపడానికి కూడా రాక చాలా ఇబ్బందిపడుతుండేవారు. హాస్పిటల్‌కి వెళితే డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చి తగ్గుతుందని చెప్పారు. కానీ డాక్టర్ ఇచ్చిన పవర్‌ఫుల్ యాంటీబయోటిక్స్ నాన్న తట్టుకోలేకపోయారు. ఆయనకి ఆకలి లేకపోవడం, కొంచెం తిన్నా వాంతి అవ్వడం, నరాలన్ని లాగుతూ ఉండటం జరుగుతుంటుండేది. వాటితో ఆయన అస్సలు నిద్రపోయేవారు కాదు. అప్పుడు మేము ఒక సమస్య తగ్గుతుందనుకుంటే ఇంకో సమస్య తోడైందని చాలా బాధపడ్డాం. ఇంతలో నాన్నకి పంటి సమస్య వచ్చింది. దానివలన ఆయన నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిపడ్డారు. డెంటల్ హాస్పిటల్‌కి వెళితే రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయాలని చెప్పి, రూట్ కెనాల్ చేసి ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఇచ్చారు. అవి కూడా ఎక్కువ పవర్ ఉన్నవి కావడం వల్ల, అదీకాక మునపటి టాబ్లెట్లు కూడా వాడుతుండటం వలన సమస్య ఇంకా ఎక్కువైంది. నాన్నకి గుండె దడ వచ్చి హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్లాల్సి వచ్చింది.  డాక్టరు నాన్నకి ఇంజెక్షన్స్ వేసి సాయంత్రం వరకు అక్కడే ఉండమన్నారు. ఆయన ఎందుకలా చెప్పారో మాకు తెలియక మేము చాలా టెన్షన్ పడ్డాం. మేమెంత భయపడ్డామో ఆ సాయితండ్రికి మాత్రమే తెలుసు. హాస్పిటల్లో ఉన్న ప్రతిక్షణం నేను, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అని జపిస్తూ, "ఏంటి సాయితండ్రి మాకు ఈ సమస్యలు? తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసుంటే క్షమించి నాన్నని ఈ అనారోగ్య సమస్యల నుండి కోలుకునేలా చూడు సాయీ" అని వేడుకున్నాను. చివరికి డాక్టర్ వచ్చి చెక్ చేసి, "ఇబ్బందేమీ లేదు. మీరు ఇంటికి వెళ్లొచ్చు" అని చెప్పారు. ఆ మాట వినగానే చాలా సంతోషపడి సాయితండ్రికి ధన్యవాదాలు తెలుపుకొని ఇంటికి వచ్చాము. కొద్దిరోజులు గడిచిన తర్వాత మేము తిరుపతి వెళ్ళాము. కారులో ఏసీ వేయడం వల్లనేమో అసలే ఎలర్జీ ఉన్న నాన్నకి ఇంటికొచ్చేసరికి దగ్గు మొదలైంది. ఆ రాత్రంతా నిమిషం కూడా గ్యాప్ లేకుండా నాన్న దగ్గుతూనే ఉన్నారు. ఆ సమయంలో హాస్పిటల్స్ మూసి ఉంటాయి. మాకు ఏం చేయాలో అర్థంకాక ఎంతో బాధపడ్డాము. దగ్గు ఎక్కువగా వచ్చిన ప్రతిసారీ నాన్న కళ్ళనుండి నీరు రావడం. కండరాలన్నీ పట్టేయడం జరుగుతుంటే నాన్న బాధను చూడలేక మాకు ప్రాణం పోయేంత బాధేసింది. "ఏంటి సాయితండ్రి మాకీ  సమస్యలు? ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఏమి తప్పు చేశాము తండ్రి? తెలిసీతెలియక చేసిన తప్పులుంటే క్షమించి చెడు కర్మలను తొలగించి నాన్నకు మంచి ఆరోగ్యానికి ప్రసాదించు తండ్రీ" అని బాబాను వేడుకున్నాను. నాకు తెలిసి నేను ఎప్పుడూ నాన్న ఒకరిని ఒక మాట అనడం, ఒకరి గురించి చెడుగా మాట్లాడటం చూడలేదు. అటువంటి మంచి వ్యక్తికి ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధేసింది. కానీ మనసులో 'సాయి ఉన్నారు. అంతా ఆయన చూసుకుంటార'న్న దృఢ నమ్మకం ఎప్పుడూ ఉంటుంది. కానీ పరిస్థితుల వల్ల మనశ్శాంతి కోల్పోయి బాధపడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో నేను ఎప్పుడూ సాయి నామాన్ని జపిస్తూ ఉంటాను. సరే, అసలు విషయానికి వస్తే మర్నాడు హాస్పిటల్‌కి వెళ్తే డాక్టర్ అన్ని చెక్ చేసి, "ఎలర్జీ ఎక్కువైంది. లంగ్స్ చాలా వీక్‌గా ఉన్నాయి" అని టాబ్లెట్లు, ఇంజక్షన్ ఇచ్చారు. డాక్టర్ అలా చెప్పినప్పటినుండి నేను సమస్యలు బాధలు తగ్గుతాయి అనుకుంటే ఇలా పెరుగుతున్నాయని మానసికంగా చాలా కృంగిపోయాను. నా బాధను సాయితండ్రికి చెప్పుకొని, "నాన్న ఆరోగ్యం మెరుగుపడేలా చూడమ"ని అనుకున్నాను. బాబా దయవల్ల ఒక మూడు నెలలు టాబ్లెట్లు వాడిన తర్వాత నాన్న ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చింది. ప్రస్తుతం నాన్నకి బాగుంది. ఇలా సాయితండ్రి మమ్మల్ని ఎన్నోసార్లు ఎన్నో సమస్యల నుండి గట్టెక్కించారు. సాయితండ్రి నాన్నకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని దృఢంగా విశ్వసిస్తున్నాను.

కొద్దిరోజులు ముందు అమ్మకు జలుబు చేసి ఏది తిన్నా, చివరికి తాగినా మింగడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ENT డాక్టర్ దగ్గరకి వెళితే ఆయన చెక్ చేసి "నాకు సంబంధించి ఎటువంటి సమస్య లేదు. ఒకసారి హార్ట్ డాక్టరుని కలవండి" అని చెప్పారు. సరేనని ఆ డాక్టరు దగ్గరకి వెళితే, ఆయన చెక్ చేసి "లంగ్స్ వీక్‌గా ఉన్నాయి. మింగేందుకు ఏ సమస్య లేద"ని టాబ్లెట్లు వ్రాసిచ్చారు. కానీ సమస్య తగ్గకపోవడంతో మళ్ళీ ENT డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. ఆయన ఈసారి "గ్యాస్టిక్ డాక్టర్ దగ్గరకి వెళ్లి ఎండోస్కోపీ చేయించుకొండి. ఏదైనా సమస్య ఉంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది" అన్నారు. దాంతో మా అమ్మ చాలా టెన్షన్ పడింది. ఎండోస్కోపి ఇదివరకు ఎప్పుడూ చేయించుకోలేదు, ఎలా చేస్తారో, ఏం చేస్తారో అని చాలా భయపడింది. నేను సాయితండ్రికి నా బాధ చెప్పుకొని, "అమ్మకి ఎటువంటి ఇబ్బంది లేదని డాక్టర్ చెప్పేలా ఆశీర్వదించండి బాబా" అని కోరుకున్నాను. ఎండోస్కోపీ చేసే సమయంలో నేను, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపిస్తూ గడిపాను. సాయితండ్రి మేము కోరుకున్నట్లే మమ్మల్ని అనుగ్రహించారు. డాక్టర్ ఎటువంటి ఇబ్బంది లేదని, టాబ్లెట్లు  వ్రాసిచ్చారు. అంతటితో సమస్య తగ్గి అమ్మ ఆరోగ్యంగా ఉంది. సాయితండ్రికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. "సాయితండ్రీ! అమ్మకు, నాన్నకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు. నీ అనుగ్రహం మా కుటుంబంపై ఎల్లవేళలా ఉంచి మమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తావని విశ్వసిస్తున్నాను తండ్రీ".

బాబాని తలుచుకుంటే ఏదైనా అవుతుంది

ముందుగా అందరికీ వందనాలు. నా పేరు గురుప్రసాద్. నేను ఆస్ట్రేలియాలో ఉంటున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను నా స్నేహితునికి కొంత డబ్బు ఇచ్చాను. నాకు చాలా అవసరమై 4 నెలల నుండి ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడుగుతుంటే,.నేను కాల్ చేసినా ప్రతిసారీ తను ఇస్తానని చెప్తుండేవాడు కానీ, ఇచ్చేవాడు కాదు. డబ్బు ఇచ్చి, మన అవసరానికి అడిగితే ఇలా చేస్తున్నారని నాకు చాలా బాధేసి, "బాబా! మీరే ఏదో విధంగా తన నుండి నా డబ్బు నాకు వచ్చేలా చేయండి" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా దయవల్ల 2024, సెప్టెంబర్ 1న తను నా డబ్బు నాకు పంపండి. బాబాని తలుచుకుంటే ఏదైనా అవుతుంది. "బాబా! మీకు ఋణపడి ఉంటాను. దయతో నా ఆఫీస్‌వాళ్ళు నాకు PR నామినేట్ వేసేలా చూడండి బాబా".

14 comments:

  1. Om Sairam!!! Andarini meere kapadali thandri. Nenu meeku sarvasya saranagathi ayyela ashirvadinchandi thandri. Om sai sri sai jaya jaya sai!!

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om sai ram, anni vishayallo anta bagunde la chayandi tandri pls.

    ReplyDelete
  7. ఓం సాయిరామ్

    ReplyDelete
  8. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl rent ki ippinchsndi

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. Sai Baba with your blessings 🙏😄 we got visa.Thank you Sai tandri.Before 10 years i applied for visa.At that time my brother sponsored to see my father.Who is bed ridden.His both legs are amputeded .At that time my bad period started.my visa was rejected.i am elder daughter.He want to see me.In that time no video call to watch him.i suffered from depression.After 15 years with Baba's blessings I got visa.My husband gave interview .They issued visa.i felt very happy.Om Sai Ram

    ReplyDelete
  11. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  12. Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha

    ReplyDelete
  13. Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo