ఈ భాగంలో అనుభవం:
- బాధ వెనకాల బాబా ఇచ్చిన సంతోషం
నేను కొన్ని సంవత్సరాల నుంచి బాబా భక్తురాలిని. నేను నా జీవితంలోని ప్రతి విషయంలో బాబా నాకు తోడు ఉన్నారని నమ్ముతూ ఉంటాను. ఒక్కోసారి కోపంలో, బాధలో ఆయన్ని మర్చిపోతాను. కానీ బాబా మాత్రం నన్ను మర్చిపోరని నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఆయన దయగల దేవుడు కదా! నాకు ఎప్పటినుంచో శిరిడీ వెళ్లి బాబాని దర్శించాలని కోరికగా ఉన్నందున 2024లో దగ్గరలో ఒక వారాంతంలో నా పుట్టినరోజు ఉందనగా నా పుట్టినరోజుకి బాబా దగ్గరికి వెళ్ళాలి, ప్రశాంతంగా ఉండాలనిపించింది. ఎందుకంటే, నేను నా జీవితంలో ఎవరికీ చెప్పుకోలేని కొన్ని సమస్యలతో బాధపడుతున్నాను. అందుచేత శిరిడీ వెళ్తే కొంచెం ప్రశాంతత దొరుకుతుందేమోనని అనుకున్నాను. కానీ ఇంట్లో శిరిడీ వెళదామని అడిగితే, "అన్ని బాగున్నాక వెళ్దాం" అన్నారు. అప్పుడు నేను ఇంకా ఇలా కాదని మా చెల్లి(మా బాబాయ్ కూతురు)తో మాట్లాడి ఇంట్లో చెప్పకుండా తను, నేను కలిసి నా పుట్టినరోజుకి శిరిడీ వెళ్లాలనుకున్నాం. మా శిరిడీ ప్రయాణానికి ఇంకో రెండు వారాలు ఉందనగా మా తమ్ముడు నాకు ఫోన్ చేసి, "వచ్చే వారాంతంలో శిరిడీ వెళ్దాం. హైదరాబాద్ వస్తావా?" అని అన్నాడు. నేను తనతో, "ఎవరికీ చెప్పకుండా నేను, చెల్లి వెళదామనుకున్నాము. హఠాత్తుగా నువ్వు కూడా శిరిడీ వెళదామని అడుగుతున్నావు. సరే వెళ్దాం కానీ, వచ్చే వారంతో కాకుండా ఆ మరుసటి వారాంతంలో ఉన్న నా పుట్టినరోజు సమయానికి వెళ్దామ"ని అన్నాను. కానీ తను తన భార్యకి ఆ వారం కుదరదన్నాడు. నేను ఇంకా బాబా దగ్గరకి వెళ్లి, 'అవకాశం రావడమే అదృష్టం. ఎప్పుడు అయితే ఏంటి? నాకు ఇలా వ్రాసి ఉందేమో!' అని అనుకున్నాను. ఇంకా తమ్ముడువాళ్ళు ఈ వారాంతంలో, మరుసటి వారాంతంలో నేను, చెల్లి వెళ్తే బాగోదు. ముఖ్యంగా తమ్ముడు అడిగాక కాదంటే బాగోదని తనతో సరేనన్నాను. ఐతే మర్నాడు తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసి, "సరే, మరుసటి వారాంతంలో నీ పుట్టినరోజుకు వెళ్దాం లే" అని చెప్పి, "నీ మరదలువాళ్ళ తల్లిదండ్రులు కూడా వస్తార"ని అన్నాడు. అంతే, అది వింటూనే నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే, వాళ్ళ తల్లిదండ్రులతో వెళ్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాళ్లు అందరూ ఒక్కటిగా ఉంటే నాకు ఒంటరిగా ఉన్నట్టు ఉంటుందనిపించి తమ్ముడుతో నేను రానని చెప్పేసాను. తర్వాత, "నా పుట్టినరోజుకి మీ దగ్గరకు రావాలని ఆశపడితే ఎందుకు బాబా ఇంత ఏడిపిస్తున్నావు?" అని బాగా ఏడ్చాను. ఆ తర్వాత నేను వెళ్లి మా అమ్మవాళ్ళని, "మరదలువాళ్ల తల్లిదండ్రులు వస్తున్నారు అంట. మీరూ రండి. అందరం కలిసి శిరిడీ వెళ్తే నాకు బాగుంటుంద"ని అడిగాను. కానీ మా అమ్మ, "మేము రాములే, నువ్వు వెళ్ళు" అంది. నాకు మరింత ఏడుపొచ్చి, "సరే నేనూ వెళ్ళను" అని అనేసి, "ఎందుకు బాబా ఇలా చేసావు? నేనిప్పుడు వాళ్లతో పోకుండా వేరుగా వెళ్తే బాగోదు. అలాగని వాళ్లతో వెళ్తే, ఏ సంతోషం కోసం, మనశాంతికోసం రావాలనుకుంటున్నానో అది నాకు అక్కడ దొరకదు. కాబట్టి ఇంకా బాధపడతానేమో!" అని బాగా ఏడ్చాను. తర్వాత మా తమ్ముడు, డాడీలను అడిగాను. అయితే వాళ్లు కూడా శిరిడీ రావడానికి ఒప్పుకోకుండా రామన్నారు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్తూ మా డాడీవాళ్లతో, "నాకోసం ఏదైనా చేస్తాను అన్నారుగా, శిరిడీకి రండి" అని ఆంటే మా డాడీ, "చూద్దాంలే" అన్నారు. నేను హైదరాబాద్ వెళ్ళిపోయాక నా పుట్టినరోజు వారంలో ఉందనగా హఠాత్తుగా మా డాడీ నాకు కాల్ చేసారు. అప్పుడు నేను మళ్ళీ అడిగితే, సరే వస్తామన్నారు. వెంటనే అందరికీ బస్సు టికెట్లు బుక్ చేసి మా చెల్లితో, "మన ఇద్దరమే కాదు. మా వాళ్ళందరూ శిరిడీ వస్తున్నారు" అని చెప్పాను. తను, 'అందరూ వస్తే నేను ఒక్కదాన్నే ఉన్నట్టు ఉంటుంద'ని వాళ్ళ తల్లిదండ్రులను కూడా రమ్మని అడిగింది. వాళ్ళు సరేనని మాకన్నా ఒకరోజు ముందు ట్రైన్‌లో శిరిడీ చేరుకున్నారు. మేము మరుసటిరోజు వెళ్లి వాళ్ళని కలుసుకున్నాం. అంతమంది మధ్య ఎంతో సంతోషంగా నా పుట్టినరోజు చేసుకున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. నా జీవితంలో ఏ పుట్టినరోజూ ఇలా జరపుకోలేదు. అన్నిటికీ మించిన సంతోషం ఏమిటంటే, నేను మొదటిసారి నా పుట్టినరోజుకి శిరిడీ వెళ్లి, బాబా సన్నిధిలో పుట్టినరోజు జరుపుకున్నాను. ఇదంతా బాబా నాకు ఇచ్చిన సంతోషం. ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. బాబాకి నా మీద ఇంత ప్రేమ ఉందా అని నా సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. నేను 'నాకు ఎందుకు ఇంత బాధనిచ్చావు బాబా?' అని ఏడ్చాను గానీ, ఆ బాధ వెనకాల బాబా నాకు ఇంత సంతోషాన్ని ఇవ్వాలనుకున్నారని అనుకోలేదు. నా మరదలువాళ్ళ తల్లిదండ్రులు రాకపోతే మా డాడీవాళ్లు వచ్చే వాళ్ళు కాదు, మా డాడీవాళ్లు రాకపోతే మా పిన్నివాళ్ళు వచ్చే వాళ్ళు కాదు. బాబా నాకోసం ఒకరి వెనక ఒకరిని కలిపి మరీ అందరినీ శిరిడీకి రప్పించారని నాకనిపిచింది. మా డాడీ అయితే "నువ్వు ఒక్కదానివే వెళ్లాలనుకున్నావు. కానీ కుటుంబంలో అందరినీ నీ పుట్టినరోజుకి శిరిడీ తీసుకొచ్చారు బాబా" అన్నారు. నేను ఆయనతో "అవును, ఇదంతా బాబానే చేశార"ని చెప్పాను.
ఇప్పుడు ఇది వ్రాస్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంతకు మించి ఎవరికైనా ఏం కావాలనిపిస్తుంది. "థాంక్యూ సో మచ్ బాబా. నా ఈ పుట్టినరోజుని నా జీటివితంలో అత్యంత గుర్తుంచుకో దగ్గ రోజుగా మార్చేశారు మీరు. ఎప్పుడూ నాతోనే ఉండండి బాబా. మీరు నాతో లేకుంటే నేను లేనట్టే బాబా. మీరే నాకు అన్ని బాబా.
ఇంతకుమించి ఏం చెప్పలేను. ఎంతో చెప్పాలని ఉంది కానీ సంతోషం వల్ల నాకు మాటలు రావట్లేదు".
తరువాత మేము తిరుపతి వెళ్ళాలనుకొని రెండు నెలల ముందు మా అమ్మ, నాన్న, తమ్ముడు మరదలు, తన తల్లిదండ్రులకి దర్శనం టిక్కెట్లు బుక్ చేసాము. తీరా తిరుపతి వెళ్ళే సమయం దగ్గరకు వస్తూండేసరికి మా పిన్ని, బాబాయ్ కూడా మాతో వస్తామని చెప్పారు. కానీ టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వాళ్ళు వస్తారని మాకు తెలియక మేము వాళ్ళని అడగకుండా మాకు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసినందువల్ల వాళ్ళకి టికెట్లు లేవు. అయినా వాళ్ళు మాతోపాటు వచ్చి, ఉచిత దర్శనానికి వెళతామని అన్నారు. దాంతో అందరం కలిసి రెండు కార్లలో వెళదామని నిర్ణయించుకున్నాము. అయితే మా ప్రయాణానికి కొన్నిరోజుల ముందు నుంచి బాగా వానలు పడుతుండటంతో నేను బాబాని, "దూర ప్రయాణమవుతున్నాము. ఏ సమస్య లేకుండా తిరుపతి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చేలా చేయండి బాబా" అని కోరుకున్నాను. మేము ప్రయాణమయ్యే రోజు కూడా వాతావరణం మేఘావృతమై ఉంది. పైగా ఆరోజు ఇంట్లో పూజ చేస్తూ అమ్మ కొబ్బరికాయ కొడితే అది కుళ్లిపోయి వుంది. ఇంకొక కాయ కొడితేపోయేది. కానీ మా అమ్మ విషయం నాతో చెప్పి, "నాకు ఎందుకో ఆందోళనగా ఉంది" అని అంది. నేను ఆమెతో, "ఏం కాదు. అంతా మంచిగా జరుగుతుంది. నువ్వు బాధపడకు, భయపడకు" అని చెప్పాను. కానీ నా మనసులో కూడా కొంచెం ఏదోలా అనిపించింది. అయినా, 'బాబా ఉన్నారు. అంతా ఆయన చూసుకుంటారు' అని అనుకున్నాను. తర్వాత మేము ప్రయాణమయ్యే ముందు నేను నా మనసులో బాబాని తలుచుకొని, "బాబా! కారులో వెళుతున్నాం. వాతావరణం బాగోలేదు. మేము క్షేమంగా వెళ్లి, వచ్చేలా చూడండి. సదా మాకు తోడుగా ఉండండి" అని బాబాతో చెప్పుకున్నాను. తర్వాత మా ప్రయాణం మొదలవగానే నేను నా మనసులో, "బాబా! మీరు ఏదో ఒక రూపంలో కనిపించి నాకు తోడుగా ఉన్నానని తెలియజేసి నా టెన్షన్ తగ్గించండి" అని అనుకున్నాను. కానీ బాబా ఎక్కడా కనిపించలేదు. నేను బాబా గుడి లేదా ఏదైనా వాహనం మీద బాబా కనిపిస్తారని కారులో నుండి బయటకి చూస్తున్నాను కానీ కారు లోపల చూడట్లేదు. నిజానికి బాబాని కనిపించమని నేను కోరుకున్నప్పుడే మా నాన్న కారులో ఉన్న అద్దానికి తగిలించి ఉన్న బాబా ఫోటో పట్టుకొని, "ఇది మొన్న శిరిడీలో కొన్నదేనా?" అని మా బాబాయ్‌ని అడిగారు. కానీ బయట ఎక్కడా బాబా కనపడలేదన్న టెన్షన్‌లో ఉన్న నేను నాన్న మాటల్ని ఆ క్షణం పట్టించుకోలేదు. కానీ కాసేపటికి ఒక్కసారిగా 'కారులో వేలాడుతున్న ఫోటోలో ఉన్నది బాబానే కదా!' అన్న ఆలోచన నాకు వచ్చింది. అప్పుడు 'బాబా నాతో తామున్నామని తెలియజేయటం కోసమే నేను బాబాని కనిపించమని కోరుకోగానే మా నాన్న ఫోటో పట్టుకుని మరీ మా బాబాయిని 'ఇది శిరిడీలో కొన్నదేనా?' అని అడిగిలా చేసారని, కానీ నా అజ్ఞానంతో నేను దానిని అర్దం చేసుకోలేకపోయాను' అని గ్రహించాను. "క్షమించండి బాబా".
మా పిన్నివాళ్ళు ఉచిత దర్శనానికి వెళ్లారని చెప్పను కదా! ఆ సమయంలో తిరుమలలో చాలా రద్దీ ఉంది. అందువల్ల నేను, "ఏ ఇబ్బందీ లేకుండా పిన్నివాళ్ళు దర్శనం చేసుకొని వచ్చేలా చేయమ"ని బాబాని కోరుకున్నాను. కొంచెం సమయం ఎక్కువ పట్టినా బాబా దయవల్ల ఏ సమస్య లేకుండా అనుకున్న దానికంటే బాగా దర్శనం చేసుకొని వచ్చారు పిన్నివాళ్ళు. ఇకపోతే, బయటకి వెళితే నాకు ఫుడ్ పడదు. శిరిడీ వెళ్లినప్పుడు ఇబ్బందిపడ్డాను కూడా. అందువల్ల, "ఇప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకో బాబా" అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయవల్ల వెళ్లిన రెండు రోజుల్లో నాకు ఏ జీర్ణ సమస్య రాలేదు. అంతేకాదు, తిరుపతి వెళ్ళేరోజు నాకు కొంచం అసౌకర్యంగా అనిపించినప్పటికీ బాబా దయవల్ల ఏ సమస్య రాలేదు. మేము తిరుపతి వెళ్లే సమయానికల్లా నాకు నెలసరి వచ్చేయాలి. కానీ ఎందుకో తెలీదు, సమయానికి నెలసరి రాలేదు. నేను చేసేదేమీలేక తిరుపతి వెళ్ళొచ్చేవరకు నెలసరి రాకుండా ఉండటం కోసం టాబ్లెట్లు వేసుకోటం మొదలుపెట్టాను. అయితే దాదాపు తిరుపతి వెళ్లే సమయం దగ్గరకి వచ్చాక వేసుకోవడం వల్ల ఎక్కడ నెలసరి వేచేస్తుంది అన్న భయం నన్ను వెంటాడింది. అందుచేత, "నెలసరి రాకుండా స్వామి దర్శనం చేసుకొని వచ్చే బాగాన్ని ప్రసాదించమ"ని బాబాని వేడుకున్నాను. బాబా దయతో ఏ సమస్య రాకుండా చూసారు. మా అమ్మ కాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పటికీ కొండపైకి నడిచి వస్తానని నడిచింది. అప్పుడు నేను, "బాబా! అమ్మకి ఏ సమస్య రాకుండా చూడమ"ని కోరుకున్నాను. బాబా దయవల్ల అమ్మ క్షేమంగా కొండెక్కి స్వామి దర్శనం చేసుకుంది. తిరుగు ప్రయాణంలో వాహనాలు, షాపుల పైన ఫోటోలు, నామం రూపంలో ఎక్కడ చూసినా నాకు బాబానే కనిపించారు. తద్వారా బాబా నాతోనే ఉన్నానని చెప్తున్నారని నాకు అర్దమైంది. "అన్నిటికీ చాలా చాలా ధన్యవాదాలు బాబా".
Sai na kastanni thirchu thandi
ReplyDeleteOm sai ram, prathi vishayam lo thodu unde nv ippudu naatho leva baba, e samasyalu teere marganni chupinchandi baba pls. Anni me chethilo ne peduthunnanu baba anta me daya.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
baba madava ki chaduvu meeda dyasa ravali baba.
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sri Sai nathaya namaha
ReplyDeleteOm Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Sri Sachchidanand sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDelete