సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1913వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలుకుతారు బాబా

నా పేరు హాసిని. ఒకరోజు నేను స్పెట్స్ తీసుకుందామని స్పెట్స్(కళ్లద్దాలు) షాపుకి వెళ్లే ముందు బాబాకి, "తక్కువలో సెట్ అయ్యేలా చూడండి బాబా" అని చెప్పుకొని వెళ్ళాను. అక్కడ చెకప్ అయ్యాక స్పెట్స్, ఫ్రేమ్ మొత్తం కలిపి 6,200 రూపాయలు చెప్పారు. నేను "ఏంటి ఇంతా?" అని షాప్ నుండి బయటకి వచ్చేసి, 'బాబా! నాకు ఆ స్పెట్స్ బాగా నచ్చాయి. కానీ, అంత డబ్బు ఎందుకు పెట్టాలి బాబా?' అని అనుకున్నాను. తర్వాత విషయం మా ఫ్రెండ్‌కి చెప్తే, "నాకు తెలిసినవాళ్ళు వున్నారు. వెళ్దాం లే" అని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు అంతా కలిపి 2,500 చెప్పి 2,250కి ఇస్తామన్నారు. నేను, "బాబా! 2,000కి ఇచ్చేలా చేయండి" అని అనుకున్నాను. బాబా దయవల్ల వాళ్ళు ఆఖరికి నేను కోరుకున్న 2,000కి ఇచ్చేసారు. నేను 3,000 రూపాయలలో అయ్యేలా చూడండి బాబా అని అనుకుంటే ఆయన 2000కే ఐపోయేలా దయ చూపారు. ఇకపొతే, స్పెట్స్ తయారయ్యాక పెట్టుకొని చూస్తే, అవి నాకున్న సైట్‌కి సంబంధించినవి కావు. గ్లాసెస్ తప్పుగా ఫిట్ చేసారు. షాపు వాళ్ళని అడిగితే, మీదే తప్పు అంటారేమోనని నాకు భయమేసింది. సాధారణంగా ఏ షాపువాళ్ళు అయినా అలానే అంటారు. అందుచేత నేను, "ఏంటి బాబా, ఇలా జరిగింది? వాళ్ళు నా స్పెట్స్ విజన్ పవర్ సరిచేసి ఇచ్చేలా చూడండి" అని బాబాను అడిగాను. బాబా దయవల్ల వాళ్ళు నా స్పెట్స్ మార్చి ఇచ్చారు.

నేను స్పెట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 2గంటలపాటు నిరంతరాయంగా వర్షం కురిసింది. ఆ వర్షంలో నేను బాగా తడిసిపోయాను. నా ఫోన్ కూడా తడిసిపోయి దానంతట అదే స్విచ్ ఆఫ్, ఆన్ అవ్వసాగింది. నాకు భయమేసి, "ఏంటి బాబా, ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్ పొతే డబ్బులు పెట్టె పరిస్థితి లేదని మీకు తెలుసు కదా!" అని బాబాకి చెప్పుకున్నాను. కానీ ఫోన్ ఆన్ అవ్వలేదు. అప్పుడు, "ఏంటి బాబా? మీరు 'సాయీ' అంటే 'ఓయ్' అని పలుకుతానని అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు పలకట్లేదు" అని బాబాని అడిగాను. సాధారణంగా నా నుదిటిపై బాబా ఊదీ ఎప్పుడూ ఉంటుంది. కొంతమంది "ఎప్పుడూ విబూది పెడతావు. నువ్వు కేరళ అమ్మాయివా?" అని అన్నారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు బాబా ఊదీ శక్తి, లీలలు. చెప్పినా అర్దం కాదని నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు. సరే విషయానికి వస్తే, 'వర్షంలో తడిచిపోయినందువల్ల నా నుదిటిపై ఊదీ లేదు. బాబాకి ఇష్టం లేదేమో! ఆయనకి ఈరోజు నాపై కోపం వచ్చిందేమో! ఫోన్ ఆన్ అవ్వలేదు. సమస్య అలాగే ఉంది' అని అనుకొని ఇంటికి వెళదామని ఆటోలో బయలుదేరాను. ఆటోలో ఉన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అదేమిటంటే, ఆరోజు నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు హుండీలో డబ్బు వేద్దామనుకున్నాను కానీ, నిన్ననే వేశానని వేయకుండా స్పెట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాను. అది గుర్తొచ్చాక, 'చిన్న మొత్తం డబ్బు హుండీలో వేయకుండా ఆగిపోయాను. అందుకే ఇప్పుడు ఇంత పెద్ద మొత్తం డబ్బు పెట్టాల్సిన ఫోన్ రిపేర్ వచ్చింది' అని అనుకున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాక "తప్పు అయిపొయింది అమ్మా. హుండీలో ఇందాక వేయాలనుకున్న డబ్బు వేసేస్తాను" అని అనుకున్నాను. ఇంకా 'ఆటో దిగి ఇంటికి వెళ్ళాక ఫోన్‌కి బాబా ఊదీ పెట్టాలి. అప్పుడే ఫోన్ సరిగా వుంటుంది' అనుకున్నాను. అలా అనుకున్నాక మనసులో చాలా ఉత్సాహంగా అనిపించింది. సరిగా అప్పుడే నేను అమ్మవారి గుడి దాటాను. నా ఫోన్ ఆన్ అయింది. అప్పుడే నా ఫ్రండ్ వచ్చి 'ఓయీ' అని నన్ను పిలిచాడు. నేను, సరైన సమయానికి వచ్చావు. ఫోన్ ఆన్ ఐయింది చూడు" అని ఫోన్ తనకి ఇచ్చాను. తను ఫోన్ సెట్టింగ్స్ సరి చేసాడు. ఇంకా ఫోన్ ఆగలేదు. నేనింకా అలానే అమ్మవారి గుడికి వెళ్ళిపోయి అదివరకు వేయాలనుకున్న డబ్బు హుండీలో వేసేసి, తప్పు అయిపొయింది అమ్మా అని దణ్ణం పెట్టుకొని వచ్చాను. అప్పుడు రాత్రి ఈ అనుభవాన్ని బ్లాగ్‌కి పంపుదామని అనుకున్నాను. కానీ అది తప్ప అన్ని పనులు చేసాను. అప్పుడు చూస్తే ఫోన్ ఛార్జింగ్ అవ్వట్లేదు. వెంటనే, "బాబా! తప్పు అయిపొయింది. మీ అనుగ్రహాన్ని బ్లాగ్‌కి పంపుతాను" అని చెప్పుకున్నాను. అంతే, ఫోన్ ఛార్జింగ్ అయింది. నాకు తెలిసి ఈ అనుభవం ఎవరికైన ఉపయోగపడవచ్చు. అందుకే బాబా నాచేత ఇంత తొందరగా ఈ అనుభవాన్ని బ్లాగ్‌కి పంపేలా చేసారు. "క్షమించండి సాయినాన్నా. రెండేళ్ల నుంచి నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడైనా అది నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నాను తండ్రీ".

మా చెల్లి గొడవ చేసి మరీ మూడు, నాలుగు రోజుల వయసున్న ఒక చిన్న కుక్కపిల్లని ఇంటికి తీసుకొచ్చింది. అది చాలా అందంగా బాగుంది. కానీ మాకు పెంపుడు జంతువులను పెంచడం ఇష్టం వుండదు. మునుపెన్నడూ వాటిని పెంచనందున మాలో ఎవరికీ వాటిని ఎలా పోషించాలో తెలీదు. అందువల్ల ఆ కుక్కపిల్లకి పాలు ఎలా పెట్టాలో మాకు తెలియలేదు. మేము ఏదోలా పెట్టినా కూడా అది తాగేది కాదు. 2024, ఆగస్టు 25 మధ్యాహ్నం ఏదో కాస్త పాలు తగ్గిందికానీ రాత్రి వరకు మళ్ళీ తాగలేదు. మాకు చాలా జాలి వేసింది. మనకి సహాయం చేయడానికి మన సాయినాన్న ఉన్నారు కదా! "బాబా! పాపం దాన్ని వేరు చేసి తెచ్చేయడం, అది పాలు తాగకపోవడం వల్ల చాలా బాధగా ఉంది. తల్లిప్రేమ ఎవరికైన కావాలి. ఉదయానికి ఎలాగైనా ఆ కుక్కపిల్ల తన తల్లి దగ్గరకి వెళ్లిపోయేలా చేయండి" అని బాబాని వేడుకున్నాను. 'సాయీ' అని పిలిస్తే 'ఓయీ' అని పలుకుతారు కదా బాబా. రాత్రి ఆయన్ని అడిగానో, లేదో ఉదయం ఆ కుక్కపిల్ల తన తల్లి దగ్గరకి చేరుకుంది. నిజానికి అప్పటివరకు మా చెల్లితో ఆ కుక్కపిల్లని ఎక్కడినుంచి తెచ్చావో అక్కడ వదిలేయి అని చెప్తుంటే, నేను  ఇంట్లోంచి వెళ్ళిపోయి దాన్ని పెంచుకుంటానని మొండిగా ప్రవర్తిస్తుండేది. అలాంటి తను ఉదయం బాగా సర్ధి చెప్పి, తిడితే ఒప్పుకొని కుక్కపిల్లని తీసుకెళ్లి వదిలేసి వచ్చింది. ఇది బాబా లీలే కదా!
 
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు.

12 comments:

  1. Om Sai nanna you made my desire come true.Thank you Sai tandri.Om Sai Ram . please arrange foreign trip Sai.I am waiting for many years.. Thank you Baba

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  4. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  5. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐

    ReplyDelete
  6. Om sai ram, anni vishayallo anta bagunde la chayandi tandri.

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai Sai tandri Nayana maa sir ki operation ai subhranga ayyela cheyyi Sai arogyanga intiki vachela cheyyi Sai om Sai ram om Sai raram om Sai ram

    ReplyDelete
  9. Om Sri Sai Raksha 🙏🙏🙏

    ReplyDelete
  10. baba, sai madava bharam antha meede baba

    ReplyDelete
  11. Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo