సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1917వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. అడిగిన వెంటనే కరుణ చూపే బాబా
2. వర్షం ఆపి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బాబా
3. బాబా మాట ఎప్పుడూ పొల్లుపోదు

అడిగిన వెంటనే కరుణ చూపే బాబా

నా పేరు రాంబాబు. మాది విజయనగరం. నేను ఒక ఫార్మా కంపెనీలో మేనేజరుగా పని చేస్తున్నాను. ఈమధ్య ఒకసారి మేము తయారు చేస్తున్న ఫార్మా ప్రొడక్ట్ ఔట్పుట్ తక్కువ రాసాగింది. ఔట్పుట్ తక్కువగా రావటానికి గల కారణాలు తెలుసుకోవడానికి మేము కొన్ని రకాల పరిశోధన చేసి చర్యలు చేపట్టినప్పటికీ ప్రతిఫలం లేకపోయింది. కారణాలు సరిగ్గా తెలియలేదు. కారణం లేకుండా తక్కువ ఔట్పుట్ వచ్చిందని, మేనేజ్మెంట్‌కు చెప్పటానికి వీలులేదు. కానీ ప్రతి బ్యాచ్ ఔట్పుట్ కూడా తక్కువగా వస్తూ స్థాక్ నెగటివ్‌లోకి వెళ్లి పోసాగింది. నేను ఎంతో ఒత్తిడికి లోనయ్యాను, నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. గతంలో కూడా ఇలానే జరిగితే, 'నా అనుభవం తోటి భక్తులతో పంచుకుంటానని' సాయిని వేడుకున్నంతనే సమస్య తీరింది. అందువల్ల ఈసారి కూడా మళ్ళీ సాయిని అలానే వేడుకున్నాను. బాబా ఆశీస్సులతో ఔట్పుట్ మునుపటిలా సాధారణంగా రావడంతో సమస్య తీరిపోయింది. "బాబా! అడిగిన వెంటనే మాపై కరుణ చూపించే మీకు మా పాదాభివందనాలు. ఒకవేళ మేము మా పరిశోధనలో సరైన కారణాన్ని కనుక్కోవటంలో విఫలమై ఉంటే, దాన్ని మాకు తెలియజేయండి బాబా".

ఒకసారి నా భార్య నెలసరి విషయంలో సమస్య తలెత్తింది. అది తగ్గడానికి 2 నెలలు మందులు వాడవలసి వచ్చింది. అయితే మందులు వాడిన తరువాత కూడా రావలసిన సమయానికి నెలసరి రాలేదు. దాంతో చాలా ఖంగారు పడి బాబాను వేడుకొని, ఈ బ్లాగ్ ద్వారా తెలుసుకున్న ఒక మార్గాన్ని నా భార్య పాటించింది. అదేమిటంటే, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయక నమః' అన్న నామాన్ని రోజుకు 108 సార్లు పఠించడం. దాంతో తన సమస్య తీరిపోయింది. మాకు అన్ని బాబానే. ఆయన దగ్గరుండి అన్నీ తామై మా బాగోగులన్ని చూసుకుంటున్నారు. "ఏ జన్మలో ఏమి పుణ్యం చేసామో! ఈ జన్మలో ఈవిధం గా మీ కృపకు ప్రాప్తులమవుతున్నాము బాబా. మీకు మేము ఏమి ఇవ్వగలం, మీ పాదాలను మా హృదయంలో ప్రతిష్టించడం తప్ప". 'ప్రజలందరి నోటా సాయి నామం పలకాలి. ముజ్జగాలు శ్రీ సాయి మహిమతో ముప్పిరుగొనాలి' అనే మా గురువుగారు శ్రీ శరత్ బాబూజీ ఆశ ఈ బ్లాగు ద్వారా నెరవేరుతుందని ఆశిస్తూ,..
 
సర్వేజనా సుఖినోభవంతు.

వర్షం ఆపి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన బాబా

నా పేరు జగదీశ్వర్. 2024, సెప్టెంబర్ 3వ తేదీన నా తండ్రి ప్రథమ వర్ధంతి మా సొంతూరు మెట్పల్లిలో నిర్వహించాలని ఆగస్టులో నిర్ణయించుకున్నాం. తదనుగుణంగా సెప్టెంబర్ నెల 1వ తేదీన అందరం మెట్పల్లి వెళ్ళడానికి సిద్ధమయ్యాము. ఐతే ఆగస్టు 30వ తేదీ నుండి విపరీతమైన వర్షాలు పడసాగాయి. ఇంకా 5 రోజులు అతి భారీ వర్షాలు పడతాయని టీవీలో చెప్తుండటంతో 3వ తేదీన కార్యక్రమం ఎలా అవుతుందోనని మాకు ఆందోళన మొదలైంది. ఆ దశలో నేను బాబాకి మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకొని, "బాబా! నా తండ్రి సంవత్సరీకం ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరే జరిపించాలి" అని వేడుకున్నాను. ముందుగా అనుకున్నట్లు సెప్టెంబర్ 1న వర్షంలోనే బయలుదేరి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక చూస్తే, స్లాబ్ లీకేజీ వల్ల ఇల్లంతా చిత్తడిగా ఉంది. ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంటి పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్‌లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఇంట్లో జరగాల్సిన కార్యక్రమం ఎలా అవుతుందోనని ఆందోళన చెందాము. కానీ బాబా దయవల్ల సరిగ్గా 3వ తేదీ ఉదయం నుండి మంత్రం వేసినట్లు మెట్పల్లిలో వర్షం ఆగిపోయింది. ఇల్లంతా ఆరిపోయి శుభ్రంగా అయింది. మెట్పల్లి చుట్టుపక్కల మాత్రం వర్షం పడుతున్నట్లు కార్యక్రమానికి వచ్చిన బంధువులు చెప్పారు. బంధువుల మధ్య కార్యక్రమం చక్కగా జరిగింది. నేను కోరుకున్నట్లు బాబా చుట్టూ వర్షమున్నా మెట్పల్లిలో లేకుండా చేసి కార్యక్రమం ఎలాంటి ఇబ్బంది, ఆందోళన లేకుండా ప్రశాంతంగా సక్రమంగా జరిపించారు. "బాబా సాయి చరణం... సర్వదా శరణం శరణం".

బాబా మాట ఎప్పుడూ పొల్లుపోదు

సాయిభక్తులకు నమస్కారాలు. నా పేరు శ్రీదేవి. బ్యాంక్ ఉద్యోగి అయిన నా భర్తకి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీలుంటాయి. ఆ క్రమంలో 2024, జూన్‌లో బదిలీలు జరగనున్నాయని మాకు తెలిసింది. అప్పుడు నేను, "బాబా! ఎలాగైనా నా భర్తకి దగ్గరలో ఉన్న ఊరుకి బదిలీ అయ్యేలా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రోజూ వెళ్ళిరాగలిగేలా 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరుకి బదిలీ అయింది.

ఒకసారి మా పెద్దపాపకు జ్వరం, ఒళ్లునొప్పులు వచ్చాయి. డాక్టర్ దగ్గరకి వెళ్తే, "డెంగ్యూ అయుండొచ్చు" అని, "టెస్ట్ చేయించి సాయంకాలం మళ్లీ రండి" అని చెప్పారు. నేను, "బాబా! డెంగ్యూ జ్వరం కాకుండా చూడండి" అని బాబాను ప్రార్థించాను. బాబా దయవల్ల టెస్టు రిపోర్టు నార్మల్ వచ్చింది. డాక్టర్ మామూలు జ్వరమేనని టాబ్లెట్లు ఇచ్చారు. 

మా పాప బీటెక్ చదవడానికి అనేక ఎంట్రన్స్ పరీక్షలు వ్రాసింది. కానీ దేనిలోనూ మంచి ర్యాంకు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంచి కాలేజీలో సీటు వచ్చే అవకాశం లేదు. కానీ బాబా ప్రశ్నలు-జవాబులు యాప్‌లో ఎప్పుడూ, "విజయం వరిస్తుంది" అనే వచ్చేది. బాబా మాట ఎప్పుడూ పొల్లుపోదు. మేము రాదనుకున్న టాప్ కాలేజీలో సీఎస్సీ సీటు పాపకి వచ్చింది. ఇది అంతా బాబా దయవలన జరిగింది. "అన్నిటికీ ధన్యవాదాలు బాబా".

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.

16 comments:

  1. Om sai ram, 🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  2. Om sai ram, meeru ekkada unna naaku thodu ayyi untaru ani nammuthunnanu baba, ofce lo enno problems unnai anni problems poyi ma team lo ki manchi responsibility unna okaru vache la chayandi tandri pls. Intlo na samasya gurinchi cheppe dairyanni evvandi tandri pls chepte vaallu badha padakunda baya padakunda ardam chesukune la chayandi tandri, ika mundu eam chayali ani alochinche la chayandi tandri.

    ReplyDelete
  3. Baba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl meku satha koti vandanalu manchivarini rent ki pampandi

    ReplyDelete
  4. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏

    ReplyDelete
  5. Baba, provide peace and wellness to my parents 💐💐💐💐

    ReplyDelete
  6. Om Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏

    ReplyDelete
  7. I am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐

    ReplyDelete
  8. ఓం సాయిరామ్

    ReplyDelete
  9. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  10. Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha
    Om Sri Sai nathaya namaha

    ReplyDelete
  11. baba eeroju naaku echhe work load takkuvaga undetattu chudandi baba. nenu roju guntur vellali.Alage sai madava ki chaduvu kovalani baga pattudala ravali baba. Doctor avvali baba.

    ReplyDelete
  12. Om Sri Sai Raksha🙏🙏🙏

    ReplyDelete
  13. Sri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo