సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

నేను కేవలం చంద్రునిలోనే లేను - సృష్టి అంతటా అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్నాను.....


సాయిబంధువులందరికీ నమస్కారం. నేను సంబల్పూర్ నుండి సదాశివ. నాకు 2018, సెప్టెంబర్ నెల చివరిలో జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. బాబా లీలలు అద్భుతం, అనంతం. నాలాంటి చదువురాని వాళ్ళు వాటిని చెప్పడం కూడా కష్టం. అందుకే నాకు జరిగిన అనుభవాలన్నీ మా మాధవి మేడమ్ గారికి చెప్తాను. ఆవిడే వ్రాసి ఇస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే, ఈ అనుభవం జరగడానికి నాలుగురోజుల ముందు చంద్రుడిలో సాయిబాబా కనపడ్డారని అందరూ అంటూ ఉంటే విన్నాను. మా మేడమ్ గారు కూడా ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి, "సదాశివా! చంద్రునిలో బాబా కనపడుతున్నారు, చూడు!" అని చెప్పారు. నేను వెంటనే బయటకు వెళ్లి చూసాను. కానీ నాకు ఏమీ కనపడలేదు. ఒక గంటపాటు అలా చూస్తూ ఉన్నా కానీ నాకు బాబా కనపడలేదు. ఇంతలో మా ఆఫీసు వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇదేమాట చెప్పారు. నేను, "నాకు కనపడటం లేద"ని వాళ్లతో చెప్పాను. కానీ, "అందరికీ కనపడుతున్న బాబా నాకెందుకు కనపడటం లేదు? నేనేమి తప్పు చేశాను? నా నమ్మకంలో ఏమన్నా లోపం ఉందా?" అని ఒకటే దుఃఖం. నా మనసంతా అదే ఆందోళనతో నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టనేలేదు. తరువాతరోజు మేడమ్ గారికి అదే విషయం చెపితే, "అరే, సదా! ఎందుకు టెన్షన్ పడతావు? బాబా ఏదోవిధంగా నీకు దర్శనం ఇస్తారులే" అని నన్ను శాంతపరిచారు. తరువాత ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లి, భోజనం చేసి మాకున్న లేడీస్ కార్నర్ షాపుకు వెళ్లి కూర్చున్నాను. మనసులో మాత్రం వేదనగానే ఉంది. "బాబా! ఈరోజు రాత్రి అయినా చంద్రునిలో మీరు నాకు తప్పక కనపడాలి" అని అనుకుంటూ రాత్రి ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్నాను. ఇంతలో చాలా జోరుగా వాన పడింది. వాన నీళ్లు మా షాపు ముందు నుంచి ఒక నదిలా ప్రవహిస్తున్నాయి. ఆ నీళ్లలో మడతపడి ఉన్న ఒక పెద్ద బ్యానర్ లాంటిది వచ్చి, సరిగ్గా మా దుకాణం ముందు ఆగిపోయింది. ఎక్కడనుంచి వచ్చిందో తెలీదు గాని, వెంటనే వెళ్లి దానిని బయటకు తీసి నా షాపులోకి వెళ్లి దానిని తెరిచి చూసాను. అంతే! ఆనందం పట్టలేకపోయాను. అదొక పెద్ద బాబా ఫోటో. ఆ క్షణాన బాబా నాతో, "సదా! ఎక్కడో నేను చంద్రుడిలో ఉన్నానని, నీకు కనపడలేదని నీవు బాధపడుతున్నావు, కానీ చంద్రునిలోనే కాదు, నీళ్లలో కూడా నేనే వున్నాను, పంచభూతాలు సైతం నేనే, సృష్టి అంతటా అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్నాను, నన్ను నువ్వు ఎక్కడని వెతుకుతున్నావు" అన్నట్లు అనిపించింది. వెంటనే నా మనసు కుదుటపడింది. ఆ స్వామి పాపం నాకోసం వాన నీళ్లలో ప్రకటమయ్యారు. సర్వవ్యాపియైన సాయి - "చంద్రుడిలో కనపడలేదని నీకు దిగులెందుకు? నేను అంతటా ఉన్నాను" అని నాకు ఈ లీల ద్వారా తెలియజేసారు. ఇంకో లీలతో మళ్ళీ కలుస్తాను.

ఓం సర్వాంతర్యామినే నమః

కఠినమైన పరిస్థితిలో బాబా కృప వలన మా డబ్బు మాకు దక్కింది....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిభక్తులందరికీ నమస్తే!

నాపేరు దుర్గ. నేను హైదరాబాద్ నివాసిని. నేను టెలికాం శాఖలో పని చేస్తున్నాను. నేను చిన్నప్పటి నుండి సాయిభక్తురాలిని. ఈరోజు వరకు నా జీవితంలో బాబా ఎంతో సహాయం చేసారు. ఇప్పుడు నేను ఈ బ్లాగ్ ద్వారా నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకోవాలని వ్రాస్తున్నాను.

తేదీ. 02.09.2018న చెక్కుని సమర్పించడం ద్వారా నా ఖాతా నుంచి 22,000 రూపాయలు డెబిట్ చేయబడిందని బ్యాంకు నుండి ఒక సందేశం వచ్చింది. నేను ఆ సందేశాన్ని చూసి ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను ఎవరికీ ఏవిధమైన చెక్ ఇవ్వలేదు. వెంటనే నా భర్తను అడిగాను. అది విని అయన కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే అది చిన్న మొత్తమేమీ కాదు. మా అనుమతి లేకుండా చెక్ ను ఎవరు సమర్పించారో మాకు అర్ధం కాలేదు. మేము వెంటనే బ్యాంక్ కి వెళ్లి వారిని వివరాలు తెలుపమని అభ్యర్థించాము. బ్యాంకు వారు చెక్కు మీద సంతకం నాదేనని, అందువలన ఈ విషయంలో తాము ఇంకే సహాయం చేయలేమని సమాధానం ఇచ్చారు. నేను వెంటనే బాబాని, "బాబా! మాకు సహాయం చేయండ"ని ప్రార్థించాను. కొంతసేపటికి బాబా కృప చూపారు. మా పర్సనల్ లోన్ ఒకటి క్లియర్ చేసే విషయంగా 2016 డిసెంబర్ లో ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధి ఒకరికి మేము చెక్ ఇచ్చిన విషయం బాబా ప్రేరణ వలన మావారికి గుర్తుకొచ్చింది. వెంటనే మేము బ్యాంకు రికార్డులలో పరిశీలించగా, అప్పుడు మేము ఇచ్చిన చెక్ నెంబర్, ఇప్పుడు ఈరోజు జమ చేయబడిన చెక్ నెంబర్ రెండూ ఒక్కటిగా నిర్ధారణ అయ్యాయి. మేము ఆశ్చర్యపోయి ఆ ఐసీఐసీఐ బ్యాంకు ప్రతినిధిని సంప్రదించేందుకు ప్రయత్నించాము. కానీ అతని నెంబర్ పని చేయడం లేదు. "బాబా! మాకు ఇప్పుడు ఏమి చేయాలో, ఎలా ముందుకు పోవాలో తెలియడం లేదు" అని సాయిబాబాను ప్రార్థించాను. నేను ఆశ్చర్యపోయేలా బాబా సహాయం అందించారు. బ్యాంక్ మేనేజర్ ఆ చెక్ ఎమౌంట్ ఎవరి పేరు మీద డెబిట్ అయ్యిందీ ఆ వివరాలు సేకరించి, వేరే బ్యాంకు వద్ద ధృవీకరించడానికి ఒక కాపీని నాకిచ్చి సహాయం చేసారు. కానీ అప్పటికి బ్యాంక్ పని గంటలు పూర్తి అయ్యాయి. మరుసటిరోజు ఉదయం నేను సదరు బ్యాంకుకి వెళ్లి బ్యాంకు మేనేజర్ కి మొత్తం పరిస్థితిని వివరించాను. బాబా దయవల్ల వెంటనే అతను స్పందించి, ఆ వ్యక్తిని సంప్రదించి మీకు సహాయం చేస్తానని చెప్పాడు. కొన్నిగంటల సమయంలో స్వయంగా అతను ఆ వ్యక్తి ఉండే కార్యాలయానికి వెళ్లి, అక్కడినుండి మమ్మల్ని సంప్రదించాడు. అప్పుడు ఆ వ్యక్తిని అడిగితే వారి కార్యాలయంలో ఎవరో ఆ చెక్ ని పొరపాటుగా  సమర్పించినట్లు చెప్తూ, ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆ డబ్బుని తిరిగి ఇచ్చేస్తానని వాగ్దానం చేసాడు. మాకైతే మా డబ్బు మాకు తిరిగి వస్తుందనే ఆశ లేకుండాపోయింది. అటువంటి కఠినమైన పరిస్థితిలో మాకు తమ రక్షణను అందించినందుకు బాబాకు ధన్యవాదాలు. అసలు కొన్నిసార్లు వెంటనే బ్యాంకుల నుండి సందేశాలు అందవు. అలా సరైన సమయంలో మెసేజ్ రాకపోయి ఉంటే మా డబ్బు మేము తిరిగి పొందలేకపోయేవాళ్ళము. సరైన సమయంలో మాకు మెసేజ్ అందేలా చేసి బాబా మాకు  ఎంతో సహాయం చేసారు. మరోసారి మీకు కృతజ్ఞతలు బాబా.

ఆర్ధిక సమస్యల పరిష్కారం - మధురమైన శిరిడీ దర్శనం అనుభవాలు....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు సుమ. మాది నెల్లూరు. నేను సాయిభక్తురాలినని చెప్పడంలో నాకు చాలా ఆనందం ఉంది. నేను నా అనుభవాలు సాయిబంధువులందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. బాబా! మీరే నా అనుభవాన్ని ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అయేలాగా నాతో వ్రాయించండి. ఓం సాయిరాం!!!

గత కొద్దికాలంగా మా కుటుంబంలో ఆర్ధిక సమస్యలు ఎక్కువయ్యాయి. వాటి నుండి బయటపడటానికి మాకున్న ఒకే ఒక పరిష్కారమార్గం -  మా ఇంటిని అమ్మడం. కానీ, ప్రస్తుతం మేమున్న ఏరియాలో ధరలు చాలా తక్కువగా ఉండటం వలన మేమనుకున్న ధరకి అమ్మడం చాలా కష్టమైన పని. రోజూ నేను ఇదే విషయం గురించి, "బాబా! మా ఇల్లు మంచి ధరకు అమ్ముడయ్యేలా, మా సమస్యలు తీరేలా చూడండ"ని బాబాను ప్రార్థించేదాన్ని. మా కజిన్ ద్వారా 'నవ గురువారవ్రతం' గురించి తెలుసుకొని, ఇల్లు మంచి ధరకు అమ్మకం కావాలన్న సంకల్పంతో వ్రతాన్ని మొదలుపెట్టాను. దానితో పాటు 'స్తవనమంజరి' చదవడం కూడా ప్రారంభించాను. స్తవనమంజరి చదివిన మొదటిరోజే ఇల్లు కొనడానికి ముగ్గురు వచ్చారు, అయితే ధర విషయంలో కుదరక అది మేము ఒప్పుకోలేదు. ఆ సమయంలో, "బాబా! విజయదశమి లోపల ఎలాగైనా మా ఇల్లు మంచి ధరకి అమ్ముడై, మా ఆర్ధిక  సమస్యలు తీరిపోయి, మేము శిరిడీ వచ్చి మిమ్మల్ని చూడాలి" అని కూడా బాబాని ప్రార్థించాను. నవ గురువార వ్రతం 3 వారాలు పూర్తై, ఇంకా 6 వారాలు ఉంటుండగానే బాబా అద్భుతం చేసి నా కోరికను తీర్చేసారు. మా బంధువుల ద్వారా ఇల్లు మంచి ధరకి అమ్ముడయింది. వాళ్ళు మాకు రావాల్సిన అమౌంట్ కంటే ఎక్కువ మొత్తం వచ్చేలా చేసారు. నిజంగా బాబానే వాళ్ళ రూపంలో మాకు సహాయం అందించారు. దానితో మా ఆర్థిక ఇబ్బందులు కూడా తీరడంతో మాకు చాలా సంతోషంగా అనిపించింది. "చాలా చాలా కృతఙ్ఞతలు బాబా! వ్రతంలో మిగతా 6 వారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరే పూర్తయ్యేలా చూడండి బాబా!".

ఇంకో అద్భుతం ఏమిటంటే, నిజానికి మా ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ మేము శిరిడీ నుంచి వచ్చిన తరువాత చేద్దామన్నారు. కానీ నాకు మాత్రం ఇల్లు అమ్మకం పూర్తి అయ్యాక ప్రశాంతంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలనిపించింది. బాబా చేసిన చమత్కారం చూడండి. మేము శిరిడీ వెళదామనుకున్న రోజు(2018 సెప్టెంబర్ 17) మధ్యాహ్నమే రిజిస్ట్రేషన్ పూర్తై, అదే రోజు సాయంత్రం మేము శిరిడీకి బయలుదేరాము. నిజంగా ఆరోజు నా సంతోషానికి అవధుల్లేవు. ఎందుకంటే బాబా నేను అనుకున్నట్లుగానే ఇంటి సమస్య తీర్చాకే మేము శిరిడీ ప్రయాణమయ్యేలా చేసారు.

మేము శిరిడీ వెళ్ళడానికి రాత్రి నెల్లూరు నుంచి హైదరాబాదుకు బస్సులో బయలుదేరి మరుసటి రోజు ఉదయానికి హైదరాబాదు చేరుకున్నాము. అక్కడ మాకు తెలిసిన వాళ్ళెవరూ లేకపోవడంతో హోటల్లో గది తీసుకుందామని అనుకున్నాము, ఎందుకంటే శిరిడీ బస్సు మళ్ళీ సాయంత్రానికి ఉంది. మాకు హైదరాబాదు కొత్త అవడంతో ఒక ఆటో అతని సహాయంతో మంచి రూమ్ తీసుకున్నాం. అతను మాకు చూపించిన హోటల్ పేరు కూడా సాయి రెసిడెన్సీ. ఆ బాబానే అతని రూపంలో మాకు అలా రూమ్ చూపించారేమో అనుకున్నాము. రాత్రి ప్రయాణమంతా కూర్చొని చేయడం వల్ల అమ్మకి బాగా మోకాళ్ళనొప్పులు వచ్చాయి, అందువల్ల ఆమె చాలా బాధపడుతూ ఉంది. మేము సాయంత్రం శిరిడీకి బుక్ చేసుకున్న బస్సు కూడా కూర్చొని వెళ్ళాల్సిన నార్మల్ బస్సు కావడంతో అమ్మ "ఈ మోకాళ్ళనొప్పులతో మళ్లీ అంతసేపు కూర్చోగలనా?" అని అనుకుంటూ చాలా ఆందోళన పడుతూ ఉంది. కానీ, "అన్నిటికీ బాబా ఉన్నారు, అంతా ఆయన చూసుకుంటార"ని అనుకున్నాము. సాయంత్రం వరకు రూమ్ లో ఉండి బస్సు బయలుదేరే సమయానికి బస్సు ఎక్కాల్సిన చోటుకి చేరుకున్నాము. అప్పుడు బాబా మాకు చాలా పెద్ద అద్భుతమే చూపించారు. మేము ఎక్కాల్సిన బస్సు ఏదో కారణం వలన రద్దయ్యింది. అందువల్ల మమ్మల్ని స్లీపర్ బస్సు ఎక్కించారు. అది కూడా మేము తీసుకున్న మాములు టికెట్ ధరకే! అమ్మ మోకాళ్ళనొప్పితో శిరిడీ వరకు ప్రయాణం చేయలేదని బాబా స్లీపర్ బస్సు ఏర్పాటు చేసారు. ఎంతో అద్భుతమైనది ఆయనకు మనపై ఉన్న ప్రేమ! మరుసటిరోజు శిరిడీ చేరుకునేటప్పటికి అమ్మ మోకాళ్ళనొప్పి చాలావరకు తగ్గిపోయింది. ముందురోజు అసలు నడవలేనంత నొప్పి భరించిన అమ్మ శిరిడీ చేరుకోగానే చాలా మాములుగా మాతోపాటు నడవగలిగింది. అంతా బాబా చేసిన లీల.

ముందుగా అక్కడి క్షేత్ర పాలకుడైన విష్ణుగణపతిస్వామి దర్శనం చేసుకొన్న తరువాత మధ్యాహ్న ఆరతి సమయానికి ఆరతి చూడాలని ఉచిత దర్శనం ద్వారా వెళ్ళాము. కానీ లోపలికి వెళ్ళేలోపే లైన్ ఆపేసారు. అందువలన ఆరతి సమయానికి మేము లైన్ లోనే ఉండాల్సి వచ్చింది. "ఏమిటి  బాబా, ఆరతి చూడాలని ఆరాటంగా వస్తే ఇలా అయ్యింది?" అని నేను చాలా బాధపడ్డాను. ఆరతి జరుగుతున్నంతసేపు సమాధి మందిరంలో బాబా ముందు ఆరతి పాడలేక పోయానని నాకు ఒకటే బాధ. క్యూ లైన్ లో కూర్చోవడానికి వీలుగా బెంచ్ లు ఉండడంతో అమ్మ కూర్చొని ఆరతి పాడుకుంది. ఆరతి అయ్యాక మేము సాయినాథుని దర్శనం చేసుకున్నాం. నిజంగా బాబా రూపాన్ని చూస్తుంటే, అలా బాబాని చూస్తూ ఉండి పోవాలనిపించింది. నేను బాబాకోసం రెండు పాలకోవా ప్యాకెట్లు తీసుకొని వెళ్ళాను కానీ, అక్కడ పూజార్లు తీసుకుంటారో లేదోనని ఆందోళన చెందాను. కానీ బాబా నేను ఇచ్చిన పాలకోవా స్వీకరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ బాబా ముందు ఆరతి పాడలేక పోయాననే లోటు అలాగే ఉండిపోయింది. అందుకే మరలా సాయంత్రం ఆరతికి నేను, నాన్న మాత్రమే ఫ్రీ టోకెన్ తీసుకొని వెళ్ళాం. బాబా నా ప్రార్థన విన్నారు. ఈసారి బాబా మమ్మల్ని ఆరతికి అనుమతించారు. నా కోరిక ప్రకారం బాబా ముందు ఆరతి పాడగలిగాను. ఆరతి అయ్యాక ఆలోచిస్తే అర్థమయ్యిందేమిటంటే ఆరతి సమయంలో అందరూ కూర్చోవలసి ఉంటుంది. అమ్మకి మోకాళ్ళ నొప్పులు, అందువలన ఆమె అంతసేపు పద్మాసనం వేసుకొని కూర్చోలేదని బాబాకి తెలుసు, అందుకే మధ్యాహ్నం నేను ఆరతి చూడాలని ఆరాటపడినా అమ్మ ఇబ్బంది దృష్ట్యా మమ్మల్ని క్యూలోనే ఉండేలా చేసారు. ఆయనకు మనపై ఎంతటి శ్రద్ధో! తరువాత నేను, నాన్న బాబా ప్రసన్నరూపాన్ని మరోమారు తృప్తిగా దర్శించుకున్నాము. థాంక్యూ సో మచ్ బాబా! బాబా ఏది చేసినా మన మంచికే చేస్తారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ మనం అవి అర్థం చేసుకోలేక బాబా మనం కోరుకున్నది ఇవ్వలేదని అనుకుంటాం. మనకి ఏది ఎప్పుడివ్వాలో బాబాకు బాగా తెలుసు. సమయం వచ్చినప్పుడు క్షణం ఆలస్యం కాకుండా అనుగ్రహిస్తారు.

తరువాత రోజు గురువారం కావడంతో నేను సమాధి మందిరం ఆవరణలో సచ్చరిత్ర పారాయణ చేసుకున్నాను. అలాగే స్తవనమంజరి కూడా చదివాను. ఆవిధంగా బాబా నా కోరికలన్నీ తీర్చి నన్ను అనుగ్రహించారు. మీ కృప నా మీద సదా ఉండాలి బాబా! మీ చల్లని చూపు, మీ కరుణ మీ భక్తుల యందు ఎల్లప్పుడూ ఉండాలి బాబా!

ఓం సాయిరామ్!!!

వినాయక అప్పాజీ వైద్య


సాయి మహాభక్తుడు. వినాయక అప్పాజీ వైద్య కాయస్థ ప్రభు కులమునకు చెందినవాడు. అతను బొంబాయి, అంధేరీ, వర్సోవ రోడ్డులో ఉన్న పోర్ట్ ట్రస్ట్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసులో గుమస్తాగా పని చేసేవాడు.

దాసగాణు మహారాజ్ సంకీర్తనలు వినడం ద్వారా వినాయక్ కి శిరిడి వెళ్లి బాబాని దర్శించుకోవాలన్న కోరిక కలిగింది. అతను 1912వ సంవత్సరం ఈస్టర్ పండుగ సమయంలో మొదటిసారిగా శిరిడి వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాడు. ఆతరువాత అతను బాబా మహాసమాధి అనంతరం 1923వ సంవత్సరం నుండి తరుచు శిరిడీ వెళ్తూ ఉండేవాడు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలకు తప్పకుండా శిరిడీ వెళ్తుండేవాడు.

1923వ సంవత్సరంలో బాబా అతని భార్యకు స్వప్నంలో దర్శనమిచ్చి “నీ  భర్తకి వ్యతిరేకంగా ఒక కోర్టు కేసు రాబోతుంది, ఆ విషయంలో ఆందోళన పడకుండా దైర్యంగా ఉండమని వినాయక్ కి చెప్పు” అని చెప్పారు. బాబా చెప్పినట్టుగానే కొద్ది రోజుల్లోనే వినాయక్ కి వ్యతిరేకంగా ఒక కేసు పెట్టబడింది. కానీ బాబా దయతో వినాయక్ కి అనుకూలంగానే తీర్పు వెల్లడయ్యంది.

1926వ సంవత్సరంలో వినాయక్ తమ్ముడి 3 సంవత్సరాల కూతురు తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధ పడుతున్నది. వైద్యులు చేసే చికిత్సకు ఏమాత్రం జ్వరం తగ్గడం లేదు. జ్వరం సుమారు 105 డీగ్రీలుకు తగ్గకుండా వుంటూ ఉండింది. అందువలన అందరూ ఆ అమ్మాయి బ్రతకడం కష్టమని అనుకున్నారు. వినాయక్ ఆ అమ్మాయికి బాబా ఊదీ ఇచ్చాడు. దాని ప్రభావంతో 3-4 రోజులలోనే తను పూర్తిగా కోలుకుంది.

1927వ సంవత్సరంలో వినాయక్ భార్య క్షయ వ్యాధితో బాధపడింది. 8 నెలలుగా చికిత్స చేస్తున్నా తన ఆరోగ్యం మెరుగుపడే లక్షణాలేమి కనపడలేదు. క్షయవ్యాధి తోపాటు జ్వరం కూడా ఆమెని బాధపెడుతూ ఉండేది. వినాయక్ తన భార్యని శిరిడీకి తీసుకొని వెళ్ళగా ఆమె జ్వరం 4 రోజులలోనే  పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే వారు అంధేరీలో వారి ఇంటికి తిరిగి వచ్చేసారు. కాని 10 రోజుల తరువాత వినాయక్ భార్యకి మళ్ళీ వ్యాధి తిరగబెట్టింది. వినాయక్ తన భార్య ఆరోగ్య విషయంలో ఇంక ఆశ వదులుకొని ఆమెని వాళ్ళ సొంత ఊరికి తీసుకెళ్ళాలని అనుకున్నాడు. ఇంతలో బాబా అతని భార్యకి స్వప్న దర్శనమిచ్చి “త్వరలోనే కోలుకుంటావ”ని చెప్పారు. ఇది జరిగిన 15 రోజుల్లోనే ఆమెకు జ్వరం తగ్గి, నిదానంగా  ఆరోగ్యం మెరుగుపడుతూ కొద్దిరోజులలోనే పూర్తిగా కోలుకుంది. తరువాత ఆమె నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.

జూన్ నెలలో ఒక గురువారం రోజున బాబా వినాయక్ భార్య ముందు ప్రత్యక్షమై తనకి ఒక పట్క(తలకి చుట్టుకునే వస్త్రం) కావాలని అడిగారు. అది తన దగ్గర లేనందున ఆమె బాబాకి కొద్దిగా బియ్యం, పప్పు దినుసులు సమర్పించుకుంది. బాబా ఆమె ఇచ్చిన భిక్ష స్వీకరించి అదృశ్యమైపోయారు. నిజానికి ఆమె బాబాని ఎప్పుడూ చూడలేదు. ఆమె తన భర్తకి ఆ వివరాలు చెప్పగా, ఆమె చెప్పిన పోలికలను బట్టి బాబాయే స్వయంగా వచ్చారని నిర్ధారణకి వచ్చాడు వినాయక్.

బాబా ఎల్లప్పుడూ తన వెనకాలే వుంటూ తనని అన్ని విధాలుగా రక్షిస్తున్నారని వినాయక్ గట్టిగా నమ్మేవాడు. ఎప్పుడే కష్టం వచ్చినా బాబా సహకారంతో అతను వాటినుండి బయటపడేవాడు.

1933వ సంవత్సరంలో వినాయక్ శిరిడీలో 20 రోజులు వునాడు. అప్పడు తరచూ స్వప్నంలో బాబా అతనికి దర్శనమిస్తూ వుండేవారు. అతను ఉదీ మహిమల అనుభవం కూడా పొందాడు. అదే సంవత్సరంలో ఒకసారి బాబా వినాయక్ కి స్వప్నంలో కనిపించారు. ఆ స్వప్నంలో బాబాకి ఒక రూపాయి దక్షిణగా వినాయక్ సమర్పించుకున్నాడు. బాబా దానిని వినాయక్ కి తిరిగి ఇచ్చేస్తూ “ఎంత కావాలి అంటే అంత తీసుకో” అని అన్నారు. మరుసటి నెలలోనే వినాయక్ అనుకోకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందాడు.

సోర్స్: Devotees' Experiences of Sri Sai Baba, Parts I, II and III by Poojya Shri.B.V.Narasimha Swamiji,

సాయి పాదుకలు నెల్లూరు వచ్చిన వేళ - భక్తురాలికి కలిగిన చక్కని అనుభవం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

నెల్లూరు నుండి ఒక సాయిబంధువు తమ అనుభవాన్ని ఇలా తెలియజేస్తున్నారు.

ఈ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా దేశమంతటా ఒక్కొక్క ఊరికి భక్తుల సందర్శనార్ధం బాబా పాదుకలను తీసుకుని వస్తున్నారన్న విషయం అందరికీ తెలిసినదే. అందులో భాగంగానే మొన్న అంటే 2018 సెప్టెంబర్ 21, శుక్రవారం సాయంత్రం బాబా పాదుకలను నెల్లూరు పట్టణానికి తీసుకొని వచ్చారు. బాబా కృపావర్షమా అన్నట్లుగా పాదుకలు వచ్చేముందు నెల్లూరులో భారీ వర్షం కురిసింది. ఆ వానలో కూడా భక్తులు బాబా పాదుకల రాకకు ఎంతో ఆత్రంగా ఎదురుచూసారు. పాదుకలు అన్నమయ్య సర్కిల్ కి రాగానే భక్తులు బాబా పాదుకలకు నీరాజనాలు పట్టారు. కోలాటాలతో, సాయి నామస్మరణతో ప్రతి భక్తుని మనస్సు పులకరించిపోయింది. తరువాత భక్త జనసందోహం మధ్య వైభవంగా ఊరేగింపుగా పాదుకలను తీసుకొని వచ్చి నెల్లూరు గొలగమూడి రోడ్డులో ఉన్న వి.పి.ఆర్. కన్వెన్షన్ సెంటర్ లో భక్తుల దర్శనార్ధం ఉంచారు. సెప్టెంబర్ 22, 23 తేదీలలో బాబా పాదుకలను వేలాది భక్తులు దర్శించి తరించారు. ఆ దేవాదిదేవుడు, సద్గురు శ్రీ సాయినాథుని పాదుకల రాకతో మా నెల్లూరు పట్టణానికి ఒక కొత్త కళ వచ్చింది. ఏ మోము చూచినా ఆనంద దరహాసంతో ఒక పండుగ వాతావరణంలా అనిపించింది.

రెండవరోజు బాబా నాకిచ్చిన గొప్ప అనుభవం:

తేది. 22.09.2018 శనివారం సాయంత్రం నేను, మా బాబు, మా నాన్నగారు, మా ఫ్రెండ్ నలుగురం కలిసి బాబా పాదుకల దర్శనార్థం వెళ్లి పాదుకలను దర్శించి బాబా అశీస్సులు పొందాము. అయితే ఈ పాదుకలు ఉంచిన హాల్ పట్టణానికి దూరంగా ఉండటం వలన వాహన సౌకర్యం చాలా తక్కువగా ఉంది. పైగా పాదుకల దర్శనార్ధం చాలామంది భక్తులు రావడంతో చాలా రద్దీగా ఉంది. అప్పుడప్పుడు వస్తున్న ఆటోలలో దాదాపు 20 మంది దాకా ఇరికించి మరీ తీసుకుని పోతున్నారు. దర్శనానంతరం మేము తిరిగి వెళ్దామంటే ఆటోలో అంతేసి జనం చూసి చిన్నపిల్లాడితో ఎలా వెళ్తామని నాకు భయమేసింది. సరే క్యాబ్ బుక్ చేద్దామని ప్రయత్నించాను. నేను రెండు క్యాబ్ లను బుక్ చేసినా కూడా వాళ్ళు ఎందుచేతనో క్యాన్సిల్ చేసారు. ఇంక చేసిదిలేక ఆ దారిలో వస్తున్న కార్లని కూడా లిఫ్ట్ అడిగాను. వాళ్ళు కూడా ఎవరూ ఆపలేదు. మావాళ్ళు విసిగిపోయి దూరంగా కూర్చున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా నా మనసుకు ఎందుకో, "బాబా ఉన్నారు, మాకు ఏ ఇబ్బందీ ఉండదు, చాలా సౌకర్యవంతంగా వెళ్తామ"ని అనిపిస్తూ ఉంది. అంతలో ఒక ఆటో వచ్చింది. దాని చుట్టూ దాదాపు ఒక 30 మంది చేరారు. ముందు ఆటోవాళ్ళలాగా ఇతను కూడా ఎక్కించుకుంటే ఎంత లేదన్నా ఒక 300 రూపాయలు వరకు వస్తుంది అతనికి. కానీ ఆ ఆటో అతను వాళ్ళందరినీ పట్టించుకోకుండా నావైపు చూసాడు. నేను, "బి.వి. నగర్ వస్తారా?" అని అడిగితే, అతను 150 రూపాయలు అడిగాడు. నేను 100 రూపాయలు ఇస్తానన్నాను. అతను సరేనన్నాడు. అయితే మేము ఇంటికి చేరుకున్నాక ఆటో దిగి, నేను 100 రూపాయలు ఇస్తే అతను ఇంకో 2 రూపాయలు అడిగాడు. "దేనికి ప్రత్యేకంగా రెండు రూపాయలు?" అని అడిగితే, "నాది కొత్త ఆటో అమ్మా, మొదట మీరే ఎక్కారు. మొదటి బోణి మీదే" అన్నాడు. నేను అతనికి రెండు రూపాయలు ఇచ్చి 'చాలా థాంక్స్ అండీ' అని చెప్పాను. కానీ నా మనసుకెంతో ఆనందంగా అనిపించింది, ఎందుకంటే అంత రష్ లో ఒకే ఆటోలో 20 మంది మధ్య ఇబ్బంది పడకుండా బాబా మమ్మల్ని కొత్త ఆటోలో సౌకర్యవంతంగా ఇంటికి చేర్చారు. పైగా ప్రత్యేకించి 2 రూపాయలు(శ్రద్ధ, సబూరీ) అడగడంతో అది తమ అనుగ్రహమే అని బాబా స్పష్టం చేశారు.

మరో ముఖ్య విషయం, బాబా పాదుకలు నెల్లూరు వస్తున్నాయని మా అన్నయ్య వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. కానీ, వెళ్లి దర్శించుకోవడానికి నాకు వీలవుతుందో, లేదోనని బాధపడ్డాను. కానీ బాబా నన్ను ఎంతలా అనుగ్రహించారంటే మూడు రోజులూ కూడా పాదుకలను దర్శించుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు బాబా.  చాలా చాలా ధన్యవాదాలు బాబా! ఎప్పటికీ మీ బిడ్డలపై మీ అనుగ్రహాన్ని ఇలాగే కురిపించండి బాబా.

బాబాని మనం ఏదైనా అడిగితే ఇస్తారా? అడగకపోయినా ఇస్తారా?


బాబాని మనం ఏదైనా అడిగితే ఇస్తారా? అడగకపోయినా ఇస్తారా? అంటే దానికి సూటిగా ఒకటే సమాధానం - ఆయనకి తన భక్తుల అవసరాలు తెలుసు. వాళ్ళకి ఏది శ్రేయస్కరమో ఆయనకు తెలుసు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన తన భక్తులు అడిగినా, అడగకున్నా వాటిని అనుగ్రహిస్తూ ఉంటారు. వారికి భక్తులయందు అమితమైన ప్రేమ, వారిని ఎల్లవేళలా కంటికిరెప్పలా చూసుకుంటూ, కన్నతల్లిలా అవసరమైన వాటిని సరైన సమయానికి అందిస్తూ ఉంటారు.

పై రెండు ప్రశ్నలకు సంబంధించినటువంటి రెండు అనుభవాలను బాబా ఆదివారం(23.09.2018) నాకు ప్రసాదించారు. వాటిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

బాబాను అడిగిన వెంటనే అనుగ్రహించిన అనుభవం:

మా కంప్యూటర్ లో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ నిన్నటితో ఎక్స్పైర్ కావడంతో రాత్రి కొత్త యాంటీవైరస్ ఇన్స్టాల్ చేశాము. అయితే సాఫ్ట్ వేర్ యాక్టివేట్ చేద్దామంటే అది బై డిఫాల్ట్ IE (Internet Explorer) బ్రౌజర్ లో ఓపెన్ అవడానికి వెళ్తుంది. అయితే మా సిస్టమ్ లో IE బ్రౌజర్ ప్రాబ్లమ్ ఉంది. ఇదివరకు మేము ఎన్నోసార్లు IE అప్డేట్ చేయాలని ప్రయత్నించాము కానీ, అవలేదు. డైరెక్ట్ గా బ్రౌజర్ నుండి అప్డేట్ చేయాలన్నా, లేదా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసి అప్డేట్ చేద్దామన్నా కూడా మా సిస్టమ్ లో సాధ్యపడలేదు. అందువలన మేము IE ఉపయోగించడమే మానేసాము. కానీ ఇప్పుడు దానవసరమే వచ్చింది. అది అప్డేట్ కావడంలేదు. అది అప్డేట్ కాకపోతే యాంటీ వైరస్ యాక్టివేట్ కావడంలేదు. ఆల్రెడీ కొత్త యాంటీ వైరస్ వేయడానికి పాతది కూడా తీసేసాము. యాంటీ వైరస్ తప్పనిసరిగా కావాలి కాబట్టి ఏమిచేయాలో తోచలేదు. ప్రోబ్లమ్ సాల్వ్ చేయడానికి గూగుల్ లో సెర్చ్ చేసి  ప్రయత్నించాము. మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి కూడా అడిగాను. కానీ ఏవిధంగానూ పరిష్కారం దొరకలేదు. చివరికి, "బాబా! ఇప్పుడెలా? బ్లాగు వర్క్ ఆగిపోతుంది. అసలే నేను ఒక పదిరోజులు ఊరికి వెళ్లాల్సి ఉంది. నేను లేని సమయంలో బ్లాగులో లీలలు అప్లోడ్ చేయడం ఆగకుండా నేను షెడ్యూలు కూడా చేసుకోలేదు. ఇప్పుడీ సమస్య వలన నేను బ్లాగు వర్క్ ఎలా చేయగలను? బాబా, మీరే ఏదో ఒక సహాయం చేయండ"ని బాబాను ప్రార్థించాను. అప్పటికే రాత్రి 10.30 దాటింది. పిలిచిన పలికే దైవం కదా మన బాబా. వెంటనే అద్భుతం మొదలైంది. బాబాని ప్రార్థించిన తరువాత బహుశా ఆయన ప్రేరణే, ఏదో అలా బ్రౌజ్ చేస్తూ ఉంటే అనుకోకుండా IE లేటెస్ట్ వెర్షన్ ఫైల్ డౌన్లోడ్ లింక్ కనిపించింది. సరే ప్రయత్నిద్దామని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేశాను. ఆశ్చర్యం! ఇంతకుముందు మేము ఒక 15 సార్లు చేసినా అప్డేట్ కానిది, ఇప్పుడు బాబా దయతో విజయవంతంగా ఇన్స్టాల్ అయిపోయింది. బాబా చేసిన అద్భుతానికి మమ్మల్ని మేమే నమ్మలేకపోయాం. నాకు చాలా సంతోషంగా అనిపించి, బాబాకు కృతఙ్ఞతలు చెప్పుకున్నాను. బ్లాగు వర్క్ కి బ్రేక్ వస్తుందని చాలా ఆందోళన పడ్డాను, కానీ బాబా నా ప్రార్థనను మన్నించి సమస్యను పరిష్కరించడంతో ప్రశాంతంగా పడుకున్నాను. 

బాబాని అడగకుండానే ఆయన అనుగ్రహించిన అనుభవం:

దాదాపు సంవత్సరం, సంవత్సరమున్నర క్రిందట ఇమేజ్ ఫైల్ లో ఉండే టెక్స్ట్ ని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో OCR సాఫ్ట్ వేర్ ద్వారా చేయొచ్చని తెలిసి, ఆ సాఫ్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించాను. కానీ అది ఇంగ్లీష్ వరకు వర్క్ అవుతుంది కానీ తెలుగు టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడం సాధ్యపడలేదు. నా ప్రయత్నాలు ఫలించక నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతనిని ఆ విషయమై సహాయం అడిగాను, కానీ తన ద్వారా కూడా నాకు సహాయం అందలేదు. ఆ సమయంలో కనీసం బాబా సహాయం కూడా నేను అడగలేదు. ఇంక ఏమీ చేసేది లేక దానిగురించి మరచిపోయాను. అయితే బాబా చేసిన అద్భుతం చూడండి. నిన్న నేను బ్లాగులో బాబా లీలను అప్లోడు చేసిన తరువాత ఎవరో ఒక సాయిబంధువు చేసిన కామెంట్ చూసి నేను ఆనందాశ్చర్యాలకు లోనయ్యాను. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా కామెంట్ చేస్తే ఆ లీల గురించిగాని, లేకపోతే కేవలం 'సాయిరామ్' అని గాని చేస్తారు. కానీ ఆ సాయిబంధువు ఇమేజ్ ఫైల్ లో వున్న తెలుగు టెక్స్ట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో చూపించే లింక్ ని షేర్ చేశారు. అలా ఆ సాయిబంధువు ద్వారా సంవత్సరమున్నర క్రిందటి నా ప్రయత్నానికి బాబా జవాబు ఇచ్చారు. అసలు నేను ఆ సమస్య గురించి ఎవరికీ చెప్పలేదు, ఎవరినీ అడగలేదు, అలాంటిది ఎవరికి తెలుస్తుంది నా సమస్య గురించి? (మనందరివాడైన బాబాకి తప్ప!) ఆ కామెంట్ చూసిన నా ఆనందానికి అవధులు లేవు. నాకది ఎంతో ఉపయోగపడుతుందని బాబాకి తెలుసు కాబట్టి నేను అడగకపోయినా అద్భుతంగా బాబా నాకు కావలసింది అందించారు. బాబా లీలలు అమోఘం.

"బాబా! ఎప్పటికీ మీ సహాయ సహకారాలతో ఈ బ్లాగు ఇలాగే కొనసాగుతూ వుండాలి. ఎందరో సాయిబంధువులకు మీ భక్తుల అనుభవాల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం అందాలని, మరియు వారి భక్తి విశ్వాసాలు దృఢపడేందుకు ఈ బ్లాగు ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను."

దారి చూపుతూ జాగ్రత్తగా నన్ను హోటల్ కి చేర్చారు నా సాయి


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

అందరికీ నమస్కారం, ఓం సాయిరాం. నేను బ్లాగ్ కి కాస్త కొత్త. బ్లాగ్ లో అందరి అనుభవాలు చదివి, సాయి నాకు ఇచ్చిన అనుభవాన్ని కూడా అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. దారి తప్పిపోయిన నాకు, తలచిన వెంటనే సాయి చేసిన సహాయం మరువలేనిది. నేను గత సంవత్సరం బిజినెస్ పని మీద కౌలాలంపూర్ వెళ్ళినప్పుడు ఒకనాటి రాత్రి సాయి నాకు ఈ అనుభవం ఇచ్చారు. సాయి చేసిన సహాయానికి సదా నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను.
నేను కౌలాలంపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నొవోటెల్ హోటల్ లో రూమ్ తీసుకున్నాను. ఆ రాత్రి డిన్నర్ కోసం Bukit Bintang మాల్ కి వెళ్ళాను. డిన్నర్ అయ్యాక బయటకి వచ్చి చూసేసరికి సమయం రాత్రి పదిగంటలు అవుతోంది. నేను కంగారులో ఇంకో గేటు నుండి బయటకి వచ్చి దారి తప్పిపోయాను. ఆ ప్రదేశంలో నేను తప్ప ఎవరూ లేరు. నేను సహాయం కోసం అన్నివైపులా వెతికాను, కానీ ప్రయోజనం లేదు. కొంతసేపటికి ఒకరిద్దరు వ్యక్తులు కనిపించినా, వారు నాకు దారి చెప్పి సహాయం చేయలేకపోయారు. అప్పటికే చాలా ఆలస్యం అయినందువల్ల నాలో ఏదో తెలియని గాభరా, ఆందోళన మొదలయ్యింది.

మనసులోనే నేను హోటల్ కి జాగ్రత్తగా వెళ్ళడంలో సహాయం చేయమని నా సాయిని వేడుకున్నాను. ఇంక చేసేది లేక నేరుగా నడుస్తూ ముందుకు వెళ్తుండగా, మార్గంలో ఒక జనరల్ స్టోర్ ఎదురయింది. ఒక అందమయిన మధ్య వయసు గల మలేషియా స్త్రీ అక్కణ్ణించి నేరుగా నా వద్దకు వచ్చి, “మీరు నొవోటెల్ కోసం చూస్తున్నారా?” అని అడిగారు. నేను ఆశ్చర్యంగా  'అవున'ని బదులిచ్చాను. ఆమె స్వయంగా నన్ను హోటల్ కి తీసుకొని వెళ్తానని చెప్పారు. నాకంటే కాస్త ముందు ఆమె వడివడిగా నడుస్తూ వెళ్తున్నారు. నేను ఆమెను వెంబడించాను. ఆమె హోటల్ గేటు దాకా వచ్చారు. అప్పటిదాకా నాకు మార్గం చూపించి నాతోనే ఉన్నారు. నేను కాస్త అటు ఇటు చూసి ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకుందామని చూసేసరికి, ఆవిడ అప్పటికే చాలా దూరం వెళ్ళి ఉన్నారు. అది ఏ మలుపులు, సందులు లేకుండా తిన్నగా ఉన్న రోడ్డు. కానీ అకస్మాత్తుగా ఆమె ఎక్కడా కనిపించలేదు. అలా ఎంతసేపు గమనించినా ఆమె జాడ ఎక్కడా కానరాలేదు. ఆ వచ్చిన స్త్రీ ఖచ్చితంగా నా సాయే. లేకుంటే నేను నొవోటెల్ హోటల్ కే వెళ్తున్నానని ఆమెకి ఎలా తెలుస్తుంది, నేరుగా వచ్చి నొవోటెల్ హోటల్ కోసం చూస్తున్నారా అని నన్ను అడగటానికి? ఆ రూపంలో వచ్చి హోటల్ వరకు నాకు మార్గం చూపి, నన్ను సురక్షితంగా హోటల్ చేర్చారు. తన భక్తులు ప్రపంచం ఏ మూలన ఉన్నా, వారు కష్టాలలో ఉంటే సాయి వాళ్ళకి సదా అండగా నిలుస్తారు. ఆనాడు సాయి నాకు దర్శనం ఇచ్చిన ఆ అందమైన మధ్యవయసు గల మలేషియా స్త్రీ రూపాన్ని నేను నా మదిలో పదిలంగా నిలుపుకున్నాను.

ఓం సాయిరాం!!!

అజ్ఞాతవ్యక్తి రూపంలో సాయిబాబా సహాయం


01 మార్చి 2017 నాటి సాయి లీలలు

నా పేరు అనితాకాంత్, నేను ముంబాయి నివాసిని. నేను నా ఇంటిలో ప్రైవేటు ట్యూషన్లు చెప్తూ ఉంటాను. మేము 9వ అంతస్తులో ఉంటున్నాం. మా అపార్టుమెంటులో 2 లిఫ్టులు ఉన్నాయి. ఒకదానికి ఆటోమేటిక్ డోర్స్, మరొకదానికి నార్మల్ డోర్స్ ఉన్నాయి.

ఒక సాయంత్రం 5 గంటలకు నా విద్యార్థులు ప్రియాన్షీ, శ్రుతి (ఇద్దరు బాలికలు) మరియు నామ్ (బాలుడు) 3 మరియు 9వ తరగతి చదువుతూ ఉన్నారు. డియా మరియు ఖుషి 1వ తరగతి చదివే పిల్లలు. ట్యూషన్ పూర్తై, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. నేను లిఫ్ట్ వచ్చేవరకు వేచి ఉండమని వాళ్ళకి చెప్పి, నేను కూడా లిఫ్ట్ వచ్చేవరకు ఉండి, పిల్లల్ని లిఫ్ట్ లోకి పంపి డోర్స్ క్లోజ్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి టీ త్రాగబోతుండగా ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ చూస్తే, ప్రియాన్షి కాల్ చేస్తూ ఉంది. కాల్ లిఫ్ట్ చేయగానే, తాము లిఫ్టులో చిక్కుకున్నామని ప్రియాన్షి చెప్పింది. ఒక్కక్షణం నేను అవాక్కై, ఏ అంతస్తులో ఉన్నారని అడిగాను. అదే ఫ్లోర్ కానీ కొద్దిగా క్రిందకు దిగింది అని చెప్పింది. బయటకు వస్తే వారి గొంతులు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి. నెట్ వర్క్ సమస్య కారణంగా ఫోన్లు ఆటోమేటిక్ లిఫ్టులో పనిచేయవు, కానీ బాబా దయవలన కాల్ వచ్చింది. నేను, "ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండండి" అని వారికి చెప్పి, నా ఇంటి నుండి బయటకు వచ్చి, సొసైటీ వాచ్ మెన్ ని పిలిచాను.

వాచ్ మెన్ వెంటనే పైకి వచ్చి 10 నిమిషాలు ప్రయత్నించాడు, కానీ డోర్స్ ఓపెన్ చేయలేక మరొక వాచ్ మెన్ ని పిలవాలని చెప్పాడు. నేను చాలా భయపడి, 'సాయిబాబా! సాయిబాబా!' అని బాబాని స్మరించుకుంటూ మరొక వాచ్ మెన్ ని పిలవడానికి క్రిందకి వెళ్ళాను. అక్కడ వాచ్ మెన్ కనిపించలేదు. కాని నేను ఇద్దరు మనుష్యులను చూశాను. ఒకరు మంచి శరీర దారుఢ్యంతో పొడవుగా ఉండగా, రెండవ అతను నల్లని ఛాయలో సన్నగా ఉన్నాడు. శరీర దారుఢ్యం ఉన్న వ్యక్తి సహాయం చేయగలడనే ఆలోచనతో అతనిని అభ్యర్ధించాను. కానీ అతను ఏదో గొణుగుతూ వెళ్ళిపోయాడు. ఇంతలో రెండవ వాచ్ మన్ వచ్చాడు. వెంటనే మేము మేడ మీదకి పరుగెత్తాం. దియా నాన్నగారు కూడా వచ్చారు. నేను ఆయనకు జరిగిందంతా చెప్పాను. ఆయన చింతించవద్దన్నారు. ఇద్దరు వాచ్ మెన్ లు ప్రయత్నిస్తున్నారు కానీ డోర్ ఓపెన్ కాలేదు. పిల్లలు 30నిమషాలు పైగా లోపల ఉండిపోయారు. సొసైటీ కార్యదర్శి కూడా ప్రయత్నించాడు, కానీ తలుపులు తెరుచుకోలేదు. ఏం చేయాలో తోచట్లేదు, ఒకటే కంగారుగా ఉంది. ఇంతలో ఇంతకుముందు నేను చూసిన ముదురు రంగులో ఉన్న సన్నని వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను ఎవరన్నది మాకెవరికీ తెలియదు. అతను డోర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. మొత్తానికి అతను తలుపులు పాక్షికంగా తెరవగలిగాడు. అతను 45 నిమిషాలపాటు అలాగే తలుపులు పట్టుకున్నాడు. నేను పిల్లలకు కొన్ని స్నాక్స్ అందించి, పిల్లలని ప్రశాంతంగా ఉండమని, చిన్న పిల్లల్ని ఆడిస్తూ వారి దృష్టిని మళ్ళించమని కొంచెం పెద్ద అమ్మాయికి చెప్పాను. లిఫ్ట్ నిర్వహణ కాంట్రాక్టర్ ని సంప్రదిస్తే, సాంకేతిక నిపుణులు సహాయం చేసేందుకు వస్తూ ఉన్నారని చెప్పారు. కొద్దిసేపటిలో వారు వచ్చి, తలుపులు తెరిచారు. మొత్తానికి 6.30pmకి పిల్లలు బయటకు వచ్చారు. పిల్లల్ని గట్టిగా హత్తుకొని ఏడ్చేసాను. వెంటనే బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను.

మరుసటి ఉదయం ప్రియన్షీ వచ్చి, తన చేతులతోను, కాళ్ళతోను లిఫ్ట్ తలుపులు తెరిచి పట్టుకున్న వ్యక్తి షూ నుండి ఒక అద్భుతమైన కాంతి కనిపించిందని, "మమ్మల్ని కాపాడటానికి సాయి అరూపంలో వచ్చారని" లోపల ఉన్న మాఅందరికి అనిపించిందని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తరువాత మేమంతా అతను ఎవరని చర్చించుకున్నాం. సొసైటీలో ఎవరూ ఇంతకుముందు ఎప్పుడూ అతనిని చూడలేదని, అతను ఎక్కడ నుండి వచ్చాడో, అక్కడ నుండి ఎలా అతను అదృశ్యమయ్యాడో గుర్తించలేదని చెప్పారు.

ఓమ్ సాయిరామ్. బాబా! పిల్లలను ఆశీర్వదించు.

బాబా చూపిన కరుణను పొగిడేందుకు నాకు మాటలు రాలేదు


నేను భువనేశ్వర్ నుండి మాధవి. సాయిబంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే లీలను ఎలా వర్ణించాలో నాకు అర్థం కావటం లేదు. దీన్ని సాయి లీల అనేదానికన్నా, ఆయనకు తన భక్తుల మీద చెప్పనలవికాని కరుణ అంటే బాగుంటుంది. ఇది యు.ఎస్.ఏలో ఉంటున్న ఒక సాయిభక్తుని అనుభవం. గురువారం(తేది. 20.09.2018) నాడు తనపై బాబా చూపిన కృపను వెంటనే నాతో పంచుకున్నారు. తన పేరు వెల్లడి చేయవద్దని చెప్పినందువలన ఇక్కడ ఆయన పేరు ప్రస్తావించడం లేదు. ఇక అసలు విషయాన్ని ఆయన మాటలలోనే విందాము. 

సాయిరామ్ అమ్మా మాధవీ! ఈరోజు బాబా చూపిన లీల నీతో పంచుకోవాలనిపించింది తల్లీ! నా ఆనందాన్ని ఆపుకోలేక మీకిప్పుడు అర్థరాత్రి అని తెలిసినా ఈ లీలను మెసేజ్ చేస్తున్నాను తల్లీ. మొన్న సోమవారం మాఇంటి తోటలో పసుపు గులాబీ మొక్కకు రెండు మొగ్గలు ఉన్నాయి. గురువారంనాడు బాబా పూజకు ఇవి అద్భుతంగా ఉంటాయి అని అనుకుంటూ నా మనస్సులో ఎంతో సంతోషించాను. రోజూ సాయంత్రం ఎంతో కుతూహలంగా వాటిని చూసుకునేవాడిని. అవి నిన్న బుధవారం సాయంత్రానికి పూర్తిగా విచ్చుకున్నాయి. వాటిని తుంచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాం అనుకున్నాను కానీ, మళ్ళీ ఎందుకులే ఇప్పుడు తీసేయడం, రేపు పొద్దునే తీసుకోవచ్చు అనుకొని అలాగే ఉంచాను. ఆ రెండు గులాబీలలో ఒకటి బాబాకి, ఇంకోటి దక్షిణామూర్తికి పెడదాము అనుకున్నాను. గురువారం రానే వచ్చింది. ఉదయాన్నే తొందరగా లేచి తోటలోకి వెళ్లి చూస్తే అసలు అక్కడ పువ్వులు లేవు. సోమవారం నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తే ఇప్పుడు పువ్వులు ఎక్కడకి పోయాయి? బహుశా బాబాకు ఇష్టం లేదేమో అనుకొని మనసులో చాలా బాధపడ్డాను. అంతేకదా, మనం మాములు మనుషులం, ముందు వెనక ఆలోచించకుండా బాధ పడిపోతాము. కానీ, "తాను ఒకటి తలచిన, దైవం ఇంకొకటి తలచును" అనే సామెత ప్రకారం దైవం ఆలోచన వేరేగా ఉంది. తరువాత నేను పూజ చేసుకుందామని పూజ గదిలోకి వెళ్ళాను. అక్కడ చూస్తే ఆ రెండు పసుపు గులాబీపూలు దక్షిణామూర్తికే పెట్టి ఉన్నాయి. బహుశా నా కోడలు వాటిని తెచ్చి పెట్టి ఆఫీసుకు వెళ్ళిపోయి ఉంటుందనుకున్నాను. కానీ మనసులో, "అయ్యో! బాబా, నేను మీకు ఒక్క గులాబీ కూడా సమర్పించుకోలేకపోయాను. ఇదే భారతదేశం అయివుంటే వెంటనే బజారుకు వెళ్లి మీకోసం పువ్వులు తెచ్చేవాడిని. కానీ నాకు ఇక్కడ ఏమీ తెలియదు. నన్ను క్షమించు బాబా" అనుకొని నా రోజువారీ పారాయణ మొదలుపెట్టాను. ఇంతలో ఆశ్చర్యం! దక్షిణామూర్తికి పెట్టిన పసుపు గులాబీ పూరేకులు రాలి నా సాయిచరిత్ర గ్రంథం మీద పడ్డాయి. ఆ సమయంలో గాలి కూడా లేదు. కానీ అవి వాటంతటవే రాలి పడడం నాకు ఏదో అద్భుతం జరిగినట్లుగా అనిపించింది. బాబా కృపకు చాలా ఆనందంగా అనిపించింది. కానీ ఆయన చేసిన అసలు లీల చూడండి! పూజ అయిపోయాక నీళ్ళ కోసం వంటగదిలోకి వెళితే అక్కడ ఫ్రెష్ గా ఉన్న గులాబీ పూరేకులు బోలెడన్ని ఉన్నాయి. ఇంట్లో ఎవ్వరూ లేరు, అంతకుముందు నేను అక్కడ చూసినప్పుడు అవి లేవు. నేను పారాయణ పూర్తి చేసి వచ్చినంతలోనే అవి అక్కడికి ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చి పెట్టారు? నాకంతా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఆనందం పట్టలేకపోయాను. ఆ పూరేకులను తెచ్చి బాబా పాదాలకు సమర్పించుకున్నాను. బాబాకు గులాబీ సమర్పించలేకపోయానని బాధపడినందుకు బాబా చేసిన అద్భుతమిది. ఆయన చూపిన కరుణను పొగిడేందుకు నాకు మాటలు రావడంలేదు.

చెప్పుకుంటే చిన్న లీలే. కానీ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఒక భక్తుని హృదయంతరాళాల్లో ఉన్న చిన్న కోరికను బాబా తీర్చారు. అంటే ఆయనకు తన భక్తులపైన ఎంతటి కృపో!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఇంటికొచ్చి ఇచ్చిన అనుభూతి


నా పేరు భాస్కరాచార్యులు. నేను తాడేపల్లిగూడెం నివాసిని. ప్రతిరోజూ బ్యాంకుకి వెళ్ళేటప్పుడు బాబా మందిరం ముందు ఆగి బైక్ మీద నుండే మందిరం లోపలి బాబాని దర్శించుకొని, ఆయనకు నమస్కారం చేసుకుని వెళ్లడం నాకలవాటు. అలాగే 2018, సెప్టెంబర్ 20, గురువారంనాడు బ్యాంకుకి వెళ్ళేటప్పుడు, 'గురువారం కదా! బాబా ప్రత్యేక అలంకారంలో, కిరీటంతో అక్కడి లైటింగ్‌లో చాలా ప్రకాశవంతంగా, అందంగా కనిపిస్తార'ని ఆశగా చూసాను. కానీ, డోర్ కర్టెన్ దగ్గర బ్యానర్ కట్టడం వలన నాకు బాబా దర్శనం అవలేదు. 'సరే, ఏమి చేస్తాం, ఇప్పటికే ఆలస్యం అయిపోయింద'ని బయట బోర్డులో బాబాని చూసి సరిపెట్టుకుని వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చేటప్పుడు ఉదయం బాబా దర్శనం కాలేదన్న సంగతి మర్చిపోయి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. కానీ బాబా తమ భక్తులు మరచిపోతే ఆయన ఊరుకుంటారా! ఆయనకు తన భక్తులపై అమితమైన ప్రేమ కదా!. రాత్రి 7.30 గంటల సమయంలో నేను వాట్సాప్‌లోని స్టేటస్‌లు చూస్తున్నప్పుడు నా స్నేహితుడు ఒకతను పెట్టిన మా టెంపుల్‌లోని ఆ రోజు ఉదయం బాబా ఫొటోలు చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, నా స్నేహితుడు అప్పటివరకు సినిమా క్లిప్స్ మాత్రమే తన స్టేటస్‌లో పెట్టేవాడు. తను బాబాని స్టేటస్‌లో పెట్టడం అదే మొదటిసారి. ఆ ఫోటోలు చూస్తూనే నేను ఆరోజు ఉదయం బాబా దర్శనాన్ని మిస్ అయ్యానని గుర్తొచ్చి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు నాకోసం మా ఊరి టెంపుల్ నుండి మా ఇంటికొచ్చినంత అనుభూతి కలిగింది. బాబా చూపిన ప్రేమకు ఆనందంతో గుండె బరువెక్కి, నా కళ్ళనుండి కన్నీళ్లు వచ్చేసాయి. వెంటనే ఈ ఆనందాన్ని సాయిబంధువులతో పంచుకోవాలనిపించింది. నా స్నేహితుడు వేరే ఎక్కడి బాబా ఫోటోనో పెడితే నేను మర్చిపోయిన విషయం నాకు గుర్తుకు వచ్చేది కాదు, ఇంతటి బాబా ప్రేమ అనుభూతిలోకి వచ్చేది కాదు. చూశారా! మన సాయి ఇంటికొచ్చి మరీ ఎలా తమ గురువారంనాటి అలంకారం చూపించారో? మనం ఆయనను మరచిపోయినా ఆయన ఎంత అప్రమత్తంగా ఉంటారో కదా! క్రింద ఆ ఫోటో జతచేస్తున్నాను. మీరు కూడా దర్శించుకోండి. ఆపై ఫోటోలో టైం చూడండి బాబా మనపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో అర్ధం అవుతుంది. నేను 10గంటల సమయంలో ఆయన దర్శనాన్ని మిస్ అవుతానని, ఆయన అంతకుముందే గం. 8.46 నిమషాలకే నా ఫ్రెండ్ తో ఫోటో తీయించుకున్నారు. ఆయన మన ప్రతి కదిలకపై యెంత శ్రద్ధ వహిస్తున్నారో చూశారా! మనం మాత్రం ఆయనపై శ్రద్ధ నిలపలేకపోతున్నాము. "బాబా! మేము కూడా మీ యందు సదా శ్రద్ధ నిలపగలిగేలా అనుగ్రహించండి".

కెప్టెన్ హాటే


సాయిభక్తుడు డాక్టర్ వినాయక్ రావు గోపీనాథ్ హాటే గారి ప్రస్తావన శ్రీసాయి సచ్చరిత్ర 29వ అధ్యాయంలో ఉంది. శ్రీసాయి సచ్చరిత్ర రచించిన శ్రీ హేమాడ్ పంత్(దభోల్కర్) గారు హాటే గారిని కెప్టెన్ హాటేగా సంబోధించారు.
హాటే గారు వృత్తిరీత్యా వైద్యులు. వారు దైవజ్ఞ సంతతికి చెందినవారు. హాటే గారు బాబా శిరిడీలో ఉన్నకాలంలో సైన్యంలో కెప్టెన్ గా పనిచేస్తూ పదోన్నతులు పొందుతూ తుదకు కల్నల్ గా రిటైర్ అయ్యారు. ఒకప్పుడతనికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి శిరిడీకి రప్పించారు. అతను బాబా పట్ల అమితమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండేవాడు.

ఒకసారి హాటే గ్వాలియర్ లో నివసిస్తున్నప్పుడు బాబా స్వప్న దర్శనమిచ్చి, "నన్ను మర్చిపోయావా?" అని అడిగారు. అప్పుడు హటే బాబా పాదాలని పట్టుకుని, "బిడ్డ తల్లిని మర్చిపోతే, అతనికి ఇంకెక్కడ ఆశ్రయం లభిస్తుంది?" అని అన్నాడు. వెంటనే తాను తోటలోకి వెళ్లి చిక్కుడుకాయలను తెంపి, బియ్యం, పిండి, పప్పుదినుసులు మొదలగు వంట వస్తువులని, కొంత డబ్బుని దక్షిణగా సమకూర్చుకొని భక్తితో బాబాకి సమర్పించబోతుండగా అతనికి మెలకువ వచ్చింది. తనకి కలిగిన ఈ స్వప్నానికి హాటే సంతోషించి బాబాకి తాను స్వప్నంలో సమకూర్చిన వస్తువులతో శిరిడీకి వెళ్లి స్వయంగా వాటిని బాబాకు అర్పించాలని అనుకున్నాడు. కానీ తనకి వీలుపడక బొంబాయిలో నివసిస్తున్న తన మిత్రుడైన శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ గారికి తన స్వప్న వృత్తాంతాన్ని వివరిస్తూ లేఖ వ్రాసి, తన తరపున కాకాసాహెబ్ గారిని శిరిడీ వెళ్లి వాటిని బాబాకు సమర్పించవలసిందిగా అభ్యర్ధించాడు. అందుకు సరిపడా డబ్బులను మనీ ఆర్డర్ ద్వారా పంపుతానని, వాటితో నైవేద్యానికి కావాల్సిన బియ్యం, పిండి, పప్పుదినుసులు, మంచిరకం చిక్కుడుకాయలను తీసుకోమని, అవి తీసుకోగా మిగిలిన డబ్బుని బాబాకి దక్షిణగా నివేదించమని అభ్యర్ధించుకున్నాడు. బాబాకి అర్పించిన తరువాత తనకోసం బాబా వద్ద ప్రసాదం తీసుకొని పోస్ట్ ద్వారా గ్వాలియర్ పంపమని కూడా కాకాసాహెబ్ ను హాటే కోరాడు.

హటే వద్ద నుండి మనీ ఆర్డర్ అందిన వెంటనే దీక్షిత్ శిరిడీ వెళ్లి కావలసిన అన్ని వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయగా, వంట వస్తువులన్నీ దొరికాయి కానీ చిక్కుడుకాయలు లభ్యం కాలేదు. ఇప్పుడెలా అని ఆలోచిస్తున్నంతలో అక్కడికి కూరగాయలు అమ్మే ఒక స్త్రీ బుట్టనిండా చిక్కుడుకాయలతో వచ్చింది. అది చూసి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. కావాల్సిన అన్ని వస్తువులు సమకూరడంతో దీక్షిత్ వాటిని తీసుకొని మశీదుకి వెళ్లి బాబాకు సమర్పించాడు. బాబా వాటిని నిమోన్కర్ కు అప్పజెప్పి మరునాడు వాటిని వండి నైవేద్యానికి తీసుకొని రమ్మని చెప్పారు. మరునాడు బాబా భోజనానికి కూర్చొని అన్నం, పప్పు, ఇతర వంటకాలన్నింటిని ప్రక్కకి తోసేసి చిక్కుడుకాయల కూరనే ఎంతో ఇష్టంగా తిన్నారు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలిసిన హాటే ఎంతగానో సంతోషించాడు.

బాబా హస్తస్పర్శతో పవిత్రమైన రూపాయి నాణెం:

కొద్దిరోజుల తరువాత హాటేకి బాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి నాణాన్ని తన ఇంటిలో ఉంచుకోవాలని ఒక కోరిక కలిగింది. ఆ కోరికను కూడా కరుణామయుడైన బాబా అనుగ్రహించారు.

ఒకరోజు సావల్ రామ్ అను గ్వాలియర్ వాస్తవ్యుడు తన కుమారుడు తప్పిపోవడం చేత బాధపడుతూ హాటేను కలిసాడు. అప్పుడు హాటే, “శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోండి, బాబా దయవలన తప్పక మీ కొడుకు మీకు దొరుకుతాడు” అని చెప్పాడు. అందుకు సావల్ రామ్ అంగీకరించి శిరిడీ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ఇంతలోనే తన కుమారుడి నుంచి సావల్ రామ్ కు ఒక ఉత్తరం వచ్చింది. తానిప్పుడు ఈజిప్టు దేశంలో క్షేమంగా ఉన్నానని, అక్కడి సైన్యంలో చేరానని, తొందరలోనే భారతదేశానికి తిరిగి వస్తున్నానని, ముంబై నగరంలో వారిని కలుస్తానని లేఖలో వివరించాడు. ఆ లేఖను చదివిన సావల్ రామ్ ఆనందానికి అవధుల్లేవు. తాను తన భార్యతో కలిసి శిరిడీ వెళ్ళడానికి బదులు బొంబాయి వెళ్లి తన కొడుకుని కలుసుకున్నాడు. ఆ సమయంలో అతని కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. అతని ఆరోగ్యం బాగా క్షీణించిపోయివుంది. కొడుకు పరిస్థితి చూసి  సావల్ రామ్ చలించిపోయి వెంటనే చికిత్స కోసం గ్వాలియర్ కి తీసుకొచ్చాడు. గ్వాలియర్ చేరుకున్నాక హటేను కలిసి ఈ విషయాన్ని తెలియచేసాడు. హటే అతనిని బాబా దర్శనం చేసుకోనందుకు మందలించి, “నువ్వు నీ మాటను తప్పావు. ఇప్పుడే నీ కొడుకుని తీసుకొని బాబా దర్శనానికి వెళ్ళు, జ్వరం తగ్గిపోతుంది” అని చెప్పాడు. సరేనని సావల్ రామ్ తన భార్య, కొడుకుతో శిరిడీ వెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్లేముందు హటే అతని చేతికి ఒక రూపాయి నాణేన్ని ఇచ్చి, “దీనిని బాబా చేతిలో పెట్టి తిరిగి బాబా ప్రసాదంగా దానిని తీసుకొనిరమ్మ”ని చెప్పాడు. అతడు బాబా హస్తస్పర్శతో  పవిత్రమైన ఆ నాణేన్ని పూజలో పెట్టుకోవాలని ఆశించాడు.

సావల్ రామ్ శిరిడీ చేరి బాబా పాదాలకు నమస్కరించుకొని దక్షిణను ఇచ్చాడు. దాన్ని బాబా తన జేబులో వేసుకున్నారు. ఆ తరువాత అతను హటే ఇచ్చిన నాణాన్ని ఇవ్వగా, బాబా దానిని తదేకంగా చూస్తూ, తన బొటనవేలుతో కిందకి పైకి కాసేపు ఎగురవేసి, సావల్ రామ్ వైపు చూసి, “ఈ నాణాన్ని ఊదీ ప్రసాదంతో పాటు దాని యజమానికి అందజేయి. అతనినుండి నాకేమీ వద్దు, తనని సుఖశాంతులతో ఉండమని చెప్పు” అని అన్నారు. సావల్ రామ్ తన శిరిడీ యాత్రను ముగించుకుని గ్వాలియర్ కు తిరిగి వచ్చాడు. హాటేను కలుసుకొని శిరిడీలో జరిగినదంతా చెప్పాడు. బాబా తనను ఆశీర్వదించి, తన కోరికను మన్నించారని హాటే చాలా సంతోషించాడు. బాబా ఎల్లప్పుడూ మంచి ఆలోచనలను ప్రోత్సహిస్తారని అనుకున్నాడు. సావల్ రామ్ తన కొడుకు కోలుకుంటున్నాడని హాటేకు చెప్పి బాబా తిరిగిచ్చిన నాణేన్ని హాటేకు ఇచ్చాడు. హాటే ఆ నాణేన్ని చూసి, అది తాను ఇచ్చిన నాణెం కాదని బాధపడి సావల్ రామ్ కి తిరిగిచ్చి, మళ్ళీ శిరిడీ వెళ్లి ఆ నాణేన్ని తీసుకొని రమ్మన్నాడు. సావల్ రామ్ ఇంటికి చేరి తన భార్యకు ఈ విషయం చెప్పగా, ఆమె వెంటనే లోపలికి వెళ్లి హాటే ఇచ్చిన నాణేన్ని తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టి, భద్రంగా ఆ నాణేన్ని తాను జాగ్రత్తగా దాచిపెట్టానని చెప్పింది. మరుసటిరోజు సావల్ రామ్ జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పి, ఆ నాణేన్ని తన భార్య భద్రంగా దాచిపెట్టిందని చెప్పి, దానిని హాటేకు అందించాడు. బాబా ప్రసాదంగా లభించిన ఆ నాణేన్ని చూసి హాటే సంతోషంతో ఉప్పొంగిపోయాడు. దానిని పూజలో పెట్టుకొని హాటే ఎంతో తృప్తిచెందాడు.

హాటే మనుమరాలైన శ్రీమతి దేవికా పటేల్ గారు హాటే మరణానంతరం జన్మించారు. ఆమె కొన్ని వివరాలిలా తెలిపారు. హాటేగారికి ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం వాళ్ళెవరూ సజీవులుగా లేరు. హటే కొడుకు మేజర్ ప్రతాప్ హాటే గారి ఒక్కగానొక్క కుమార్తె శ్రీమతి దేవికగారు. ప్రతాప్ హాటే కూడా బాబాకి గొప్ప భక్తులు.

శ్రీమతి దేవికా పటేల్ భర్త డాక్టర్ అల్తాఫ్ పటేల్. అతను వైద్య వృత్తి చేస్తున్నారు. ముంబాయిలోని జస్లోక్ హాస్పిటల్లో డైరెక్టర్ అఫ్ మెడిసిన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అతను టైమ్స్ అఫ్ ఇండియా దినపత్రికలో 'ముంబై మిర్రర్' అనే కాలమ్ ని వ్రాస్తూ వుంటారు. అతడు మొదట నాస్తికుడైనప్పటికీ బాబా మహిమలను స్వయంగా అనుభూతి చెంది బాబా భక్తుడయ్యారు.

శ్రీమతి దేవికా పటేల్ బాబా హస్తస్పర్శ పొందిన పవిత్ర నాణెం గురించి ఇలా తెలిపారు.. "ఆ నాణెం హాటే గారి పెద్దకుమారుడి దగ్గర ఉండేదిఅతను కుటుంబసభ్యులెవ్వరికీ దాని వివరాలు తెలియజేయకుండా ఎక్కడో దాచిపెట్టేసాడు. ఒకప్పుడు నేను పెద్దనాన్నగారితో, "బ్లాంక్ చెక్ ఇస్తాను, అందుకు బదులుగా ఆ రూపాయి నాణాన్ని నాకివ్వమ"ని అడిగాను కానీ, ఆయన అందుకు ఒప్పుకోలేదు. కెనడాలో వుండే మా బంధువు ఒకరు కూడా ఆ నాణెం పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్దనాన్న, పెద్దమ్మ, వాళ్ళ ఒక్కగానొక్క కుమార్తె ఇప్పుడు సజీవులుగా లేనందున ఆ నాణెం వివరాలు తెలియకుండా రహస్యంగా ఉండిపోయాయి".


Contact Details:
Smt.Devika Altaf Patel 
Grand Daughter of Dr.Colonel Vinayakrao Gopinath Hate
15/B/1, Woodlands Apartments,
Near Kemp's Corner Fly Over Bridge, 
67, Pedder Road, 
Mumbai-400 026. 
Email:  devikapatel486@msn.com   

(Source: Holy Shri Sai Satcharitra Chapter 29, Shri Sai Leela Magazine, Personal Interview Smt.Shreya Nagaraj had with Smt.Devika Altaf Patel, Grand Daughter of Late Dr.Colonel Vinayakrao Gopinath Hate Photo Courtesy: Smt.Devika Patel
http://saiamrithadhara.com/mahabhakthas/vinayakrao_gopinath_hate.html)

రాక్ సాల్ట్ లైట్ మీద బాబా దర్శనం


సాయి బంధువులందరికీ ఓం సాయిరామ్. నేను దుబాయ్ నుండి లత రామచంద్రన్. నేను మహాపారాయణ (MP-77, ఎల్లో హౌస్) గ్రూపులో సభ్యురాలిని. 2018లో నేను మహాపారాయణలో భాగంగా సచ్చరిత్ర చదివిన కొన్నిరోజులకు నాకు కలిగిన అనుభవాన్ని దిగువ తెలియజేస్తున్నాను.

"దేవుడెక్కడో లేడు, భక్తి భావంతో చూస్తే దేవుడు అణువణువునా ఉన్నాడని తెలుసుకుంటావ"ని ఎందరో మహాత్ములు చెప్పారు. ఇదే అనుభవం నాకు జరిగింది. నేను చాలా సంవత్సరాల నుండి సాయిబాబా భక్తురాలిని. నేను పుణేలో పుట్టి, పెరిగాను. పవిత్రమైన శిరిడి మాకు కొన్ని గంటల దూరంలోనే ఉంది. బాబా యందు భక్తి, ఆయన కథలయందు ఆసక్తి, ఆయనను సేవించడం అన్నీ ఆ సమయంలోనే నాలో మొదలయ్యాయి. నేను చాలాసార్లు తన ఉనికిని చూపించమని బాబాను అడిగాను. ఆయన కూడా అప్పుడప్పుడు అనుకోకుండా ఎదురుపడిన వ్యక్తులు లేదా ఫోటోలు లేదా ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు చివరి నిమిషంలో ఊహించని వ్యక్తి రూపంలో సహాయం అందించడం ఇలా అనేక విధాలుగా తన ఉనికిని నాకు తెలియజేసారు.

కానీ, ఒక నెల నుండి నేను సాయి సచ్చరిత్ర చదువుతున్నప్పటికీ, శ్రద్ధగా పూజలు చేస్తున్నప్పటికీ ఆయన ఉనికిని తెలియజేసే ఎటువంటి అనుభూతి కలగలేదు. ఆయన నుండి అటువంటి సంకేతాల కోసం ఎదురు చూసి అనేకసార్లు నేను నిరాశ చెందాను. ఇక బాధను తట్టుకోలేక బాబా ముందు కూర్చొని "బాబా! మీరు నాతో ఉన్నారని చూపించండి, నేనింకా నిరీక్షించలేను నాపై దయ చూపి నాకు అనుభవాన్ని ప్రసాదించండ"ని సాయిని దృఢంగా ప్రార్ధించాను. బాబా నా ప్రార్థన విన్నారు. బహుశా నా కన్నీళ్లు చూసి ఆయన కరిగిపోయారు. మాఇంటిలోనే అద్భుతం చూపించారు బాబా. అదేరోజు మా ఇంటిలో ఉన్న రాక్ సాల్ట్ లైట్ మీద బాబా దర్శనమిచ్చారు. అది చూసి భావోద్వేగంతో నా కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ఈ అనుభవం ద్వారా "శ్రద్ధ - సబూరి" నేర్చుకున్నాను. బాబాను ఏదైనా విశ్వాసంతో అడిగి ఆయన అనుగ్రహించేవరకు సహనంతో వేచి ఉండాలని తెలుసుకున్నాను. ఫోటో క్రింద ఇస్తున్నాను మీరు కూడా చూసి ఆనందించండి.

http://www.mybloggertricks.com/2012/07/Submit-posts-to-article-directories.html MahaParayan Experiences With Shirdi Sai Baba | Miracles of MahaParayan | Blessings of Shri Sai Satcharitra | experiences.mahaparayan.com


బాబా కాపాడిన బిడ్డ


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

ఒక అద్భుతమైన సంఘటన ద్వారా సాయి భగవంతుని అవతారమని నిరూపించిన అనుభవాన్ని మీకు తెలియజేస్తాను.

రెండు సంవత్సరాల క్రితం మా కుటుంబం సమస్యలలో ఉన్నప్పుడు నా భార్య గర్భవతి అని తెలిసింది. 2 వారాల తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్ళగా డాక్టర్ ఒకసారి స్కాన్ తీయించమని సూచించారు. మేము స్కాన్ తీయించి, రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ కి ఇచ్చి, డాక్టర్ ఏమి చెప్తారా అని వెయిట్ చేస్తున్నాం. 15 నిమిషాల డిస్కషన్ తరువాత డాక్టర్ బయటకు వచ్చి, స్కాన్ రిపోర్ట్ కొంచెం ఆందోళనకరంగా ఉందని, పిండం(fetus) వయసు 6 వారాలు ఉండొచ్చు, కానీ 2 వారాల నుండి ఎదుగుదల ఆగిపోయిందని, ఇలానే ఉంటే అబార్షన్ జరగవచ్చని చెప్పారు. అది విని మేము షాక్ అయ్యాం. మొదటిసారి గర్భవతి అయిన నా భార్య చాలా కృంగిపోయింది. తన కళ్ళ నుండి నీళ్ళు అలానే కారుతూనే ఉన్నాయి. నేను తనని అలా చూడలేక డాక్టర్ ని మరోమారు చెక్ చేయమని అడిగాను. ఆ డాక్టర్ చాలా అనుభవం కలిగిన పెద్దావిడ, ఆ హాస్పిటల్ గైనకాలజీ డిపార్టుమెంటుకి హెడ్. మా తృప్తి కోసం ఆవిడ మరలా స్కాన్ చేసి, తేదీల వారీగా పల్స్ అందటం లేదు అని రిపోర్ట్స్ మాకు చూపించారు. అందువలన మమ్మల్ని అబార్షన్ చేయించడమే మంచిదని సూచించారు. మళ్ళీ ఆమె, సరే ఇంకో వారం చూసి తరువాత అబార్షన్ కోసం రమ్మని చెప్పారు.

ఇక చేసేది ఏమీలేక హాస్పిటల్ నుండి భారమైన మనసుతో ఇంటికి చేరాము. దారిలో అంతా నా భార్య ఏడుస్తూనే ఉంది. నా భార్యని ఓదార్చడం నావల్ల కాలేదు. నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని ఇవ్వమని భగవంతుడిని ప్రార్ధించాను. అకస్మాత్తుగా నాకెందుకో 'సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే?' అనే ఆలోచన వచ్చింది. వారం తరువాత మరో లేడీ డాక్టర్ దగ్గరకు వెళ్ళాం. ముందు సంప్రదించిన డాక్టర్ లాగే ఈమె కూడా చాలా అనుభవం ఉన్న ఆవిడ, ఈవిడ కూడా వేరే హాస్పిటల్ గైనకాలజీ డిపార్టుమెంటుకి హెడ్. ఆమెకి పరిస్థితి అంతా వివరించి చెప్పాను. ఆమె 2 రోజుల తరువాత స్కాన్ చేయడానికి నిర్ణయించారు. మేము ఆరోజు కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూసి స్కాన్ చేయించాము. రిజల్ట్ ఎలా వస్తుందా అని చాలా ఆందోళనగా ఉన్నాము. కాని డాక్టర్ నన్ను పక్కకి పిలిచి మొదటి డాక్టర్ చెప్పిందే  చెప్పారు. అయితే ఈ డాక్టర్ మాకు చాలా మానసిక ధైర్యాన్ని ఇచ్చి ఇంకో వారం ఆగి చూసి తరువాత అబార్షన్ కి రమ్మని సలహా చెప్పారు. మేము ఆమె సలహాను అంగీకరించడం తప్ప వేరే ఏమీ చేయలేని స్థితిలో సరేనని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఆ రాత్రి నాకు చాలా ఆందోళనగా అనిపించింది. మేము ఇద్దరం, "మాకు ఏది మంచిదని మీకు అనిపిస్తే అదే చెయ్యండి బాబా!" అని సాయిని వేడుకుని పడుకున్నాం. నా భార్య పడుకునే ముందు తన పొట్టకి ఊదీ రాసుకుని పడుకుంది. తను ఆ వారమంతా రోజూ అలానే చేసింది. వారం తరువాత డాక్టర్ చెప్పిన ప్రకారం అబార్షన్ కోసం వెళ్ళాం. కాని ఆవిడ ముందుగా తాను ఎప్పుడూ తీసే స్కాన్ ఒకసారి తీస్తానని చెప్పారు.

ఇప్పుడు సాయి లీల చూడండి. స్కాన్ రిపోర్ట్స్ చూడగా, అందులో పిండం యొక్క పల్స్ అందుతోంది. పైగా ఎదుగుదల కూడా బాగా ఉంది. అది చూసి డాక్టర్ షాక్ అయ్యారు. ఆమె పదే పదే ముందర తీసిన స్కాన్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి, డేట్స్ అన్నీ లెక్క పెట్టుకొని చూసి, ఆమెలో ఆమె 10 నిముషాలు మాట్లాడుకున్నారు. “ఇది అసంభవం, అసంభవం“ అని రెండు, మూడుసార్లు ఆమె అంటూ ఉండగా మేము విన్నాము. చివరికి ఆమె, “భగవంతుడు ఈ బేబీని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు” అని సంతోషంగా చెప్పారు. మేము చాలా ఆశ్చర్యపోయాము. నా భార్య చాలా సంతోషంగా బాబాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. బాబా వల్లే ఇదంతా జరిగింది. బాబా దయతో మా బాబు చాలా ఆరోగ్యంగా పుట్టాడు. ఇప్పుడు బాబుకి 2 సంవత్సరాల వయస్సు. చాలా ఆరోగ్యంగా,హుషారుగా ఉన్నాడు. బాబా దయకి వెల కట్టలేము.

ఓం సాయిరాం!!!

షిర్డీ సాయి సందర్శన


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


1978, మే 6న సిమ్లా (హిమాచల్ ప్రదేశ్ రాజధాని) నుండి నాకు మా సొంత ఊరు 'మండి' పట్టణానికి బదిలీ అయ్యింది. అప్పటివరకు నాకు గొప్ప మహాత్ముడైన సాయి గురించి చాలా కొంచెం తెలుసు. ప్రధానోపాధ్యాయుడు అయిన నా చిన్న సోదరుడు శ్రీ బి.సి.వైద్య శ్రీసాయిబాబాకు గొప్ప భక్తుడు. తను ఎప్పుడూ 'సాయిరామ్', 'ఓం సాయినాథ్', 'ఓ దేవా', 'నా బాబాజీ' మొదలైన నామాలతో బాబాని స్మరిస్తూ ఉంటాడు. తనే నాకు బాబా గురించి చాలా చక్కగా చెప్పాడు. అప్పటినుండి బాబా గురించి మరింత తెలుసుకోవాలని నాకు ఎంతో ఆసక్తిగా ఉండేది, కానీ నా కోరిక నెరవేరలేదు.

1979 జనవరి మొదటివారంలో నా సోదరుడు తన కుటుంబంతో కలిసి షిరిడీ,  అక్కడనుండి కన్యాకుమారి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. నేను నా సోదరుడితో‌, "నాకు కూడా మీతోపాటు వచ్చి సాయిబాబా దర్శనం చేసుకోవాలని కోరికగా ఉంది. కానీ నాకు ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలియదు" అని అన్నాను. దానికతను, "మీరు షిర్డీ రావడానికి అనుమతినిస్తారా లేదా అన్నది సాయిబాబా చేతిలో ఉంది" అన్నాడు. వాస్తవానికి నేను మాత్రం ఈ అవకాశాన్ని కోల్పోకూడదని, నా భార్యతో కలిసి బాబా దర్శనం చేసుకోవాలని చాలా ఆత్రుతతో ఉన్నాను. మేము 1979 జనవరి 7 సాయంత్రం వెళ్లవలసి ఉంది. 1979 జనవరి 4న నేను నా ఆఫీసర్ గదిలోకి వెళ్లి ఎల్.టి.సి. పై సెలవు పొందడానికి దరఖాస్తును సమర్పించాను. ఆఫీసర్ గారు ఏమీ చెప్పలేదు. సెలవు ఇస్తారో లేదో అని ఆందోళన పడుతూనే నేను వెనక్కి వచ్చేసాను. మరోవైపు నేను పూర్తి చేయాల్సిన ఇతర ఫార్మాలిటీలు అన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మళ్ళీ జనవరి 5న నేను ఆఫీసర్ గారిని కలుసుకొని, నా సోదరుడి కుటుంబంతో కలిసి షిర్డీకి, కన్యాకుమారికి ఎల్.టి.సి. పై వెళ్ళాలని అనుకుంటున్నాను, దయచేసి సెలవు మంజూరు చేయవలసిందిగా అభ్యర్ధించాను. అతను కొన్ని అత్యవసర పనులు పూర్తి చేయమని చెప్పడం తప్ప సెలవు గురించి ఏమీ మాట్లాడలేదు. నిజానికి ముందుగానే నేను ఆ పనులు పూర్తి చేశాను. ఆ విషయమే నేను అతనితో చెప్పగా, అతను వెంటనే సెలవు మంజూరు చేసాడు. ఆశ్చర్యం! షిర్డీ సాయిబాబా మొదటిసారిగా నాపైన చూపిన అనుగ్రహానికి నేను మనస్సులోనే బాబాకు తలవంచి నమస్కరించుకున్నాను. ఖచ్చితంగా ఇది శ్రీసాయిబాబా కరుణగా భావించాను. "భక్తుడు తనంత తానుగా బాబా దర్శనం చేసుకుంటాను అంటే బాబా దర్శనం పొందలేడు. కాని బాబా తన భక్తుని తానే దర్శనానికి ఆహ్వానిస్తే భక్తుని కోరిక నెరవేరుతుంది". ప్రతి ఒక్కరికీ బాబా పవిత్ర దర్శనం లభించదు.

మేము షిరిడీకి చేరుకుని, జనవరి 14 నుండి జనవరి 16వ తేదీ వరకు మూడు రోజులు భక్తనివాస్ లో ఉన్నాము. అది నా సోదరుడి రెండవ షిర్డీ సందర్శన. అందువల్ల తను బాబా యొక్క ముఖ్యమైన ప్రదేశాలు - (1)ఖండోబా మందిరం (మహల్సాపతి బాబాని మొదటిసారి 'సాయి' అని పిలిచిన స్థలం), (2) లెండిబాగ్, (3) బాబా ఉపయోగించిన బావి, (4) చావడి, (5) ద్వారకామాయి (సాయిబాబా ఎన్నో సంవత్సరాలపాటు నివశించిన చోటు) మాకు చూపించాడు. మేము చాలా ఆనందించాము. ప్రతిరోజూ ఉదయం 5గంటల నుండి రాత్రి 10గంటల వరకు  షిర్డీ సంస్థాన్ నిర్వహించే అన్ని కార్యక్రమాలకు పూర్తి భక్తితో హాజరయ్యాము. నేను మొదటిసారి బాబా దర్బారులో ప్రవేశించినప్పుడు సాయిబాబా యొక్క గంభీరమైన తెల్లని పాలరాతి మూర్తిని చూసి పులకరించిపోయాను. భక్తితో ఆయనకు నమస్కరించుకున్నాను. అలా బాబాని చూస్తూనే నా హృదయం ద్రవించిపోయింది. "ఎన్నో జన్మల పుణ్యం వలన నాకు బాబా దర్శన భాగ్యం కలిగింది" అనిపించింది. ఎంతో అద్భుతమైన మూర్తి అది. మరోక్షణంలో నా ముందు సజీవంగా బాబా ఉన్నట్లు అనిపించింది. నేను బాబాతో మాట్లాడుతూ, "బాబా! నేను ఎన్నో పాపాలు చేశాను. ఎప్పుడూ మీకు ఎటువంటి సేవా చేయలేదు. మీకు నాయందు దయ ఉన్నట్లయితే నా పాపాలను పరిగణించకుండా నన్ను క్షమించండి. జీవితాంతం నేను మీకు శరణాగతి చెందుతాను. భవిష్యత్తులో మీరు నన్ను ఏ స్థితిలో ఎలా ఉంచినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఓ దేవా! మా అందరిపైన మీ కృపను చూపండి" అని చెప్పుకున్నాను. తరువాత "బాబా! 3 సంవత్సరాల క్రితం నేను వివాహం చేసుకున్నాను. కాని మాకు ఇప్పటివరకు పిల్లలు లేరు. మీరు నాకు సంతానాన్ని ప్రసాదించి మా కోరికను నెరవేర్చండి" అని వేడుకున్నాను. అదే రాత్రి నాకు ఒక కల వచ్చింది అందులో, నల్లటి గడ్డం, పొడవాటి జుట్టుతో, తలపై ఒక బుట్ట తీసుకొని నీటిలో నుండి ఒక సాధువు ప్రత్యక్షమై, ఆ బుట్ట నాకు ఇచ్చి అదృశ్యమైపోయారు. ఈ కల గురించి నేను నా కుటుంబంలో ఎవరికీ చెప్పలేదు. చివరిరోజు మేము బాబా అనుమతి తీసుకొని మా ప్రయాణం కొనసాగించాం. మా ప్రయాణమంతా చాలా సౌకర్యవంతంగా సాగింది. ఒక సంవత్సరం తరువాత, 27-5-1980 గురువారంనాడు సాయంత్రం, బాబా నా కోరిక నెరవేర్చారు. నా భార్య ఒక అందమైన శిశువుకు జన్మనిచ్చింది. నిస్సందేహంగా బాబా నాపై ప్రేమతో నాకు సంతానాన్ని అనుగ్రహించారని నేను భావించాను.

సాయిబాబా ప్రసాదించిన మరో అనుభవాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మేము మైసూరులో ఉన్నప్పుడు, ఒకరోజు ఉదయం సుమారు 10 లేదా 11 గంటలకు మేము మహారాజ్ జగ్మోహన్ గారి ప్రసిద్ధ ఆర్ట్ గ్యాలరీని చూడాలనుకున్నాము. ఇలాంటివి చూడాలంటే టిక్కెట్లను కొనవలసి ఉంటుంది, అది మాకు అదనపు భారం అవుతుందని మాట్లాడుకుంటున్నాం. అలా మాట్లాడుకుంటూ మేము గేట్ దగ్గరకు చేరుకుని డబ్బును తీయడానికి నా బ్యాక్ జేబులో చేయి పెట్టాను. ఇంతలో అకస్మాత్తుగా ఒక ఆంగ్లేయుడు, ఒక భారతీయ బాలుడు మమ్మల్ని పిలుస్తూ మా వద్దకు వచ్చారు. వాళ్ళు నా చేతిలో 8 టికెట్లను పెట్టి, "మేము దీనిని ఇదివరకే చూసేసాము, మీరు ఈ టికెట్లను తీసుకొని ఆర్ట్ గ్యాలరీని చూడండి" అని చెప్పారు. నేను వాళ్ళని డబ్బులు తీసుకోమని కోరాను. కానీ వాళ్ళు ఏమీ తీసుకోకుండా వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఇదంతా విచిత్రంగా లేదూ! టికెట్లను కొనుగోలు చేయటానికి మేము సందేహిస్తుంటే సాయిబాబా సరిగ్గా ఎనిమిది టికెట్లను మాకు అందించారు. వాళ్ళ రూపంలో మా ముందుకు వచ్చి బాబాయే మాకు టికెట్లు ఇచ్చారు. అక్కడనుండి మా మిగతా ప్రయాణమంతా బాబా మాతోపాటే ఉన్నట్లు అనుభూతి చెందాము. 

ఇలాగే ప్రతి సంవత్సరం బాబా మాకు షిర్డీ సందర్శన భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను.

D.N. వైద్య
బంగ్లా మోహల్లా,
మండి - 175 001 (H. P)
(మూలం: శ్రీ సాయిలీల అక్టోబర్ 1980)

పవిత్రమైన ఊదీతో అనారోగ్యాన్ని నయం చేసిన బాబా


నేను నోయిడా నుండి జితేంద్ర శర్మని. నేను గత 20 సంవత్సరాలుగా సాయిభక్తుడిని. ఆయన నా జీవితంలో అనేక అద్భుతాలు చేసారు. సాయి లేని నా జీవితాన్ని నేను ఊహించలేను. నాకు ఫిబ్రవరి నెలలో జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
2018 ఫిబ్రవరి 13న నా కుటుంబంతోపాటు ఒక వివాహానికి హాజరై అర్థరాత్రి తిరిగి ఇంటికి చేరుకున్నాము. తరువాత నేను నా బట్టలు మార్చుకొని పడుకోవడానికి వెళ్ళాను. పడుకున్న కాసేపటికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి మరియు ఛాతీలో మంటతోపాటు నొప్పి మొదలైంది. నాకు చాలా భయం వేసింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని యాంటాసిడ్ మందులు తీసుకున్నాను. కానీ ఎటువంటి ప్రభావం చూపలేదు. అకస్మాత్తుగా సాయి ఊదీ గుర్తు వచ్చింది. బాబా ఊదీ సర్వరోగ నివారిణి కదా! వెంటనే కొంచెం ఊదీ నీళ్ళలో వేసి త్రాగాను. మరికొంత ఊదీ నా కడుపుపై రాసుకున్నాను. కొన్ని క్షణాలలో బాబా అద్భుతం చేశారు. ఆయన అందరి విషయంలో చేస్తారనుకోండి. నాకున్న నొప్పులన్నీ అదృశ్యమైపోయాయి. ప్రశాంతంగా పడుకున్నాను. ఉదయం లేవగానే మళ్ళీ కొంచెం నొప్పిగా అనిపించింది. వెంటనే నేను ఊదీ నీళ్లలో కలుపుకొని త్రాగి, కడుపు మీద కూడా రాసుకున్నాను. దానితో పూర్తిగా నొప్పి పోయింది, మళ్ళీ ఆ నొప్పి రాలేదు. నాకు బిపి సమస్య ఉంది, కాబట్టి గుండెనొప్పి వస్తుందేమోనని నేను చాలా భయపడిపోయాను. కానీ బాబా నా అనారోగ్యాన్ని తన పవిత్రమైన ఊదీతో నయం చేసేశారు. ఆయన నా జీవితంలో నాకన్నీ ఇచ్చారు. నేను ఎల్లప్పుడూ ఆయన బోధనలను అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సాయిభక్తులందరినీ నేను అభ్యర్థించేది ఒకటే - "బాబా చూపించిన మార్గంలో నడవండి. సాయి సచ్చరిత్ర చదవండి. దానితో మీ జీవితంలోని సమస్యలన్నీ అంతరించిపోతాయి".

శ్రీ గంగగిర్ మహారాజ్ - 171వ అఖండ హరి నామ సప్తాహం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

శ్రీసాయిబాబా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో 2018, ఆగస్టు 16 నుండి ఆగస్టు 23 వరకు 171వ అఖండ హరినామ సప్తాహం పవిత్ర శిరిడీక్షేత్రంలో మహావైభవంగా నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, శిరిడీ గ్రామస్థులు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల పౌరులు పాల్గొని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక కీర్తిపతాకాన్ని ఎగరవేశారు.

యోగిరాజ్ సద్గురు గంగగిర్ మహారాజ్ గొప్ప సాధుసత్పురుషులు. ఆయన చాలామంది ప్రజల జీవితాలను మార్చి, సరైన దిశలో పురోగతి మర్గాన నడిపించారు. ఆయన కేవలం సాధారణ ప్రజలను సరైన మార్గంలో పెట్టడమే కాకుండా మారుమూల కుగ్రామమైన శిరిడీలో వెలసిన సాయిసత్పురుషులలో దాగి ఉన్న దివ్యాత్మని గుర్తించి "నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివార"ని చెప్పారు. అలా ఆయనే తొలిసారిగా ప్రపంచానికి శ్రీ సాయిబాబాను పరిచయం చేశారు. ఒకసారి  కొంతమంది భక్తులతో పాటు గంగగిర్ మహారాజ్ శిరిడీ వచ్చి భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. ఆ సమయంలో బావి నుండి స్వయంగా మట్టికుండలతో నీటిని పట్టుకొని వస్తున్న ప్రకాశవంతమైన యువకుడిని గమనించారు. ఆ తొలిచూపులోనే ఆ యువకునిలోని దైవికశక్తిని గంగగిర్ మహారాజ్ గుర్తించి శిరిడీ పౌరులతో, "ఇతను గొప్ప తపస్వి" అని చెప్పారు. ఈ వివరాలు శ్రీ సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో 35 నుండి 38 వరకు వరకు ఉన్న ఓవీలలో ఈక్రింది విధంగా చెప్పబడి ఉన్నాయి. 

35. ప్రసిద్ధి చెందిన వైష్ణవ భక్తుడు, గృహస్థు, పుణతాంబే నివాసి, గంగగిర్ శిరిడీకి తరచూ వచ్చేవారు.

36. సాయి రెండు చేతులతోనూ మట్టి కుండలను పట్టుకొని బావి నుంచి నీరు మోసుకొని రావటం చూచి మొదట గంగగిర్ ఆశ్చర్యపోయారు.

37. అలా సాయిని ముఖాముఖి చూచి
"ఈ అమూల్య రత్నాన్ని పొందిన శిరిడీ ప్రజలు భాగ్యవంతులు, వారు ధన్యులు" అని చెప్పారు.

38. 
"ఈ రోజు ఇతడు భుజాన నీరు మోస్తున్నాడు. కాని ఇతడు సామాన్యుడు కాదు. ఈ క్షేత్రం యొక్క పుణ్యం ఏదో ఉండబట్టే ఈ స్థలంలో లభ్యమయ్యాడు" అని చెప్పారు.
  
పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు కూడా గంగగిర్ మహారాజ్ గురించి శ్రీ సాయి లీలామృతంలో క్రింది విధంగా రచించారు.

    పుణతాంబేకు చెందిన గంగగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు. ఒకసారి ఆయన శిరిడీ వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. అంతలో భుజాన నీటి కుండలతో సాయి ఆ ప్రక్కగా మశీదుకు వెళుతుంటే చూచి గంగగిర్ ప్రసంగం ఆపి, లేచి నమస్కరించి, వారి వెనుకనే మశీదుకు వెళ్ళారు. అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగగిర్ ఆయనకు నమస్కరించారు. బాబా పెద్దగా నవ్వి "దేవాలయం యీ మశీదుకు వచ్చిందే! మంచిది. మనమిద్దరమూ ఒకే కుటుంబంలోని వారము. ఎంతోకాలంగా కలసి వుంటున్నాము. ప్రజలను సన్మార్గములో పెట్టమని భగవంతుడు మనలను పంపాడు. కాని యీ రోజులలో ప్రజలు కించిత్తు గూడా పరివర్తనం చెందడం లేదు. అందరూ క్షుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే, హరి మన నెత్తిపై ఆవుపాలు పెట్టి వారి మధ్యకు పంపారు. కొందరు నన్ను చూచి నవ్వి, పాలకుండపై రాళ్ళు విసురుతున్నారు. కొందరు నవ్వుతూ, అతడు చెప్పేది వినకండి. సాయి నన్ను పూనాడని చెప్పి ప్రజలచేత ఈతకల్లు త్రాగిస్తున్నారు. నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడినంటున్నారు. కొందరు పాలు తీసుకొని గూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళవుతున్నారు. సత్సంగం పట్ల విశ్వాసము, గౌరవమూ పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నార"ని ఎంతో బాధగా గంగగిర్ చేతులు పట్టుకొని"పోయేవాడు పోతాడు, నిలిచేవాడే నిలుస్తాడు. చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని" అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు. అప్పుడు గంగగిర్ తన భక్తులతో"పేడకుప్పవంటి యీ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది! నక్షత్రాలవంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటివాడు. మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడచి ఎక్కడెక్కడో వెదుకుతున్నారు" అన్నారు.

అలా తొలిసారిగా గంగగిర్ మహారాజ్ ప్రపంచానికి సాయిబాబాను పరిచయం చేశారు.

శ్రీ 
గంగగిర్ మహారాజ్ 1847వ సంవత్సరంలో ప్రజా సంక్షేమం కోసం 'అఖండ హరినామ సప్తాహం' ప్రారంభించారు. అలా మొదలైన ఈ కార్యక్రమం 171 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రతి సంవత్సరం నిర్వహింపబడుతూ వస్తుంది. ఈ నామసప్తాహం ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో పంచమినాడు ప్రారంభమై, ద్వాదశినాడు ముగుస్తుంది. ఈ సప్తాహంలో చాలా ప్రాధాన్యత కలిగివున్న అంశం - "అన్నదానం". సమాజములో ఆకలితో ఉన్నవాళ్ళకి అన్నం అందించాలని, కరువు, వ్యసనాల నుండి విముక్తి కలిగించాలన్న దూరదృష్టితో ఆయన ఈ సప్తాహాన్ని ప్రారంభించారు.

   ఈసంవత్సరం ఈ సప్తాహానికి 20 నుండి 25 లక్షల మంది భక్తులు వందలాది గ్రామాల నుండి పాల్గొని భక్తి భావనలతో ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడాలన్న లక్ష్యంతో సుమారు 350 నుండి 400 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో ఈ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. సప్తాహ సమయంలో శ్రీ సాయిబాబా పాదుకలను, శ్రీ గంగగిర్ మహారాజ్ పాదుకలను భక్తుల దర్శనార్ధం ఉంచారు. భక్తులు ఏకకాలంలో ఇద్దరు మహాత్ముల పాదుకలు దర్శించుకొని వారి ఆశీర్వాదాలతో పరిశుద్ధులయ్యారు. లక్షలాది సాయిభక్తులు ఇందులో పాల్గొని ప్రయోజనం పొందారు.

భక్తులందరికీ విరివిగా అన్నదానం ఏర్పాటు చేసారు. శిరిడీలోని గృహస్తులంతా భాక్రి, చపాతీలు తయారుచేసి ఈ సప్తాహానికి సహాయపడ్డారు. రోజుకు వంద ట్యాంకర్ల పప్పు తయారుచేసారు. సప్తాహం రోజులలో ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఈవిధంగా సప్తాహం ఎంతో ఘనంగా నిర్వహించబడింది.


 శ్రీసాయిబాబా పాదుకలు
 శ్రీ గంగగిర్ మహారాజ్ పాదుకలు
























2017 డిసెంబర్ 11 నాటి శిరిడీ ప్రయాణంలోని అనుభవాలు


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

సాయిబంధువు నిరుపమ గారి 2017 డిసెంబర్ 11 నాటి శిరిడీ ప్రయాణంలోని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.




నేను ఆరోజు శిరిడీకి బస్సులో ప్రయాణిస్తుండగా ఒక కల వచ్చింది. కలలో నేను శిరిడీ వెళ్ళాను కానీ బాబా దర్శనం కాలేదు. బాబా విగ్రహాలు అమ్ముతున్న ఒక ఇంటి ముందు నేను నిలబడి ఒక బాబా విగ్రహాన్ని చూస్తూ నన్ను శిరిడీకి తీసుకొని వచ్చి కూడా మీ దర్శనం మాత్రం ఎందుకు ఇవ్వలేదని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. కొంతమంది సాయిబంధువులకు వాళ్ళు అడిగినవన్నీ తెస్తానని వాగ్దానం చేశాను కాని మీరు అందుకు కూడా మీరు అనుమతించట్లేదని బాధపడుతున్నాను. హఠాత్తుగా నాకు మెలుకువ వచ్చింది. ఆ కల వలన నేను నేను చాలా అప్సెట్ అయ్యాను. అప్పడు సమయం 6.30 గంటలయింది.

నేను 8.30కి దర్శనానికి బుక్ చేసుకున్నందున సరైన సమయానికి చేరుకోగలనా లేదా అని కొంచం టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ మేము 7.30 కల్లా శిరిడీ చేరుకున్నాము. త్వరగా ఫ్రెషప్ అయ్యి సమాధి మందిరానికి బయలుదేరాను. కొందరు సాయిబంధువుల కోరిక ప్రకారం పేడా ప్యాకెట్లను, ఒక సాయిబంధువు కోసం ఒక బాబా విగ్రహం దారిలో తీసుకొని బాబా దర్శనానికి వెళ్లి వాటిని బాబాకు సమర్పించుకున్నాను. వాటిలో ఒకరి పేడాలను బాబా తీసుకొని మిగిలిన వాటిని తిరిగిచ్చారు. వాటిని తిరిగి నాకు ఇచ్చేంతలో నాకు ఒక గులాబి కావాలని బాబాను అడిగారు. మన బాబా ప్రేమను చూడండి. బాబా విగ్రహంతోపాటు ఒక రెడ్ రోజ్ ఇచ్చారు. ఇంకా పూజారిగారు మరో రెండు గులాబీలు, ఒకటి ఎరుపు రంగు, రెండవది పసుపు రంగుదీ ఇచ్చారు. బాబా నా కోరిక మన్నించి నన్ను ఆశీర్వదించారని చాలా సంతోషంగా అనిపించింది. బయటకు వచ్చిన తరువాత రీతూ గారి అభ్యర్ధన మేరకు ఒక బాబా ఫోటో, 'సాయిబాబా స్టిల్ అలైవ్' బుక్ కొనుగోలు చేసి మళ్ళీ 9.30గంటలకి బుక్ చేసుకున్న దర్శనానికి వెళ్లి వాటిని బాబాకు సమర్పించాను. పూజరిగారు వాటిని బాబాకు, సమాధికి తాకించి నాకు తిరిగి ఇచ్చారు. రెండుసార్లు కూడా నాకు అద్భుతమైన బాబా దర్శనం లభించింది. మొదటి దర్శనంలో బాబాకు దగ్గరగా ఉన్నప్పుడు లైన్ కొంతసేపు కదలకపోవడంతో 5 నిముషాలకన్నా ఎక్కువసేపు బాబాను దగ్గర నుండి చూసుకోగాలిగాను. రెండవసారి వెళ్ళినప్పుడు దర్శనానంతరం మధ్యలోకి వచ్చేటట్లుగా వద్దామని, అలా అయితే బాబా ఎదురుగా నిలుచొని ఆయనను తృప్తిగా చూడవచ్చు అనుకున్నాను కానీ ఆ మార్గం మూసి ఉంది. సరే అది బాబా సంకల్పమనుకొని లైన్ లో కదులుతూ సరిగ్గా నేను అక్కడకు చేరుకోనేసరికి సెక్యూరిటీ అతను తాడు తీసి ఆ మార్గాన్ని ఓపెన్ చేసాడు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈసారి 10 నిమిషాలకంటే ఎక్కువసేపు బాబా దర్శనం చేసుకున్నాను. ఎవరు నన్ను వెళ్ళిపోమని తరమలేదు. బయటకు వచ్చిన తర్వాత గురుస్థాన్, చావడి మరియు ద్వారకామాయిలలో బాబా దర్శనం చేసుకున్నాను. 

బాబా ఈ పర్యటనలో నాకు ఒక పాఠం నేర్పించారు. బస్సులో నాతోపాటు ఒక వృద్ధ మహిళ ప్రయాణిస్తున్నది. పాపం ఆమె ఒంటరిగా వస్తుంది, శిరిడీలో ఎక్కడ ఉండాలో కూడా ఆమెకు తెలియదు. ఆమె డార్మెటరీలో స్నానం చేసి బాబా దర్శనం చేసుందామని అనుకుంది. నిజానికి నేను కూడా ఒంటరిగానే వెళ్తున్నాను. నేను ముందుగానే రూమ్ బుక్ చేసుకొని ఉండటంతో తనని మీకు అభ్యంతరం లేకపోతే నాతోపాటు రూమ్ లో ఉండమని అడిగాను. అందుకు ఆమె అంగీకరించింది. మేము రూమ్ కి వెళ్లి స్నానాదులు ముగించిన తరువాత ఆమెను సీనియర్ సిటిజన్ క్యూలో విడిచిపెట్టి 11.30 గంటల సమయంలో రూమ్ వద్ద తిరిగి కలుసుకుందామని ఆమెతో చెప్పాను. మళ్లీ మేము 12 గంటలకి కలుసుకున్నాము. ఆమె సంతోషంగా నన్ను ఆశీర్వదించి,  తన కథనిలా చెప్పింది. తనకిద్దరు పిల్లలని, వాళ్ళు చిన్న వయస్సులో ఉన్నప్పుడే తన భర్త తనని విడిచిపెట్టేసాడని చెప్పింది. తాను పిల్లలతోపాటు పార్కులో లేదా సత్రంలో ఉంటూ చాలా కష్టాలు పడ్డానని చెప్పింది. కొన్నిసార్లు కొబ్బరి ముక్కలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పార్లే-జి బిస్కెట్స్ కొనుక్కొని కడుపు నింపుకొనే వాళ్ళమని చెప్పింది. ఇప్పుడు శిరిడీ రావడానికి కూడా తన ప్రయాణానికి సరిపడా డబ్బులు తన స్నేహితులిచ్చారని, మిగతా అవసరాలకు తన దగ్గర డబ్బులు లేవని చెప్పంది. ఇదంతా చెప్తూ తను కన్నీళ్లు పెట్టుకున్నారు. విన్న నేను కూడా బాధపడ్డాను.

దీని ద్వారా బాబా ఇచ్చిన దాని గురించి వదిలేసి, నా దగ్గర లేని దాని గురించి, నాది కాని దాని గురించి పాకులాడకూదని నేర్చుకున్నాను. ఆ ముసలావిడ పిల్లలతో తినడానికి కూడా ఇబ్బంది పడింది. అయితే బాబా నాకు తిండికి, బట్టకు, ఉండడానికి చోటు విషయంలో ఏ లోటు చెయ్యలేదు. అవి కూడా లేకపోతే జీవితాన్ని ఎలా సాగించేది. అలా అయితే వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది అది ఇంకా నరకం. లేని దానికోసం చింతించకుండా ఉన్నదానితో హ్యాపీగా బాబాను తలచుకుంటూ ఉండాలి అని నేర్చుకున్నాను. ఇవన్నీ ఇచ్చి నా అవసరాలు చూసుకుంటున్నందుకు బాబాకు చాలా చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
ఓం సాయిరాం

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo