సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2081వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఎప్పుడూ మనతో ఉన్నారు - సరైన సమయంలో సహాయం చేస్తారు!  
2. శ్రీసాయి కృప


శ్రీసాయి కృప

నా పేరు జగదీశ్వర్. మా చిన్నమ్మాయికి 2026, ఏప్రిల్ 2న పెళ్లి నిశ్చయమైనది. మొదట నాకు ఆ సంబంధం విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉండటం వల్ల నేను ఒప్పుకోలేదు. కానీ మా అమ్మాయి అతనితోనే తన పెళ్లి జరగాలని పట్టుబట్టింది. నాకు ఏం చేయలో అర్థం కాలేదు. కొన్నిరోజులు తర్వాత ఒకరోజు రాత్రి నేను పడుకున్నాకనో, మేలుకొని ఉన్నానో తెలియదు కానీ, నాకు తెలుస్తుంది. నేను చాలా బాధతో, "బాబా! ఏమిటి ఇలా అవుతుంది?" అని అన్నాను. అప్పుడు బాబా, "అంత మంచి జరుగుతుంది. ఇది నా నిర్ణయమే" అన్నారు. నేను, "బాబా! మీరు అలానే అంటారు. నాకు ఏదైనా నిదర్శనం చూపించండి" అని అడిగాను. వెంటనే బాబా, "సరే, పొద్దున్న నీకు గ్రీన్ కలర్ డ్రెస్లో దర్శనమిస్తాను" అని అన్నారు. నేను, "గ్రీన్ కలరా?" అని అడిగితే, "అవును" అని అన్నారు బాబా. మర్నాడు ఉదయం యధాలాపంగా వాట్సాప్ చూస్తుంటే, 'శిరిడీ సాయి లైవ్ దర్శన్' గ్రూపులో బాబా ఉదయం గ్రీన్ కలర్ డ్రెస్లో ఉన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు. ఇది నిజమా అన్న గందరగోళంలో ఉండిపోయాను. తర్వాత నేను బాబాకు మనస్పూర్తిగా దణ్ణం పెట్టుకొని, "బాబా! మంచి-చెడు మీకు తెలుసు కదా. మీరు ఎలా నిర్ణయిస్తే అలాగే జరపండి" అని వేడుకున్నాను. తర్వాత ఫిబ్రవరి 20న అమ్మాయి నిశ్చితార్థం ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. "బాబా! అమ్మాయి పెళ్లి ఏప్రిల్ 2న. మీ ఆశీస్సులు ఇవ్వండి. అలాగే మా అబ్బాయి నిశ్చితార్థం మార్చి 21న, పెళ్లి ఏప్రిల్ 29న, రిసెప్షన్ మే 3న ఏలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చేసి మీ ఆశీస్సులు ఇవ్వండి".

ఇకపోతే, రెండు పెళ్లిళ్ల నిమిత్తం మా పెద్దమ్మాయి, మనుమరాలు పోలాండ్ నుండి వచ్చారు. 2026, మార్చి నెల మొదటివారంలో మా మనుమరాలు ఆడుకుంటుంటే డోర్ కర్టెన్ తట్టుకొని బొక్కబోర్ల పడింది. నేను తనని లేపి చూస్తే, తన నోరు అంతా రక్తం కనిపించింది. నాకు చాలా భయమేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాబా ఊదీ తెచ్చి పాప నుదుటన పెట్టి, కొంచం నోట్లో వేసాను. కొద్దిసేపటి తరువాత నోరు అంత కడిగి చూస్తే, కొద్దిగా చిగురుకి దెబ్బ తగిలింది తప్ప ఇంకేమీ లేదు. నొప్పి కూడా ఏం లేదు. "ధన్యవాదాలు బాబా".

మా చిన్నమ్మాయి పెళ్లి సందర్బంగా, హైదరాబాద్లో ఉన్న అబ్బాయి వాళ్ళకి పెళ్లి పత్రికలు ఇవ్వడానికి 2026, ఏప్రిల్ 13, శుక్రవారం తెల్లవారుజామున లేచి తయారవవుతుంటే, హఠాత్తుగా నా భార్యకు 3 సార్లు వాంతులు, నీళ్ల విరోచనాలు అయ్యాయి. ఏం చేయాలో తోచక ఒక సెస్టిల్ టాబ్లెట్ వేసి పూజ గదిలోకి వెళ్లి బాబా ఊదీ తీసుకొచ్చి నా భార్య నుదుటన పెట్టి, మరి కొంచెం ఊదీ తన నోటిలో వేసాను. విచిత్రంగా మంత్రం వేసినట్టు వాంతులు, విరోచనాలు ఆగిపోయాయాయి. మర్నాడు వెళ్లి పెళ్లి పత్రికలు ఇచ్చి వచ్చాము.

బాబా సాయి చరణం సర్వదా శరణం శరణం.

10 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. Om Sai ram be with us and bless us.. Om Sai ram

    ReplyDelete
  3. Jaisairam bless amma for her health and bless supraja for her neck pain and shoulder pain and help her to get normal Jaisairam she is suffering with disk bulges and bless her to get normal Jaisairam she is suffering with nerve pain and help her to get normal Jaisairam she is suffering with kidney disease and help her to get normal Jaisairam. Bless me and be there always with me and bless me and my wife do our jobs for another 15 yrs Jaisairam

    ReplyDelete
  4. Om sai ram, andarni anni velala kshamam ga chusukondi, anni situations anugunam ga maare la chusukondi baba, anta me daaya, meeru leni Memu lemu tandri anduke prathidi meede badyata.

    ReplyDelete
  5. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete
  6. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo