సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2083వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయ
2. సాయినాథుని కృపతో ఏదైనా జరుగుతుంది

బాబా దయ

సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నేను ఒక బాబా భక్తురాలిని. నాకు తండ్రి లేరు. "నాన్న బ్రతికుంటే, నాకు మంచి సలహాదారుగా ఉండేవారు కదా!" అని బాధపడుతుంటే, ఈ బ్లాగులో "నేనే నీకు తండ్రిని. నిన్ను నేను విడువను. దిగులుపడకు" అని వచ్చింది. అప్పటినుంచి ప్రతిక్షణం బాబానే తలుచుకుంటూ నా కోపాన్ని అధిగమించాను. "థాంక్యూ బాబా. సన్ను ఎన్నటికీ విడువకు బాబా".

ఒకసారి నేను, నాభర్త, పిల్లలు రోడ్డు దాటుతూ హఠాత్తుగా చూసేసరికి ఒక బస్సు దగ్గరగా వచ్చేసింది. నేను 'బాబా' అని అరిచేసాను. మా పెద్దబాబు ఒక్క అడుగు వేస్తే చాలా ప్రమాదం జరిగేది కానీ, బాబా కాపాడారు.

ఇంకోసారి మా చిన్నబాబుకి కడుపునొప్పి వచ్చి తట్టుకోలేక ఏడ్చాడు. డాక్టర్ దగ్గరకి వెళితే యూరిన్, కిడ్నీ టెస్టీలు వ్రాశారు. నాకు చాలా భయమేసి కన్నీళ్లతో, "బాబా! టెస్టీలు నార్మల్ రావాలి. నార్మల్ వస్తే మీ పేరు మీద అన్నదానంకు 1000 రూపాయలు ఇస్తాన"ని వేడుకున్నాను. బాబా దయవల్ల టెస్టులు నార్మల్ వచ్చాయి. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

సాయినాథుని కృపతో ఏదైనా జరుగుతుంది


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు రవి. నేను నా కుటుంబంతో యుఎస్‌లో ఉంటున్నాను. 2026, ఫిబ్రవరిలో మా బాబాయ్ గారి అబ్బాయి వివాహం వైజాగ్‌లో జరిగింది. నేను ఒక నెల రోజులు సెలవు పెట్టి ఇండియా వెళ్లాలనుకున్నాను. అయితే మా పిల్లలు ఇక్కడ యుఎస్ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడి స్కూలు నిబంధనల ప్రకారం ఊరికే పది రోజులకు మించి సెలవు పెడితే, పిల్లల్ని స్కూలు నుంచి తొలగిస్తారు. అలాంటప్పుడు మళ్లీ ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ వేస్తే, స్కూల్లో ఖాళీ ఉంటే వెంటనే సీటు వస్తుంది లేదంటే వచ్చేవరకు వేచి ఉండాలి. ఒక్కోసారి ఆ సంవత్సరం సీటు రాకపోవచ్చు కూడా. అందువల్ల నేను ఏం చేయాలని సందిగ్ధంలో పడ్డాను. అదే ఆలోచిస్తూ బాబాని అడిగితే, ఏది సరైనదో చెప్తారని(నాకు ఏ సంశయం వచ్చినా బాబాని అడిగి విసిగిస్తూ ఉంటాను), “బాబా! ఇండియాకి వెళ్ళమంటారా?, వద్దంటారా?” అని 'ఎస్', 'నో' చీటీలు వేసి అడిగాను. ఆయన 'ఎస్' అని ఇచ్చారు. దాంతో నేను నా భార్యతో “ఇంక బెంగలేదు, బాబా వెళ్ళమన్నారు. అంతా ఆయన చూసుకుంటారు” అని ధైర్యం చెప్పి అనుకున్నట్టుగా నెల రోజులు సెలవు పెట్టి కుటుంబంతో ఇండియా వెళ్ళాను. అక్కడంతా బాగా జరిగింది. ముఖ్యంగా శిరిడీలో బాబా దర్శనం నన్ను చాలా సంతోషపరిచింది. అంత సంతృప్తికరంగా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు వెళ్ళినా కాలేదు. నేను నాతోపాటు మా బాబాయ్ కొడుకు పెళ్లి శుభలేఖ తీసుకొని వెళ్లి బాబా సమాధి దగ్గర పెట్టి, “బాబా! మీరు వచ్చి వధూవరులను ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ బాగా జరిగేలా చూడండి” అని ప్రార్థించాను. మా బాబాయ్ మేము హైదరాబాద్ నుంచి వైజాగ్‌లో ఆడపెళ్ళివారింట జరిగే పెళ్లికి వెళ్లేందుకు ఒక బస్సు మాట్లాడారు. ప్రయాణం రోజు సాయంత్రం బస్సు రాగానే పెళ్లి సామాన్లు తీసుకొని బస్సు ఆగిన చోటకి  వెళితే, బస్సు ముందు భాగంలో 'నేను ఉన్నాను” అంటూ బాబా విగ్రహ రూపంలో పలకరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అప్పటినుంచి వైజాగ్‌లో పెళ్ళై తిరిగి వచ్చేవరకు అడుగడుగునా సాయి ఏదో ఒక రూపంలో దర్శనం ఇస్తూనే ఉన్నారు(ఆ ఫోటోలు కింద జతపరుస్తున్నాను. చూసి ఆనందించండి). ఉదాహరణకి ఒక చోట కాఫీ కోసం బస్సు ఆపితే, అక్కుడున్న హోటల్ పేరు “సాయికృష్ణ”, వైజాగ్ చేరుకున్నాక బస్సు నిలిపిన స్థలానికి ఎదురుగా 'సాయిబాబా స్పిరిట్యువల్ సెంటర్(Saibaba spiritual center)' అని, ఇలా ఎన్బెన్నో. బాబా చూపిన ప్రేమ, దయ, కరుణలకి ఉబ్బితబ్బిబ్బయిపోయాను.


మేము ఇండియా నుంచి తిరిగి యుఎస్ వెళ్ళాక చూస్తే, నేను భయపడినట్లే మా పిల్లల్ని స్కూలు నుంచి తొలగించారు. దాంతో నేను ఫ్రెష్ ఎన్రోల్మెంట్ అప్లికేషన్ వేసాను. బాబా దయవల్ల మా అమ్మాయికి వెంటనే సీటు వచ్చింది. కానీ అబ్బాయికి వెయిటింగ్ లిస్ట్ అన్నారు. మూడు వారాలు గడిచినా అందులో ఏ మార్పు లేదు. బాబా ఎందుకు ఇలా చేస్తున్నారని అనుకున్నప్పటికీ ఇంకా వేచి చూద్దామని నేను అంటుండేవాడిని. కానీ స్కూల్ ప్రిన్సిపాల్ "ఈ సంవత్సరం సీటు రావడం కష్టమేమో!" అనడంతో నా భార్య బాబు ఇంట్లో ఖాళీగా ఏమీ చేయకుండా ఉంటే సమయం వృధాగా పోతుందని దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూలులో అప్లికేషన్ సబ్మిట్ చేసి, జాయిన్ చేద్దాం అంది. నేను సరేనన్నాను. బాబు ఒక వారం ఆ ప్రైవేట్ స్కూలుకి వెళ్ళాక మరుసటి సోమవారం ఉదయాన్నే పాత స్కూల్ ఆఫీస్ నుంచి ఎవరో అప్లికేషన్ విత్ డ్రా చేసుకోవడం వల్ల ఒక వేకెన్సీ ఏర్పడిందని ఫోన్ వచ్చింది. అది విని మా ఆనందానికి అవధులు లేవు. అప్పటివరకు ఏ మార్పులేని వెయిటింగ్ లిస్ట్ నెంబర్ అడ్మిషన్‌కి వచ్చిందంటే అది ఆ సాయినాథుని కృపవల్లనే. ఆయన తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది.  నేను బాబా మా శ్రద్ధ-సబూరిలు పరీక్షించటానికి మా బాబు స్కూల్ అడ్మిషన్ ఆలస్యం చేశారనుకున్నాను. ఇంకొక్క రెండు రోజులైతే ప్రైవేట్ స్కూలులో తర్వాత నెల ఫీజు కట్టాల్సి వచ్చేది. బాబా దయతో అలా జరగనివ్వలేదు. ఇంకో విషయం ఏమిటంటే, సాధారణంగా ఇక్కడ స్కూలు మానేయాలంటే నెల రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. కానీ బాబా దయవల్ల మా పిల్లలు అదివరకు ఆ స్కూలులో చదివిన కారణంగా ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ పరిస్థితి అర్థం చేసుకుని మా బాబుని విత్ డ్రా చేయడానికి ఒప్పుకున్నారు. బాబా ప్రేమతో పిలిస్తే చాలు, పరుగుపరుగున తమ భక్తులకోసం వస్తారు. "ధన్యవాదాలు బాబా. నేను, నా కుటుంబం మిమ్మల్ని తలుచుకుంటూ మీకు సేవ చేసుకునేలా ఆశీర్వదించండి".

ఓం శ్రీసాయినాథాయ నమః


7 comments:

  1. ఓం సాయిరామ్

    ReplyDelete
  2. Om Sai Ram
    Sai always be with me

    ReplyDelete
  3. Om sai ram tandri ofce lo intlo anni bagunde la chayandi, anni problems solve ayye la chayandi anni meeku telusu amma nannalani na kutumbanni andarni anni velala ayur arogyalatho kshamam ga kapadandi anta meede badyata om sai ram.

    ReplyDelete
  4. Om Sai Rakshak Saranam Devaa 🙏🙏🙏

    ReplyDelete
  5. Om Sai Sri Sai Jaya Jaya Sai 🙏🙏

    ReplyDelete
  6. Baba … Adi jaragadani telusu.. aina maro maru adugutunna..tana Pelli jaripinchu deva..

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo