- పెళ్ళైన 15ఏళ్లకు సంతాన భాగ్యం ప్రసాదించిన బాబా - మొదటి భాగం
|
సాయి వచనం:-
|
|
|
సాయిభక్తుల అనుభవమాలిక 2101వ భాగం....
సాయిభక్తుల అనుభవమాలిక 2100వ భాగం....
- ఖచ్చితంగా బాబా ఉన్నారు - మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు
నా పేరు జగదీశ్వర్. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి కరీంనగర్లో, ఏప్రిల్ 29న మా అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో జరిగాయి. వేసవికాలం, ఒక్క పెళ్లికే అలసిపోయే రోజులు. అలాంటిది రెండు పెళ్లిళ్లు. ఎలా చేయగలనో అని మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను కానీ, తర్వాత మొత్తం భారం బాబా మీద వేసి, "బాబా! నేను నిమిత్తమాత్రుణ్ణి, రెండు పెళ్లిళ్లు ఏ ఇబ్బందులు రాకుండా మీరే దగ్గరుండి జరిపించి ఆశీర్వదించండి" అని వేడుకున్నాను. బాబా దయవల్ల పెళ్లి కార్యక్రమాలు మొదలు పెట్టినప్పటినుంచి అమ్మాయి పెళ్లి కరీంనగర్లో, అబ్బాయి పెళ్లి విశాఖపట్నంలో, తన రిసెప్షన్ కరీంనగర్లో అయ్యేవరకు ఎలాంటి టెన్షన్ లేకుండా అన్నీ సక్రమంగా అనుకున్న విధంగా పూర్తయ్యాయి. అమ్మాయి పెళ్లిలో, అబ్బాయి రిసెప్షన్లో ఎవరో ఇద్దరు బ్రాహ్మణులు వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు సాధారణంగా వచ్చేవాళ్ళో, బాబా దయ చూపి అలా వచ్చారో నాకైతే తెలియలేదు. ఇంకా డబ్బుల విషయానికి వస్తే, అప్పట్లో సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్న మా అబ్బాయి, హఠాత్తుగా మనసు మార్చుకొని యుఎస్ వెళ్లి MS పూర్తి చేసి, NVedia అనే పెద్ద కంపెనీలో సూపర్ జీతంతో జాయినయ్యాడు. ఈ పెళ్లిళ్ల ఖర్చులు తనే సర్దుబాటు చేసుకున్నాడు. ఇదంతా బాబా ముందస్తు ప్రణాళిక.
నాకు ఒక సాయిబాబా బంగారు ఉంగరం ఉంది. నేను దాన్ని అప్పుడప్పుడు పెట్టుకొని, తిరిగి లోపల దాచేస్తుంటాను. 2026, ఏప్రిల్ 2న మా చిన్నమ్మాయి పెళ్లి ఉందని వారం ముందు ఆ ఉంగరం కోసం చూస్తే, అది కనిపించలేదు. అన్నీ చోట్లా వెతికినా కానీ దొరకలేదు. నేను చాలా టెన్షన్ పడిపోయి బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరికేలా చేయమ"ని వేడుకున్నాను. ఐదు రోజుల తర్వాత మా ఆవిడ ఏదో మందు కొరకు వెతుకుతుంటే, విచిత్రంగా టాబ్లెట్ల బాక్స్‌లో బాబా ఉంగరం ఉంది.
ఇకపోతే, పెళ్ళైన తర్వాత, ఏప్రిల్ 6న భోజనాల అనంతరం మా అమ్మాయి చేతి వేలికి ఉండాల్సిన వంకి ఉంగరం లేదు. ఫోటోలలో చేస్తే భోజనం చేసేటప్పుడు తన వేలికి ఉంగరం ఉంది. ఇంకా అందరం అన్నీ చోట్లా వెతికాము కానీ, ఎక్కడా ఆ ఉంగరం దొరకలేదు. మా చిన్నమ్మాయి ఏడుస్తూ అత్తవారింటికి హైదరాబాద్ వెళ్ళింది. నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "ఎలాగైనా ఆ ఉంగరం దొరకాల"ని వేడుకున్నాను. మర్నాడు ఉదయం మా చిన్నమ్మాయి ఫోన్ చేసి, ఒక బ్యాగులో ఉంగరం ఉందని చెప్పింది. అందరం చాలా సంతోషించాం.
పెళ్లిళ్లు అయిన తర్వాత, 2026, మే 8న అందరం అంటే మా ఇద్దరు అమ్మాయిలు, అల్లుళ్లు, మనవరాలు, అబ్బాయి, కోడలు, నేను, నా భార్య బయలుదేరి ఫ్లైట్‌లో శిరిడీ వెళ్లాము. అదే రోజు ధూప్ ఆరతిలో మేము పాల్గొన్నాము. మర్నాడు 9వ తేదీ మధ్యాహ్నం 3.40కి మా రిటర్న్ ఫ్లైట్ ఉండగా నేను పొద్దున్నే బాబా దర్శనం చేసుకున్నాను. తర్వాత 10 గంటలకు అందరం టిఫిన్ చేసి దర్శనానికి సీనియర్ సిటిజన్ లైన్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తే నన్ను, నా భార్యను అనుమతించి మిగతా వాళ్లను అనుమతించలేదు. దాంతో వాళ్ళు స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్టు తీసుకుని వస్తామని వెళ్లారు. అప్పటికి దాదాపు 11.10 అవుతుంది. నాకు, నా భార్యకి 20 నిమిషాల్లో దర్శనం అయింది కానీ, పిల్లలు రాలేదు. మేము ముందుగా భయపడ్డట్టే ఆరతికోసం లైన్లు ఆపేసారు. దాంతో ఒకవైపు మేము కనీసం 2 గంటలకి ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలన్న టెన్షన్, ఇంకో వైపు పిల్లలు ఎప్పుడు బయటికి వస్తారో తెలియని పరిస్థితి. బాబానే ప్రార్థించి ఆయన మీదే భారమేసాను. బాబా దయవల్ల వాళ్ళు సరిగ్గా 1:30కి బయటకు వచ్చారు. మేము ఇంకా ఆలస్యం చేయకుండా రూమ్‌కి వెళ్లి, లగేజ్ సర్దుకొని సమయానికి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చాము. అక్కడ వేరే ఫ్లైట్ ఎక్కి తిరుపతి వెళ్ళాము. మే 10వ తేదీన పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిపించాము. మర్నాడు 11వ తేదీ రాత్రి 9 గంటలకి మా తిరుగు ప్రయాణానికి ఫ్లైట్ ఉంది. స్వామివారి దర్శనానికి నా దగ్గర విఐపి లెటర్స్ ఉన్నా వాటిని యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఎదురైంది. ఇంకా తప్పనిసరై నేను, నా భార్య మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటామని అనుకున్నాము. కానీ పిల్లలు విదేశాలకు వెళ్ళిపోతారు కాబట్టి, స్వామివారికి దణ్ణం పెట్టుకొని 11వ తేదీకి శ్రీవాణి టిక్కెట్లు తీసుకున్నాం. ఆరోజు మేము కూడా కొండపైకి వెళ్లి స్వామివారికి బయటనుండి దణ్ణం పెట్టుకొని, రాత్రి 7 కల్లా విమానాశ్రయం చేరుకున్నాము కానీ, 4 గంటలకి శ్రీవాణి బ్రేక్ దర్శనానికి లోపలికి వెళ్లిన పిల్లలు రావడానికి ఎంత టైం పడుతుందో, వాళ్లకి ఫ్లైట్ అందుతుందో, లేదో అని టెన్షన్ పడ్డాం. అయినా నాకు బాబా ఉన్నారన్న ధైర్యం మాత్రం పోలేదు. బాబా దయవల్ల వాళ్ళు మొదటి గడప దర్శనం చేసుకొని 6.30కి బయటకు వచ్చి, ఎయిర్ పోర్ట్‌కి 8 గంటల కల్లా చేరుకున్నారు. సురక్షితంగా ప్రయాణం చేసి ఇంటికి చేరుకున్నాము.
మా పెద్దమ్మాయి, అల్లుడు, మనుమరాలు పోలాండ్‌కి వెళ్ళడానికి మే 16కి టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ 5 రోజుల ముందు వాళ్ళు దుబాయ్‌కి బుక్ చేసుకున్న ఫ్లైట్ క్యాన్సిల్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాంతో వాళ్ళు తప్పనిసరై హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి వియన్నాకి ఫ్లైట్, వియన్నా నుండి పోలాండ్ దేశంలోని క్రకౌకి బస్సు బుక్ చేసుకున్నారు. బస్ ఫ్లైట్‌కి లింక్ సర్వీస్ కాదు కాబట్టి, బస్సు బయలుదేరే లోపు వీళ్ళు వియన్నా చేరుకోవాలి. కానీ ఢిల్లీ నుండి వియన్నా వెళ్లే ఫ్లైట్ ఆలస్యం అయింది. దాంతో అక్కడ బస్ మిస్ అవుతుందేమో అని భయపడ్డాము. ఇక్కడ నేను బాబాకి దణ్ణం పెట్టుకొని, "పిల్లలు బస్సుకి అందేలా చూడమ"ని వేడుకున్నాను. వాళ్ళు వియన్నా చేరుకున్నాక మా పెద్దమ్మాయి చాలా ఉత్సాహంగా ఫోన్ చేసి, "బస్ అందుకున్నాము. ఒక్క నిమిషం ఆలస్యమైనా బస్సు వెళ్లిపోయేది" అని చెప్పడంతో 'మనకు బాబా ఉన్నారు కదా!' అనుకోని మనసులోనే వారికి దణ్ణం పెట్టుకున్నాను. ఆయన దయవల్ల మా పెద్దమ్మాయివాళ్ళు క్రకౌలోని వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు.
తర్వాత 14వ రోజు మా అబ్బాయి, కోడలు బయలుదేరి బాబా దయవల్ల ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి సమస్య లేకుండా యుఎస్ చేరుకోని, వాళ్ళవాళ్ళ ఉద్యోగాల్లో చేరారు. తర్వాత మా చిన్నమ్మాయి, అల్లుడు స్లీపర్ బస్సులో గోవా వెళ్లారు. వాళ్ళ క్షేమం గురించి నేను బాబాను ప్రార్థించాను. బాబా అనుగ్రహంతో వాళ్ళు క్షేమంగా వెళ్లొచ్చారు. 100కి 200% బాబా దయవల్లనే అన్నీ సక్రమంగా జరిగాయి. నేను అందరికీ చెప్పేది ఒక్కటే, 'ఖచ్చితంగా బాబా ఉన్నారు. మనల్ని చూస్తున్నారు, మన ప్రార్థనలు వింటున్నారు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
ఓం శ్రీసాయి సర్వభారాభృతే నమః.
బాబా సాయి చరణం
సర్వదా శరణం శరణం.
సాయిభక్తుల అనుభవమాలిక 2099వ భాగం....
1. మనస్ఫూర్తిగా వేడుకుంటే అన్ని బాబానే చూసుకుంటారు
2. బాబును ప్రసాదించిన బాబా
బాబును ప్రసాదించిన బాబా
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సందీప్. మేము గత 10 సంవత్సరాలుగా బాబాను మా ఇంటి సభ్యుడిలా భావిస్తూ, ప్రతి విషయంలో ఆయన ఆశీస్సులు తీసుకుంటూ జీవిస్తున్నాము. బాబాకు చెప్పకుండా మేము ఏ పని ప్రారంభించము. మా జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆశలు కోల్పోయిన రోజులున్నా మేమెప్పుడూ బాబాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం వదలలేదు. బాబా దయవల్ల మాకు మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థికంగా స్థిరపడ్డాం. హైదరాబాద్‌లో ఒక ఇల్లు కూడా తీసుకున్నాము. మాకు ఒక పాప ఉంది. ఆమె మా జీవితానికి ఆనందం తీసుకొచ్చింది. కానీ కుటుంబసభ్యులు, బంధువులు, సమాజంలోని కొందరు "ఒక బాబు కూడా ఉంటే బాగుంటుంది" అని తరచూ అంటుండేవారు. మా కుటుంబం ఎంతో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తున్నప్పటికీ అలాంటి మాటలు కొన్నిసార్లు మనసుకు బాధ కలిగించేవి. ఆ పరిస్థితుల్లో మేము బాబాపై విశ్వాసం ఉంచి, ఆయనకు మా కోరికను విన్నవించుకున్నాము. కొంత కాలం గడిచాక బాబా ఆశీస్సులతో మాకు ఒక బాబు జన్మించాడు. మా ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ రోజు మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. మా కుటుంబం పరిపూర్ణమైన భావన కలిగింది. మాకు సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవం లభించినట్లు అనిపించింది. బంధువులు, స్నేహితులు కూడా చాలా సంతోషించారు. ఈ అనుభవం ద్వారా మేము బాబాను సంపూర్ణంగా విశ్వసిస్తే, ఆయన సరైన సమయంలో మనకు కావాల్సింది ప్రసాదిస్తారు. కొన్నిసార్లు ఆలస్యం జరిగినట్లు అనిపించినా, బాబా నిర్ణయం ఎప్పుడూ మన మంచికే అయి ఉంటుందని నేను తెలుసుకున్నాను. "బాబా! మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఐ లవ్ యు బాబా".
సాయిభక్తుల అనుభవమాలిక 2098వ భాగం....
- 'శ్రద్ధ - సబూరీ' కలిగి ఉంటే, సరైన సమయంలో అన్నీ చక్కబెడతారు బాబా
ఒకరోజు నేను టీవీ ఛానళ్లు కోసం రీఛార్జ్ చేస్తే, నాకు కావాల్సిన కొన్ని ఛానళ్లు యాక్టివేట్ కాలేదు. కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదులు చేసినా సమస్య పరిష్కారం రాలేదు. నేను ప్రతిరోజూ బాబాను స్మరిస్తూ ఓపికగా ఎదురుచూసి చివరికి ఒకరోజు, "బాబా! ఈ సమస్యను మీరు మాత్రమే పరిష్కరించగలరు" అని బాబాని వేడుకున్నాను.
కొంత సమయం తరువాత చెక్ చేస్తే, ఆశ్చర్యకరంగా మిస్ అయిన ఛానళ్లు అన్నీ యాక్టివేట్ అయ్యాయి. ఆ క్షణం బాబా నా ప్రార్థన ఆలకించారని నాకనిపించి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. అలాగే చాలారోజులు మా ల్యాండ్‌లైన్ ఫోన్‌కు ఎలాంటి కాల్స్ రాకపోతే ఒకరోజు నేను బాబాను ప్రార్థించి, ఆయన్ని స్మరిస్తూ ఉండగా కొద్దిసేపటికి ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది. ఇది చిన్న విషయంగా అనిపించినా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే, బాబా తమ ఉనికిని తెలియజేస్తూ, 'నేను నీతోనే ఉన్నాను' అని చెప్పినట్లుగా అనిపించింది. ఈ రెండు సంఘటనలు నా విశ్వాసాన్ని మరింత పెంచాయి. సాయిబాబా తన భక్తులకు సంబంధించిన పెద్ద విషయాల్లోనే కాదు, చిన్న విషయాల్లో కూడా సహాయం చేస్తారని మరోసారి నాకు అనుభవమైంది. మనం శ్రద్ధ(విశ్వాసం), సబూరీ(
ఒకరోజు నా ఫారం 16 పిడిఎఫ్‌లో 'సిగ్నేచర్ నాట్ వెరిఫైడ్(Signature Not Verified)' అని చూసి ఆందోళన చెందాను. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక సందిగ్ధంలో ఉన్న సమయంలో సాయిబాబాను ప్రార్థించాను. బాబా దయతో అనుకోకుండా సరైన మార్గదర్శనం లభించి అడోబ్ అక్రోబట్ రీడర్(Adobe Acrobat Reader) ద్వారా డిజిటల్ సిగ్నేచర్‌ను వెరిఫై చేసే విధానం తెలిసి సమస్య పరిష్కారమైంది. ఇది చిన్న విషయంగా కనిపించినా, నాకు అది బాబా కృపతో సరైన సమయంలో, సరైన సహాయం అందినట్లుగా అనిపించింది. జీవితంలో ఇలాంటి సందర్భాలు విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయని నేను నమ్ముతున్నాను.
సాయి శ్రీసాయి జయజయసాయి
సాయిభక్తుల అనుభవమాలిక 2097వ భాగం....
1. సరైన సమయంలో, సరైన విధంగా మార్గదర్శనం చేసే బాబా
2. అంతా బాబా దయ
సాయిభక్తుల అనుభవమాలిక 2096వ భాగం....
1. ఆరోగ్య సమస్యలను పూర్తిగా తగ్గించిన బాబా
2. కృపతో కోరుకున్నట్టు అనుగ్రహించిన బాబా
3. కోరుకున్నట్టు దర్శనమిచ్చి పాస్‌పోర్ట్ మంజారు చేసిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2095వ భాగం....
- అడుగడుగునా బాబా కృప
సాయిభక్తుల అనుభవమాలిక 2094వ భాగం....
1. బాబా మీద నమ్మకం పెట్టుకుంటే చాలు - ఆలస్యమైనా ఖచ్చితంగా అనుగ్రహిస్తారు
2. బాబా దయ కాకపోతే పోయిన లాకెట్టు అదివరకే జిప్‌లు వేసిన బ్యాగులో ఉండటం ఏమిటి?
3. చెప్పుకున్న కాసేపటికే నొప్పిని తగ్గించిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2093వ భాగం....
1. ఏళ్ళ బాధను ఒక్క ప్రార్థనతో తీసేసిన బాబా
2. కోరుకున్నట్టే బిడ్డలను ప్రసాదించిన బాబా
సాయిభక్తుల అనుభవమాలిక 2092వ భాగం....
- సమస్యలు చిన్నవైనా, పెద్దవైనా బాబాను నమ్మి ప్రార్థిస్తే, మనసుకు ప్రశాంతత లభిస్తుంది
నా పేరు మహేష్. నేను ఒక కంపెనీలో పని చేస్తున్నాను. నేను రాత్రిపూట షిఫ్ట్‌లో పని చేస్తాను. నా షిఫ్ట్ ప్రతిరోజూ రాత్రి 2:30కి ముగుస్తుంది. ఇంటికి వచ్చి పడుకునేసరికి 3:30 అవుతుంది. మళ్ళీ ఉదయం 8 లేదా 9 గంటలకి నిద్ర లేస్తే, శరీరానికి సరైన విశ్రాంతి లభించక రోజంతా అలసటగా అనిపిస్తుండేది. అందుకని నేను బాబాని, "నాకు ఉదయం 10 గంటల వరకు ప్రశాంతమైన నిద్ర కావాల"ని కోరుకొని ఆయనపై పూర్తి నమ్మకముంచి ప్రతిరోజూ నిద్రపోయేముందు బాబాను స్మరించడం ప్రారంభించాను. బాబా కృపతో నెమ్మదిగా నా మనసు ప్రశాంతమై నాకిప్పుడు గాఢమైన నిద్రపడుతుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల వరకు సుఖంగా నిద్రపోగలుగుతున్నాను. మునుపటిలా ఇప్పుడు అలసట ఉండట్లేదు. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. నా ఆరోగ్యం కూడా మెరుగుపడింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బాబాపై నాకు భక్తి మరింత పెరిగింది. ప్రతిరోజూ బాబాను స్మరించడం నాకు అలవాటుగా మారింది. ఆయన ఆశీర్వాదంతో నా జీవితం సుఖంగా సాగుతోంది. నా జీవితంలో వచ్చిన ఈ మంచి మార్పుకు ఆయనకి కృతజ్ఞతలు, హృదయపూర్వక నమస్కారాలు.
ఒకసారి నా ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమస్యతో నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఎంత ప్రయత్నించినా అది సరిగ్గా ఛార్జ్ అయ్యేది కాదు. దాంతో నా పనులు ఆగిపోవడంతో నేను పిర్యాదు చేశాను. కానీ రెండు రోజులు గడిచినా సమస్య పరిష్కారం కాలేదు. నాకు టెన్షన్ ఎక్కువై, “బాబా! ఈ సమస్యను మీరు తప్ప మరెవ్వరూ సరిచేయలేరు” అని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించాను. కొంతసేపటి తర్వాత మళ్లీ ల్యాప్‌టాప్‌ను కనెక్ట్ చేసి చూసాను. ఆశ్చర్యంగా, అది మామూలుగా ఛార్జ్ అవ్వడం ప్రారంభించింది. ఆ క్షణంలో నాకు బాబా ఉన్నారనే నమ్మకం మరింత పెరిగింది. ఆయన కృపతో నా సమస్య సులభంగా పరిష్కారమైంది. ఆయన దయ ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటున్నాను.
ఒకరోజు నేను ఆఫీస్‌లో నా మొబైల్ చార్జింగ్ కేబుల్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మొదట అది పెద్ద విషయం అనిపించలేదు కానీ, అవసరం వచ్చినప్పుడు అది దొరకకపోయేసరికి కొంచెం ఆందోళన, అసౌకర్యం కలిగాయి. ఎంత ఆలోచించినా ఎక్కడ పెట్టానో గుర్తు రాలేదు. అప్పుడు మనసులో బాబాని గుర్తు చేసుకొని, “బాబా! ఇది చిన్న విషయమై అయినా నాకు ఇప్పుడు దాని అవసరం చాలా వుంది. దయచేసి అది దొరకేలా చేయండి” అని ప్రార్థించాను. కొంతసేపటి తర్వాత ఆ కేబుల్ ఆఫీస్‌లో సురక్షితంగా ఉన్నట్లు తెలిసింది. చివరకు అది నాకు తిరిగి దొరికింది. మన జీవితంలో కొన్ని సంఘటనలు సాధారణంగా అనిపించినా లోతుగా గమనిస్తే, దైవ కృపలా అనిపిస్తాయి.
జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒక సాధారణ ఫోన్ కాల్ కూడా చాలా భారంగా అనిపిస్తుంది. ఒకరోజు నేను నా కొడుకుకి ఫోన్ చేస్తే, తను ఎత్తలేదు. మూడు, నాలుగు సార్లు చేసినా తన నుండి ఎలాంటి స్పందన లేకపోయింది. ఒక్కొక్క కాల్కి నా మనసులో ఆందోళన పెరిగి, 'తను బాగానే ఉన్నాడా? నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? నేను ఏదైనా తప్పు చేశానా?' అని ఆలోచనలు మొదలయ్యాయి. అంతకంటే ఎక్కువ ఆలోచించకుండా నేను కళ్ళు మూసుకుని మౌనంగా, “బాబా! దయచేసి నన్ను నా కొడుకుతో మాట్లాడేలా చేయండి” అని బాబాతో చెప్పుకున్నాను. వెంటనే ఏం జరగకపోయినప్పటికీ నా మనసులో కొంత శాంతి చోటు చేసుకుంది. కొంతసేపటి తర్వాత తను నా కాల్ లిఫ్ట్ చేశాడు. ఆ క్షణం నాకు చాలా ఆనందం కలిగింది. అది కేవలం ఒక ఫోన్ కాల్ కాదు – బాబా ఆశీర్వాదం అనిపించింది. ఈ అనుభవం సహనం అవసరమని, సరైన సమయంలో అన్నీ జరుగుతాయని తెలియజేసింది.
ఒకరోజు బస్సు ప్రయాణంలో అకస్మాత్తుగా యూరిన్ సమస్యతో నాకు చాలా ఇబ్బంది కలిగింది. బస్సు ఎక్కడ ఆపుతారో, అప్పటివరకు ఎలా మేనేజ్ చేయాలో అర్థంకాక మనసులో భయం, ఆందోళన కలిగి మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. ఆశ్చర్యంగా కొద్దిసేపట్లోనే బస్సు ఆగింది. నాకు చాలా ఉపశమనం కలిగింది. ఆ క్షణంలో బాబా నా పక్కనే ఉన్నట్టు అనిపించింది. బాబా కృప ఎంత అద్భుతంగా ఉంటుందో అనుభూతి చెందాను. ఈ అనుభవాల ద్వారా మన సమస్య చిన్నదైనా, పెద్దదైనా భక్తితో పిలిస్తే బాబా తప్పకుండా దారి చూపిస్తారు.
