సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2133వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం
2. సందేశంలో చెప్పినట్లే అనుగ్రహించిన బాబా

బాబా దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం

నా పేరు శ్రీనివాస్. నేను నా భార్య, పిల్లలతో సోలాపూర్‌లో నివాసముంటున్నాను. 2026, ఆగస్టు నెలాఖరులో నా స్నేహితుడి పెళ్ళి విజయవాడలో జరిగింది. ఆ పెళ్ళికి వెళ్లేందుకు నేను డైరెక్ట్ ట్రైన్స్ లేకపోవడం వల్ల 'సోలాపూర్ నుంచి హైదరాబాద్‌కి, అక్కడినుండి విజయవాడకి బ్రేక్ జర్నీ టికెట్లు బుక్ చేసుకున్నాను. తీరా ప్రయాణమయ్యే రోజు రాత్రి సోలాపూర్‌లో నేను ఎక్కాల్సిన ట్రైన్ గంట ఆలస్యంగా వచ్చింది. అదీకాక మరో గంట సోలాపూర్‌లో నిలిచిపోయింది. సరే రాత్రి ఆ ఆలస్యాన్ని కవర్ చేస్తాడనుకుంటే, కవర్ చేయలేదు సరికదా! మరింత ఆలస్యమైంది. దానివల్ల నేను హైదరాబాద్‌లో అందుకోవాల్సిన కనెక్టింగ్ ట్రైన్ అందని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను "కనీసం వేరే ట్రైన్ అయిన తొందరగా అందేలా చూడండి బాబా" అని బాబాని ప్రార్థించాను. ఆయన దయ చూపారు. నేను బేగంపేటలో దిగి రాపిడో బైక్ బుక్ చేసుకొని చర్లపల్లి స్టేషన్‌కి వెళ్లేసరికి అక్కడ బాబా నాకోసమే ఆపినట్లుగా సాయినగర్ శిరిడీ నుండి విశాఖపట్నం వెళ్తున్న వీక్లీ ఎక్ష్ప్రెస్స్ రైలు ఆగి వుంది. నేను ట్రైన్ ఎక్కేసాను. TTE నాకు ఒక సీటు కూడా ఇచ్చా రు. అలా బాబా దయవల్ల నేను ఏ ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం 3:30కి విజయవాడ చేరుకున్నాను. తిరుగు ప్రయాణంలో కూడా బాబా దయవల్ల ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదు. "ధన్యవాదాలు బాబా".

తర్వాత ఒకరోజు ఉదయం నా భార్య బావగారు(అక్క భర్త) నిద్రలోనే చనిపోయారు. వాళ్ళు ఉండేది విజయనగరం కావడం వల్ల హఠాత్తుగా షోలాపూర్ నుండి భార్యపిల్లలతో సహా అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు నెలల ముందు ట్రైన్ టికెట్లు బుక్ చేస్తేనే కన్ఫర్మ్ అవ్వవు. అలాంటిది అప్పటికప్పుడు టిక్కెట్లు దొరకడం చాలా కష్టమైన పని. ఇక్కడ నుండి బస్సులు అసలు ఉండవు. ఇప్పుడెలా అనుకున్నంతలో ఆ సాయినాథుని దయవల్ల ఆరోజు మధ్యా హ్నం 2 గంటలకి వచ్చే LTT-VSKP EXP ట్రైన్ కి కరెంట్ ఆవైలబిలిటీలో 2 టిక్కెట్లు కనిపించాయి. వెంటనే టికెట్ బుక్ చేసుకుని, తిరిగి రావడం గురించి బాబా మీద భారమేసి విజయనగరం వెళ్ళాము. ఇకపోతే, మేము మా తిరుగు ప్రయాణం కోసం కోణార్క్ ట్రైన్‌కి టిక్కెట్లు బుక్ చేసాము. కానీ అవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రయాణమయ్యేరోజు ఒక టికెట్ కన్ఫర్మ్ అయి, మరొకటి వెయిటింగ్ లిస్టులో ఉండిపోయింది. అయితే మరోసారి బాబా తమ లీల చూపించారు. మర్నాడు ఆదివారం ఉదయం నా భార్య ట్విన్ సిస్టర్ వాళ్ళు విజయనగరం నుంచి హైదరాబాద్‌కి కారులో వెళ్ళబోతున్నారు. అదృష్టవశాత్తూ మాకు చర్లపల్లి నుండి సోలాపూర్‌కి ట్రైన్ టికెట్లు దొరికాయి కూడా. అలా బాబా దయవల్ల పిల్లలతో ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయనగరం నుండి సోలాపూర్ చేరుకున్నాము. లేదంటే ఇద్దరు చిన్నపిల్లలతో అంత దూర ప్రయాణం చాలా కష్టమయ్యేది. "ధన్యవాదాలు బాబా. మీ కృపాదృష్టి మాపై సదా ప్రసరించండి తండ్రీ".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo