సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 2130వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • ఎంత ఆధారపడితే, అంతలా కనిపెట్టుకొని ఉండే బాబా

సాయి భక్తులందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. బాబా అనుగ్రహంతో వారు నాకు ప్రసాదించిన కొన్ని అద్భుతమైన అనుభవాలను మీ అందరీతో పంచుకుంటున్నాను. నేను ఎన్నోసార్లు స్కూటీ కొనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. కానీ, మా ఆర్థిక పరిస్థితి కారణంగా అది కలలా మిగిలిపోయింది. నేను ఎన్నోసార్లు బాబాని, "బండి లేకపొతే నేను ఏ పని చేసుకోలేకపోతున్నాను. మీకు తెలుసు కదా నా పరిస్థితి. తొందరలోనే బండి కొనుక్కునేలా చూడండి బాబా" అని వేడుకున్నాను. ఆఖరికి ఇన్నాళ్లుగా నేను కోరుకున్నది జరగలేదు,ఇంకా జరగదని అనేసుకున్నాను. కాని బాబా మాత్రం నేను అడిగింది మర్చిపోలేదు. రోజులు గడుస్తూ 2026, గురుపూర్ణిమ వచ్చింది. ఆరోజు నాకు స్కూటీ ఇవ్వాలని బాబా నిర్ణయించారనుకుంటా! మావారు స్కూటీ తీసుకోవడానికి షోరూంకి వెళదామన్నారు. నిజానికి నేను నా మనసులో కనీసం గురుపౌర్ణమినాడు మీ దర్శనం కూడా చేసుకోలేకపోతున్నాను బాబా అనుకున్నాను. 'నువ్వు నా దర్శనంకి రాలేకపోతే, నేనే నీ దగ్గరికి వస్తాను' అన్నట్టు నేను, నా భర్త షోరూంకి వెళ్తుంటే అడుగడుగునా బాబా తమ దర్శనం ఇచ్చారు. బస్సులపైనా, కార్లపైనా, షాపులపైనా ఇలా ఎక్కడ చూసినా బాబానే కనిపించారు. షోరూంలో ప్రక్రియ అంతా పూర్తై బండి నా చేతికి వచ్చాక ఒక ఫోటో దిగమని షోరూం వాళ్ళు అన్నారు. నేను ఫోటో దిగి అలా చూసానో, లేదో ఒక బస్సు మీద పెద్ద బాబా ఫోటో నవ్వుతూ దర్శనమిచ్చింది. 'ఇప్పుడు నీకు సంతోషమేనా?' అని బాబా అడుగుతున్నట్టు నాకనిపించింది. నేను మనసులో, "నాకు చాలా సంతోషంగా ఉంది బాబా. మీరు నన్ను ఇంత అద్భుతంగా ఆశీర్వదిస్తారనుకోలేదు' అనుకొని బయలేదేరి నేరుగా గుడికి పోయి పూజ చేయించుకున్నాము. తర్వాత బాబా పల్లకి ఊరేగింపుతో వెళ్తుంటే, బాబాని దర్శించుకొని ఇంటికి వచ్చాము. నేను గురుపౌర్ణమి సందర్భంగా బాబాకి పువ్వో, పండో ఇవ్వాలి కానీ, ఆయనే నాకు కొండంత ఆనందాన్ని ఇచ్చారు.

నేను కొన్ని నెలలు నెలసరి సమస్యతో ఇబ్బందిపడ్డాను. కుటుంబంలో ఎవరికైన క్యాన్సర్ వచ్చి ఉంటే మిగతవాళ్లకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను విన్నాను. మా అమ్మ గర్బసంచి క్యాన్సర్ వల్ల చనిపోయింది. నాకున్న సమస్యలు ఇంచుమించు మా అమ్మ ఎదుర్కొన్న సమస్యల్లానే ఉండేవి. మరోపక్క నా భర్త ఆరోగ్యం కూడా బాగలేదు. మాకు ఇద్దరు చిన్నపిల్లలు. నా భర్త అనారోగ్యం వల్ల నేనే వాళ్ళకి ముఖ్యమైన ఆధారం. అందుకని నాకు చాలా భయమేసి బాబాని తలుచుకొని, "నాకు ఏదైనా జరిగితే పోయేది ఒక్క ప్రాణం కాదు, నాలుగు ప్రాణాలు బాబా. మా ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయి. టాబ్లెట్లు వేసుకుంటే సమస్య తగ్గి, వేయకుంటే మళ్ళీ వస్తుంది. మీరు నాకు అన్యాయం చేయరని నాకు తెలుసు. ఆ ధైర్యంతో ఈ మాత్రలు వేసుకోవడం ఆపేస్తున్నాను" అని చెప్పుకొని టాబ్లెట్లు వేసుకోవడం మానేసాను. బాబా ఫేస్బుక్ ద్వారా 'నీకు ఏమి కాదు. నువ్వు కోలుకుంటావని' సందేశాలు ఇస్తుండేవారు. బాబా దయవల్ల ఆయన చెప్పినట్లే నా సమస్య తగ్గిపోయింది. మనం బాబా మీద ఎంత ఆధారపడితే, ఆయన అంతలా మనల్ని కనిపెట్టుకొని ఉంటారు.

నేను ఉద్యోగస్థురాలిని. 2026, ఆగస్టు నెలలో లాప్టాప్ లో ఫైల్స్ అప్లోడ్ చేస్తుంటే, అప్లోడ్ కాలేదు. సమస్య ఎక్కడ వుందో తెలియక నా పని కొంచం కూడా జరగలేదు. అప్పుడు మా సార్ వాళ్ళు నా మీద కోపడుతారేమోనని బాబాని తలచుకొని, "బాబా! నేనేం చేయలేకపోతున్నాను. ఇలాగే ఉంటే నా ఉద్యోగం పోయే ప్రమాదం లేకపోలేదు. ఈ ఉద్యోగం పోతే ఇలాంటి ఉద్యోగం రావడం కష్టం. కాబట్టి మీరే నాకు సహాయం చేయాలి బాబా" అని వేడుకొని బాబా ఊదీ ల్యాప్‌టాప్‌కి పెట్టి, "మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. రేపు సమస్య పరిష్కారం కావాలి" అని అనుకొని పడుకున్నాను. మర్నాడు ఉదయం ఇంట్లో పనులు పూర్తి చేసుకొని ఆఫీసుకి బయలుదేరేముందు క్వశ్చన్&ఆన్సర్ సైట్‌లో బాబాని అడిగితే, సమస్య పరిష్కారమవుతుందన్నట్టు సానుకూలమైన సమాధానం వచ్చింది. ఇంకా ఆఫీసుకి వెళ్ళే దారిలో నా వెంటే ఉన్నానన్నట్టు దారిపొడుగునా బాబా దర్శనమిచ్చారు. కానీ ఆఫీసుకి చేరుకుని వర్క్ మొదలుపెడితే ఒకటి, రెండు సార్లు అదే సమస్య వచ్చింది. దాన్ని మా మేనేజర్ సార్ కూడా పరిష్కరించలేకపోయారు. నాకు ఏమి చేయాలో అర్థం కాక, "బాబా! ఈరోజు నా సమస్య పోతుందన్నారు. కానీ ఇంకా పోలేదు. నాకు సహాయం చేయండి" అనుకున్నాను. వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చి, ఆ ఫెయిల్ అయిన ఫైల్స్ పిడిఎఫ్ లోకి మార్చి అప్లోడ్ చేస్తే, అద్భుతం జరిగింది. అవి ఎటువంటి సమస్య లేకుండా అప్లోడ్ అయ్యాయి. ఇక అప్పటినుండి నేను ఎలాంటి సమస్య ఎదుర్కోలేదు. అంత సజావుగా జరుగుతుంది. ఇదంతా బాబా దయేనని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. "బాబా! మీకు మనస్ఫూర్తిగా నమస్కరించడం తప్ప ఏం చేయలేను. నాపైనా, కుటుంబంపైనా మీ దయ ఇలాగే ఉండాలి తండ్రి. అందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదించండి బాబా".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo