ఈ భాగంలో అనుభవాలు:
1. కాలినొప్పి నుండి ఉపశనం ప్రసాదించిన బాబా
2. సాయి దివ్యపూజలో చివరి గురువారంనాడు బాబా అనుగ్రహం
కాలినొప్పి నుండి ఉపశనం ప్రసాదించిన బాబా
సాయి సర్వ సంకట హరాయ నమః. నా పేరు శ్రీవాణి. ఈ రాఖీ పౌర్ణమినాడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవం మీతో పంచుకుంటున్నాను. నేను స్కూలు టీచరుని. కొన్ని రోజుల కిందట నేను స్కూల్లో (సాయి స్వరూపాలైన)విద్యార్థులని కొట్ టానని, దానికి కర్మ రూపేణా నేను బాత్రూంలో స్టూల్ మీద నుండి పడిపోయానని, ఆ ఘటనలో బాబా నా నడుము విరిగిపోకుండా కాపాడారని మీతో పంచుకున్నాను. అయితే ఆరోజు నాకు ఏ ఇబ్బందీ తెలియలేదు కానీ, ఆ తరువాత కింద కూర్చున్నప్పుడు, పైకి లేచేటప్పుడు, కాలు మడిచేప్పుడు మోకాలిలో ఏదో బేణికినట్లు చాలా నొప్పిగా ఉంటుండేది. 2026, ఆగస్టు 28, రాఖీ పౌర్ణమి రోజు సాయిబాబా మందిరానికి వెళ్లి సాయినాథుని పాదాల దగ్గర కూర్చున్నప్పుడు కూడా నొప్పితో చాలా ఇబ్బందిగా అనిపించింది. అయినా కొద్దిసేపు కూర్చొని 'సాయి నామం' చెప్పుకున్నాను. తర్వాత ఇబ్బందిపడుతూనే లేచి నిలబడి బాబాకి ఆరతి ఇచ్చాను. ఆరోజు ఇతర భక్తులెవరు రానందున ఒక్కదాన్నే సాయితో మనస్ఫూర్తిగా గడిపే అవకాశం నాకు లభించింది. "ఈ రాఖీ పండుగనాడు అన్ని విషయాల్లోనూ నాకు రక్షణ ప్రసాదించమ"ని సాయిని ఆర్థిస్తూ చాలా సమయం మందిరంలోనే గడిపాను. సాయితో నా మనసులో ఉన్న ఎన్నో విషయాలు చెప్పుకున్నాను. అయితే చాలాసేపు నేల మీద కూర్చోవడం వల్ల ఇంటికెళ్ళాక ఆ నొప్పి ముందు కన్నా ఎక్కువ బాధించింది. అప్పుడు మనసులో, 'మీ గుడికి వచ్చాను. మీ సేవ చేసుకున్నాను. అయినా ఈ నొప్పి పెరిగిందేంటి సాయి?' అని అనుకున్నాను. ఆమధ్య ఆక్సిడెంట్లో చీలమండ లిగ్మెంట్ టియర్ జరిగినట్లు, ఇప్పుడు మోకాలి లిగ్మెంట్ టియర్ అయిందా అని చాలా భయపడి, "బాబా! విద్యార్థులు అల్లరి చేస్తుంటే, వాళ్ళని కొట్టినందుకు మరీ ఇన్ని రోజులు నొప్పి అవుతుందేంటి? దానికి మరీ ఇంత కర్మ అనుభవించాల్సి వుంటుందా?" అని బాబాని అడిగాను. అలా అనుకుంటూ మంచంపై కూర్చుని సాయిని స్మరిస్తూ ఉండగా ఉన్నట్టుండి 'టక్'మంటూ మోకాలిలో శబ్దం వచ్చింది. మోకాలి నరం బెణుకు విడినట్లై వెంటనే నొప్పి మాయం అయింది. అన్ని రోజులుగా అలా కూర్చున్నపుడు లేనిది, ఆరోజు ఎవరో లాగి సరి చేసినట్లు దానంతట అదే పట్టుకున్న నరమో లేదా కండరమో వదులై వెంటనే నొప్పి తగ్గిపోయింది. దాంతో మామూలుగా మెడ పట్టేసినట్లుగానే ఇన్నిరోజులు మోకాలి నరం పట్టేసిందని, నేను భయపడినంతగా ఏమీ జరగలేదని చాలా ఆనందపడ్డాను. "ఇన్నిరోజుల బాధ నుండి నాకు ఉపశమనం కల్గించినందుకు వేవేల కృతజ్ఞతలు సాయిదేవా! మీ సన్నిధిని నా మనసు ఎప్పుడూ వీడకుండుగాక!".
సాయి దివ్యపూజలో చివరి గురువారంనాడు బాబా అనుగ్రహం
