నీంగాఁవ్ నివాసస్థులైన త్రయంబక్ డేంగ్లే ఆ గ్రామ జాగీర్‌దారుగా ఉండేవారు. అతని మనుమలు బాబాసాహెబ్ డేంగ్లే మరియు నానాసాహెబ్ డేంగ్లేలు బాబాకు పరమ భక్తులు. బాబాకు కూడా బాబాసాహెబ్ డేంగ్లే అంటే చాలా ఇష్టం. బాబా తరచూ శిరిడీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నీంగాఁవ్ లోని డేంగ్లే ఇంటికి వెళ్తుండేవారు. ఆ రోజంతా అతనితో మాట్లాడుతూ గడిపేవారు. వాళ్ళు వేపచెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. తరువాత బాబా ప్రధాన రహదారి మీదుగా నడుచుకుంటూ శిరిడీకి తిరిగి వచ్చి ద్వారకామాయికి చేరుకునేవారు.
బాబాసాహెబ్ డేంగ్లే కనిష్ఠ సోదరుడు నానాసాహెబ్ డేంగ్లే. అతనికి మగసంతానం లేనందున ఎప్పుడూ చింతాగ్రస్తుడై ఉండేవాడు. మొదటి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉన్నందున అతడు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ విధి వెక్కిరించింది, రెండవ వివాహం చేసుకున్నా కూడా అతనికి పుత్రుడు జన్మించలేదు. అప్పుడు బాబాసాహెబ్ డేంగ్లే తన సోదరుణ్ణి శ్రీసాయిబాబాను దర్శించమని పంపాడు. సాయిబాబా అనుగ్రహం, ఆశీర్వాదం వల్ల అతనికి పుత్రుడు జన్మించాడు. అంతటితో అతడు కూడా సాయిబాబాకు భక్తుడై, ఆయనను ఎంతగానో ప్రేమిస్తుండేవాడు.
నానాసాహెబ్ డేంగ్లే అహ్మద్‌నగర్ లోని ప్రభుత్వ వర్గాలలో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. అధికారులందరి వద్ద అతనికి గొప్ప పలుకుబడి ఉండేది. వాళ్ళల్లో చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనునతడు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ దగ్గర సెక్రటరీగా పనిచేస్తుండేవాడు. ఒకసారి నానాసాహెబ్ అతనికి, "మీరు మీ భార్య, పిల్లలు, స్నేహితులతో కలిసి శిరిడీ వచ్చి సాయిబాబా దర్శనం చేసుకోండి. ఆయన దర్శనమెంతో శ్రేయోదాయకమైనది" అని లేఖ వ్రాశాడు. ఆ లేఖ అందుకున్న చిదంబర్ కేశవ్ శిరిడీ వెళ్లి బాబా దర్శనంతో ఆనందభరితుడయ్యాడు. అప్పటినుండి అతను బాబాకు అంకిత భక్తుడయ్యాడు. ఈ విధంగా బాబా కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందడం మొదలై అహ్మద్‌నగర్, అక్కడి చుట్టుప్రక్కల ప్రాంతాలనుండి జనులు తండోపతండాలుగా బాబా దర్శనం కోసం శిరిడీ రాసాగారు. దాంతో రోజురోజుకీ భక్తుల సంఖ్య అంతకంతకూ పెరగసాగింది.
ఒకనాడు బాబాసాహెబ్ డేంగ్లే పొలంపనులు చేయిస్తున్నాడు. ఒక కూలిమనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తోంది. అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోకి పరుగుతీశారు. వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్లేసరికి, బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు! బాబా ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరచినందుకు మందలించారు. ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకొనేలోగా బాబా అదృశ్యమయ్యారు. ఆ తరువాత విచారిస్తే ఆ సమయంలో బాబా శిరిడీలోనే ఉన్నారని తెలిసింది.
బాబా ద్వారకామాయిలో ఒక చెక్కబల్ల మీద నిద్రించేవారు. దానిని నానాసాహెబ్ డేంగ్లేనే బాబాకు కానుకగా సమర్పించుకున్నాడు. ఆ చెక్కబల్ల నాలుగు మూరల పొడవు, జానెడు వెడల్పు కలిగి ఉండేది. బాబా దానిని సన్నని గుడ్డపీలికలతో మశీదు పైకప్పు నుండి మూరెడు కిందకి ఉయ్యాలలాగా వ్రేలాడదీశారు. రాత్రివేళ దానికి నాలుగు మూలలా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి, వాటి మధ్యన బాబా తలవంచుకొని కూర్చునేవారు లేదా నిద్రపోయేవారు. ఆయన దానిపైకి ఎలా ఎక్కేవారో, ఎలా దిగేవారో ఎవరికీ అంతుబట్టేది కాదు. ఆయన ఆ బల్లను గుడ్డపీలికలతో కట్టారు సరే, కానీ అవి ఆయన బరువును ఎలా మోయగలిగేవో! బాబా అష్టసిద్ధులను తమ స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆయనకు ఈగలా, పురుగులా, చీమలా చాలా తేలికగా మారిపోయే శక్తి ఉంది. చెక్కబల్ల అన్నది కేవలం నామమాత్రమే.
ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే మహల్సాపతి సహాయం తీసుకొని సంప్రదాయబద్ధంగా పూజించేందుకు అనుమతించమని బాబాను వేడుకొన్నాడు. కానీ ఆయన అందుకు అంగీకరించక మశీదులో ఉన్న ఒక స్తంభాన్ని చూపించి దాన్ని పూజించమన్నారు. అతడు బాబా ఆదేశించినట్లే స్తంభాన్ని పూజించాడుగానీ అతనికి సంతృప్తి కలగలేదు. అందువలన అతను మళ్ళీ అదే విజ్ఞప్తితో బాబాను సంప్రదించాడు. ఆయన మునుపటిలాగానే స్తంభాన్ని పూజించమన్నారు. కానీ ఈసారి అతను తాను అనుకున్నట్లు బాబాను పూజించాలని మొండిపట్టుపట్టి దగ్గూభాయ్ అనే మరో భక్తుని సహాయంతో బాబాను పూజించాడు. బాబా కోపంతో అతనిపై విరుచుకుపడ్డారు. డేంగ్లే వాటిని ఆయన ఆశీస్సులుగా భావించి సంతోషంగా స్వీకరించాడు.
ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే పలురకాల రుచికరమైన వంటకాలను ఒక పెద్ద వెండి పళ్లెంలో వడ్డించి బాబాకు అర్పించాడు. బాబా కేక వేయగానే ఒక నల్లకుక్క వచ్చి వాటిని తినసాగింది. అది చూచి అతడు అసహ్యించుకుంటూ తన మనసులో, "ఈ ఊరకుక్క కోసమా నేను ఇవన్నీ సిద్ధం చేసి తీసుకొచ్చాను?" అని అనుకున్నాడు. వెంటనే సర్వజ్ఞుడైన బాబా ఆ పళ్లాన్ని దూరంగా తోసేసి, “దీన్ని నువ్వే తీసుకో. నాకొద్దు!” అన్నారు. బాబా సర్వజీవులలోనూ ఉంటారు. ఆ జీవిని అసహ్యించుకుంటే వారిని అసహించుకున్నట్లే.

బాబా ద్వారకామాయిలో దీపాలు వెలిగించడానికి శిరిడీలోని దుకాణాదారుల వద్దనుండి నూనె అడిగి తెచ్చేవారు. ఒకసారి ఆ దుకాణాదారులు నూనె ఇవ్వడానికి నిరాకరించారు. బాబా నిశ్చింతగా మశీదుకు వెళ్లారు. నూనె లేకుండా బాబా ఏం చేస్తారో చూద్దామని ఆయనను అనుసరిస్తూ దుకాణాదారులు కూడా మశీదుకు వచ్చారు. బాబా నీటితో ప్రమిదలు నింపారు. అది చూస్తున్న దుకాణాదారులు, "ఈ మనిషి ఖచ్చితంగా పిచ్చివాడు" అని అన్నారు. ఆ సమయంలో అక్కడున్న నానాసాహెబ్ డేంగ్లే వాళ్ళ మాటలకు అంగీకరించక, "ఈయనకున్న శక్తి ఏమిటో ఆ శ్రీహరికి తెలుసు. రాళ్ళకుప్పలో ఉన్నంత మాత్రాన వజ్రాన్ని రాయి అని అంటారా?" అని అన్నాడు. అంతలో బాబా దీపాలు వెలిగించారు. అవి దేదీప్యమానంగా కాంతులు వెదజల్లసాగాయి. ఆ రాత్రంతా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఆ అద్భుత లీలకు ఆశ్చర్యపోతూ డేంగ్లే బాబా పాదాల మీద పడ్డాడు. జీవితాంతం ఆయనకు గొప్ప భక్తునిగా నిలిచిపోయాడు.
శిరిడీ వాస్తవ్యుడైన మార్తాండ్ అనే దర్జీ (టైలర్) ఒకప్పుడు అనారోగ్యంతో చాలా బాధపడ్డాడు. అట్టి స్థితిలో అతనిని చూసుకోవటానికి ఎవరూ లేరు. బాబా లెండీకి వెళ్తూ దారిలో నిస్సహాయస్థితిలో ఉన్న అతన్ని చూసి, "నువ్వు నీంగాఁవ్ లోని నాసాహెబ్ డేంగ్లే వద్దకు వెళ్ళు, అతడు నిన్ను ఆదరిస్తాడు" అని చెప్పారు. దాంతో అతడు నీంగాఁవ్ వెళ్లి డేంగ్లేను కలిశాడు. డేంగ్లే అతనితో, "బాబా నాకు కలలో కనిపించి నిన్ను నావద్దకు పంపుతున్నానని చెప్పారు. నిన్ను మా ఇంట్లో ఉంచుకొని, ఎటువంటి ఇబ్బంది లేకుండా సొంతమనిషిలా చూసుకోమని చెప్పారు. కాబట్టి ఇది నీ ఇల్లనుకొని కావలసినవి నిస్సంకోచంగా అడుగు" అని చెప్పాడు. అక్కడ మెరుగైన వైద్యాన్ని పొందిన తరువాత మార్తాండ్ పూర్తిగా కోలుకున్నాడు. తిరిగి శిరిడీ వచ్చి బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని, ఆయనకు సర్వస్య శరణాగతి చెందాడు. ఆయన నీడలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపి చివరికి విముక్తి పొందాడు.
ప్రస్తుతం నానాసాహెబ్ డేంగ్లే మునిమనుమడు తన కుటుంబంతో తాత ముత్తాతలనాటి ఆ ఇంట్లోనే జీవిస్తున్నారు. తమ ఇంటి ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక సాయిబాబా మందిరాన్ని కూడా నిర్మించారు.
(Source: Shri Sai Satcharitra, Chapter 5 and Chapter 10, Das Ganu’s Bhakta Leelamrut Chapter 31 and Baba’s Vaani by Vinny Chitluri; Photo Courtesy: Shreya Nagaraj,Pune)
http://www.saiamrithadhara.com/mahabhakthas/nana_saheb_dengle.html
Om Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
On sai ram, ofce lo eam anakunda permission eche la chudandi tandri pls, ma team ki manchi responsibility unna oka fresher person ni allocate chese la chudandi tandri pls… surgery ki ye problem lekunda permission echi surgery baga jarige la chudandi tandri pls.
ReplyDelete