సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 416వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైతొమ్మిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

1916 ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తోంది. అది గ్రంథస్తం చేయటం యోగ్యమే. ఒకరాత్రి దీక్షిత్ వాడాలో కాకాసాహెబ్ హాల్లో నిద్రించాను. అప్పుడొక పీడకల వచ్చింది. “నేనెప్పుడూ ఇలా చేయను” అని అరుస్తూ నేను నిద్రలేచాను. ఈ స్వప్నానికి ఋజువు, అంటే సాంప్రదాయానికి విరుద్ధమైన నిర్గుణం గురించిన ఉపదేశాన్ని నేను తెలీకుండానే, చూడకుండానే, గుర్తుపట్టకుండానే పైన వ్రాయబడిన శబ్దాల్లో ఇచ్చాను. గాజుకప్పు గాజుపొడి నుంచి వేరుగా ఉండనట్లు, బంగారు ఆభరణం నిజానికి బంగారమే అయివున్నట్లు, మట్టి ఇల్లు వాస్తవానికి మట్టే అయివున్నట్లు, ఆ ప్రకారంగానే ఈ జగత్తు వాస్తవానికి జగత్తు కాక పరబ్రహ్మమే అని చెప్పి, ఈ జగత్తు నిజానికి లేనేలేదన్న ఉపదేశాన్ని ఒక అయోగ్యుడికి ఇచ్చాను. దానికిది శిక్ష. జాగ్రదావస్థలోకి వచ్చిన వెంటనే నేను ఈ స్వప్నం గురించి తెలుసుకున్నాను. దీని తరువాత నేను నిర్గుణ నిరంజన పరబ్రహ్మ గురించి ఉపదేశించటం ఆపేశాను. వైకుంఠరావుకి పరబ్రహ్మ తత్వం యొక్క అత్యంత మహత్వపూర్ణ ఉపదేశాన్నిచ్చాను. ఇది బాబాకు గానీ లేదా పరమాత్మకు గానీ నచ్చుండకపోవచ్చు. దీనిక్కారణం వైకుంఠరావు అయోగ్యుడు. ఇది ముకుందరాజా 'పరమామృతం'లో ఈ క్రింది పంక్తులతో స్పష్టమవుతుంది.

హే శాస్త్ర గోప్య కరావే, కవణాస్ఫుట్ నా సాంగావే
తులే తువా అనుభవావే, గురు గమ్యహే౹౹ (19)

(ఈ శాస్త్రాన్ని గోప్యంగా ఉంచాలి. ఎవరికీ తెలియచెప్పే ప్రయాసలు పడకూడదు. దీన్ని స్వయంగా అనుభవించాలి. దీన్ని తెలుసుకోగలవారు కేవలం గురువే.)

గురు సాంప్రదాయాచీ వాట్, నా ధరితా కరీషిల్ ప్రకట్
తరీ గుజ్ ఘేవునీ చావట్ హోతీల్ బహు (21)

(గురు సాంప్రదాయ పరంపరాగతమైన మార్గాన్ని అనుసరించి నీవు చేయవలసిన కార్యాన్ని చేయకుండా దీన్ని ప్రకటిస్తూ ఉంటే దీనివల్ల అర్హతలేని వ్యక్తులందరూ లాభాన్ని పొందుతారు.)
పైన చెప్పిన సూచనను అలక్ష్యం చేసినందువల్ల పరమేశ్వరుడికి కోపం వచ్చి, దాంతో పీడకల అనే దుఃఖానుభవం కలిగింది.

పైన చెప్పిన దానికి విరుద్ధంగా వేరే ఒక అనుభవం ఉంది. ఒక భక్తుడి అర్థింపు కారణంగా నేను అతనికి 'జయ జయ రామకృష్ణ హరి' అన్న మంత్రాన్నిచ్చాను. 1916లో ఆ విషయంపై ఆలోచించిన మీదట, “అరే! నేను యోగ్యతను చూడకుండా మంత్రాన్నిచ్చాను. అందువల్ల భవిష్యత్తులో ఏదో ఒక శిక్ష అనుభవించవలసి వస్తుంది” అని నాకు అనిపించింది. అలా విచారగ్రస్త దశలో, వర్షపు చినుకులు పడుతూ ఉండటం వల్ల నేను స్కూలు వసారాలో కూర్చుని ఉన్నాను. కొద్దిసేపు తరువాత రాధాకృష్ణమాయి తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని గుడ్డ పీలికలు తీసుకొని వెళ్తునట్లు కనిపించింది. ఈ ప్రకారంగా దర్శనాన్నిచ్చి, “వామన్, నేను ధరించిన వస్త్రమూ, నా చేతిలో ఉన్న పేలికలూ రెండూ ఒకే స్వరూపంలో ఉన్నట్లే, నీ స్వరూపమూ, నా స్వరూపమూ ఒకటే. నీవు నా మంత్రాన్నిస్తే అందులో నష్టమేమిటి? నా ప్రేరణ, స్ఫూర్తులతోనే అదలా జరిగింది. కనుక చింతించవద్దు” అని సూచించింది.

పైన చెప్పిన పీడకలా, జాగ్రదావస్థలో రాధాకృష్ణమాయి దర్శనం, అలాగే ఆమె ఇచ్చిన వాగ్దానాలతో ఈరోజు, అంటే 8-7-1959 రోజున నేను ఒక స్పష్టమైన నిర్ణయానికొచ్చాను. అదేమిటంటే, నిరంజన, నిరాకార, శుద్ధబుద్ధ పరబ్రహ్మను గురించిన ఉపదేశం ఎవరికీ కూడా చేసే యోగ్యత నాకు లేదు. నా యోగ్యత కేవలం సగుణరూపధారణ చేసిన అవతారమూర్తుల నామస్మరణ చేయించటం, లేదా వారి నామమంత్రాన్నివ్వటమే. అంతకంటే ఎక్కువ లేదు. అందువల్ల అవతారాల నామమంత్రాన్ని కూడా వీలైనంతవరకే, అత్యంత అవసరమైతేనే ఇవ్వాలి. జరిగిపోయిన అవతారాల లాగానే మన గురువు యొక్క స్మరణ, భజన, కీర్తన మొదలైనవి చేసి, అలాగే చేయించి జనుల్లో భక్తి ప్రచారం చేయమని నాకు ఆదేశం లభించినట్లు నాకనిపించింది. ఇదిప్పుడు ఏ పొరపాటూ లేకుండా హృదయంలో దృఢంగా అంకితమై ఉంచమని పరమకృపాళువైన సద్గురువు శ్రీ సాయినాథునికి నా ప్రార్థన. 

సన్యాస స్వీకారం తరువాత ఈ భక్తినే ప్రచారం చేయమని నాకు ఆదేశం లభించింది. 1954 జూన్ 13, జేష్ఠ్య శుద్ధ ద్వాదశి రోజున శ్రీవణశీకర్ పన్నెండు రోజులు ఉపవాసం చేసి అతని బృందం ద్వారా తయారుకాబడిన పాదుకలను అతని బృందంలోని సదస్యులతో సహా సొంత ఖర్చు మీద స్టేషను నుంచి మంగళవాద్యాలు మ్రోగుతుండగా ఊరేగింపుతో వచ్చి విధివిధానసహితంగా నాకు అర్పించినప్పుడు, చక్కగా సగుణ భక్తి ప్రచారం చేయటమే నా ధర్మమని నాకు స్పష్టమైంది. ఇదిప్పుడు నాకు బాగా తెలిసిపోయింది. ఈ విషయంలో చిన్న గవ్వంత శంక కూడా నా మనసులో మిగల్లేదు.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

  1. 🙏🌹🙏💐🙏🌹🙏💐🙏🌹🙏💐🙏💐🙏

    నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు..
    పల్లవించును ప్రభూ పవళించు భువనాలు!!
    నీ దోవ పొడవునా కువకువల స్వాగతం..
    నీ కాలి అలికిడికి మెలకువల వందనం!!
    🙏💐🙏🌹🙏💐🙏🌹🙏🌹🙏💐🙏🌹🙏💐🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  4. Om Sri Sai Ram thaatha 🙏🙏
    Bhāvyā srēē

    ReplyDelete
  5. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo