ఈ భాగంలో అనుభవం:
- బాబా చేసిన సహాయం
- సాయిబాబా ఊదీ మహిమ మహత్యం
- సాయి కృప, ఊదీతో చేకూరిన ఆరోగ్యం
బాబా చేసిన సహాయం
సాయి భక్తురాలు వీణ తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయిభక్తులకు మరియు ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న బృందానికి నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
నా పేరు వీణ. మేము హైదరాబాదులో నివాసముంటున్నాము. మా అత్తగారు వాళ్ళది నిజామాబాద్. 2020, మే 23న మా అత్తగారి ఇంటికి పెయింటింగ్స్ వేయిద్దామని అందరం నిజామాబాద్ వెళ్ళాము. పెయింటింగ్ చేసే సమయంలో శుభ్రపరచడానికి పనివాళ్ల అవసరం ఉంది. అయితే పని చేయటానికి పనివాళ్ళు అక్కడ అందుబాటులో లేరు. ఆ ప్రాంతంలో ఉన్నవారిని అడిగితే, వస్తామని చెప్పేవారు కానీ వచ్చేవారు కాదు. ఇలా రెండురోజులు గడిచింది. పెయింటింగ్ వర్క్ మొదలైంది. నేను, మావారు సామాన్లు సర్దడం కూడా మొదలుపెట్టాం. కానీ ఆ పనులు చేయడం మాకెంతో కష్టంగా ఉంది. 2020, మే 26 ఉదయం నేను సాయిబాబా ఫోటో ముందు నిలుచుని, "బాబా! మీరు మాతోనే ఉన్నట్లయితే గనక ఈరోజు సాయంత్రానికల్లా ఒక పనిమనిషిని పంపండి. పనిమనిషి వచ్చినట్లైతే నేను నా అనుభవాన్ని మీ బ్లాగు ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. బాబా అద్భుతం చేశారు. కొంతసేపటికి మా ఇంటికి బంధువులొచ్చారు. మాటల సందర్భంలో నేను, "ఇక్కడ పనివాళ్ళు దొరకడంలేద"ని చెప్పాను. ఆవిడ, "నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది" అని చెప్పి, వెంటనే ఫోన్ తీసి ఆ అమ్మాయికి ఫోన్ చేసి, "మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెయింటింగ్ వర్క్ జరుగుతోంది. సామాను సర్దటం లాంటి పనులున్నాయి. వీళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులూ పని చేయాలి" అని చెప్పింది. అందుకు ఆ అమ్మాయి అంగీకరించి, గంటలో ఇంటికి వచ్చి పని మొదలుపెట్టింది. ఆ అమ్మాయిది మా కాలనీ కూడా కాదు, చాలా దూరం నుండి వచ్చింది. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. బంధువుల రూపంలో బాబానే వచ్చి మాకు సహాయం చేశారు. ప్రార్థించిన కొద్దిసేపట్లోనే బాబా చేసిన సహాయానికి నాకు చాలా సంతోషం కలిగింది. బాబాకి కృతజ్ఞతలు తెలుపుకొని నాకు ఇష్టమైనవారితో బాబా ఇచ్చిన ఆనందాన్ని పంచుకున్నాను. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు బాబా గుర్తుకు వస్తున్నారు. ఎందుకంటే తనని బాబా పంపారు కదా! ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. ఇప్పటికీ మేము తనతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాము.
ఓం సాయిరామ్!

సాయిబాబా ఊదీ మహిమ మహత్యం
సాయి భక్తుడు గోపాలకృష్ణ తనకి బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరాం! సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేను ప్రతిరోజూ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను చదువుతూ ఉంటాను. నా జీవితంలోకి సాయిబాబా వచ్చి మూడు వసంతాలు పూర్తయింది. 2020, జూన్ 28వ తారీఖున సాయిబాబా నా భార్యకు తన లీలామహత్యాన్ని అత్యద్భుతంగా చూపించారు. అదేమిటంటే, ఆరోజున నా భార్యకు కాలు కొద్దిగా వాచి, నొప్పితో బాధను భరించలేకపోయింది. తను నొప్పితో విలవిల్లాడుతుంటే నాకు బాధగా అనిపించింది. కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. తన బాధ చూడలేక బాబాను తలచుకుని, “బాబా! నా భార్య కాలినొప్పితో బాధపడుతోంది. తన నొప్పిని త్వరగా తగ్గించండి బాబా. మీ ఆశీస్సులతో తన కాలినొప్పి తగ్గితే ఈ లీలను బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి బాబా ఊదీని మంచినీళ్ళలో కలిపి తనకిచ్చాను. తను త్రాగింది. కొంత సమయం గడిచిన తర్వాత బాబా అనుగ్రహంతో తన కాలినొప్పి తగ్గిపోయింది. బాబా చేసిన లీలకు మేము ఆశ్చర్యానికి లోనయ్యాము. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాము. బాబా తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుతారని ఈ లీలను చూస్తే అర్థమవుతుంది.
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

సాయి కృప, ఊదీతో చేకూరిన ఆరోగ్యం
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. సాయినాథుడు మా జీవితంలో అడుగడుగునా అన్నింటిలోనూ తోడునీడై మమ్మల్ని నడిపిస్తున్నారు. నేనిప్పుడు 2020, జూన్ 28న జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఆరోజు ఇంట్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున నేను చాలా అలసటకి గురయ్యాను. సాయంత్రానికి ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. రాత్రికి నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. దాంతో బాబా ఊదీని నీళ్ళలో కలుపుకొని త్రాగి, "నొప్పులు తగ్గేలా చెయ్యమ"ని బాబాని ప్రార్థించాను. అయితే మర్నాడు ఉదయానికి కూడా నొప్పులు అలానే ఉన్నాయి. దానికితోడు సాయంత్రానికి జ్వరం కూడా మొదలైంది. నేను మన సమర్థ సద్గురు సాయినాథునిపై పూర్తి విశ్వాసంతో, ఆయననే స్మరిస్తూ, ఊదీని ధరిస్తూ గడిపాను. అసలే ఈ సమయంలో కోవిడ్ అంతటా వ్యాపించి ఉంది. అందువలన, "ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించమ"ని బాబాని ప్రార్థిస్తూ గడిపాను. ఆయన కృపవలన తెల్లవారేసరికి నా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చింది. "సాయి తండ్రీ! మీకు అనేక వేల సాష్టాంగ ప్రణామాలు. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మా అందరికీ అందించండి బాబా!"
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
ReplyDeleteపత్రి గ్రామ సమాధ్బూతం ద్వారకామాయి వాసినం
భక్తా భీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం🌺
🍎💐🍎💐🍎💐🍎💐🍎💐🍎💐🍎💐🍎💐🍎
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ
యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై!!🛕🙏🌹🙏
Baga chepparu..
Deleteఓం సాయిరామ్!
ReplyDeleteఅనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
sairam
ReplyDeletebe with my son
cure health
Om sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏