సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 415వ భాగం


సాయిశరణానంద అనుభవాలు - నలభైఎనిమిదవ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

తరువాత ఏడు సంవత్సరాలకు, అంటే 1923 ఆగష్టు నెలలో నేను మోతా గ్రామంలో సొలిసిటర్ పరీక్షకు సన్నద్ధమవటం కోసం వెళ్ళాను. ఉదయం అయిదు గంటలకే లేచి బాబా ఇచ్చిన మంత్రాన్ని ధ్యానంతోపాటు జపిస్తుండేవాడిని. అందుకోసం 1911వ సంవత్సరంలో బాబా నుంచి ప్రసాదరూపంగా తీసుకొన్న చిత్రపటాన్ని నా ఎదుట పెట్టుకొని చిత్రపటం మీద దృష్టిని ఏకాగ్రం చేస్తూండేవాడిని. అలా చేస్తూండగా సెప్టెంబరు నెల గడిచిపోయి మోతా నుంచి వెళ్ళిపోవలసిన సమయమొచ్చింది. దానికి నాలుగైదురోజుల ముందు ఒకరోజు పైన చెప్పిన విధంగా జపధ్యానాదులు చేస్తున్న సమయంలో బాబా ఆకృతి మీద అంతే పరిమాణంలో ఉన్న ఒక తేజోమయమైన 'ఓం' కనిపించింది. చిత్రపటం మీద బాబా పేరుంది. ఆ పేరు మీద కూడా ఏకాక్షరీ మంత్రం ఆవరించినట్లు కనిపించింది. నా దృష్టి ఎక్కడెక్కడకు పోయిందో అక్కడంతా ఆ తేజోరూపమైన ప్రణవం దర్శనమవసాగింది. ఇదివరకు బాబా ఆకృతి ఏ రకంగా సర్వత్రా కనిపించిందో ఆ ప్రకారంగానే ఆకాశంలోనూ, పృథ్విమీదా, వృక్షాలమీదా, రాళ్ళమీదా, సర్వత్రా ప్రణవ దర్శనమవసాగింది. దీనివల్ల “ఈ ఏకాక్షరీ మంత్రజపం చేయాలన్నదే బాబా ఇచ్ఛ” అన్న నిశ్చయం నాకు కలిగింది. దేహత్యాగం తరువాత బాబా ప్రణవస్వరూపంలో విరాజమానులై ఉంటారని ఈ అనుభవంతో నాకు స్పష్టమైంది. అలా చాలారోజులైన తరువాత నా ఇచ్చతోనే ప్రణవదర్శనం ఆగిపోయింది.

బాబా ఇచ్ఛ స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా ఏకాక్షరీ మంత్రం జపించాలన్న నిశ్చయం ఒకేసారిగా కాలేదు. అందువల్ల శ్రీరామ, శ్రీకృష్ణుల నామమంత్రాన్నీ, నవార్ణవ మంత్రాన్నీ కొంతకాలం చేస్తూండేవాడిని. విశేషంగా స్వప్నంలో సూచింపబడిన ఒక కృష్ణమంత్రజపాన్ని 1942లో ప్రారంభించగానే హృదయంలోంచి ఒక బొటనవ్రేలు బయటకొచ్చి నిలబడినట్లు కనిపించింది. అలాగే సంత్ తుకారామ్ మహారాజు బొటనవ్రేలుతో సమానం చేసిన ఆత్మ గురించిన నిరూపణ నాకు గుర్తొచ్చింది. అందువల్ల ఆ మంత్రాన్ని కూడా ఉపయోగించాను. సన్యాసం తీసుకొన్న తరువాత ఏ విషయం పైనా ఆలోచన మిగలదు. ఎందుకంటే, 'సన్యాసికుండేది ఏకాక్షరీ మంత్రమే!' అని శాస్త్రాలు ముక్తకంఠంతో ప్రతిపాదిస్తాయి. సన్యాస స్వీకారం తరువాత అహంకారాన్ని తొలగించుకోవటం కోసం విష్ణుసహస్రనామం పఠించమని అంతరిక్షం నుంచి ఆదేశం వచ్చింది. అది చేయగా చేయగా ఏకాక్షరీమంత్రం సగుణ నిర్గుణ సూచకమై ఉన్నదని స్పష్టమైంది. అలాగే సన్యాసులకు కూడా ఈ మంత్రం శాస్త్ర సమ్మతమే. అయితే దీన్ని నిస్సంకోచంగా జపించాలి. అందువల్ల 1957 తరువాత అదే నా మంత్రమయింది. అపరోక్ష జ్ఞానం ఇవ్వటానికి పూర్వం గురువు ఏకాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి అలా మహావాక్యాల ద్వారా అపరోక్ష జ్ఞానాన్ని ఇవ్వాలని ఒక ఉపనిషత్తు ద్వారా స్పష్టమైంది. ఈ పద్ధతిని అనుసరించి సన్యాసం స్వీకరించటానికి 30 సంవత్సరాల ముందే బాబా నాకు ఏకాక్షరీ మంత్ర సాక్షాత్కారాన్ని కలిగించారని స్పష్టమైంది.

1953 డిసెంబరు 12న డాకోర్ నుంచి అహమ్మదాబాదు చేరుకుని, డిసెంబరు 14వ తారీఖున తలోద్ లోని శివాలయ పూజారి ముందుగదిలో మకాం చేశాను. అక్కడ 1954 జనవరి 6న జాగ్రదావస్తలో నోరు తెరుచుకుని ఉన్న సింహాన్ని అధిరోహించిన మాతా భవానీదేవి, ఉమాదేవిల సుందర దర్శనమైంది. తరువాత శంకర భగవానుడు సశరీరులుగా దర్శనమిచ్చి నిగూఢరీతిలో ఉపనిషత్ ద్వారా దృఢమైన మహావాక్య అనుభవాన్నిచ్చారు. భగవాన్ శంకరుడు తన గుర్తులు చూపించి, "1923లో నీకు ప్రణవోపదేశం ఇచ్చాను. అలాగే దాని సర్వవ్యాపి స్వరూప ప్రత్యక్ష దర్శనం ఇచ్చాను. దాని అనుసంధానం కోసం ఇప్పుడు నీకు మహావాక్యోపదేశాన్ని ఇస్తున్నాను” అని అన్నారు. 1923లో ఓంకారం యొక్క ప్రత్యక్ష దర్శనాన్నిచ్చి, నాకు యజ్ఞోపవీతాన్నిచ్చారు. ఇప్పుడు ఈ మహావాక్య ప్రబోధాన్ని చేస్తున్నారు.

“తతో బ్రహ్మో వదిష్టవై సచ్చిదానంద లక్షణమ్, జీవన్ముక్త స్సదా ధ్యానం నిత్యత్వం విహరిష్యసి"

“సన్యాసికి మహావాక్యోపదేశాన్ని ఆచార్యుడు చేస్తాడు. అదే ప్రకారం విధి విధానాన్ని చేసిన నీ గురువు పేరు శుకదేవుడు (వ్యాస పుత్రుడు). శుకదేవుడికి శంకరభగవానుడు ఉపదేశించాడు. అందువల్ల శుకదేవుడు నీ గురువు” అని అన్నారు. ఈ ప్రకారంగా నా పరమగురువు శంకరుడే.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

  1. 🙏 🙏 ఓం సాయి రామ్ 🙏🙏

    ReplyDelete
  2. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo