ఈ భాగంలో అనుభవం:
- ‘బాబా తాత’ సంరక్షణ
సాయిబంధువులకు నమస్కారం. నా పేరు సంహిత. ఇంతకుముందు ఈ బ్లాగ్ ద్వారా నా అనుభవాలను కొన్నిటిని మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరొక గొప్ప అనుభవాన్ని పంచుకుంటున్నాను. ఇది నా జీవితంలో జరిగిన చాలా గొప్ప అనుభవం. చిన్నప్పటినుంచి నేను బాబాకు పూజ చేసేదాన్ని. బాబాను చాలా నమ్మేదాన్ని. మేము 2008వ సంవత్సరంలో మొదటిసారిగా శిరిడీ వెళ్లి, అక్కడ మూడు రోజులు ఉన్నాము. మొదటిరోజు బాబా దర్శనం చేసుకున్నాము. తరువాత శని శింగణాపూర్ దర్శనం చేసుకుని తిరిగి శిరిడీ వచ్చాము. మరుసటిరోజు బాబా దర్శనం చేసుకుని, మేము రూమ్ తీసుకున్న భక్తనివాస్‌కి వచ్చాము. అక్కడ ఒక అంకుల్ పుస్తకాలు పెట్టుకుని అమ్ముతున్నాడు. అక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించిన బాబా ఫోటో ఉన్న పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది. ఆ పుస్తకం ‘సాయిబాబా జీవిత చరిత్ర’! నేను ఆ పుస్తకం కొనుక్కోవాలని తలచి అమ్మను అడిగితే వెంటనే మా అమ్మ ఆ పుస్తకం కొనిచ్చింది. నాకు ఆ పుస్తకం చదవాలని చాలా ఆసక్తిగా ఉన్నందువల్ల రూముకి వెళ్ళగానే ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. మెల్లగా ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఒళ్ళంతా పులకించిపోయింది. మరి అది బాబా జీవిత చరిత్ర కదా!
అప్పటికి నేను ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేశాను. కానీ అప్పటివరకు నాకు బాబా గురించి ఏమీ తెలియదు, బాబా అంటే దేవుడు అని మాత్రమే తెలుసు. ఆ పుస్తకం చదివాకే బాబా గురించి పూర్తిగా తెలిసింది. అంటే, బాబా గురించి పూర్తిగా తెలుసుకునే శక్తి నాకు లేదనుకోండి. కానీ బాబా నిజంగా మానవరూపంలో శిరిడీ ప్రజలతో జీవించారని కూడా అప్పటివరకు నాకు తెలియదు. మొత్తం ఒక నాలుగు గంటలు కూర్చుని చదివాను. చదివాక తెలిసింది, బాబాని మనం సమాధిమందిరంలోనే కాదు, ద్వారకామాయిలో కూడా దర్శనం చేసుకోవాలని, తమ జీవిత పర్యంతం బాబా అక్కడే ఉన్నారని. గురుస్థాన్ విశిష్టత గురించి, మ్యూజియం గురించి, అబ్దుల్‌బాబా గురించి తెలుసుకున్నాను. మరుసటిరోజు మేము ద్వారకామాయి, గురుస్థాన్, మ్యూజియం అన్నీ దర్శించుకున్నాము. నేను ఆరోజు ఆ పుస్తకం చదవకపోయుంటే అవన్నీ దర్శించుకునే అవకాశం ఉండేది కాదు. ఆ పుస్తకం ద్వారా బాబా నాకు అన్నీ తెలిసేలా చేశారు. ఆ పుస్తకం చదివితే ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుంది అని ఆ పుస్తకంలో ఉంది. ఎందుకో ఆ విషయం నా మనసులో గాఢంగా హత్తుకుపోయింది. ఇక అసలైన అద్భుతం పంచుకుంటాను.
ఒకసారి మా నాన్నగారు మూత్రపిండాల సమస్యతో హాస్పిటల్‌కి వెళ్ళారు. నాన్నను పరీక్షించిన డాక్టరు, “మీ మూత్రపిండాలు పూర్తిగా పాడైపోయాయి, మీరు త్వరలోనే చనిపోతారు” అని చెప్పారు. నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాతయ్య అందరూ బాధపడుతున్నారు. ఏమి జరిగిందని అడిగితే, విషయం చెప్పారు. నా తల్లిదండ్రులకి నేను ఏకైక సంతానాన్ని. అంతకుముందు సంవత్సరమే అమ్మకి క్యాన్సర్ వచ్చింది. బాబా దయవల్ల అమ్మ క్యాన్సర్ నుంచి కోలుకుంది. అమ్మకు నయమయ్యాక మేము శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకున్నాము. ఇంతలోనే నాన్నకి అలా అయ్యిందని తెలిసి నేను నిర్ఘాంతపోయాను. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. మరుసటిరోజు అమ్మానాన్నలు మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్లాలని నిర్ణయించుకుని నాతో, “మేము హాస్పిటల్‌కి వెళ్తాము, నువ్వు కాలేజీకి వెళ్ళు” అని చెప్పారు. “నేనీరోజు కాలేజీకి వెళ్ళను. శిరిడీ నుంచి తెచ్చుకున్న పుస్తకం చదువుతూ ఇంట్లోనే ఉంటాను” అని వాళ్ళతో చెప్పాను. వాళ్ళిద్దరూ హాస్పిటల్‌కి వెళ్ళారు. ఆరోజు మంగళవారం. బాబాకు పూజ చేసి, బాబా దగ్గర కూర్చుని, “బాబా! నాకేం అర్థం కావట్లేదు, నాకు అమ్మానాన్న తప్ప వేరే ప్రపంచం తెలియదు. నాన్నకి తగ్గాలి, నాన్న లేకపోతే నా జీవితం వృధా. నాన్న లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. అమ్మని కాపాడిన విధంగానే నాన్నని కూడా నువ్వే కాపాడాలి” అని ఎంతో ఆర్తిగా బాబాను ప్రార్థించాను. తరువాత బాబా చరిత్ర చదివి, బాబాకు 11 రూపాయలు దక్షిణ సమర్పించాను. నా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఇంతలో అమ్మానాన్నలు హాస్పిటల్ నుంచి వచ్చారు. వాళ్ళు చెప్పిన మాట వింటే నాకు ఆనందంతో కన్నీళ్లు వచ్చేశాయి. నాన్నను మళ్ళీ పరీక్షించిన డాక్టరు, “మీకేం కాదు, అసలు ఇది పెద్ద సమస్యేమీ కాదు. కొన్నిరోజులు మందులు వాడితే అంతా సర్దుకుంటుంది” అని చెప్పారట. ముందురోజు ‘చనిపోతావ’ని చెప్పిన డాక్టరే ఈరోజు ‘మీకేం కాదు’ అని చెప్పటం ఎంత ఆశ్చర్యం! నాన్నకు ఏ సమస్యా లేకుండా కాపాడినందుకు ఎంతో సంతోషంతో బాబాకి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకున్నాను. అప్పటినుంచి ‘పుస్తకం చదువుతాను’ అని అనడం మానేసి ‘పారాయణం చేస్తాను’ అని చెప్తున్నాను. బాబాని నమ్ముకుంటే బాబా మనని ఎన్నడూ వదలరు. తన భక్తులను తన దగ్గరకు తానే తెచ్చుకుంటారు. బాబా నన్ను తన దగ్గరకు లాక్కున్నారు. అప్పటినుంచి బాబాను నేను ‘బాబా తాత’ అంటున్నాను. ఎందుకంటే, నేను మా నాన్నగారి నాన్నను (తాతను) చూడలేదు. నేను పుట్టకముందే ఆయన చనిపోయారు. ఆయనకి అందరూ చాలా గౌరవం ఇస్తారు. అందుకే తాత అంటే నాకు ఇష్టం. అందుకే బాబాని ‘బాబా తాత’ అంటాను.
ఇప్పుడు మరొక అనుభవాన్ని పంచుకుంటాను. నేనెంతో ఇష్టపడుతున్న వ్యక్తిని నేను ‘బంగారం’ అని పిలుస్తాను. తను వేరే చోట ఉద్యోగం చేస్తున్నాడు. నేనేమో ట్రైనింగులో ఉన్నాను. ఒకరోజు రాత్రి తను వర్షంలో బాగా తడిశాడు. మరుసటిరోజు నేను ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేయలేదు. తను ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయట్లేదు. అలా కొంత సమయం గడిచిపోయింది. అసలే కరోనా పరిస్థితుల వల్ల ఎంతో భయంతో ఉన్న నేను బాబాకు నమస్కరించి, “బాబా! నాకేం అర్థం కావట్లేదు, తనని మీరే కాపాడాలి” అని ఆర్తిగా వేడుకున్నాను. తరువాత ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే బాబా ఫోటోతో ఒక మెసేజ్ వచ్చింది. “You Don’t worry, your Bangaram is safe there. Do you believe me at least now? Ha ha.. You will believe me now (As I told your loved one name)” అని. అసలు ఆ మెసేజ్ అంత ఖచ్చితంగా పేరుతో సహా వచ్చేసరికి చాలా ఆశ్చర్యమేసింది. ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తరువాత ఆ బాబా మెసేజ్‌ని నేను తనకి చెప్పాను. “అంత ఖచ్చితంగా ఎలా వచ్చింది?” అని తను కూడా ఆశ్చర్యపోయాడు. బాబాకు అన్నీ తెలుసు. అసలు నన్ను, నా జీవితాన్ని నడిపించేది బాబానే కదా! “బాబా! ఈ జీవితం మీది, నా జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుతారో మీ ఇష్టం బాబా!” జై సాయిరాం!

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
🙏🌹🙏సకల సాధు స్వరూప.. అవధూత చింతన.. త్రిగునాతీత.. ధీన భక్త జన రక్షక..శిరిడి నివాస.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కి జై🙏🌹🙏
ReplyDeleteశ్రీ శ్రీ శ్రీ సచ్చిందానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Sairam
ReplyDeleteplease save my son
always be with him
Om Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDelete