ఈ భాగంలో అనుభవాలు:
- అమ్మ లేని లోటు తీర్చిన బాబా
- ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో మనకంటే బాబాకి బాగా తెలుసు
అమ్మ లేని లోటు తీర్చిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయి సోదరి తన తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ నా నమస్కారం. నేను సాయిబిడ్డని. సాటి సాయిభక్తుల అనుభవాల ద్వారా నా మనసుకు ఎంతో ప్రశాంతత, ధైర్యం కలుగుతున్నాయి. సాయి కృపతో నేను కూడా నా అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
నేను 5వ తరగతిలో ఉన్నపుడు మా అమ్మ చనిపోయింది. అంతటితో నా జీవితంలో తీరని లోటు ఏర్పడింది. ఎన్నో రాత్రులు ఏడుస్తూ, ‘అమ్మని నాకు దూరం చేశాడ’ని దేవుడిని తిట్టుకుంటూ పడుకున్న రోజులున్నాయి. ఏ విషయాన్నయినా పంచుకోవడానికి నమ్మదగిన వారెవరూ నాకు లేకపోయారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. చదువులో నేను చాలా వెనకబడిపోయాను. నేను ఇంటర్ రెండవ సంవత్సరం చదివేటప్పుడు ఒక అక్క నాకు బాబా గురించి చెప్పింది. అప్పటివరకు నాకు బాబా అంటే ఎవరో తెలియదు, అసలు బాబా అనే దైవం ఉన్నారని కూడా తెలియదు. సరే, అక్క చెప్పింది కదా అని బాబాని పూజించడం మొదలుపెట్టాను. ఒక గురువారంనాడు మొదటిసారి బాబా మందిరానికి వెళ్ళాను. బాబా దర్శనంతో నాకు చెప్పలేనంత ధైర్యం, సంతోషం కలిగాయి. ఆ సంతోషం మాటల్లో వర్ణించలేనిది. ఎక్కడో స్వర్గంలో ఉన్నంత సంతోషం కలిగింది. ఆ క్షణం నుండి బాబా నాకు అమ్మగా మారారు. బాబా ప్రతి అడుగులోనూ నాకు తోడుగా ఉండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం కేవలం పాస్ మార్కులతో పాసైన నేను ఇంటర్ రెండవ సంవత్సరం 90% మార్కులు సాధించాను. ఇదంతా బాబా కృపయే. డిగ్రీలో నేను ఇంగ్లీష్ మీడియంలో చేరాను. కానీ ఆ సమయంలో నాకు ఇంగ్లీష్ సరిగ్గా చదవడం కూడా వచ్చేది కాదు. అలాంటిది బాబా నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేశారు. బాబా దయతో నేను మా కాలేజీలో మొదటి స్థానంలో నిలిచాను. ఇలా ఒక్క చదువు విషయంలోనే కాదు, అన్ని విషయాలలోనూ బాబా నాకు తోడున్నారు.
తరువాత ఉద్యోగ విషయానికి వస్తే, మొదటి ఇంటర్వ్యూలోనే నాకు ఉద్యోగం వచ్చింది. అది కూడా బాబా కృపతోనే. ఇప్పటికీ నా ఉద్యోగానికి సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ నేను బాబా మీదనే ఆధారపడతాను. ఇంట్లో ఏదైనా కనపడకపోయినా, ఎవరైనా నన్ను ఏమైనా అన్నా వెంటనే అమ్మతో చాడీలు చెప్పినట్టు, అమ్మని విసిగించినట్టు నేను బాబాను విసిగిస్తుంటాను. నేను ప్రతి విషయం బాబాకి చెప్పిన తర్వాతనే చేస్తాను. ఇంకా ఎన్నో అనుభవాలు పంచుకోవాలని ఉంది, కానీ మాటల్లో చెప్పలేకపోతున్నాను. నా జీవితంలో బాబా ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. బాబా ఆశీస్సులతో వాటన్నిటినీ మరోసారి మీతో పంచుకుంటాను.

ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో మనకంటే బాబాకి బాగా తెలుసు
పేరు వెల్లడించని ఒక సాయి భక్తుడు ఇటీవల బాబా తనకు ప్రసాదించిన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను బాబా చూపించిన నమ్మశక్యం కాని ఒక లీలను మీతో పంచుకుంటాను. నాకు బాబా మీద, బాబా సూత్రాల మీద శ్రద్ధ లోపించినప్పుడు ఈ బ్లాగులో ప్రచురించే బాబా భక్తుల అనుభవాలు చదువుతుంటాను. తద్వారా బాబాపట్ల శ్రద్ధ తిరిగి పునరుద్ధరింపబడుతుంది. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రస్తుతం నేను కుటుంబసమేతంగా యు.కె లో నివాసం ఉంటున్నాను. నా భార్య ఉన్నత ఉద్యోగం కోసం మేము గత సంవత్సరం జర్మనీ నుండి యు.కె కి వచ్చాము. వర్కులో నాకున్న అనుభవం వలన నాకు ఇక్కడ త్వరగానే ఉద్యోగం వస్తుందని అనుకున్నాను. అదే విశ్వాసంతో ఉద్యోగం కోసం ఎన్నో కంపెనీలకు దరఖాస్తు చేసుకొని, ఎన్నోచోట్ల ఎంతో ప్రయత్నించినప్పటికీ ప్రస్తుత బ్రెగ్జిట్(యూరోపియన్ యూనియన్ నుండి యు.కె విడిపోవడం) పరిస్థితి వల్ల ఏ కంపెనీ నించి కూడా నాకు కనీసం ఇంటర్వ్యూ పిలుపు రాలేదు. రెండు మూడు చోట్ల ఇంటర్వ్యూ చేసినా ఆ ఉద్యోగాలకు నేను సెలెక్ట్ కాలేదు. ఈ లోపల కరోనా వల్ల మార్కెట్ బాగా డౌన్ అయిపొయింది. అందువల్ల మా పాపని తీసుకుని ఇండియాకి వచ్చేద్దామని నిర్ణయించుకుని ఇండియాలో కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అక్కడ కూడా నాకు ఇంటర్వ్యూ పిలుపు రాలేదు. ఆన్లైన్లో ఒక ఇంటర్వ్యూ హాజరైనప్పటికీ, ఆ ఉద్యోగం నాకున్న అనుభవానికి చాలా చిన్నది, జీతం కూడా తక్కువే. అయితే దురదృష్టవశాత్తు ఆ ఉద్యోగం కూడా నాకు రాలేదు. దాంతో, "ఎందుకు బాబా నాకు ఇండియాలో ఉద్యోగం ఇవ్వలేద"ని బాబాని ప్రశ్నించడం మొదలుపెట్టాను. కానీ ఆయన ప్రణాళికలు ఆయనకుంటాయి. అవి సమయం వచ్చినప్పుడు మనకు అర్థమవుతాయి.
ఇక నేను ఉద్యోగ విషయంలో పూర్తిగా ఆశలు వదిలేసుకుని ఎలాగైనా ఇండియాకి వచ్చేద్దామని అనుకున్నాను. కానీ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేకపోవటంవల్ల నేను UK లోనే ఉండవలసి వచ్చింది. ఈ లోపల నేను అదివరకు ఎప్పుడో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి 2020, జూన్ 11న ఇంటర్వ్యూకి హాజరు కమ్మని పిలుపు వచ్చింది. ఈ ఉద్యోగం నాకు సంబంధించిన ఫీల్డ్ కాకపోవడం వల్ల ఇంటర్వ్యూ కోసం నేను చాలా ప్రిపేర్ కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, 2020, May 21 ఆఖరి తేదీ అనగా మే 19న నేను ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేశాను, కాదు.. కాదు.. బాబానే చేయించారు. అది చాలా మంచి కంపెనీ. అయితే నాకు దీనిమీద ఏ మాత్రమూ ఆశ లేదు. ఎందుకంటే, ఈ ఉద్యోగానికి 6 నెలల క్రితం ఒకసారి దరఖాస్తు చేసినప్పుడు కనీసం ఇంటర్వ్యూ పిలుపు కూడా రాలేదు. అలాంటిదిసారి జూన్ 2వ తారీఖున వాళ్ళ దగ్గర నుండి 'జూన్ 5న ఇంటర్వ్యూ ఉంద'ని నాకు ఇ-మెయిల్ వచ్చింది. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవటానికి కేవలం రెండు రోజులే సమయముంది. నేను ఏదో అంతంత మాత్రం ప్రిపేర్ అయ్యాను కానీ, ఆ ఉద్యోగం వస్తుందని నమ్మకం నాకు అస్సలు లేదు. అయినా బాబా దయవల్ల నేను ఆ ఇంటర్వ్యూ బాగా చేశాను. కానీ తరువాత వారం రోజుల వరకు వాళ్ల దగ్గర్నుంచి నాకు ఏ మెయిలూ రాలేదు. ఆలోగా మొదటి కంపెనీ ఇంటర్వ్యూ కూడా పూర్తయింది, అయితే నేను ఆ ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు. జూన్ 15, సోమవారం నాడు బాబా తమ ఆశీస్సులు నాపై కురిపించారు. సెకండ్ కంపెనీలో ఉద్యోగానికి నేను ఎంపిక కబడ్డాను.

బాబా చేసిన లీల చూడండి. ఆ వారంరోజుల్లో ఆ కంపెనీవాళ్ళు నేను ఇంతకుముందు పని చేసిన కంపెనీ ఉద్యోగులను సంప్రదించారు. వాళ్లు నా గురించి చాలా పాజిటివ్‌గా రికమండ్ చేయడం వలన, ఇంటర్వ్యూకి జూనియర్ లెవెల్ అని ప్రకటన ఇచ్చినప్పటికీ కంపెనీవాళ్ళు నాకు చాలా ఎక్కువ జీతంతో సీనియర్ లెవెల్ పొజిషన్ ఆఫర్ చేశారు. బాబా ఎంత గొప్పగా అనుగ్రహించారో చూసారా!. ఒకవేళ ఇండియాలో నాకు ఉద్యోగం వచ్చి ఉంటే, నేను ఈ కంపెనీకి దరఖాస్తు చేసేవాడిని కాదు. ఇదే ఉద్యోగానికి నేను మొదటిసారి దరఖాస్తు చేసినప్పుడు నాకున్న అనుభవానికి ఉద్యోగం తప్పకుండా వస్తుందని నమ్మకంతో ఉన్నాను. కానీ రెండోసారి దరఖాస్తు చేసినప్పుడు, "బాబా! మీరే దిక్కు" అని బాబాను తలచుకున్నాను. ఇంతకీ నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, నాకు ఈ ఉద్యోగం రావడానికి కారణం బాబా కరుణే గానీ నా అర్హత కాదు. మనకి ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో మనకంటే బాబాకి బాగా తెలుసు. అది తెలియక మనం చాలా కంగారుపడుతూ ఉంటాం. బాబాకి సాధ్యం కానిది ఏదీ లేదు. కానీ మనకి కావలసింది నమ్మకం(శ్రద్ధ) మరియు సహనం(సబూరి). ఈ కష్టకాలంలో బాబా నా చేత 'సుందరకాండ' పారాయణ చేయించారు. చివరిగా ఈ లీలను ఇంత విడమరిచి చెప్పటానికి కారణం మరియు నేను సాయిబంధువులకు చెప్పేది ఏమిటంటే, “బాబా మన ప్రార్థనలను ఎప్పుడూ వింటూనే ఉంటారు. తగిన సమయంలో తప్పక అనుగ్రహిస్తార"నే విశ్వాసం ఎల్లప్పుడూ మనకి ఉండాలి.
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ReplyDeleteనిర్గుణ బ్రహ్మ తత్వజ్ఞాన నిరాకార నిరామయ
బాలభాస్కర సంకాశ సాయిరామ్ నమోస్తుతే!!
*"*"*"*"*"*"*"*"*"*"*"*"*"*"*"*
🛕💐🛕💐🛕💐🛕💐🛕💐🛕💐🛕💐🛕💐🛕
🙏🌹🙏 లీలా విశ్వంభర జగద్గురు సాయినాథ పాహిమాం పాహిమాం 🙏🌹🙏
sairam
ReplyDeletei want my son
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'
Om Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhāvyā srēē
Om Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete