సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 485వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా స్మరణతో అంతా సుఖాంతం
  2. "బాబా! మీరే మాకు రక్ష!"

బాబా స్మరణతో అంతా సుఖాంతం

సాయిబంధువులందరికీ ఓం సాయిరాం! నా పేరు గోపాలకృష్ణ. మాది హైదరాబాద్. నేను ఎన్నో సంవత్సరాల నుండి సాయికి అంకితభక్తుడిని. నేను చాలాసార్లు శిరిడీ, గాణుగాపురం, పిఠాపురం దర్శించాను. నాకు బాబా ఎన్నోరకాలుగా సహాయం చేశారు. ఆ అనుభవాలలో నుండి కొన్నిటిని ఇప్పుడు మీతో పంచుకుంటాను.

మొదటి అనుభవం: 

2020, మార్చి 21న మా అబ్బాయివాళ్ళు బెంగళూరులో గృహప్రవేశం ఏర్పాటు చేసుకున్నారు. మేము ఆ గృహప్రవేశానికి మార్చి 10వ తారీఖున హైదరాబాదు నుండి బయలుదేరి బెంగళూరు వెళ్ళాము. క్రొత్త ఫ్లాట్ మార్చి 20వ తారీఖుకి పూర్తయింది. మార్చి 21వ తారీఖు ఉదయం 5.30కి గృహప్రవేశం చేసుకున్నాము. ఆరోజే క్రొత్తింటికి సామాన్లు షిఫ్ట్ చేయటం కోసం ప్యాకర్స్ అండ్ మూవర్స్ బుక్ చేస్తే ఆ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీవాళ్ళు ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. షిఫ్టింగ్ కోసం సామాన్లన్నీ రెడీ చేశాము. వేరే ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళని బుక్ చేసుకుందామనుకుంటే మా సొసైటీవాళ్ళు, “కోవిడ్ కారణంగా ఇప్పుడు ఫ్లాట్ ఖాళీ చేయటానికి అనుమతి లేదు, బయటివాళ్ళని సొసైటీ లోపలికి రావటానికి అనుమతించకూడదని అసోసియేషన్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు” అని చెప్పారు. ఆ సమయంలో నేను సాయి నామస్మరణ చేసుకుంటూ అసోసియేషన్ ఆఫీసుకి వెళ్ళి ఫ్లాట్ ఖాళీ చేయటానికి ఒక గంట అనుమతి ఇవ్వమని అభ్యర్థించాను. బాబా అనుగ్రహంతో సొసైటీవాళ్ళు అనుమతించారు. తరువాత ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాము. బాబాకు నమస్కారం చేసుకుని, “బాబా, ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ కావాలి, మీరే ఎలాగైనా ఒక వెహికల్ పంపించండి బాబా” అని బాబాను పార్థించాను. బాబా అనుగ్రహంతో మా అబ్బాయివాళ్ళు ముందు బుక్ చేసి క్యాన్సిల్ అయిన ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళకంటే తక్కువ ధరకే ఒక వెహికల్ బుక్ అయింది. బాబా దయవల్ల సాయంత్రానికల్లా మా సామాన్లు క్రొత్తింటికి షిఫ్ట్ చేశారు. తరువాత రోజు నుండి లాక్‌డౌన్ మొదలైంది. బాబా దయవల్ల ఏ సమస్యా లేకుండా గృహప్రవేశం చక్కగా జరిగింది. ఎంతో ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాము.

రెండవ అనుభవం: 

2020 జులై 3వ తారీఖున మా చిన్నబ్బాయి హైదరాబాదు నుండి బెంగళూరుకి స్వంత కారులో బయలుదేరాడు. తను ఒంటరిగా ప్రయాణం చేస్తుండటంతో కాస్త భయపడ్డాము. ఆ సమయంలో మేము బెంగళూరులోనే ఉన్నాము. తను క్షేమంగా బెంగళూరు చేరేలా అనుగ్రహించమని బాబాను ప్రార్థిస్తూ సాయంత్రం 4 గంటల వరకు సాయి నామస్మరణ చేస్తూ ఉన్నాము. బాబా మా అబ్బాయిని క్షేమంగా బెంగళూరు చేర్చారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!”

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి

"బాబా! మీరే మాకు రక్ష!"

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన మరో అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:

ముందుగా సాయి మహారాజుకి నా శతకోటి నమస్కారములు. అలాగే సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తూ, తద్వారా మాకింత ధైర్యం చేకూరుస్తున్న సాయికి చాలా చాలా ధన్యవాదాలు. మాకు ఏ సమస్య వచ్చినా మన సాయి తండ్రికి చెప్పుకొని, అవి నెరవేరితే ఈ బ్లాగ్ ద్వారా తోటి భక్తులతో మా ఆనందాన్ని, బాబా ప్రేమను పంచుకోగలుగుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.

ఇటీవల నా అనుభవాలను కొన్ని మీతో పంచుకున్నాను. అందులో మా విదేశీ ప్రయాణం గురించి ప్రస్తావించాను. బాబా దయతో మా ప్రయాణమంతా బాగా జరిగింది. అన్నింటా బాబానే దగ్గరుండి నన్ను ఇంటికి చేర్చారు. కరోనా మూలంగా అడుగడుగునా భయమే. అయినా ఏ ఇబ్బందీ లేకుండా బాబా చూసుకున్నారు

అసలు విషయమేమిటంటే, ఇక్కడికి చేరుకున్నాక ఇక్కడి చలికి ఒకరోజు గొంతు నొప్పిగా అనిపించింది. దాంతో భయపడి, "బాబా! మీరే మాకు రక్ష" అని ప్రార్థించి, బాబా ఊదీని నుదుటిపై ధరించి, కొంత గొంతుపై రాసుకొని, మరికొంత నీళ్లలో కలుపుకొని త్రాగాను. రెండురోజుల్లో అంతా మామూలుగా అయిపోయింది. బాబానే మనందరి పాలిట వైద్యుడు. "ధన్యవాదాలు బాబా! ఇకముందు కూడా మీరే అందరి ఆరోగ్యాలను చూడాలి బాబా!" అని మా కుటుంబ బాధ్యత (భారం) అంతా బాబా పైన వేసి, బాబా నామజపం చేస్తూ ఉన్నాను.

ఒక సాయి పాద సేవకురాలు.

జై సాయిరాం!!!


6 comments:

  1. ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి

    ReplyDelete
  2. Om Sairam
    sai always be with me

    ReplyDelete
  3. Om Sri Sai Ram thaatha 🙏🙏.
    Bhavya sree

    ReplyDelete
  4. Om Sai Ram 🙏🌹🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
    ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo