ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఒక్కరే నా నమ్మకం
- కోరిన వెంటనే మన బాధలు తీర్చే బాబా
బాబా ఒక్కరే నా నమ్మకం
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ముందుగా బాబాకి నా ప్రణామాలు. నేను బాబాకి 2003 నుండి భక్తురాలిని. మా ఇంటికి దగ్గరలోనే బాబా మందిరం ఉండడంతో తరచూ ఆరతులకి వెళ్తూ ఉండడం వల్ల నెమ్మదిగా బాబా అంటే ఇష్టం మొదలైంది. ఒక ఫ్రెండ్ ద్వారా "సాయి సచ్చరిత్ర" గురించి తెలిసి అప్పుడప్పుడు సచ్చరిత్ర చదువుతూ ఉండేదాన్ని. తరువాత మావారు ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టడం, ఎన్ని చేసినా, ఎంత కష్టపడ్డా ఏమీ కలిసిరాకపోవడం వంటి ఎన్నో సమస్యలతో బాబాకి బాగా దగ్గరయ్యాను. బాబా ఒక్కరే నా నమ్మకం.
మా పెద్దబ్బాయి చాలా మంచి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పెద్ద కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేశాడు. సాధారణంగా ఇంటర్న్‌షిప్ చేసిన కంపెనీవాళ్ళే ఉద్యోగం కూడా ఇస్తారు. అలా అనుకునే మా అబ్బాయి వేరే ఏ కంపెనీలకీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయలేదు. మా అబ్బాయితో పాటు ఇంటర్న్‌షిప్ చేసిన అందరికీ ఆ కంపెనీలోనే ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఎందుకనో మా అబ్బాయికి మాత్రం ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు. తాను పని చేసిన టీం హెడ్ తోనూ, స్టాఫ్ తోనూ కూడా అన్నింటిలోనూ బెస్ట్ అనిపించుకున్న తనకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో అర్థంకాక మా అబ్బాయి చాలా బాధపడ్డాడు. మేము ఎంత ధైర్యం చెప్పినా సర్దుకోలేక చాలా మధనపడ్డాడు. వాడి బాధ చూడలేక నేను ఈ విషయాన్ని బాబాకి చెప్పుకుని, మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించమని బాబాను ఎంతగానో వేడుకున్నాను. మేమున్న పరిస్థితిలో తనకి ఉద్యోగం రావడం అవసరం కూడా.
సరిగ్గా బాబాను ప్రార్థించిన 10 రోజుల్లో బాబా మా కోరిక నెరవేర్చారు. చిన్న తప్పిదం వల్ల ఆలస్యమైందని చెప్పి, తను ఇంటర్న్‌షిప్ చేసిన అదే కంపెనీలో మంచి జీతంతో మా అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు. బాబా అనుగ్రహం వల్లనే మా అబ్బాయికి ఈ ఉద్యోగం వచ్చిందని మా పూర్తి నమ్మకం. ఆ ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలకి మా అబ్బాయికి ప్రమోషన్ కూడా ఇప్పించారు బాబా. ఇప్పుడు మా అబ్బాయి చేత "సాయిబాబా దివ్యపూజ" చేయిస్తున్నాను.
బాబాకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదు. “బాబా! మా కుటుంబాన్ని అన్ని సమస్యల నుండి బయటకు తీసుకువచ్చి మాకు ఆధారం చూపించు తండ్రీ. మా తోడు నీడగా ఉండి పిల్లలిద్దరినీ, మా కుటుంబాన్ని ఎప్పటికీ కాపాడు తండ్రీ! పెద్దబ్బాయికి ఉద్యోగంలో ఎటువంటి సమస్యలూ రాకుండా అంతా బాగుండేలా ఆశీర్వదించు తండ్రీ! మా చిన్నబ్బాయికి కూడా మంచి ఉద్యోగం ప్రసాదించు బాబా. మాకు ఆధారం చూపించు తండ్రీ. అన్నీ విజయవంతమయ్యేలా ఆశీర్వదించు తండ్రీ!”

కోరిన వెంటనే మన బాధలు తీర్చే బాబా
సాయి భక్తుడు శ్రీనివాసరావు బాబా తమకు ప్రసాదించిన మరికొన్ని అనుభవాలను మనతో పంచుకుంటున్నారు:
సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నమస్కారం. గతంలో నా అనుభవాలను కొన్నింటిని ఈ బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకున్నాను. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకుంటాను.
మొదటి అనుభవం:
21.6.2020 ఆదివారం రాత్రి అజీర్తి సమస్య వల్ల నాకు నాలుగైదుసార్లు విరేచనాలు అయ్యాయి. సోమవారం తెల్లవారుఝాముకల్లా నాకు 99.5 డిగ్రీల జ్వరం వచ్చేసింది. అంతేకాకుండా, ఒళ్ళునొప్పులు, తలనొప్పి కూడా వచ్చాయి. ఆరోజు సాయంత్రానికి జ్వరం 101 డిగ్రీలకి పెరిగింది. ప్రస్తుతం కరోనాతో చాలా భయంకరమైన పరిస్థితి ఉండటం వల్ల నాకు జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పులు ఉండేసరికి కుటుంబంలో అందరికీ చాలా భయమేసింది. ఆరోజు రాత్రి నా జ్వరం తగ్గించమని బాబాను వేడుకుంటూ, బాబా ఊదీని నా నుదుటన పెట్టుకొని, కొంచెం ఊదీని నోటిలో వేసుకొని, “బాబా! నా ఆరోగ్యం కుదుటపడితే నీ బ్లాగులో నా అనుభవాన్ని పంచుకుంటాను” అని బాబాను ప్రార్థించుకుని పడుకున్నాను. తెల్లవారేసరికి నా జ్వరం, ఒళ్ళునొప్పులు, తలనొప్పి తగ్గిపోయాయి. బాబా అనుగ్రహంతో ప్రస్తుతం నా ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది.
రెండవ అనుభవం:
మా పెద్దబ్బాయి జహీరాబాదులో ఒక ప్రవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో మాతోపాటు ఇంటివద్దనే ఉన్నాడు. ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తివేయడం వలన కంపెనీవాళ్ళు తనని ఉద్యోగంలో తిరిగి జాయిన్ అవమని ఫోన్లు చేస్తున్నారు. వీడు పనిచేసే ఊరిలో కరోనా వచ్చిందని తెలియడంవల్ల నేను మా అబ్బాయిని అక్కడికి వెళ్లకుండా ఆపుతూ ఉన్నాను. ఒకరోజు, “స్టాఫ్ అందరూ జాయిన్ అయ్యారట, నేనూ వెళ్ళి జాయిన్ అవుతాను” అని మా అబ్బాయి పట్టుపట్టాడు. ఇంకొక వారం ఆగి వెళ్ళమని మేమెంత బ్రతిమాలినా వినకుండా బయలుదేరటానికి సిద్ధపడ్డాడు. ఊరికి బయలుదేరే ముందురోజు మా అబ్బాయిలిద్దరూ బైక్ మీద బజారుకు వెళ్లగా, పోలీసులు వారిని ఆపి బైకును వారి వద్దనే ఉంచుకుని, మరుసటిరోజు సాయంత్రం తిరిగిచ్చారు. అలా బాబా మా అబ్బాయిని బయలుదేరవద్దని సూచించారు. దాంతో మా అబ్బాయి మరుసటి ఆదివారం బైక్ పై ఊరికి బయలుదేరటానికి సిద్ధపడ్డాడు. నేను బాబా అనుమతికై ప్రార్థిస్తూ, “బాబా! మా అబ్బాయి ఊరికి బయలుదేరే సమయంలో మీరు ఆకుపచ్చరంగు వస్త్రాలలో దర్శనమిస్తే మీరు అనుమతి ప్రసాదించినట్లు భావిస్తాన”ని బాబాకు చెప్పుకున్నాను. మా అబ్బాయి బయలుదేరేరోజు, అనగా ఆదివారంనాడు బాబా ఆకుపచ్చరంగు వస్త్రాలలో దర్శనమిచ్చి, తన అనుమతిని తెలిపి, మా అబ్బాయి ఎటువంటి ఇబ్బందీ, అపాయమూ లేకుండా ఉరికి చేరేలా అనుగ్రహించారు. ప్రస్తుతం మా అబ్బాయి బాబా దయతో క్షేమంగా ఉన్నాడు. కోరిన వెంటనే మన బాధలు తీర్చే బాబాకు మనం ఏమివ్వగలం, ఆయనను ప్రేమించడం తప్ప. “బాబా! ఎల్లప్పుడూ మా కుటుంబాన్ని, నీ భక్తులను కాపాడు తండ్రీ!” ఓం సాయిరాం!

🙏🌹🙏 చిదానంద రూప.. సదా దివ్య తేజ🙏🌹🙏
ReplyDelete🙏🌹🙏నమోస్తు సాయినాథ.. పాహిమాం రక్ష రక్ష🙏🌹🙏
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhāvyā srēē
Om Sai Ram 🙏🌹🙏
ReplyDelete