ఈ భాగంలో అనుభవాలు:
- కష్టకాలంలో బాబా సందేశం - ఆయన అనుగ్రహం
- సాయి అనుగ్రహంతో లభించిన రేషన్ కార్డు
కష్టకాలంలో బాబా సందేశం - ఆయన అనుగ్రహం
పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు ఇటీవల తనకు బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. మేము సాయిబాబా భక్తులం. చాలా సంవత్సరాల నుండి మేము బాబాని పూజిస్తున్నాము. మొదటిసారిగా నేను బాబా నాకు ప్రసాదించిన ఒక అద్భుత అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకుంటున్నాను. ఈ అవకాశాన్నిచ్చిన బాబాకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మా అమ్మాయి వయస్సు 16 సంవత్సరాలు. తనకు 2020, ఏప్రిల్ 22వ తేదీన జ్వరం వచ్చింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా మేము చాలా భయపడ్డాము. నేను నిర్విరామంగా బాబా స్మరణ చేస్తున్నప్పటికీ జ్వరతీవ్రత తగ్గలేదు సరికదా ఇంకా ఎక్కువైంది. దాంతో మాకు ఆందోళన మొదలైంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో శిరిడీ నుండి బాబా ఫొటోలు పంపారు. అందులో బాబా ఫోటోలతో పాటు అమ్మవారి ఫోటో కూడా ఒకటి ఉంది. అదివరకు కూడా బాబా ఫోటోలు వస్తుండేవి కానీ, అమ్మవారి ఫోటో ఎప్పుడూ రాలేదు. ప్రత్యేకంగా ఆ సమయంలో ఆ ఫోటో ఎందుకు వచ్చిందో నాకప్పుడు అస్సలు అర్థం కాలేదు. ఇదిలా ఉంటే, ఆరోజు ఉదయం నేను ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి బయటకి వెళ్ళాను. అప్పుడు అనుకోకుండా మేము ఎప్పుడూ వెళ్లే హాస్పిటల్ తెరచి ఉండటం గమనించాను. నేను ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మా అమ్మాయి జ్వరం అలానే ఉంది. జ్వరమంటేనే చాలా భయం పుట్టే ప్రస్తుత పరిస్థితిలో ఏమవుతుందో, ఏమిటో అన్న ఆందోళనతో మేము చాలా మధనపడ్డాము. మరుసటిరోజు మా అమ్మాయిని ముందురోజు చూసిన హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాము. డాక్టర్ కొన్ని మందులిచ్చి, "దగ్గు రాకుండా చూసుకోండి" అని చెప్పారు. రక్తపరీక్ష కూడా చేయించమని చెప్పారు. మేము రక్త నమూనాలు ఇచ్చి ఇంటికి వచ్చాము. రిపోర్టులు నార్మల్‌గా రావాలని మేము బాబాని ప్రార్థిస్తూ గడిపాము. దానితోపాటు తరచుగా మా అమ్మాయికి బాబా ఊదీ కలిపిన నీళ్లు ఇచ్చాను. బాబా దయవల్ల మరుసటిరోజు రాత్రి నుండి జ్వరం తగ్గుముఖం పట్టింది. రిపోర్టులు కూడా నార్మల్ వైరల్ ఫీవర్ అని వచ్చాయి. బాబా దయ, ఆయన ఊదీతో మేము ఈ కష్టం నుండి ఏ సమస్య లేకుండా బయటపడ్డాము.
ఇకపోతే అమ్మవారి ఫోటో వచ్చిందని చెప్పాను కదా! అది ఏదో ఆషామాషీగా వచ్చిన ఫోటో కాదు. దానివెనుక అద్భుతమైన బాబా లీల దాగి ఉంది. ఆ సమయంలో నేనున్న ఒత్తిడిలో ఆ ఫోటో విషయంలో అంత శ్రద్ధ చూపకపోయినప్పటికీ బాబా తమ సందేశాన్ని నాకు అర్థమయ్యేలా చేశారు. ఆ ఫొటోలో ఉన్నది 'శీతలదేవి' అమ్మవారు. నిజానికి మేము మహారాష్ట్రలోని నాగపూరుకి చెందినవాళ్ళం. మావారి ఉద్యోగరీత్యా బదిలీపై హైదరాబాద్ వచ్చాము. విషజ్వరాలు, అంటుజ్వరాలు మొదలైనవి వచ్చినప్పుడు మహారాష్ట్ర అంతటా శీతలదేవిని ఎక్కువగా కొలుస్తారు. మా అమ్మాయికి జ్వరంగా ఉందని తెలిసిన నా స్నేహితురాలు ఒకరోజు తనకు ఎలా ఉందో తెలుసుకుందామని నాకు ఫోన్ చేసింది. నేను చాలా ఉద్వేగంతో "ఇంకా తగ్గలేద"ని చెప్పాను. అప్పుడు నా స్నేహితురాలు శీతలదేవి అష్టకం, మంత్రం పఠించమని చెప్పింది. ముందే ఫోటో రూపంలో అమ్మవారిని పంపినా నేను అర్థం చేసుకోలేకపోయానని, బాబానే నా స్నేహితురాలి ద్వారా అమ్మవారిని ప్రార్థించమని మళ్ళీ చెప్పిస్తున్నారని అప్పుడు నాకు అర్థమైంది. దాంతో నేను బాబా సందేశానుసారం అమ్మవారిని కూడా ప్రార్థించి, బాబా ఆరతి యూట్యూబ్‌లో వింటూ ఊదీ నీళ్లు మా అమ్మాయికి ఇవ్వడం చేశాను. అపారమైన కరుణామూర్తి తమ అనుగ్రహాన్ని మాపై కురిపించి మాకొచ్చిన కష్టం నుండి మమ్మల్ని బయటపడేశారు.
బాబా ఒక్కొక్కరికి ఒక్కోరీతిన సందేశం ఇస్తారని సచ్చరిత్రలో చదివాను. అందులో కొంతమందికి విష్ణుసహస్రనామం, మరికొందరికి భాగవతం చదవమని చెప్పినట్లే బాబా మాకు ఆ సమయంలో అమ్మవారి జపం చేయమని సూచించారని నేను భావిస్తున్నాను. నిజానికి నేను బాబాని తప్ప ఇంకెవరినీ ప్రార్థించను. మరి బాబా పంపిన సందేశంలోని పరమార్థమేమిటో ఆ సమర్థ సద్గురుమూర్తికే ఎరుక. ఆయన సూచించింది చేయడం మన ధర్మం.
"బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. ఈ వైరస్ నుండి మమ్మల్ని కాపాడే బాధ్యత మీదే బాబా. మీ పాదాలకు సంపూర్ణ శరణాగతి చెందాము. మమ్మల్ని సదా కాపాడండి బాబా".

సాయి అనుగ్రహంతో లభించిన రేషన్ కార్డు
సాయిభక్తులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయిబంధువుకి నా ధన్యవాదాలు.
నా పేరు లక్ష్మి. బాబా ఆశీస్సులతో నాకు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకుంటాను.
నేను 2019 డిసెంబరు నుండి రేషన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్నాను. మా వార్డు వాలంటీరు కార్డు త్వరలోనే వస్తుందని చెప్తుండేది. కానీ రోజులు గడుస్తున్నా కార్డు రావడంలో ఆలస్యం జరుగుతూనే ఉండేది. రేషన్ కార్డు లేనందున అమ్మ ఒడి, కరోనా సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సాయం మొదలైనటువంటి వాటికి అర్హత ఉండి కూడా మేము వాటిని పొందలేకపోయాము. మా కుటుంబ పరిస్థితులకు ఆ ప్రభుత్వ సహాయం ఎంతో అవసరం. అందువలన రేషన్ కార్డు ఎప్పటికి వస్తుందో అని నేను బాధపడుతూ ఉండేదాన్ని.
చివరికి 2020, మే 14వ తేదీన నా సమస్యను బాబాకు చెప్పుకొని సాయిలీలామృతం పారాయణ మొదలుపెట్టాను. పారాయణ మొదలుపెట్టిన 5వ రోజున, అనగా మే 18న రేషన్ కార్డు మంజూరు అయినట్టు మాకు ఒక లెటర్ అందింది. ఆ లెటర్ చూసి నేను చాలా ఆనందించాను. ఇక కార్డు ఎప్పుడు మా చేతికి అందుతుందా అని ఎదురుచూస్తూ రోజూ బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. జూన్ 24వ తేదీన మా రేషన్ కార్డు వచ్చిందని వాలంటీరు తీసుకొచ్చి నాకిచ్చింది. నేను పట్టలేని ఆనందంతో, "సాయి తండ్రీ! కేవలం మీ దయవలనే మాకు రేషన్ కార్డు వచ్చింది. మీరు చేసిన సహాయానికి అనంతకోటి ధన్యవాదాలు దేవా!"

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
ReplyDeleteసదాకల్ప వృక్షస్య తస్యాధిమూలే
భవద్భావబుద్ధ్యా సపర్యాదిసేవాం
నృణాం కుర్వతాం భుక్తి-ముక్తి ప్రదంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం
🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏
అపద్బాంధవ అనాధ రక్షకా సాయినాదా శరణం శరణం
ReplyDeleteom sairam
ReplyDeletesai always be with me
sai cure my son health
ReplyDeletebe with him sairam
https://youtu.be/nu2VfiQvTOI
Delete🙏🙏 ఓం సాయిరాం 🙏🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteOm apadbhadavaya namaha ����������
ReplyDelete