సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 473వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. అడుగడుగునా బాబా అనుగ్రహం  
  2. గుండెనొప్పి భయాన్ని తీసేసిన బాబా

అడుగడుగునా బాబా అనుగ్రహం

నా సాయితండ్రికి శతకోటి నమస్కారములు. ముందుగా ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్సుమాంజలులు. ఇంతకుముందు నా అనుభవాలు కొన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా గురించి అందరం భయపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు మా కోడలికి కొద్దిగా జలుబు చేసింది. నాకు చాలా భయమేసింది. బాబా పైనే భారం వేసి, “బాబా! నీవే మాకు దిక్కు, నీవే కాపాడాలి. తన జలుబు తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించి, మా కోడలి నుదుటన బాబా ఊదీ పెట్టి, కొద్దిగా ఊదీని తన నోట్లో వేశాను. బాబా దయవల్ల మరునాటికల్లా తన జలుబు తగ్గిపోయింది

ఆ తర్వాత ఒకరోజు నాకు గొంతునొప్పిగా అనిపించింది. మనల్ని కాపాడే బాబా  ఉండగా మనకు భయం ఎందుకని అనుకుని, బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నుదుటన ధరించాను. ఆ రాత్రంతా మెలకువ వచ్చినప్పుడల్లా బాబా నామాన్ని జపించాను. బాబా తన పిల్లలను ప్రేమగా చూసుకుంటారు కదా! బాబా అనుగ్రహంతో మర్నాటి ఉదయానికి నా గొంతునొప్పి తగ్గిపోయింది. మన భారం ఆయన మీద వేస్తే మనకిక దిగులెందుకు? “చాలా చాలా ధన్యవాదాలు బాబా! మా కుటుంబం బాధ్యత మీరు తీసుకున్నందుకు మీకు ఎల్లవేళలా ఋణపడివుంటాను బాబా!”

మరొక అనుభవం: 

ఈమధ్య మా వియ్యపురాలు అమెరికా నుండి వచ్చారు. ఆమెను ఢిల్లీలో క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. ఆవిడకి అక్కడి భాష రాదు. అందువల్ల నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఆవిడని క్షేమంగా ఇంటికి పంపించు, ఏ ఇబ్బందీ లేకుండా ఆవిడ ఇంటికి వచ్చేస్తే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. బాబాను ప్రార్థించిన తరువాత, ఆవిడ అంతకుముందు మూడుసార్లు అడిగినా ఇంటికి పంపడం కుదరదని అన్న ఆఫీసరు, నాలుగవసారి బాబాను తలచుకొని, “బాబా! ఎలాగైనా మీరే నన్ను ఇంటికి పంపించండి” అని వేడుకుని వెళితే చాలా కూల్‌గా స్టాంప్ వేసి ఆమెని ఇంటికి వెళ్ళిపొమ్మని చెప్పారట. బాబానే ఆయన రూపంలో ఉండి పంపారు. ఆవిడతో వచ్చిన మిగిలిన వారందరూ క్వారంటైన్‌కి వెళ్లారు. ఇలా బాబా అడుగడుగునా మమ్మల్ని కాపాడుతున్నారు. బాబా లీలలను ఎలా వర్ణించను? 

“బాబా! కొంతమంది బంధువులనుండి, తెలిసినవాళ్ళనుండి మాకు రావలసిన పొలాలు, ప్లాట్లు, డబ్బులు మాకు త్వరగా అందేలా అనుగ్రహించండి”. ఇవి వాణిజ్య సంబంధమైన కోరికలని అందరూ అనుకోవచ్చు. కానీ ఈ సమస్యల వల్ల ప్రశాంతమైన మనసుతో ఉండలేకపోతున్నాను. ఇవన్నీ బ్లాగులో చెప్పుకుంటే, ఈ అనుభవాలు చదువుతున్న ఇంతమంది సాయిబంధువుల ఆశీస్సులతో నా సమస్యలను బాబా త్వరగా పరిష్కరిస్తారని నా ఆశ. బాబా తలచుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. “బాబా! మీ ఆశీస్సులు మాపై ఎల్లప్పుడూ ఉండాలి. మా కోడలిని, మనవరాలిని తీసుకుని నేను, మావారు అమెరికా వెళ్లడానికి మీ అనుమతిని ప్రసాదించండి”. 

నేను నా అనుభవాలను మీతో పంచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడే మావారికి, కోడలికి, పాపకి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అదీ గురువారం రోజున! అది బాబా లీల కాక మరేమిటి? మా మనవడి కోసం మేమంతా ఖచ్చితంగా అమెరికా వెళ్లవలసిన అవసరముంది. “బాబా! మీ దయవల్ల అందరం క్షేమంగా అమెరికా వెళ్లిరావాలని కోరుకుంటున్నాను. అక్కడ ఎలాంటి ఇబ్బందీ కలగకుండా చూడండి బాబా!” ఓం సాయిరామ్!

గుండెనొప్పి భయాన్ని తీసేసిన బాబా

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా సాయిబంధువులందరికీ ఓం సాయిరామ్! కొద్దిరోజుల క్రితం నేనొక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకున్నాను. ఇటీవలే జరిగిన మరొక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 2020, జూన్ 18న హఠాత్తుగా నా గుండెలో నొప్పిగా అనిపించింది. దానితోపాటు ఎడమచేతికి కూడా నొప్పి వచ్చింది. నాకు చాలా భయమేసి, "బాబా! నాకీ పరిస్థితి ఏమిటి? దయతో నాకు ఈ బాధ నుండి నువ్వే విముక్తిని ప్రసాదించాలి బాబా. నాకు ఏ కష్టం లేకపోయినట్లయితే నా అనుభవాన్ని బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. తరువాత కొంచెం ఊదీ తీసుకొని నొప్పి ఉన్న చోట రాసుకుని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకొని త్రాగాను. తరువాత కూడా 'బాబా.. బాబా' అంటూ బాబానే తలచుకుంటూ సహనంతో ఉన్నాను. కొంతసేపటికి బాబా దయవలన నొప్పి తగ్గిపోయింది. అయినప్పటికీ నేను బాబాని, "హాస్పిటల్‌కి వెళ్ళనా?" అని అడిగాను. "వెళ్ళమ"ని బాబా సమాధానం వచ్చింది. దాంతో నేను హాస్పిటల్‌కి వెళ్లి డాక్టరుతో నాకిలా నొప్పి వచ్చిందని చెప్పాను. అందుకు డాక్టరు, "కంగారుపడాల్సిన పనిలేదు. మీరు వాడుతున్న మందుల వలన అలా అనిపిస్తుంది" అని అన్నారు. వాస్తవానికి నేను నొప్పి వచ్చినప్పుడు గుండెకు సంబంధించి ఏదైనా పెద్ద సమస్యేమోనని చాలా భయపడ్డాను. కానీ బాబా దయవలన అలాంటిదేమీ జరగలేదు. "బాబా! మీకు చాలా చాలా ధన్యవాదాలు".


7 comments:

  1. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

    !!!శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ!!!
    !! శ్రీ గురు రూపాయ.దీన భక్తజన ఆపద్బాంధవాయ!!
    ముని జన వందిత సాయిరాం.
    పతితపావన సాయి శ్యామ్!!
    🙏🌹🙏 ఓం గురుభ్యోన్నమః 🙏🌹🙏

    ReplyDelete
  2. ఓం సాయిరామ్!

    ReplyDelete
  3. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  4. Sai cure my son health
    ellapudu thoduga undu

    ReplyDelete
  5. Om Sri Sai Ram thaatha 🙏🙏🙏🙏
    Bhāvyā srēē

    ReplyDelete
  6. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo