సాయి వచనం:-
'మీ ఆలోచనలు, మీరు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నేనెప్పుడూ మీ చెంతనే ఉండి పిలచిన పలుకుతాను. నేనెప్పుడూ కోరేది మీ ప్రేమను మాత్రమే!'

'ఏ దైవాన్ని ఆశ్రయించినా ఆ దైవాన్నే అనన్యంగా ఆరాధించాలి' - శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 425వ భాగం



సాయిశరణానంద అనుభవాలు - 58వ భాగం

నిన్నటి తరువాయిభాగం..... 

ఈరోజు, అంటే 19-8-1959న గురుభక్తినీ, ఏకపత్నీవ్రతాన్ని అనుసరించి ఆచరణలోకి తీసుకురాగల నీతికి సంబంధించి ఆకాశవాణి ద్వారా వినిపించిన మాటలకు ఎంత ప్రాముఖ్యతను ఇవ్వాలి అన్న ఆలోచన కలిగింది. 1916లో శిరిడీలో ఒకరోజు ఉదయం, “చూడు, నన్నిక్కడ వ్రేలాడదీశారు” అని వినిపించింది. ఈ ధ్వని అచ్చం బాబా కంఠధ్వనిలాగే ఉంది. ఏ దిశ నుంచి ఆ ధ్వని వచ్చిందో ఆ దిశవైవు చూస్తుంటే, ముక్తారాంకి బాబా ప్రసాదించిన కఫ్నీ ఉతికి ఆరవేయటానికి వ్రేలాడదీయబడి ఉండటం కనిపించింది. దీంతో నిర్జీవ వస్తువుల నుంచి, అంటే బాబా కఫ్నీలాంటి వాటిలో నుంచి కూడా బాబా స్వరం వినిపిస్తుందన్న అనుభవాన్నిచ్చినా గానీ దీన్ని గురించి ఆలోచించనక్కర్లేదు. మరి వినిపిస్తున్న దేనిని నిజమని అంగీకరించాలి? బాబా ప్రత్యక్షంగా ఏం చెప్పారో అదే సత్యమని అంగీకరించాలి. అంతకుమించి దేనినీ అంగీకరించవద్దు. ఆకాశవాణి ద్వారా వినిపించిన సూచనలన్నీ శుభమవుతాయని అంగీకరించనక్కర్లేదు. మనలోని దుష్టవాసనలు, శంక-కుశంకలు, భయాది మలినవృత్తులు సూక్ష్మవిచారవాణి రూపంలో వ్యక్తమవుతాయి. అందువల్ల ఈ ప్రకారంగా శాస్త్ర ఆచారానికి లేక పరంపరకి విరుద్ధమైన సూచనలపై దృష్టి పెట్టటం, వాటి ఆచరణలో పొరపాటు చేయటంలో లాభముండదు. పైగా ఎన్నోసార్లు నష్టం సంభవించటమే అధికంగా ఉంటుంది. అందువల్ల అలాంటి శబ్దాన్ని విని దాన్ని గురించి ఆలోచించే అవసరం కూడా ఏమీలేదు. నామస్మరణ, పఠనాలతో ఈ రకమైన శబ్దం వినిపించకుండా ఉండేట్లు సాధన చేసుకోవాలి.

1916లో బాబా ఒకసారి, “వామన్ భావాలన్నీ పూర్తిగా ఇక్కడే ఉండిపోయాయి. అందువల్ల అతని మస్తిష్కానికి ఇంత సున్నితమైన స్థితి కలిగింది” అన్నారు. దీంతో, “బాబా ధరించే కఫ్నీ కూడా చైతన్యవంతమైనదే” అన్న ఆలోచన ప్రస్ఫుటమైంది. అలాంటి భావన నా చిత్తంలో ఎంతో లోతుగా ఉండిపోయింది. అందువల్లే ఆరబెట్టటానికి వ్రేలాడదీసిన బాబా కఫ్నీ నుంచి, "చూడు, నన్ను ఇక్కడ వ్రేలాడదీశారు” అని వినిపించింది. ఆ కంఠస్వరం బాబాదే అని తెలుసుకొన్నాను. దీని ద్వారా బాబా నాకు, "చూడు వామన్! నా దేహము, నా కళ్ళు, చెవులు, ముక్కు, జుట్టు, శిరస్సు, మొహము, పొట్ట, ఛాతీ మొదలైన అవయవాలు, ఈ అవయవాల వ్యవహారాలు, నా కఫ్నీ, తలగుడ్డ మొదలైనవి “నేను” కాదు. నా దేహం ద్వారా జరుగబోయే అన్ని వ్యవహారాలు, అంటే - తినటం, త్రాగటం, మాట్లాడటం, తిరగటం - ఈ క్రియలన్నీ యాంత్రికమైనవని తెలుసుకో. నా సత్య స్వరూపం వీటికి అతీతంగా ఉన్నది. నా ఈ మాయా వ్యవహారం ద్వారా నీకెంత అవసరమో, ఎంత లాభదాయకమో, ఎంత ఉపయుక్తమో అంతే చెప్తాను. అంతే చూపిస్తాను. అంతవరకే నీవు చూస్తున్నావు. అందువల్ల నీ భావమంతా ఇక్కడే ఉండిపోయింది. అవన్నీ మాయ అని తెలుసుకుని వదిలేసెయ్యి. నీవు సంసారంలోనే ఉండాలి. అందువల్ల ఆ దృష్టితోనే వ్యవహారాలన్నీ చేయి. నీ మస్తిష్కం యొక్క సున్నితమైన స్థితికి కారణం నీవు నా అసలు స్వరూపాన్ని గుర్తించలేకపోవటమే. నా మాయా శరీరాన్నీ, దాని వ్యవహారాలనూ నీవు నిజమనుకుంటున్నావు. ఇప్పుడు ఈ భ్రమను వదిలేసి, వ్యవహారాలన్నిటికీ అవతల మనను, బుద్ధి, వాణులకు అగోచరమూ, అగమ్యముగా ఉన్న ఆ సర్వవ్యాపక సర్వజ్ఞ అంతర్యామి, విశ్వానికి కర్త, హర్త అయిన వాడ్ని నేనేనన్న విశ్వాసాన్ని నీవు పెట్టుకుని, దాన్ని గుర్తుంచుకుని కర్మను చేస్తుండాలి” అని బోధించదలచారు. వినిపిస్తున్న శబ్దాలన్నీ నిజమా లేక అబద్ధమా అన్న దాని గురించి నేనేమీ చెప్పలేను.

1917 - 1921 మధ్యకాలంలో నా చెల్లెలికి కఫమూ, జ్వరమూ, అరుచి లాంటి వికారాలు పట్టుకున్నాయి. మందులు ఇస్తున్నారు కానీ వాటి ప్రభావం కొంచెం కూడా లేకుండా పోయింది. ఒకరోజు ప్రొద్దున నేను ఆమె వద్ద కూర్చుని టీ త్రాగుతున్నాను. అప్పుడు ఒక్కసారిగా ఒక స్వరం వినిపించింది - "నీ చెల్లెలికి పెద్ద అనారోగ్యమేం కాదు. అది కేవలం సూక్ష్మజీవుల తీవ్రతే!” అని. దీని ప్రకారం ‘కాచ్ కాచీకషాయం’(ఒక రకం మొక్క కాడ) తీసుకుంటే తనకి నయమైపోతుంది. ఇక్కడ నేను చేసిన బ్రహ్మదాతౌన్ లేదా ధౌతి ప్రయోగం సఫలం అయింది.

తరువాయి భాగం రేపు ......

source: "దేవుడున్నాడు లేడంటావేం!" బై విమలాశర్మ.

5 comments:

  1. Om Sai
    Sri Sai
    Jaya Jaya Sai
    🙏🙏🙏

    ReplyDelete
  2. 🙏🌹🙏 ఓం సాయిరాం 🙏🌹🙏

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం తాతయ్య 🌹🙏🌹🙏🌹🙏🌹

    ReplyDelete
  4. Baba Kalyan ki.marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi house lo problem solve cheyandi pl

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo