ప్రియమైన సాయిబంధువులందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని మనసారా కోరుకుంటూ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.
ఈ భాగంలో అనుభవాలు:
- ప్రియమైన సాయిబాబా
- నా ఆందోళనను తీసేసిన సాయి
ప్రియమైన సాయిబాబా
యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు తాలి తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:
నా పేరు తాలి. నేను సాయిబాబాకు చిన్న భక్తురాలిని. 2007లో బాబా నా జీవితంలోకి వచ్చారు. ఈరోజు నాకంటూ ఏదైనా ఉందంటే అది నా ప్రియమైన సాయిబాబా ఆశీర్వాదం వల్లనే.
2007వ సంవత్సరంలోని ప్రేమికులరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఆరోజు నేను నా ప్రియమైన సాయిబాబా మందిరానికి వెళ్లి ఆయనపట్ల నాకున్న ప్రేమకు చిహ్నంగా ఆయనకు ఎర్రగులాబీని సమర్పించాలని అనుకున్నాను. అందువలన నేను ఒక ఎర్రగులాబీ కొని, అమ్మతో కలిసి మందిరానికి వెళ్ళాను. నేను మందిరంలోకి అడుగుపెడుతూనే నవ్వుతూ ఉన్న అందమైన నా సాయి ముఖాన్ని చూసి నేను చెప్పలేని ఆనందంతో పరవశించిపోయాను. నా చేతిలో ఉన్న గులాబీని బాబా గుండెలపై ఉంచాలనుకున్నాను. కానీ ఎవరో అప్పటికే ఒక ఎర్రగులాబీని బాబాకు పెట్టి ఉండటం గమనించి నా గుండెకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ప్రేమికులరోజు కానుక అయిన ఎర్రగులాబీని సాయిబాబా పాదాల వద్ద పెట్టడానికి నా మనసు ఇష్టపడలేదు. నేను కేవలం గులాబీని బాబా గుండెలపై ఉంచాలనుకున్నాను. నేను నా కోరికను మా అమ్మతో చెప్పాను. ఆమె, "పర్వాలేదు, గులాబీని బాబా పాదాల చెంత పెట్టు" అని చెప్పింది. కానీ నా మనసు కుదుటపడలేదు. నేను బాబాతో, "బాబా! నేను మీ మీద చాలా ప్రేమతో ఈ గులాబీని కొన్నాను. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు?" అని అన్నాను. వెంటనే అద్భుతం జరిగింది. బాబా గుండెలపై ఉన్న గులాబీ కిందకి జారి పడిపోయింది. నా ఆనందానికి హద్దులు లేవు. నా కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అంతలో పూజారి నా దగ్గరకొచ్చి నా చేతిలో ఉన్న ఎర్రగులాబీ తీసుకుని బాబా గుండెలపై ఉంచాడు. సంతోషంతో బాబాకి మనసారా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆరోజు బాబా నాకిచ్చిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను, జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అప్పటినుండి ప్రతి ప్రేమికులరోజు నాడు నేను ఇంట్లో లేదా దేవాలయంలో బాబాకు ఎర్రగులాబీ సమర్పిస్తాను.
మరో అనుభవం:
2015, డిసెంబరులో నేను యు.ఎస్.ఏ లో డిగ్రీ పూర్తి చేశాను. అప్పటినుండి నేను ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. అయితే సంవత్సరం గడిచిపోయినా అదృష్టం కలిసి రాలేదు. కానీ నేను ఆశను కోల్పోలేదు. ఎందుకంటే ప్రతిదీ సాయిబాబా ఆదేశానుసారమే జరుగుతోందని నాకు తెలుసు. ఒకరోజు నిరాశతో నేను 'సాయిబాబా క్వశ్చన్&ఆన్సర్ వెబ్‌సైట్' తెరిచి, "నాకెందుకు ఇంటర్న్‌షిప్ గానీ, ఉద్యోగం గానీ రావడం లేద"ని బాబాని అడిగాను. అందుకు "నువ్వు అలవాటుగా చేసే దానాన్ని చేయడం ఆపేశావు. దాన్ని మళ్ళీ ప్రారంభించు" అని సమాధానం వచ్చింది. నిజమే! నేను శివ్‌పూర్ సాయిబాబా మందిరంలో కొంత విరాళం ఇస్తూ ఉండేదాన్ని. అయితే నా భర్తకు అది నచ్చలేదు. ఎందుకంటే, ఆ డబ్బును స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో ఉపయోగిస్తున్నారా లేదా అనే దానిపై ఎటువంటి ఆధారాలూ లేవని అతని అభిప్రాయం. ఆ విషయమై నేను చాలాసార్లు తనతో వాదించాను. చివరికి ఒకరోజు డబ్బు పంపడం మానేసి, నాకు ఉద్యోగం వచ్చిన తరువాత మళ్ళీ డబ్బులు పంపుతానని అనుకున్నాను. నేను సాయిబాబా ఇచ్చిన సమాధానం గురించి చాలా రోజులు ఆలోచించాను. తరువాత నా భర్తతో, "ఈసారి కొంత డబ్బు పంపించనివ్వండి" అని అడిగాను. ఆశ్చర్యకరంగా నా భర్త దానికి అంగీకరించారు. 2017, ఫిబ్రవరి 7న డబ్బులు పంపించి, సమీపంలో ప్రేమికులరోజు వస్తోంది కాబట్టి శివ్‌పూర్ సాయిబాబా మందిర పూజారి అమిత్ బిశ్వాస్ గారికి ఫోన్ చేసి ప్రేమికులరోజున పూజ చేసి, నా తరపున సాయిబాబాకి ఒక ఎర్రగులాబీ సమర్పించమని అభ్యర్థించాను. అదేరోజు అద్భుతం జరిగింది. నా భర్త నా ఉద్యోగం గురించి చాలామంది స్నేహితులతో మాట్లాడారు. కొంతసేపటికి నా భర్త స్నేహితుడొకరు తన స్నేహితుని ఆఫీసులో ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఒక పొజిషన్ ఖాళీగా ఉందని మావారికి ఫోన్ చేసి చెప్పి, ఒక ఫోన్ నంబర్ ఇచ్చి, ఆమెతో మాట్లాడమని చెప్పారు. నేను మరుసటిరోజు ఆమెతో మాట్లాడాను. ఆమె, "వచ్చే మంగళవారం నుండి ఇంటర్న్‌షిప్ మొదలుపెట్టమని" చెప్పింది. అది ఏరోజో మీకు తెలుసా? అదే ప్రేమికులరోజు. నా ప్రియమైన సాయిబాబా ప్రేమికులరోజు నాడు నాకు విలువైన బహుమతిని ఇచ్చారు. అలా నేను నా కెరీర్‌ను ప్రేమికులరోజున ప్రారంభించాను. బాబా నాకిచ్చిన వాగ్దానం నెరవేరింది. నేను ఉద్యోగం కోసం ఎదురుచూసిన సంవత్సర కాలంలో బాబా నన్ను బలోపేతం చేసి, కెరీర్ ఎంచుకోవడంలో నాకు మార్గనిర్దేశం చేశారు. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు". బాబాని నమ్మండి. ఆయన ఎప్పుడూ తన భక్తులతోనే ఉంటారు. మనం ఆయనను ఏ విధంగా ప్రార్థించినా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు.
ఓం సాయిరామ్!

నా ఆందోళనను తీసేసిన సాయి
USA నుండి ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేనొక చిన్న సాయిభక్తుడిని. ఒకసారి నేను కండరాల ఒత్తిడి వలన తీవ్రమైన మెడనొప్పితో చాలా బాధపడ్డాను. కొన్నిరోజుల తరువాత ఆ నొప్పి తల, మెడ, భుజాలకు ప్రాకింది. ఆ నొప్పితో నేను ప్రతిక్షణం చాలా బాధపడ్డాను. నేను అదివరకే వెన్నుపూస సంబంధిత డిస్క్ సమస్యతో బాధపడి ఉన్నందున ఇప్పుడీ నొప్పి తీవ్రమైన డిస్క్ సమస్య అవుతుందేమోనని చాలా భయపడ్డాను. డాక్టర్ని సంప్రదించే ముందు నేను, 'నాకు సహాయం చేయమని, నా వైద్యుడిగా ఉండమని' సాయిని ప్రార్థించాను. నాకు నయమైతే నా అనుభవాన్ని సాటి సాయిభక్తులతో పంచుకుంటానని కూడా సాయితో చెప్పుకున్నాను. ఆశ్చర్యం! నేను మరుసటిరోజు నిద్రలేచేసరికి నొప్పి అస్సలు లేదు. అదేరోజు డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. డాక్టర్ పరీక్షించి, "ఆందోళన చెందడానికి ఏమీలేద"ని చెప్పారు. "బాబా! ధన్యవాదాలు. మీరెంతో దయగలవారు. మీ భక్తులకోసం మీరు చేసే అద్భుతాలను ఏ పదాలూ వర్ణించలేవు. ఓం సాయిరామ్!"

🙏💐🙏💐🙏💐🙏🌹🙏🌹🙏💐🙏💐🙏🌹🙏
ReplyDeleteసాయి బంధువులకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
సాయి నాథుని కృప ఎల్ల వేళలా ఉండాలని....
మన సాయి కుటుంబ సభ్యులకు అందరకీ మరొక్క సారి..గురు పూర్ణిమ శుభాకాంక్షలు.
సర్వేజనా సుఖినోభవంతు సర్వే సుజనా సుఖినోభవంతు
🙏🌹🙏ఓం సాయిరాం🙏🌹🙏
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteSadguru sainath maharaj Ki jai🙏🙏
ReplyDeleteOk Sai Sri Sai Jaya Jaya Sai
ReplyDeleteOm Sri Sai Ram thaatha 🙏🙏
ReplyDeleteBhāvyā srēē
ఓం సాయిరామ్!
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete