ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ప్రసాదించిన రెండు చిన్న అనుభవాలు
- బాబా దయతో సమస్య తీరింది
బాబా ప్రసాదించిన రెండు చిన్న అనుభవాలు
బెంగళూరు నుండి సాయిభక్తురాలు శ్రీమతి లక్ష్మి తమ అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయినాథాయ నమః. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న బృందానికి, సాయిభక్తులకు నా నమస్కారాలు తెలుపుకుంటూ నాకు జరిగిన చిన్న చిన్న అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
మా అబ్బాయి వాళ్ళు మా బంధువులింట్లో జూన్ 16వ తేదీన ఉన్న నిశ్చితార్థానికి హైదరాబాదు వెళ్ళాలని చాలా ఉత్సాహ పడ్డారు. ఇంట్లో ఉన్న వాళ్ళం వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినలేదు. ఈ కరోనా సమయంలో వాళ్ళను హైదరాబాదు పంపాలంటే నాకు చాలా భయమనిపించి, 'ఎలా అయినా వాళ్ళ ప్రయాణం ఆపమ'ని ఒక వారం రోజుల పాటు సాయిబాబాను వేడుకుంటూనే ఉన్నాను. చివరకు జూన్ 15వ తేదీన వాళ్ళకు ఏమనిపించిందో గానీ, "మేము హైదరాబాదు ప్రయాణం విరమించుకున్నామ"ని చెప్పారు. మా పిల్లల మనసులను మార్చింది ఆ సాయినాథుడే తప్ప మరెవరూ కాదు. వాళ్ళ ప్రయాణం ఆపి మా అందరికీ మనశ్శాంతినిచ్చిన ఆ సాయినాథునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. మీ అందరికీ ఇది చిన్న అనుభవమే, కానీ నాకు మాత్రం ఎంతో ఆనందం కలిగించిన విషయం.
మరో అనుభవం:
కొన్ని రోజుల క్రిందట ఒక తెల్లవారుఝామున బాబా నాకు స్వప్నదర్శనమిచ్చారు. ఆ స్వప్నంలో బాబా మా బెడ్రూమ్ తలుపు దగ్గర నిలబడి నన్ను దగ్గరకు రమ్మన్నట్లు సైగలు చేసి తనకు మంచినీళ్ళు కావాలని అడిగారు. నేను ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉండిపోతే, మళ్ళా నన్ను దగ్గరకు రమ్మని పిలిచి మంచినీళ్ళిమ్మని అడిగారు. నేను ఇస్తానని చెబుతూండగానే నాకు మెలకువ వచ్చింది. ఆరోజునుండి ఊదీ కలిపిన మంచినీళ్ళను బాబా దగ్గర ఉంచి అందరం త్రాగుతున్నాము. కలలో బాబా చాలా భారీ విగ్రహంగా కనిపించారు. నేను ఆ ఆనందాన్ని ఇప్పటికీ తలచుకుంటూ ఉంటాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

బాబా దయతో సమస్య తీరింది
వైజాగ్ నుండి సాయిభక్తుడు సాయిచంద్ర తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ముందుగా సాయినాథునికి నా శతకోటి వందనాలు. సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు సాయిచంద్ర. బాబా నాపై ఎన్నో మహిమలు కురిపించారు. ఎప్పటినుండో నా అనుభవాలను "సాయి మహరాజ్ సన్నిధి" బ్లాగులో పంచుకుందామని అనుకుంటున్నాను. కానీ నా అహంకారం వల్లనో, నా అజ్ఞానం వల్లనో, ఇంతవరకు ఈ అవకాశం రాలేదు. ఈ బ్లాగుని నడిపిస్తున్న సాయి నాతో చాలాసార్లు చెప్పారు, “మీ అనుభవాలను మన బ్లాగ్ ద్వారా సాటి సాయిబంధువులందరితో పంచుకోండి” అని. కానీ నా అనుభవాలను పంచుకుందామనుకునేసరికి ఏదో ఒక కారణం (అహంకారం అనే అడ్డుగోడ) అడ్డు వచ్చి ఇంతవరకు మీతో పంచుకోలేకపోయాను. బాబా దయవలన ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది.
27-10-2019న నాకు కలిగిన సాయిమహిమను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు ఆఫీసు పనిలో ఒక సమస్య వచ్చింది. దీనివలన నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. బాబా దయ ఉంటే ఈ సమస్య తీరుతుందని నాకు తెలుసు. అందుకే ఆ సమస్యను బాబాకు విన్నవించుకున్నాను. “బాబా! ఈ సమస్య నుండి నువ్వు నన్ను గట్టెక్కిస్తే నాకు కలిగిన ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. ఇక అసలు విషయానికి వస్తాను.
నేను ఆదిత్య మల్టీ కేర్ హాస్పిటల్లో అకౌంటెంటుగా పనిచేస్తున్నాను. ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఏప్రిల్-2019లో డబ్బు చెల్లించాము. రెన్యువల్ అయిపోయినప్పటికీ అంతగా అవసరం లేనందున సర్టిఫికెట్స్ తీసుకోలేదు. కానీ అక్టోబరు నెలలో ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకోవడానికి దాని అవసరం వచ్చింది. ఎలాగైనా రెండురోజుల్లో పని అయిపోవాలని మా సార్ చెప్పారు. ఆ పనిమీద నేను GVMC ఆఫీసుకు వెళ్ళాను. “ట్రేడ్ లైసెన్స్ మీద సంతకం చేయాల్సిన ఆఫీసర్ ఇక్కడినుండి బదిలీ అయ్యారు, క్రొత్త ఆఫీసరు రావడానికి టైం పడుతుంది, అంత త్వరగా ఈ పని అవదు” అని చెప్పారు అక్కడి సిబ్బంది. నాకు ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు బాబా మీద భారం వేసి, “బాబా! ఎలాగైనా ఈ పని పూర్తయ్యేలా చూడు తండ్రీ! ఈ పని పూర్తయితే నీ మహిమని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను వేడుకున్నాను. అప్పుడు మొదలైంది సాయి మహిమ. కొద్దిసేపటి తరువాత మళ్ళీ GVMC కి రమ్మని పిలిస్తే వెళ్లాను. అప్పుడు ఒకాయన, “ఈ పని పూర్తి కావాలంటే కొద్దిగా డబ్బు (లంచం) ఖర్చవుతుంద”ని చెప్పారు. అప్పుడు నేను మా సార్‌కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. సార్ సరేనన్నారు, కానీ పని మాత్రం రెండురోజుల్లో అయిపోవాలని చెప్పారు. GVMC వాళ్ళు రెండు రోజుల్లో పని పూర్తికావటం కష్టమని చెప్పారు. నాకు మళ్ళీ ఆందోళన మొదలైంది. “ఎలాగైనా సరే పని పూర్తయ్యేటట్లు చూడమ”ని బాబాని వేడుకున్నాను. అంతే! బాబా మహిమ వల్ల రెండవరోజున సెలవులో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, దగ్గరుండి నా పని పూర్తిచేయించి వెళ్లిపోయారు. అదీ బాబా మహిమ అంటే! ఇటువంటి మహిమలు నాకు ఎన్నో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. ప్రతిక్షణం బాబా నన్ను కాపాడుతూ, నా వెంటే ఉండి నన్ను రక్షిస్తున్నారు. “బాబా! నీ పైన సంపూర్ణ విశ్వాసం కలిగేలా చూడు తండ్రీ! పాహిమాం గురుమహరాజ్, పాహిమాం!”

🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏
ReplyDeleteకళ్యాణ గుణ సంపూర్ణ కరుణా వరుణాలయ
ఆపన్నాశ్రిత మందార సాయి నామ నమోస్తుతే!!
🙏🌹🙏 సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు🙏🌹🙏
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
om sairam
ReplyDeleteom sairam
ReplyDeleteom sairam
hare hare krishna sai sai ram
Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః'
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhāvyā srēē
ఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete