ఈ భాగంలో అనుభవాలు:
- కోరుకోగానే కండరాలనొప్పిని తగ్గించిన బాబా
- అపారమైన సాయి దయ
కోరుకోగానే కండరాలనొప్పిని తగ్గించిన బాబా
సాయినాథ్ మహరాజ్ కీ జై! నా పేరు రవీంద్ర. నేను హైదరాబాదులో నివసిస్తున్నాను. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా కృతజ్ఞతలు. ప్రతిరోజూ నేను ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతుంటాను. బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
నాకు అప్పుడప్పుడు ఛాతీ దగ్గర కండరాలనొప్పి వస్తుండటంతో డాక్టరుని సంప్రదించాను. నన్ను పరీక్షించిన మీదట డాక్టరు సమస్యేమీ లేదని చెప్పారు. కానీ నాకు నొప్పి మాత్రం తగ్గడం లేదు. నాకు ఏమి చేయాలో తోచలేదు. ఇంక నేను బాబా పైనే భారం వేసి, నా కండరాలనొప్పిని ఎలాగైనా తగ్గించమని ప్రార్థించసాగాను. ఒకరోజు ఉదయాన్నే నొప్పి మరీ ఎక్కువైంది. అప్పుడు నేను, “బాబా! నేను మీ భక్తుడినే అయితే వెంటనే ఈ కండరాలనొప్పి తగ్గేలా చేయండి బాబా. ఈ నొప్పి తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని బాబాను ఆర్తిగా వేడుకున్నాను. బాబా అద్భుతం చేశారు. బాబాను ప్రార్థించిన పది నిమిషాల్లోనే నొప్పి తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
నేను ఎప్పుడూ బాబా నామాన్ని తలచుకుంటూ ఉంటాను. ఓం శ్రీ సాయినాథాయ నమః!, ఓం ఆరోగ్య క్షేమదాయ నమః! అన్న నామాలను కూడా స్మరిస్తూ ఉంటాను. మన సమస్యలు బాబాకు వదిలి మనం నిశ్చింతగా ఉంటే, సమయం వచ్చినపుడు బాబా మన సమస్యలు తీరుస్తారు. బాబాపై భక్తి విశ్వాసాలు ఉంచితే అన్నీ ఆయనే చూసుకుంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఇంకా కొన్ని ఆరోగ్యసమస్యలు, ఆర్ధికసమస్యలు ఉన్నాయి. “బాబా! వీలైనంత త్వరగా నా సమస్యలను తీర్చండి. మీరు తప్ప నా సమస్యలు తీర్చేవారెవరూ లేరు”.
జై సాయిరాం!
అపారమైన సాయి దయ
సాయిరాం ఫ్రెండ్స్! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా నమస్కారములు. నేను మే నెలలో నా అనుభవాలు కొన్ని మీతో పంచుకున్నాను. మళ్ళీ ఇంత తొందరగా నా అనుభవాలతో మీ ముందుకు వచ్చేలా ఆ సాయినాథుడు నాపై కురిపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే నా అనుభవంలోకి వస్తే, గత అనుభవంలో కరోనా మూలంగా నేను యు.ఎస్.ఎ. లో ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పాను. నేను మే ఒకటవ తేదీన ‘సాయి నవగురువార వ్రతం’ మొదలుపెట్టి, “బాబా! నన్ను తొందరగా ఇంటికి పంపించండి. నా భర్తకి, తల్లిదండ్రులందరికి దూరంగా ఉన్నాను. కరోనా మూలంగా నాకు చాలా భయంగా ఉంది. అందరినీ క్షేమంగా చూడండి బాబా. నన్ను తొందరగా ఇండియాకి తీసుకువెళ్ళండి” అని బాబాని ప్రార్థించాను. నేనలా యు.ఎస్.ఏ లో ఉండలేక ఏడుస్తుంటే మా అమ్మాయివాళ్ళు బాధపడతారని, చాటుగా బాబా వద్ద, "నీ దయ నాపై చూపు బాబా" అంటూ రోజూ ఏడ్చేదాన్ని. బాబా దయ చూపారు. జూన్ 22వ తేదీన ‘వందే భారత్ మిషన్’ ద్వారా బాబా నా విమాన ప్రయాణానికి టికెట్ బుక్ చేయించి సప్త సముద్రాల అవతల ఉన్న నన్ను నా ఇంటికి క్షేమగా చేర్చారు.
అసలు అద్భుతం ఏంటంటే, ఢిల్లీలో క్వారంటైన్‌లో పెడతారేమోనని నేను, మా పిల్లలు చాలా ఆందోళనచెందాము. అయితే బాబా దయ అపారమైనది. నేను ఢిల్లీ చేరుకున్నాక ఎయిర్‌పోర్టులో ఒక పోర్టర్‌తో మాట్లాడాను. అతని ముఖంలో నాకు బాబానే కనిపించారు. అతనికి తెలుగు రాకపోయినా ప్రతి విషయంలోనూ బాబా లాగా తన చేతిని అభయహస్తంలా పెట్టి చూపిస్తూ “మై హూ నా” అంటూ ప్రతిక్షణం నాకు అండగా నిలిచారు. అక్కడి కార్యాలయంలో మాట్లాడి నాకు హోం క్వారంటైన్ ఇప్పించారు. నేను అమెరికాలో జూన్ 22వ తేదీన విమానం ఎక్కితే, 24వ తేదీ తెల్లవారుఝాముకల్లా నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. బాబానే దగ్గరుండి నా ప్రయాణం ఏ ఇబ్బందీ లేకుండా సాగేలా చేశారు. పోర్టర్ రూపంలో నాపై ఎంతో దయచూపారు. ప్రస్తుతం, అంటే జులై 7వ తేదీ వరకు నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. బాబా దయవలన నా ఆరోగ్యం బాగానే ఉంది.
మా అబ్బాయి H1 వీసా 2020, జూలై 2వ తేదీన ఆమోదం పొందింది. ఆవిధంగా మళ్ళీ అతి తక్కువ వ్యవధిలోనే బాబా తమ అనుగ్రహం మాపై కురిపించారు. ఈవిధంగా మా జీవితంలో ప్రతిదీ బాబానే చూసుకుంటున్నారు.
ఓం సాయిరాం!
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

🙏🌹🙏 ఓం సాయిరాం🙏🌹🙏
ReplyDeleteమధురం మధురం శ్రీ సాయి లీలామృతం
సుమధురం సాయి దివ్య నామం!!
!!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
!!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
!!ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి!!
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteజై సాయిరాం!
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
ReplyDeleteSairam i want my son
ReplyDeletebe with him
Om sai ram
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః!🙏
ఓం ఆరోగ్య క్షేమదాయ నమః!🙏
Om Sri Sai Ram thaatha 🙏🙏🙏
ReplyDeleteBhāvyā srēē