‘సాయినివాస్’ అనేది సాయిభక్తులకు అత్యంత ప్రియమైన, పరమ పవిత్ర గ్రంథం "శ్రీసాయిసచ్చరిత్ర" రచింపబడిన గృహం. మరోవిధంగా చెప్పాలంటే శ్రీసాయిసచ్చరిత్ర పుట్టినిల్లు. శ్రీసాయినాథుని ఆదేశానుసారం శ్రీసాయిసచ్చరిత్రను రచించిన శ్రీ గోవింద్ రఘునాథ్ దభోల్కర్ నివసించిన గృహమే ఇది.
దభోల్కర్ శ్రీసాయినాథుని దర్శనం కోసం 1910వ సంవత్సరంలో మొట్టమొదటసారిగా శిరిడీ క్షేత్రాన్ని సందర్శించారు. మొట్టమొదటి సమావేశంలోనే అతడు బాబా పాదధూళిలో పొర్లి, పూర్తిగా శరణాగతి చెందాడు. సాయిబాబా అతనికి 'హేమాడ్‌పంత్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ఆ పేరుతోనే అతడు ప్రసిద్ధికెక్కాడు. ఆ సంవత్సరంలోనే అతడు శ్రీసాయి దివ్యలీలలను, సాయిభక్తుల అనుభవాలను సమాహారంగా కూర్చి “శ్రీసాయిసచ్చరిత్ర” వ్రాయాలని సంకల్పించి శ్రీసాయితో, "నేను మీ పాదాలవద్ద సేవకుడిని. అందువల్ల నన్ను నిరాశపరచవద్దు. ఈ శరీరంలో శ్వాస ఉన్నంతవరకు ఈ కార్యానికి నన్ను ఒక సాధనంగా చేసుకోండి" అని అభ్యర్థించాడు.
ఆ విషయం అలా ఉంచితే, హేమాడ్‌పంత్ శ్రీసాయి అనుమతితో 1911వ సంవత్సరంలో గృహనిర్మాణాన్ని ప్రారంభించాడు. శ్రీసాయి మార్గదర్శకత్వంలో ఆయన సూచనలననుసరించి ఆ గృహనిర్మాణం జరిగింది. "ఈ ఇల్లు నాకు చెందినది కాదు, ఆ సాయినాథునిదే" అన్నది అతని వినయపూర్వకమైన భావన. దాని నిర్మాణం 1913లో పూర్తయింది. ఆ భవనానికి ‘సాయినివాస్’ అని పేరు పెట్టారు. తరువాత 1916వ సంవత్సరంలో బాబా తమ జీవితచరిత్ర వ్రాయడానికి పూర్తి సమ్మతినిచ్చారు. దాంతో ఈ సాయినివాస్ లోనే అతడు తన రచనను సాగించాడు.
బాబా మహాసమాధి చెందేనాటికి అతడు కేవలం రెండు, మూడు అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు. మిగతా అధ్యాయాలన్నీ 1918 తరువాత వ్రాయబడ్డాయి. వాస్తవంగా చెప్పాలంటే 1922 నుండి అతడు రచన కొనసాగించాడు. అవి సాయిలీల పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడుతూవుండేవి. చివరికి అతడు మరణించిన తరువాత 1929వ సంవత్సరంలో సచ్చరిత్ర గ్రంథ ముద్రణ జరిగింది. 1930, నవంబరు 26న "శ్రీసాయిసచ్చరిత్ర" మరాఠీ మొదటి ఎడిషన్ శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(శిరిడీ) నుండి వెలువడింది. ఆ గ్రంథం 8'x5.5' పరిమాణంతో సుమారు 900 పేజీలను కలిగివుండి, ధర రూ. 3/- మాత్రమే ఉండేది. తరువాత ఈ పవిత్ర గ్రంథం ఇంగ్లీష్, తెలుగు, తమిళం, గుజరాతీ, సింధి, బెంగాలీ, కన్నడ, ఒరియా, నేపాలీ, పంజాబీ మరియు కొంకణి భాషలలోకి అనువదించబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే సచ్చరిత్ర రచన మొత్తం 'సాయినివాస్' లోనే జరిగింది. అందుచేతనే ఆ భవనం ఎంతగానో అనుగ్రహింపబడిందని చెప్పాలి.
ఆ ఇంట్లో ఒక మూలన ఉన్న చిన్న బల్ల(డెస్క్) మీద హేమాడ్‌పంత్ గంటల తరబడి శ్రీసాయిసచ్చరిత్ర వ్రాస్తూండేవారు. ఆ బల్లమీద ఉన్న ఒక పెద్ద సంచిలో అరుదైన బాబా ఫోటోలు అనేకం ఉండేవి. అవి శ్రీసాయిసచ్చరిత్ర మొదటి ముద్రణలో ముద్రించబడ్డాయి. బాబా తమ స్వహస్తాలతో అన్నాసాహెబ్ దభోల్కర్ కిచ్చిన నాణేలు, మరికొన్ని ఇతర వస్తువులను జ్ఞాపక చిహ్నాలుగా ఆ ఇంటిలో ఒక చోట చిన్న టేబుల్ మీద పెట్టుకున్నారు.
మరో ముఖ్యవిషయం - శ్రీసాయిసచ్చరిత్ర 40, 41వ అధ్యాయాలలో 'హోలీ నాటి విందు' గురించిన లీల చక్కగా వివరించి ఉన్న సంగతి అందరికీ విదితమే. అందులో హేమాడ్‌పంత్‌కి బాబా కలలో దర్శనమివ్వడం, తరువాత తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా చిత్రపటం రూపంలో భోజనవేళకు బాబా రావడం గురించి చెప్పబడింది. అలా చిత్రపటం రూపంలో బాబా ఈ సాయినివాస్ లోనే అడుగుపెట్టారు. ఇప్పటికీ ఆ పటం వాళ్ల పూజగదిలో గోడకు చాలా జాగ్రత్తగా అమర్చబడి పూజలందుకుంటోంది. గతంలో ఈ చిత్రపటం కేవలం హోలీ పండుగరోజు మాత్రమే భక్తుల దర్శనంకోసం అందుబాటులో ఉండేది. తరువాత కాలంలో భక్తుల కోరిక మేరకు మీనావాహిని (హేమాడ్‌పంత్ మనవడి భార్య) ఆ చిత్రపటాన్ని ప్రతిరోజూ భక్తుల దర్శనం కోసం అనుమతించారు. సద్గురు శ్రీఅనిరుద్ధ మార్గదర్శకత్వంలో ఆ చిత్రపటంలో బాబా పోలికలతో ఉన్న ఒక విగ్రహం తయారుచేసి ప్రతిష్ఠించారు. ఇది కూడా భక్తుల దర్శనం కోసం ఉంచారు. భక్తులు ఈ సాయి విగ్రహాన్ని దర్శించినప్పుడు భక్తితో 'ఓం కృపాసింధు శ్రీసాయినాథాయ నమః' అని జపం చేస్తూ అపారమైన మానసికశాంతిని అనుభవిస్తారు. బాబా వచ్చిన హోలీ పండుగరోజుని నేటికీ సాయినివాస్ లో భక్తిశ్రద్ధలతో పండుగలా జరుపుకుంటారు.
2017లో శతాబ్ది మహోత్సవం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఆ ఇల్లు ఆధ్యాత్మికశక్తితో నిండివున్న ఒక పవిత్ర క్షేత్రం. అతని వారసులు ఆ పవిత్రతను సంరక్షిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం, హేమాడ్‌పంత్ మనవడైన శ్రీగోవింద్ గజానన్ దభోల్కర్ (అప్పా దభోల్కర్) కుటుంబం ఆ భవనంలో నివాసముంటున్నారు. సాయినాథుని ప్రేమ, దయ, ఆశీస్సులతో నిండిన ఆ పవిత్రస్థలాన్ని సందర్శించే అవకాశం అందరికీ అందుబాటులో ఉంది. సాయి నివాస్ ముంబైలోని బాంద్రాలో, బాంద్రా రైల్వేస్టేషన్ నుండి కేవలం 10 నిమిషాల నడక దూరంలో ఉంది.
దభోల్కర్ శ్రీసాయినాథుని దర్శనం కోసం 1910వ సంవత్సరంలో మొట్టమొదటసారిగా శిరిడీ క్షేత్రాన్ని సందర్శించారు. మొట్టమొదటి సమావేశంలోనే అతడు బాబా పాదధూళిలో పొర్లి, పూర్తిగా శరణాగతి చెందాడు. సాయిబాబా అతనికి 'హేమాడ్‌పంత్’ అనే బిరుదును ప్రదానం చేశారు. ఆ పేరుతోనే అతడు ప్రసిద్ధికెక్కాడు. ఆ సంవత్సరంలోనే అతడు శ్రీసాయి దివ్యలీలలను, సాయిభక్తుల అనుభవాలను సమాహారంగా కూర్చి “శ్రీసాయిసచ్చరిత్ర” వ్రాయాలని సంకల్పించి శ్రీసాయితో, "నేను మీ పాదాలవద్ద సేవకుడిని. అందువల్ల నన్ను నిరాశపరచవద్దు. ఈ శరీరంలో శ్వాస ఉన్నంతవరకు ఈ కార్యానికి నన్ను ఒక సాధనంగా చేసుకోండి" అని అభ్యర్థించాడు.
ఆ విషయం అలా ఉంచితే, హేమాడ్‌పంత్ శ్రీసాయి అనుమతితో 1911వ సంవత్సరంలో గృహనిర్మాణాన్ని ప్రారంభించాడు. శ్రీసాయి మార్గదర్శకత్వంలో ఆయన సూచనలననుసరించి ఆ గృహనిర్మాణం జరిగింది. "ఈ ఇల్లు నాకు చెందినది కాదు, ఆ సాయినాథునిదే" అన్నది అతని వినయపూర్వకమైన భావన. దాని నిర్మాణం 1913లో పూర్తయింది. ఆ భవనానికి ‘సాయినివాస్’ అని పేరు పెట్టారు. తరువాత 1916వ సంవత్సరంలో బాబా తమ జీవితచరిత్ర వ్రాయడానికి పూర్తి సమ్మతినిచ్చారు. దాంతో ఈ సాయినివాస్ లోనే అతడు తన రచనను సాగించాడు.
బాబా మహాసమాధి చెందేనాటికి అతడు కేవలం రెండు, మూడు అధ్యాయాలు మాత్రమే వ్రాశాడు. మిగతా అధ్యాయాలన్నీ 1918 తరువాత వ్రాయబడ్డాయి. వాస్తవంగా చెప్పాలంటే 1922 నుండి అతడు రచన కొనసాగించాడు. అవి సాయిలీల పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడుతూవుండేవి. చివరికి అతడు మరణించిన తరువాత 1929వ సంవత్సరంలో సచ్చరిత్ర గ్రంథ ముద్రణ జరిగింది. 1930, నవంబరు 26న "శ్రీసాయిసచ్చరిత్ర" మరాఠీ మొదటి ఎడిషన్ శ్రీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(శిరిడీ) నుండి వెలువడింది. ఆ గ్రంథం 8'x5.5' పరిమాణంతో సుమారు 900 పేజీలను కలిగివుండి, ధర రూ. 3/- మాత్రమే ఉండేది. తరువాత ఈ పవిత్ర గ్రంథం ఇంగ్లీష్, తెలుగు, తమిళం, గుజరాతీ, సింధి, బెంగాలీ, కన్నడ, ఒరియా, నేపాలీ, పంజాబీ మరియు కొంకణి భాషలలోకి అనువదించబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే సచ్చరిత్ర రచన మొత్తం 'సాయినివాస్' లోనే జరిగింది. అందుచేతనే ఆ భవనం ఎంతగానో అనుగ్రహింపబడిందని చెప్పాలి.
ఆ ఇంట్లో ఒక మూలన ఉన్న చిన్న బల్ల(డెస్క్) మీద హేమాడ్‌పంత్ గంటల తరబడి శ్రీసాయిసచ్చరిత్ర వ్రాస్తూండేవారు. ఆ బల్లమీద ఉన్న ఒక పెద్ద సంచిలో అరుదైన బాబా ఫోటోలు అనేకం ఉండేవి. అవి శ్రీసాయిసచ్చరిత్ర మొదటి ముద్రణలో ముద్రించబడ్డాయి. బాబా తమ స్వహస్తాలతో అన్నాసాహెబ్ దభోల్కర్ కిచ్చిన నాణేలు, మరికొన్ని ఇతర వస్తువులను జ్ఞాపక చిహ్నాలుగా ఆ ఇంటిలో ఒక చోట చిన్న టేబుల్ మీద పెట్టుకున్నారు.
![]() |
![]() |
హోలీ పండుగరోజు వచ్చిన బాబా చిత్రపటం |
'సాయినివాస్' చిరునామా: -
సాయినివాస్,
సెయింట్ మార్టిన్ రోడ్,
బాంద్రా (వెస్ట్), ముంబై 400 053.
దర్శన సమయాలు:
ప్రతిరోజు (గురువారం మినహా): ఉదయం 8.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు, మరియు సాయంత్రం 4.30 నుండి 10.00 వరకు.
గురువారాలు: ఉదయం 8.00 నుండి సాయంత్రం 4.30 వరకు.
సమాప్తం.
http://www.saiamrithadhara.com/mahabhakthas/hemadpanth.html
Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri

ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ReplyDeleteఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha