ఈ భాగంలో అనుభవాలు:
- బాబా తన పిచ్చుకను తన సేవకు(సన్నిధికి) చేర్చుకున్న విధానం
- తెలియకుండానే అందిన బాబా ఆశీస్సులు
బాబా తన పిచ్చుకను తన సేవకు(సన్నిధికి) చేర్చుకున్న విధానం
సాయిభక్తుడు సాంబశివరావు గారు మరో అనుభవాన్నిలా మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులందరికీ ఆ సాయినాథుడు తన కృపాకటాక్షాలు ఎల్లవేళలా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై సాయిరాం! ఈ 'సాయిమహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహించే సాయికి నా నమస్కారాలు.
"నావాడు ఎక్కడవున్నా (సప్తసముద్రాల ఆవల వున్నా) నేను పిచ్చుక కాలికి దారంకట్టి లాగినట్లు నా దగ్గరకు లాగుతాను" అన్న బాబా వాక్యం అక్షరసత్యం. అదే నా విషయంలో జరిగింది. ఇప్పుడు ఆ అనుభవాన్నే నేను మీతో పంచుకుంటున్నాను.
అది నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు, అంటే నాకు 13 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన. మా గ్రామంలో అప్పటివరకు బాబా మందిరం లేదు. అప్పుడే ఎవరో మాకు తెలిసినవాళ్ళు మా ఊరి చెరువుగట్టుమీద మన ఇంట్లో వుండే చిన్నపాటి మందిరంలాంటి మందిరాన్ని మట్టి, సిమెంటుతో కలిపి ఏర్పాటు చేశారు. అందులో చిన్న బాబా ఫోటో పెట్టి భజనలు చేస్తున్నారు. నిజానికి ఆ విషయం నాకు తెలియదు. ఒకరోజు అసంకల్పితంగా (బహుశా బాబా వారి సంకల్పమే అయివుండవచ్చు) నేను ఆ భజన జరిగే ప్రదేశానికి వెళ్ళాను. ఆ చిన్ని బాబా మందిరం చాలా బాగుంది. భజన చాలా చక్కగా చేస్తున్నారు. ప్రతి గురువారం అక్కడికి వచ్చి బాబా భజనలో పాల్గొనాలని ఆరోజే నేను నిర్ణయించుకొన్నాను. భజన సభ్యులు కూడా చక్కగా వారం వారం వచ్చి భజనలో పాల్గొనమని నన్ను ప్రోత్సహించారు. అదేమి చిత్రమో గానీ, బాబా సంకల్పంతో నేను మందిరానికి వెళ్ళడం మొదలుపెట్టిన 3, 4 నెలలకు మా ఊరిలో పెద్ద బాబా మందిర నిర్మాణం జరిగింది. బాబా పూజకు పూజారిని కూడా నియమించారు. నిత్యం బాబాకు అభిషేకం, అర్చనలు జరుగుతుండేవి. రాత్రిపూట ఒక గంటసేపు భజన చేసేవాళ్ళం. గురువారంరోజు ప్రత్యేకంగా అభిషేకం, అర్చనలు, భజనలు వుండేవి. ఎంతో ఉత్సాహంగా మా భజన సమాజం సభ్యులందరం అన్ని కార్యక్రమాలలో పాలుపంచుకునేవాళ్ళం. పర్వదినాలు, పండుగలు, గురుపూర్ణిమ లాంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఏకాహం, నామసప్తాహం చేసేవాళ్ళం. ప్రసాదాల తయారీ, వితరణ కూడా మేమందరం కలిసి చేసేవాళ్ళం. ఎంతో సంతోషంగా ఉండేది. అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. అందరిలో నేనే చాలా చిన్నవాడిని, అందువల్ల నామీద అందరికీ ఎంతో ప్రేమ ఉండేది. ప్రతి ఉదయం బాబాకు పూజ చేసే సమయంలో నేను అక్కడే వుండి సేవ చేసేవాడిని. నాకున్న శ్రద్ధను గమనించిన పూజారిగారు, "ఇంత చిన్న వయసులో నీకు భక్తి వుండటమే గొప్ప విషయం. పైగా రోజూ క్రమంతప్పకుండా బాబా పూజకు వస్తున్నావు. చాలా సంతోషం. బాబాకు పూజ ఎలా చేయాలో నేర్పుతాను, నేర్చుకో!" అని చెప్పి, బాబా అష్టోత్తర శతనామావళి, సాయిబాబా చాలీసా, మంగళహారతి అన్నీ నేర్పించారు. అలా అక్కడ 3 సంవత్సరాలు నిర్విరామంగా, నిరాటంకంగా బాబాతో నా ప్రయాణం సాగింది. అయితే 10వ తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో ఇంట్లోవాళ్లు నా బాబా సేవకు కొంత అభ్యంతరం చెప్పారు. నేను మాత్రం బాబా వున్నారు, ఆయన చూసుకుంటారని ఊరుకున్నాను. చివరికి వాళ్ళంతా, “చదువు వెనకపడుతుంది, 10వ తరగతి ఎంతో ముఖ్యమైనది, కాబట్టి చదువుపై దృష్టి పెట్టమని, బాబాపై శ్రద్ధ తగ్గించమ”ని చెప్పి నన్ను బాబా సేవకు వెళ్ళనివ్వకుండా కట్టడి చేశారు. అప్పుడు నేను నా మనసులో ఇలా అనుకున్నాను(కాదు, కాదు, బహుశా బాబానే సంకల్పించి నా మనసులో అలా భావన చేయించి వుంటారు): "వీళ్ళు మహా అయితే నన్ను బాబా గుడికి వెళ్ళడం మాన్పించగలరేమో కానీ నా మనసులో గూడుకట్టుకుని ఉన్న బాబాపై ప్రేమను, భక్తిని తప్పించలేరుగా" అని. బాబా సంకల్పం మార్చగల శక్తి ఎవరికి ఉంది?
నేను ఎక్కడికి వెళ్లినా ఆయన నా వెంట వుంటున్నారు. ముందుగా నిరూపణ, నిదర్శనం ఇచ్చి, ఆ తరువాత నన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలనుకుంటే అక్కడకు తీసుకువెళ్ళేవారు. ఉదాహరణకు, నాకు ఉద్యోగం మార్చాలంటే బాబావారే స్వప్నంలో సూచించి, అక్కడకు పంపడమే కాదు, నేను ఎక్కడ ఉండాలో ఆ ప్రాంతంలో ఉండే బాబా మందిరాన్ని ముందుగా స్వప్నంలో దర్శనం చేయించి ఆ తరువాత ఆ మందిరానికి దగ్గరలో ఉండే ప్రాంతంలో నన్ను వుంచి సేవ చేయించుకుంటున్నారు. నన్ను ఇంతగా కనిపెట్టుకొనివుంటూ, తమకు సేవ చేసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తూ, నిరంతరం రక్షణనిచ్ఛే బాబాకి ఏమిచ్చి నేను ఋణం తీర్చుకోగలను? నా సర్వస్వాన్నీ ఆయన పాదారవిందాలవద్ద అర్పించి, ఆయన పాదసేవలో తరించడం తప్ప. అంతకన్నా నాకేమి కావాలి? "బాబా! మీకు వేనవేల ధన్యవాదాలు తండ్రీ! బహుశా ఇది చాలా చిన్న మాటేమో తండ్రీ! మీ పాదారవిందాలపై భక్తి విశ్వాసాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సడలనివ్వక నిరంతరం నాకు, నా కుటుంబసభ్యులకు మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రీ! నేను, నా కుటుంబం మీకు ఎంతగానో ఋణపడివున్నాము తండ్రీ! సదా మీ సేవ చేసుకోవడం తప్ప నాకు వేరే దారి తెలియదు తండ్రీ!"
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందర్పణమస్తు!

తెలియకుండానే అందిన బాబా ఆశీస్సులు
సాయిభక్తుడు రవి తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! శ్రీసాయి పాదాల క్రింద ఒక ధూళికణాన్నైన నేను ఒక ఇంటి పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాను. ఒకరోజు ఉదయం 7:30 గంటల సమయంలో నేను మంచంమీద నిద్రపోతున్నాను. హఠాత్తుగా ఇంటి పైకప్పు నుండి కొంతభాగం క్రింద పడింది. ఆ శబ్దానికి నేను తుళ్ళిపడి కళ్ళు తెరచి చూస్తే శ్లాబ్ ముక్కలు ముక్కలుగా విరిగిపడివుంది. నేను నిద్రిస్తున్న మంచంపైన, పక్కనే ఉన్న కుర్చీపైన ఆ ముక్కలు పడివున్నాయి. అవి పడిన తీవ్రతకు కుర్చీ ముక్కలైపోయింది. ఆశ్చర్యమేమిటంటే, నా మంచంమీద కూడా అవి పడ్డప్పటికీ నాకు చిన్న గాయం కూడా కాలేదు. మరో ముఖ్య విషయం, విరిగిన కుర్చీమీదే ఉన్న నా కళ్ళజోడు ఏమాత్రం చెక్కుచెదరలేదు. వాటికి ఏదైనా జరిగివుంటే నాకు పెద్ద తలనొప్పి అయ్యేది. పైకప్పు పడిన శబ్దానికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి, నాకు ఏమీ జరగకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలిసిన మా బంధువులు కూడా అవాక్కయ్యారు. ఇంత పెద్ద విషాద సంఘటన నుండి నన్ను ఎవరు రక్షించారు? మన సాయితండ్రేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అనుకుంటాను. అయితే ఆయనే నన్ను రక్షించారని గ్రహించడానికి నాకు కాస్త సమయం పట్టింది. చల్లని తండ్రి తన బిడ్డలను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటారనడానికి నిదర్శనమే ఈ సంఘటన. "బాబా! చాలా చాలా ధన్యవాదాలు. మీ దివ్య చరణాలకు నా ప్రణామములు".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
om sai ram om sai ram today leelas are good.
ReplyDeleteAnantakoti brahmandanayaka rajadiraja Yogi Raja parahbramha Sri sachchidananda sadguru sainathmaharajuki jai om Sri sainathmaharajuki jai
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDelete