సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 214వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. బాబా అనుగ్రహంతో దొరికిన ఇంటిస్థలం
  2. ఊదీ చేసిన అద్భుతం

బాబా అనుగ్రహంతో దొరికిన ఇంటిస్థలం

సాయిభక్తురాలు పద్మజ బాబా తమకు ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

సాయిభక్తులందరికీ ఓం సాయిరాం! నా పేరు పద్మజ. మేము ఇండోర్‌లో నివాసముంటున్నాము. నేను సాయిబాబా భక్తురాలిని. 2012 నుండి సాయిబాబా యందు నా భక్తి, విశ్వాసాలు వృద్ధి చెందాయి. ప్రతి గురువారం నేను బాబాకి పూజలు చేస్తుంటాను. ప్రతి విషయంలో బాబా నాకు చాలా సహాయం అందిస్తున్నారు. బాబా నా జీవితంలో ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. "బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు". కృపతో బాబా నాకు చాలా అనుభవాలు ఇచ్చారు. వాటినుండి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. "బాబా! ఈ అనుభవం వ్రాయడంలో నాకు సహాయం చేయండి. ఏమైనా తప్పులు వస్తే క్షమించండి".

రెండు సంవత్సరాలుగా మేము ఇండోర్‌లో ఇంటిస్థలం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. దాంతో మేము చాలా దిగులుపడుతూ ఉండేవాళ్ళం. ఆ కష్టంనుంచి గట్టెక్కడానికి నేను 11 వారాల సాయిబాబా వ్రతం మొదలుపెట్టి, "బాబా! అంతా సవ్యంగా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. తరువాత బాబా అనుగ్రహంతో అతి తక్కువ ఇంట్రెస్టుతో లోన్ దొరికింది. మంచి ఏరియాలో తూర్పు అభిముఖంగా ఉండే స్థలం కూడా దొరికింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇక ఇంటి నిర్మాణమే మిగిలింది. అందుకు మీ అనుగ్రహం కావాలి బాబా!". బాబా అనుగ్రహంతో ఇంటి నిర్మాణం పూర్తయితే ఆ సంతోషాన్ని కూడా మీతో పంచుకుంటాను. బాబాకు ఏదీ అసాధ్యం కాదు. పూర్తి విశ్వాసంతో ఆయనపై మీ భారాన్ని వేసి ఆయనకు శరణాగతి చెందండి. అంతా ఆయన చూసుకుంటారు.

ఊదీ చేసిన అద్భుతం

USA నుండి ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను మన తండ్రి సాయికి సాధారణమైన భక్తుడిని. నా దైనందిన జీవితంలో బాబా చేసిన అద్భుతాలను చాలా చూశాను. వాటిలో ఒక అద్భుతమైన ఊదీ మహిమను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను యాభై ఏళ్ళకు పైగా ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాను. ఇరవై ఏళ్ళ వయస్సులో అది పేరియార్టెరిటిస్ నోడోసా (Periarteritis Nodosa)గా నిర్ధారించబడింది. అది వచ్చినప్పుడు నేను చాలా చాలా బాధపడాల్సి వచ్చేది. తీవ్రమైన నొప్పి కారణంగా నడవలేను, నిద్రపోలేను. ఆ మహమ్మారి వ్యాధి తరచూ వచ్చి నన్ను నరకయాతనకు గురిచేస్తుండేది. అది వచ్చినప్పుడు 'స్కిన్ గ్రాఫ్టింగ్' అనే చికిత్స చేస్తారు. నేను యు.ఎస్ వచ్చాక మందులతోపాటు ఆ చికిత్స చాలాసార్లు చేశారు. అయినా అప్పుడప్పుడు నన్ను పలకరిస్తూ ఉంటుందది. మూడునెలల క్రితం మళ్ళీ వచ్చింది. దానివలన పెద్ద పుండై నేను చాలా బాధపడ్డాను. కానీ ఈసారి నేను, "బాబా! నేను ఏ హాస్పిటల్ కీ వెళ్ళను, ఏ డాక్టరునీ సంప్రదించను. మీరే నా డాక్టర్. మీ ఊదీయే నాకు ఔషధం. మీరే నా రక్షకుడు, సంరక్షకుడు. నాకు మీయందు పూర్తి విశ్వాసముంది. నేను మీకు పూర్తిగా శరణుజొచ్చుతున్నాను. మీ దివ్య పాదాలకు పూర్తిగా లొంగిపోతున్నాను" అని బాబాను ప్రార్థించి, బాబా ఊదీని నీళ్లలో కలుపుకుని త్రాగడం మొదలుపెట్టాను. స్తవనమంజరి, సాయిసచ్చరిత్ర పారాయణ చేయడం ప్రారంభించాను. నేను ఏడు సప్తాహాలు పారాయణ పూర్తి చేశాను. ఇప్పటికీ స్తవనమంజరి చదువుతున్నాను. నా గురువు, నా తండ్రి అయిన బాబా ఆ పుండుని అద్భుతంగా నయం చేశారు. నాకు పూర్తిగా నయమైంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీ ఊదీ నిజమైన ఔషధం అనడంలో ఏ సందేహం లేదు". భక్తులందరూ శ్రద్ధ, సబూరీ కలిగి ఉండి, తద్వారా బాబా చేసే అద్భుతాలను చూడాలని నేను కోరుకుంటున్నాను. నా అనుభవాన్ని పంచుకోవడానికి అవకాశమిచ్చిన బాబాకు, బ్లాగు బృందానికి నా కృతజ్ఞతలు.

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి. 

3 comments:

  1. Today udi Mahima epsode is very nice.baba can cure any diseases.he is doctor of doctors.i believe in him.i am also having same Leela

    ReplyDelete
  2. Omsai sri sai Jaya Jaya sai omsainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo