ఈ భాగంలో అనుభవాలు:
- ఫోనులో వచ్చిన సమస్యను తొలగించిన బాబా
- నా దయగల బాబా
ఫోనులో వచ్చిన సమస్యను తొలగించిన బాబా
ఓం సాయిరామ్! ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు, ఈ అద్భుతమైన బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదువుతున్నాను. తోటిభక్తుల అనుభవాల ద్వారా బాబా మీద నాకున్న నమ్మకం దృఢమవుతోంది.
నా పేరు కుమారి. నేను విశాఖపట్నం నివాసిని. బాబా కృపవలన నేను మహాపరాయణ గ్రూపులో సభ్యురాలిని. ఇటీవల నాకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 2019, అక్టోబరు 30న నా ఫోనులో సమస్య వచ్చి రిపేర్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ఫోన్ నా కాబోయే భర్త నాకు బహుమతిగా ఇచ్చారు. అదంటే నాకు చాలా ఇష్టం. అందువలన నేను చాలా బాధపడ్డాను. ఫోన్ తీసుకెళ్లి రిపేర్ సెంటరులో చూపించాను. వాళ్ళు, "ఫోనులో సాఫ్ట్‌వేర్ పోయింది. ఈ సాఫ్ట్‌వేర్ ఇప్పుడు మావద్ద లేదు. ఎందుకంటే ఈ ఫోన్ ఓల్డ్ మోడల్. కాబట్టి రిపేర్ చేయడం కుదరదు" అని చెప్పారు. ఏమి చేయాలో తెలియనిస్థితిలో నేను బాబాతో, "బాబా! దయచేసి నా ఫోన్ రిపేర్ అయ్యేలా చేయండి" అని చెప్పుకున్నాను. మరునాడు మళ్ళీ నేను ఫోన్ రిపేర్ షాపుకి వెళ్లి, 'ఫోన్ రిపేర్ చేయమ'ని అడిగాను. షాప్ వాళ్ళు, "ఫోన్ రిపేర్ చేస్తే, ఫోనులోని డేటా పోతుంది" అని అన్నారు. ఏం చేయాలో నాకు తెలియక, "సరే, రిపేర్ చేయండి" అని చెప్పాను. కానీ ఫోనులోని డేటా బ్యాక్‌అప్ నావద్ద లేనందున బాబాని తలచుకుని, "బాబా! ఫోన్ రిపేరై ఫోనులోని డేటా పోకుండా ఉంటే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. రెండురోజుల తర్వాత నేను ఆ షాపుకి వెళితే, షాపతను నాతో, "ఫోన్ రిపేర్ అయింది. ఫోనులో వున్న డేటా ఏమీ పోలేదు, అలానే ఉంది" అని చెప్పారు. ఆ మాట వింటూనే నా ఆనందానికి అవధుల్లేవు. ఆ ఆనందంలో నేను మనసారా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. "బాబా! మీరు లేకుండా నేను లేను. మీ చల్లని ఆశీస్సులు సదా మాపై కురిపించండి". మరికొన్ని అనుభవాలను ఈ బ్లాగు ద్వారా మరోసారి పంచుకుంటాను. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి.
సాయిమహరాజ్ కీ జై!

నా దయగల బాబా
బెంగుళూరు నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నా సాయి కుటుంబానికి సాయిరామ్! నేను బాబాకు చిన్న కూతురిని. ఇటీవల నాకు జరిగిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. మా నాన్నగారు నాడీ సంబంధిత రోగి. ఇటీవల ఒకసారి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారు. కనీసం ఏమీ తినలేని, త్రాగలేని పరిస్థితి. పైగా అధికజ్వరం కూడా. అదే సమయంలో మా అబ్బాయి పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అటువంటి స్థితిలో నేను 'పరిస్థితిని చక్కబరచమ'ని బాబాను వేడుకున్నాను. బాబా కరుణించారు, నాన్న ఆరోగ్యం కుదుటపడింది. అప్పటినుండి మా అబ్బాయి పరీక్షలు ముగిసేవరకు నాన్నకు ఆరోగ్యం బాగానే ఉంది. తరువాత ఒకరోజు ఆయనకు ఊపిరాడకపోవడంతో వెంటనే ఆయనను ఐ.సి.యు.లో చేర్పించాల్సి వచ్చింది. "బాబా! దయచేసి పరిస్థితిని జాగ్రత్తగా చూసుకోండి. బాధాకరమైన ఈ పరిస్థితిని చూడటం, అనుభవించడం ఎంత కష్టమో మీకు తెలుసు. మీరు తప్ప మాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. దయచేసి నాన్నను జాగ్రత్తగా చూసుకోండి. ప్రణామాలు బాబా".
Sri Sainathaya namaha om Sri sairam
ReplyDelete