ఈ భాగంలో అనుభవాలు:
- నా ప్రార్థనలకు సాయి కురిపిస్తున్న అనుగ్రహం
- ఋణాన్ని మంజూరు చేసిన బాబా
నా ప్రార్థనలకు సాయి కురిపిస్తున్న అనుగ్రహం
తోటి సాయిబంధువులకు నా ప్రణామములు. నా పేరు వల్లి. నేను విశాఖపట్నం నివాసిని. నేను సాయిభక్తురాలిని. ఆయన నాకెన్నో అనుభవాలిచ్చారు. సాయి దయవల్ల నేను మహాపారాయణలో చేరి, పారాయణ చేస్తున్నాను. ఈ సమయంలో సాయి నాకెన్నో అనుభవాలను ఇస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది, మా పాప తన పరీక్షల్లో క్లాస్ ఫస్ట్ వచ్చేలా ఆశీర్వదించారు సాయి. నిజానికి పరీక్ష సిలబస్ చాలా కఠినమైనది. టీచర్స్ ఆ సిలబస్ చాలా ఆలస్యంగా పూర్తిచేసి, పిల్లలు చదువుకోవడానికి చాలా తక్కువ సమయం ఇచ్చారు. దాంతో నేను ఆందోళనపడి సాయిని, "బాబా! ఎప్పటిలాగానే మా పాప క్లాస్ ఫస్ట్ వచ్చేలా ఆశీర్వదించండి" అని వేడుకున్నాను. సాయి నా ప్రార్థన విన్నారు. మా పాప 96.3% తో క్లాసు టాపర్‌గా నిలిచేటట్లు చేశారు. "థాంక్యూ సో మచ్ బాబా! ఇలాగే మా బిడ్డపై మీ ప్రేమ, ఆప్యాయతలు సదా కురిపిస్తూ, జీవితంలో తను ఉన్నత శిఖరాలకు ఎదిగేటట్లు ఆశీర్వదించండి".
ఐదు సంవత్సరాల క్రిందట అంటే 2014లో నాకు పన్నునొప్పి చాలా తీవ్రంగా వచ్చింది. నేను చాలా మందులు వాడాను. అయినా ఆ నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్ సర్జరీ చేయాలని అన్నారు. దాంతో నేను, "సాయీ! మీరే అందరికీ వైద్యులు. ఈ ప్రపంచంలో మీకన్నా గొప్ప వైద్యులెవ్వరూ లేరు. దయచేసి నా పంటినొప్పి తగ్గేలా చేయండి" అని వేడుకున్నాను. సాయి నా ప్రార్థన ఆలకించి మందులు, సర్జరీ ఏదీ అవసరం లేకుండా నా పంటినొప్పిని తగ్గించారు. తర్వాత ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ పంటినొప్పి సమస్య బయటపడలేదు. కానీ, 2019, నవంబర్ నెల మొదటి వారంలో మళ్లీ పంటినొప్పి వచ్చింది. మావారు, "డాక్టర్ దగ్గరకి వెళ్దాం" అన్నారు. నేను ఆయనతో, "ఏ డాక్టరూ వద్దు. సాయే గొప్ప వైద్యులు. ఆయనకు మించిన వైద్యులు లేరు. ఊదీకి మించిన ఔషధం లేదు" అని అన్నాను. తరువాత నేను పడుకునేముందు కొంచెం ఊదీ తీసుకొని నొప్పి ఉన్న పన్నుపై పెట్టుకుని పడుకున్నాను. సాయి అద్భుతం చేశారు. తెల్లవారి లేచేసరికి నా పంటి సమస్య పూర్తిగా నయమైంది. ఎప్పటిలాగే నేను నా పనులు చేసుకోగలిగాను. "థాంక్యూ సో మచ్ బాబా! మా ప్రతి సమస్యను మీరే తీరుస్తున్నారు. ఇలాగే మా కుటుంబంపై మీ ఆశీస్సులు కురిపించండి. ఎప్పుడూ మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తూ జీవితగమ్యాన్ని చేరుకునేలా ఆశీర్వదించండి".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

ఋణాన్ని మంజూరు చేసిన బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. ఒకప్పుడు నాకు క్లిష్టమైన పరిస్థితి ఎదురై డబ్బు చాలా అవసరమైంది. నేను అప్పు తీసుకోవడానికి నిశ్చయించుకుని ఎంతోమంది ఋణదాతలను సంప్రదించాను. కానీ, ఋణం పొందలేకపోయాను. నా ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనమయ్యాయి. ఏ దారీ కనబడక నేను బాబాను ఆశ్రయించి, "నా ఈ పరిస్థితినుండి నన్ను జాగ్రత్తగా బయటపడేయండి" అని ఆయనను ప్రార్థించాను. అప్పుడొక ఋణదాత నా ఆదాయ పత్రాలు ఏవీ అడగకుండానే నాకు ఋణం ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. వెంటనే నేను KYC పత్రాలను సమర్పించాను. కానీ వాటిని సమర్పించిన తరువాత చాలా రోజుల వరకు ఋణదాతనుండి ఏ స్పందనా రాలేదు. నాకెవ్వరూ డబ్బు ఇవ్వడానికి సిద్ధంగా లేని సమయంలో సాయి అనుగ్రహం వలన మాత్రమే ఆ ఋణదాత నాకు డబ్బు ఇవ్వడానికి ముందుకొచ్చాడని నాకు తెలుసు. కాబట్టి నేను మళ్ళీ బాబానే ప్రార్థించాను. ఆయన ముందు నిలబడి, "బాబా! నాకు ఋణం మంజూరయ్యేలా చూడండి" అని కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇంకా, "డబ్బు అందిన వెంటనే నా అనుభవాన్ని తోటి భక్తులతో పంచుకుంటాన"ని నేను సాయికి మాట ఇచ్చాను. నా ప్రియమైన సాయి నా మొర ఆలకించారు. తరువాత వచ్చిన గురువారంనాడు నా బ్యాంక్ ఖాతాలో డబ్బు పడింది. అలాగే చికెన్‌పాక్స్ నుండి నా కొడుకుకి ఉపశమనం కలిగించారు బాబా. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! కష్టసమయంలో నన్ను ఆదుకున్నారు. మా అందరినీ ఎల్లప్పుడూ ఆశీర్వదించండి".
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!
Anantakoti brahmandanayaka rajadiraja Yogi Raja parahbramha Sri sachchidananda sadguru sainathmaharajuki jai om Sacramento please bless me baba
ReplyDeleteAkilandakoti brahmandanayaka rajadiraja Yogi Raja parahbramha Sri sachchidananda sadguru sainathmaharajuki jai omsairam please bless me baba
ReplyDelete