సాయి వచనం:-
'నీవు అర్పించిన నివేదనలన్నీ నాకే చెందుతున్నాయి.'

'ఏ దైవాన్ని ఆశ్రయించినా ఆ దైవాన్నే అనన్యంగా ఆరాధించాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 234వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. నెలసరి సమస్యకు కలలో బాబా చేసిన చికిత్స
  2. బాబా ఆశీర్వాదాలు

నెలసరి సమస్యకు కలలో బాబా చేసిన చికిత్స

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

విశాఖపట్నం నుంచి సాయిభక్తురాలు కుమారి తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:

ముందుగా ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగ్ మరియు వాట్సాప్ గ్రూపు నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. సాయిబంధువులకు నా నమస్కారములు. బాబా లేకపోతే నా జీవితం లేదు. బాబా నా నెలసరి సమస్యను పరిష్కరించిన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నాకు నెలసరి ఎప్పుడూ సక్రమంగానే వచ్చేది. కానీ ఈమధ్య ఎందుకో నాకు నెలసరి సరిగా రావడం లేదు. ఈ విషయంగా నేను చాలా బాధపడుతూ, "నా నెలసరి సమస్యను తీర్చమ"ని బాబాను వేడుకున్నాను. తరువాత ఒకరోజు రాత్రి నాకొక కల వచ్చింది. ఆ కలలో, నా కడుపు లోపల ఎవరో చేతితో బలంగా లాగుతూ వున్నారు. నాకు బాగా నొప్పిగా అనిపించి ‘సాయీ, సాయీ’ అని అన్నాను. వెంటనే నొప్పి తగ్గిపోయింది. ఇంతలో మెలకువ వచ్చి, చుట్టూ చూశాను, ఎవ్వరూ లేరు. ఎంత ఆలోచించినా అలాంటి కల ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఆ మరుసటిరోజు నాకు నెలసరి వచ్చింది. అప్పుడు అర్థమైంది, ఆ కల ద్వారా బాబా నా కడుపులో వున్న అనారోగ్యాన్ని తొలగించారు అని. ఆనందంతో బాబాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ లీలతో సాయిపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది. “ఇంత గొప్ప అనుభవాన్ని ప్రసాదించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!”  బాబా ఆశీస్సులతో భవిష్యత్తులో మరెన్నో అనుభవాలను మీతో పంచుకుంటానని ఆశిస్తున్నాను. బాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

బాబా ఆశీర్వాదాలు

యు.ఎస్.ఏ. నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా తమ భక్తులను ఆశీర్వదించే ఒక రీతికి సంబంధించిన చిన్న అనుభూతిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా శిరిడీ ప్రత్యక్ష ప్రసారం చూడటం నాకు అలవాటు. దర్శనం కోసం వస్తున్న భక్తులలో కొంతమంది తమ చంటిబిడ్డలకు బాబా ఆశీస్సులు అందాలనే కోరికతో బిడ్డలను అక్కడి పూజారులకు అందిస్తూ ఉంటారు. పూజారులు ఆ పిల్లల్ని బాబా పాదాల చెంత పెట్టడంగాని, సమాధికి తాకించడంగాని చేస్తూ ఉంటారు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నేను ఎంతో ఆశీర్వాదపూర్వకంగా అనుభూతి చెంది చాలా సంతోషాన్ని పొందుతాను. నేనెప్పుడైనా నిరాశకు లోనైనప్పుడు ఆన్‌లైన్‌లో ఈ దృశ్యం కోసం చూస్తాను. బాబా దగ్గరికి చేరిన ఆ బిడ్డను చూస్తుంటే, 'ఆ బిడ్డదెంత భాగ్యమో!' అని అనిపిస్తుంది. ఆ బిడ్డలాగే నన్ను కూడా చూసుకుంటున్నానని బాబా నాకు భరోసా ఇస్తున్నట్లుగా నాకనిపిస్తుంది. ఆనందంతో నా కళ్ళు జలమయమై పోతాయి. దాంతో నాకెంతో ఉపశమనం కలుగుతుంది. ఇది పిచ్చిగా కొంతమందికి అనిపించవచ్చు కానీ, 'తన భక్తులకోసం తానెప్పుడూ ఉన్నాన'ని బాబా  భరోసా ఇచ్చే మార్గాలలో ఇదొకటని నా అభిప్రాయం. "బాబా! మీరే నాకు తల్లి, తండ్రి, గురువు. ఎల్లప్పుడూ నన్ను మీ బిడ్డలా జాగ్రత్తగా చూసుకోండి". 

FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo
 
FacebookWhatsAppXFacebook SendGmailYahoo! MailLinkedInSMSBloggerEmailSumoMe