సాయి వచనం:-
'ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి. వర్షం పడి పంట పండుతుంది. మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు?'

'మనస్సు వివిధ రూపాలు ధరించడం మాని ఒకే రూపం ధరించడం ద్వారా చైతన్యఘనత లేదా బ్రహ్మతథాకారవృత్తి సిద్ధిస్తుంది' - శ్రీబాబూజీ.

సాయినాథ్


సాయిభక్తుడు 'సాయినాథ్' ఇలా చెప్తున్నాడు:

"సాయిబాబా గురించి ఈ రోజుల్లో తెలిసినంతగా ఆ రోజుల్లో తెలియదు. అందువలన నేను పాఠశాలలో చేరిన మొదటిరోజునుండే నా క్లాస్‌మేట్స్, "నీకు 'సాయినాథ్' అని పేరు ఎలా పెట్టార"ని నన్ను అడిగేవారు. కొన్నిసార్లు నా ఉపాధ్యాయులు కూడా నా పేరు విషయంలో ఆసక్తి చూపేవారు. నేను దీని గురించి తరచూ నా తండ్రిని అడిగేవాడిని. అందుకు నాన్న, "నీ పుట్టుక ఆ సాయినాథుని ఆశీర్వాదమే" అని అనేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక 1922లో నా పేరు గురించి చెప్పమని నా తండ్రిని ఒత్తిడి చేశాను. 

అప్పుడు నాన్న ఇలా చెప్పాడు: 'మా అన్నయ్య మోక్‌డ్యా అనే గ్రామంలో రెవెన్యూ అధికారిగా పనిచేస్తుండేవాడు. అదొక చిన్న గ్రామం. అక్కడ మంచి పాఠశాలలు లేనందున, చదువుకోసం నన్ను ముంబాయికి పంపారు. ముంబాయిలో నేను చౌబాల్‌తో కలిసి ఉండేవాడిని. ఆ చౌబాల్ కుమార్తే మీ అమ్మ. దురదృష్టవశాత్తూ నేను మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదు. ఫీజు చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేనందున మళ్ళీ నేను పరీక్షలకు హాజరుకాలేదు. తరువాత నేను ఉద్యోగవేట ప్రారంభించాను. నాకు రైల్వే ఉద్యోగం వచ్చింది. అయితే పని గంటలు, షిఫ్టులు చాలా ఎక్కువగా ఉండేవి. అందువలన ఆ ఉద్యోగానికి రాజీనామా చేయమని మీ అమ్మ చెప్పింది. ఆ సమయంలో మేమిద్దరం మొదటిసారి శిరిడీ సందర్శనానికి వెళ్ళాము. కోపర్‌గాఁవ్ నుండి ఒక టాంగా(గుఱ్ఱపుబండి) కట్టించుకుని శిరిడీ వెళ్ళాము. శిరిడీ చేరుకున్నాక టాంగా తోలేవానికి డబ్బులు ఇవ్వడానికి మీ అమ్మ దగ్గర చిల్లర తీసుకుంటూ ఉండగా టాంగా అదృశ్యమైంది. మేము ఆశ్చర్యపోయాము. తరువాత మేము ద్వారకామాయిలోకి అడుగుపెడుతుండగానే బాబా, "మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? తిరిగి వెళ్ళిపోండి" అని అరిచారు. దాంతో మేము ఇంటికి తిరిగి వచ్చాము. అప్పుడే ముంబాయి పోర్ట్ ట్రస్ట్ విధులలో వెంటనే చేరమని ఒక లేఖ వచ్చింది. అప్పటినుండి నేను అక్కడే పనిచేస్తున్నాను. 

సంవత్సరం తరువాత మేమిద్దరం మళ్ళీ శిరిడీ వెళ్ళాము. మీ అమ్మ బాబా ముందు సాష్టాంగపడగా, "మీ పని పూర్తయింది" అన్నారు బాబా. ఆయన ఆశీస్సులతో సరిగ్గా తొమ్మిది నెలల తరువాత నువ్వు జన్మించావు. అందుకే మేము నీకు 'సాయినాథ్' అని పేరు పెట్టాము. నీకు సుమారు 2 సంవత్సరాలున్నప్పుడు మేము నిన్ను శిరిడీ తీసుకువెళ్ళాము. బాబా నిన్ను తమ ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నారు".

రెఫ్: సాయి ప్రసాద్ పత్రిక; 1993 (దీపావళి ఇష్యూ)
సోర్స్: బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి.

4 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి

    ReplyDelete
  3. Om sai ram, anni vishayallo anta bagundi andaru bagunde la chayandi tandri pls.

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo