ఈ భాగంలో అనుభవాలు:
- బాబా చూపుతున్న దయ
- బాబా లీల చూపించారు
బాబా చూపుతున్న దయ
ఓం సాయినాథాయనమః
ముందుగా బాబా భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు సుజిత్ కుమార్. మా నివాసం వరంగల్. నేను సాయిభక్తుడిని. బాబా నన్ను తన భక్తునిగా స్వీకరించారని నా నమ్మకం. ఆయనే మాకు తల్లి, తండ్రి. మేము ఆపదలో ఉన్న ప్రతిసారీ ఆయన మాతో ఉంటూ ఆపదలను తొలగించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. నాకు బాబా ప్రసాదించిన అనుభవాలను ఈ బ్లాగ్ ద్వారా మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
గత సంవత్సరంలో ఒకసారి మా నాన్నగారు హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే మేము ఆయనను వరంగల్‌లోని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లి చూపించాము. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. శ్వాస తీసుకోవడం కూడా ఆయనకు చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో బాబా దయ చూపించారు. ఎవరో చెప్పడంతో మేము నాన్నని హైదరాబాద్ తీసుకొని వెళ్లి, అక్కడి హాస్పిటల్లో చేర్చాము. నేను, "బాబా! నాన్న త్వరగా కోలుకునేలా అనుగ్రహించండి" అని బాబాను దీనంగా వేడుకున్నాను. తరువాత డాక్టర్లు నాన్నకి శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. మేము సరేనని శస్త్రచికిత్స చేయించాము. కొన్నిరోజులకి నాన్న ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థితికి వచ్చారు. ఇదంతా బాబా మా మీద కురిపించిన దయ. ఆ సమయంలో మేము చాలా టెన్షన్ పడ్డాము. బాబా కృప, ఆయన చల్లని చూపు వల్ల మాకు మంచి జరిగి మేము ఆ కష్టం నుండి బయటపడ్డాము.
ఈమధ్య నాకొక సమస్య వచ్చింది. అప్పుడు నేను అనుకున్నట్లు జరిగితే ఈ బ్లాగులో నా అనుభవం పంచుకుంటానని అనుకున్నాను. దాని పూర్తి వివరాలు ఇక్కడ వెల్లడించలేనుగానీ నేను అనుకున్నట్లే జరిగేలా బాబా అనుగ్రహించారు. ఇవి మన బాబా నా మీద కురిపించే ప్రేమ, ఆప్యాయతలకు రెండు ఉదాహరణలు మాత్రమే. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఇకమీదట కూడా బాబా నాపై కురిపిస్తున్న ప్రేమను మీతో పంచుకుంటాను. "బాబా! మీరు నాపై చూపుతున్న దయకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎప్పుడూ మీ రక్షణ భక్తులందరికీ ఉండాలని కోరుకుంటున్నాను".

బాబా లీల చూపించారు
ఒక అజ్ఞాత సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
నేను సాయిభక్తుడిని. నా ప్రతి చర్యలో బాబా ఉనికిని నేను అనుభవిస్తున్నాను. నా జీవితంలో ప్రతి దశలో బాబా ఆశీస్సులు నాతో ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదిన్నర నుండి ఆయన నా జీవితంలో భాగమైపోయారు. బాబానే నా జీవితం. నా ప్రతిరోజూ బాబా పేరుతో మొదలై, బాబా పేరుతోనే ముగుస్తుంది. బాబా నా బెస్ట్ ఫ్రెండ్. ఏ కాస్త సమయం దొరికినా నా జీవితంలో జరిగిన ప్రతి అంశం గురించి ఆయనతో మాట్లాడుతూ, ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతాను. బాబా లేని నా జీవితాన్ని ఊహించటం కష్టం. బాబాకు దగ్గరగా ఉండగలగటం, ఆయనని తెలుసుకోవడం, అనుభూతి చెందడం చాలా సంతోషదాయకమైనది. నేను కొంతకాలంగా బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతున్నాను. బాబా భక్తుల సంక్షేమం కోసం చేసే అద్భుతాలను విశ్వసిస్తున్నప్పటికీ, 'అటువంటివి స్వీకరించేంత ధన్యత నేను కలిగి ఉన్నానా?' అనే ప్రశ్న నన్ను ఎప్పుడూ వెంటాడేది. బాబా నాకు అందుకు తగిన అనుభవం చూపించారు. దాన్నే నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
ఒకసారి నేను నా ఆఫీసులో ఒక ముఖ్యమైన ఫైలును పోగొట్టుకున్నాను. అవకాశమున్న ప్రతిచోటా నేను దానికోసం వెతికాను. అక్కడ సహాయకులుగా పనిచేసే అందరినీ అడిగాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక నేను ఆశ వదులుకున్నాను. కానీ ఫైల్ పోగొట్టుకున్న కారణంగా చెడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మనసు లోతుల్లో భయం చోటు చేసుకుంది. అందువలన నేను, "బాబా! నా ఈ అజాగ్రత్తకు నన్ను క్షమించి, దయచేసి నాకు సహాయం చెయ్యండి" అని ప్రార్థించాను. తరువాత రోజు నేను ఆఫీసుకు వెళ్తూ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కూడా, "బాబా! ఫైల్ దొరికేలా నాకు సహాయం చేయండి" అని హృదయపూర్వకంగా బాబాని అడిగాను. తరువాత నేను ఆఫీసుకు వెళ్ళాక, నా గదిలోకి ప్రవేశిస్తూనే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఆ ఫైల్ నా టేబుల్‌పైనే ఉంది. బాబా చూపిన ఈ కరుణకు నేను కృతజ్ఞతలతో సరిపెట్టలేను. నా ఈ అనుభవాన్ని నా తోటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేసినట్లుగానే నేను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. "ధన్యవాదాలు బాబా! దయచేసి సదా నాతో ఉండి నాకు సహాయం చేయండి".
source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2555.html?m=0

Om sai ram
ReplyDelete