ఈ భాగంలో అనుభవాలు:
- బాబా సదా నా సమస్యలకు సమాధానం ఇస్తున్నారు
- బాబా కృపతో తీరిన చింత
బాబా సదా నా సమస్యలకు సమాధానం ఇస్తున్నారు
సాయిభక్తురాలు బీబీ తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
జై సాయిరామ్! నేను ప్రతిదానికీ బాబాను నమ్ముతాను. ఆయన పేరే తలచుకుంటూ ఉంటాను. నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా క్వశ్చన్&ఆన్సర్ (https://www.yoursaibaba.com/) వెబ్‌సైట్ ద్వారా నేను బాబా నుండి సమాధానాలు పొందుతున్నాను. అటువంటి కొన్ని అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
మొదటి అనుభవం:
నేను నా ఇంజనీరింగ్ పూర్తిచేసి, మా బంధువుల ఇంట్లో ఉండి ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు గురుపౌర్ణమి వచ్చింది. ఆరోజు నేను నా పారాయణ పూర్తిచేసి, 'నా జీవితం ఎలా సాగబోతోంద'ని బాబాను అడిగాను. అప్పుడు, "త్వరలో నువ్వు శిరిడీ సాయిని సందర్శిస్తావు" అని బాబా సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు. పదిరోజుల తరువాత మా బంధువులు అకస్మాత్తుగా శిరిడీ యాత్ర ప్లాన్ చేశారు. నన్ను కూడా వాళ్లతో తీసుకుని వెళ్లారు. అలా నేను బాబా చెప్పినట్లుగానే శిరిడీ సందర్శించాను.
రెండవ అనుభవం:
ఒకసారి నేను, "బాబా, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?" అని అడిగాను. అప్పుడు, “నువ్వు ఉత్తర దిశగా వెళ్తావు” అని బాబా చెప్పారు. ఆ సమయంలో నేను బెంగళూరులో ఉన్నాను. 10 రోజుల్లో నాకు పూణేలోని హెచ్‌ఎస్‌బిసి సాఫ్ట్‌వేర్ సంస్థ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఆ ఉద్యోగం నాకు రావడంతో నేను పూణే వెళ్ళాను.
మూడవ అనుభవం:
ఒకసారి నా మనసు ఏమీ బాగాలేక బాబా సమాధానం కోసం చూశాను. అప్పుడు, "త్వరలో నువ్వు శిరిడీ సందర్శిస్తావు" అని వచ్చింది. 20 రోజుల తరువాత నా రూమ్మేట్ తనతో శిరిడీ రమ్మని నన్ను పిలిచింది.
నాల్గవ అనుభవం:
3వ అనుభవంలో బాబా చెప్పినట్లుగా నేను శిరిడీ సందర్శించి వచ్చిన తరువాత నా రూమ్మేట్ తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఇటు రూములో, అటు ఆఫీసులో ఆమె సహచర్యం లేక నేను ఒంటరితనాన్ని అనుభవిస్తూ క్రొత్త ఫ్రెండ్ కోసం బాబాను అడిగాను. అప్పుడు బాబా సమాధానంగా, "నువ్వు పూణేలో ఒక వ్యక్తిని కలుస్తావు" అని వచ్చింది. ఎప్పటిలాగే ఆయన మాటలు నిజమయ్యాయి. ఆ ఒంటరితనంలో ఉన్న సమయంలో ఒకసారి నేను నా స్వగ్రామానికి వెళ్ళాను. అప్పుడు నాకొక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అంతా సక్రమంగా సాగి నెలలోనే నిశ్చితార్థం, వివాహం జరిగిపోయాయి. అతను పూణేలో పనిచేస్తున్నాడు.
ఐదవ అనుభవం:
మొదటిసారి నేను గర్భం దాల్చినపుడు నాకు గర్భస్రావం జరిగింది. నేను దిగులుపడుతూ, “బాబా! నేను గర్భవతినని మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది?” అని అడిగాను. అప్పుడు, "త్వరలో ఒక మగపిల్లవాడికి జన్మనిస్తావు" అని ఆయన హామీ లభించింది. తరువాత కొద్దిరోజుల్లోనే నేను గర్భం దాల్చి, 2019, ఏప్రిల్ 25న ఆరోగ్యకరమైన చక్కటి మగబిడ్డకు జన్మనిచ్చాను.
ఆరవ అనుభవం:
ఒకసారి నేను యథాలాపంగా వెబ్‌సైట్ తెరచి నెంబర్ 42 ఎంచుకున్నాను. అందులో, "మత పుస్తకాలను చదవడం, వ్రాయడం జరుగుతుంది. మతపరమైన కార్యకలాపాలు జరుగుతాయి. మంచి విషయాలు జరుగుతాయి" అని ఉంది. సరిగ్గా 10 రోజుల తరువాత నా కజిన్ తనకి తెలిసిన వాళ్ళకి నా నంబర్ ఇచ్చారు. వారు నాకు ఫోన్ చేసి మహాపారాయణలో చేరమని అడిగారు. ఆనందంగా మహాపారాయణలో చేరాను.
ఇలా నా ప్రతి సమస్యకు బాబా నాతో మాట్లాడుతున్నారు. "సదా నాకు అండగా ఉంటున్నందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా!"
source:http://www.shirdisaibabaexperiences.org/2019/12/shirdi-sai-baba-miracles-part-2565.html?m=0

బాబా కృపతో తీరిన చింత
సాయిభక్తురాలు శ్రీమతి అనుపమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిభక్తులందరికీ నమస్కారం! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదములు. నా పేరు అనుపమ. నాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పటినుండి బాబా అంటే చాలా ఇష్టం. గత సంవత్సరం నవంబరులో మా అమ్మాయికి తీవ్రమైన జ్వరం వచ్చింది. మరో రెండు రోజులలో మేము శివపార్వతుల కళ్యాణం చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకొని ఉన్నాం. మా అమ్మాయికి అలా ఉంటే తనని వదిలి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ అదే విషయం బాబాకి చెప్పుకున్నాను. "బాబా! మా అమ్మాయికి జ్వరం తగ్గి తను ఆరోగ్యంగా ఉండేలా అనుగ్రహించండి. తనకు జ్వరం తగ్గిపోతే నా అనుభవాన్ని 'సాయిమహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయిభక్తులతో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. బాబా కృపతో మరుసటిరోజుకే మా అమ్మాయికి జ్వరం తగ్గిపోయింది. ఎంతో ఆనందంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
అలాగే ఇంకో అనుభవం కూడా మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఒకసారి లాకర్ తాళంచెవులు ఎక్కడో పెట్టి మరచిపోయాను. ఆ సమయంలో నేను ఎంత వెతికినా అవి దొరకలేదు. మావారు నన్ను ఏమైనా అంటారేమోనని నాకు చాలా భయమేసింది. వెంటనే, "లాకర్ తాళంచెవులు దొరికితే 21 డాలర్లు దక్షిణ మరియు ఒక టెంకాయ సమర్పిస్తాను బాబా. అంతేకాదు, నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నేను ముందురోజు వెతికినప్పుడు తాళంచెవులు నా హ్యాండ్‌బ్యాగులో లేవు. ఆశ్చర్యంగా తరువాతిరోజు అవి నా హ్యాండ్‌బ్యాగులోనే కనిపించాయి. నిజంగా ఆ క్షణంలో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇదంతా బాబా కృపే అని నాకు ఖచ్చితంగా తెలుసు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!" నాకున్న ఇంకో కోరికని కూడా బాబా తొందరలోనే తీరుస్తారని అనుకుంటున్నాను. అది తీరాక మరలా ఆ అనుభవంతో మీ ముందుకి వస్తాను. "ఇంత ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు మన్నించండి బాబా!"
ఓం సాయిరామ్!!!

Om Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం సాయిరాం,🌷🙏🌷
ReplyDelete