ఈ భాగంలో అనుభవాలు:
- బాబా ఇచ్చిన గొప్ప ఉపశమనం
- సాయిబాబా ఇచ్చిన మంచి ఉద్యోగం
బాబా ఇచ్చిన గొప్ప ఉపశమనం
సాయిభక్తుడు వేణుమాధవ్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేనిప్పుడు నా జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటనను మీ అందరితో పంచుకుంటాను. దీన్ని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఇది 1997వ సంవత్సరంలో జరిగింది. ఆ సమయంలో నేనొక కార్ల షోరూంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాను. ఒకరోజు ఒకతను వచ్చి మారుతి ఎస్టీమ్ కారు గురించి అడిగాడు. ఎప్పటిలాగే నేను అతనికి కారు చూపించి, దాని గురించి అన్ని వివరాలు తెలియజేశాను. మరుసటిరోజు అతను పూర్తి మొత్తానికి డి.డి. తీసుకొని వచ్చాడు. పూర్తి నగదు చెల్లించి కారు తీసుకొనే కస్టమర్ దొరికినందువలన నాకది చాలా సంతోషకరమైన రోజు. నేను అవసరమైన అన్ని పత్రాలతో కారు డెలివరీ ఇచ్చాను. అతను కారు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు.
మరుసటిరోజు మా అకౌంట్స్ మేనేజర్ నన్ను పిలిచి, నేను తనకి ఇచ్చిన డి.డి. దొంగిలించబడిందని, మనం వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు రిపోర్టు ఇవ్వాలని చెప్పారు. ఆ మాట విని నేను నిర్ఘాంతపోయాను. వెంటనే మేము పోలీస్‌స్టేషనుకి వెళ్ళాము. వాళ్ళు నన్ను, "ఆ వ్యక్తి మీకు ఎలా తెలుసు? అతని గురించి మీకు ఇంకే విషయాలు తెలుసు?" అంటూ చాలా ప్రశ్నలు అడిగారు. అసలు విషయం ఏమిటంటే, ఆ డి.డి. ఇచ్చిన వ్యక్తి కొన్నిరోజుల ముందు ఒక బ్యాంకు నుండి చాలా డి.డి.లు దొంగిలించి, వాటితో ఇలాంటి చాలా వస్తువులను కొన్నాడు.
మరుసటిరోజు కూడా మేము పోలీస్‌స్టేషనుకి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళే దారిలో నేను చాలా భయపడ్డాను. ఆ సమయంలో నాకు సాయిబాబా గుర్తుకొచ్చారు. నేను నా మనసులోనే "నాకు సహాయం చేయమ"ని బాబాను ప్రార్థించాను. అద్భుతంలా మరుక్షణంలో, "వెంటనే తిరిగి ఆఫీసుకు రమ్మ"ని నాకు కాల్ వచ్చింది. విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఆ కారును బ్రోకర్‌కు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. మేము అక్కడికి వెళ్లేసరికి అతను తన సూట్‌కేసును, క్రొత్త కారును అక్కడే విడిచిపెట్టి వేరే మార్గంగుండా జారుకున్నాడు. మేము ఆ సూట్‌కేస్ తెరచి చూస్తే అందులో చాలా చెక్ పుస్తకాలు, డి.డి.లు మొదలైనవి ఉన్నాయి. మేము వాటిని పోలీసులకి అప్పగించాము. నా జీవితంలో ఎదురైన అతిపెద్ద సమస్య నుండి నేను గొప్ప ఉపశమనం పొందాను. ఇదంతా కేవలం బాబా కృప వలనే. ఆయనే నాకు సహాయం చేశారు. ఆయన సహాయం లేకుంటే నేను కొన్నిరోజులపాటు జైలులో గడపాల్సి వచ్చేది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా! మీకు నా హృదయపూర్వక నమస్కారములు. ఎల్లవేళలా మీ అనుగ్రహం మీ బిడ్డలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను".
ఓం శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
- వేణుమాధవ్

సాయిబాబా ఇచ్చిన మంచి ఉద్యోగం
పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
శ్రీసాయిసచ్చరిత్ర చదివిన తరువాత జరిగిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. "నేను ఎప్పుడూ నా భక్తులకు సహనంతో ఉండమని చెబుతాను. కానీ నా భక్తులలో చాలామంది సహనాన్ని కోల్పోయి, ఆతురతలో నిర్ణయం తీసుకుంటారు. అలాంటి నిర్ణయం ప్రతిసారీ మంచిదని నిరూపణ కాదు. మీరు మీ గమ్యాన్ని ఆతురతలో మార్చలేరు. గురువుపై విశ్వాసం కలిగి, సహనంతో వేచివుండటం మంచిది" అని సాయిబాబా చెప్పిన ఈ మాటలు ముమ్మాటికీ నిజం. బాబా ఉనికిని నేను ఎన్నోసార్లు అనుభూతి చెందాను. ఇక నా అనుభవానికి వస్తే...
నేను పనిచేస్తుండే కంపెనీలో నా పనిని గుర్తించేవారు కాదు. పైగా వృత్తిరీత్యా ఎదుగుదల కూడా లేదు. అందువలన నేను ఉద్యోగంలో మార్పుకోసం చూశాను. అటువంటి సమయంలో నాకొక ఆఫర్ వచ్చింది. అది మంచి ఆఫర్ కానప్పటికీ నేను పాత కంపెనీలో రాజీనామా ఇచ్చాను. అయితే మంచి కంపెనీలో ఆఫర్ పొందడమన్నది నా లక్ష్యం. దాంతో నేను చాలా ఇంటర్వ్యూలకు హాజరవుతుండేవాడిని. వాటిలో చాలా ఇంటర్వ్యూలను నేను విజయవంతంగా పూర్తి చేశాను. కానీ నా దురదృష్టం వలన వాళ్ళనుండి ఆఫర్ లెటర్ వచ్చేది కాదు. ఇలా చాలారోజులు చేసిన నా ప్రయత్నాలన్నీ చివరలో విఫలమయ్యాయి. ఈ కష్టకాలమంతా నేను ప్రతిరోజూ సాయిబాబాను పూర్తి విశ్వాసంతో, సహనంతో ప్రార్థిస్తూ ఉండేవాడిని.
చివరికి నేను మహాపారాయణ గ్రూపులో చేరాను. అదేసమయంలో శ్రీసాయిసచ్చరిత్ర చదవడం కూడా ప్రారంభించాను. ఒకరోజు నేను హృదయపూర్వకంగా సాయిబాబాను, "సాయిబాబా! నేను చాలారోజులుగా ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ కోసం ప్రయత్నిస్తున్నాను. దయచేసి ఈ విషయంలో నాకు మార్గం చూపి, సహాయం చెయ్యండి. నాకు బహుమతిగా మీరు ఇవ్వాలనుకుంటున్న కంపెనీ పేరునైనా నాకు చూపించండి" అని అడిగాను. ఈవిధంగా నేను బాబాను అడుగుతూ ఉన్నప్పుడే సోషల్ మీడియాలో ఒక మంచి కంపెనీ పేరు నా దృష్టిలో పడింది. అద్భుతం! ఆశ్చర్యం! మరుసటిరోజు నాకు అదే సంస్థ వాళ్లు కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. సాయిబాబా కృపతో నేను ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేశాను, నాకు ఆ ఉద్యోగం కూడా వచ్చింది. ఇది అద్భుతం కాదా? ఇది పూర్తిగా సాయిబాబా ప్రణాళిక. బాబా ప్రణాళికలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. నేను అడిగినదానికంటే బాబా నాకు ఎక్కువ ఇచ్చారు. బాబా మన ప్రతి ప్రార్థనకు సమాధానమిస్తారు. అయితే ఆయన ఇచ్చే సమాధానం మనం అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలిగివుండాలంతే.
ఓం సాయిరాం!
source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2545.html

om sairam
ReplyDeletealway be with me
naaku nee leelanani ardham chesukoni ghannani ivvu
Om sai ram!🙏🙏🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
Om sai ram, anta bagunde la chayandi tandri pls, ofce lo ma team ki manchi vaallani vesi vaallu baga work chese la chusukondi baba pls responsible ga tension lekunda unde la chudandi tandri, na anarogyaniki oka daari chupinchandi baba pls.
ReplyDelete