సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 309వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. కలలో కూడా ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటున్న బాబా
  2. సాయిబాబాను విశ్వసిస్తే, ఆయన ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తారు

కలలో కూడా ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటున్న బాబా

సాయిభక్తురాలు సుచిత్ర తనకు బాబా ప్రసాదించిన అనుభవాలనిలా పంచుకుంటున్నారు:

సాయిబంధువులందరికీ సాయిరామ్! నాకు వచ్చిన ప్రతి కలలో నేను ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొంటూ ఉంటాను. కానీ కలలో కూడా బాబా నాకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకుంటున్నారు. అవి కలలే అయినా బాబా సంరక్షణలో ఉన్నాననే అనుభూతి నాకెంతో ఆనందాన్నిస్తుంది. ఈ ఆనందాన్ని సాయి కుటుంబంతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 

కొన్ని నెలల క్రితం వచ్చిన కలలో ఎవరో నన్ను చంపమని ఇద్దరు మనుషులని పంపించారు. వాళ్ళు కత్తి తీసుకోని నా దగ్గరకు రాగానే నేను బాబా ఆరతి పాట పాడటం మొదలుపెట్టాను. దాంతో వాళ్ళు నన్ను వదిలేసి, తిరిగి వెళ్లి తమను పంపిన వాళ్లతో, "ఆమెను చంపడం మా వల్ల కాద"ని చెప్పి వెళ్లిపోయారు. అందుకు వాళ్ళు, "మీ వల్ల కాకపోతే మేమే స్వయంగా వెళతామ"ని కత్తి తీసుకోని నా వద్దకు వచ్చారు. నేను భయంతో 'బాబా!' అని అరిచాను. వాళ్ళు చేయెత్తి నాకు నమస్కరించి, కడుపునిండా భోజనం పెట్టి, మా ఇంటికి పంపించేశారు.

ఇంకోసారి కలలో నేను మా పాపను ఎత్తుకొని లిఫ్టులో ఉన్నాను. హఠాత్తుగా లిఫ్ట్ పాడైపోయి వేగంగా కిందకి జారసాగింది. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, అదే వేగంతో లిఫ్ట్ నేలను తాకిందంటే పెద్ద పేలుడు (బ్లాస్ట్) సంభవించేలా ఉంది. అది సరిగా నేలను తాకే సమయంలో నేను 'బాబా!' అని అరిచాను. లిఫ్ట్ నెమ్మదిగా ఆగింది.

మరొక కలలో ఎక్కడో ఒక చిక్కుడుకాయల చెట్టు ఉంది. నేను దాన్ని చూస్తూ ఉన్నాను. దాని వెనకాల రెండు కోతులున్నాయి. వాటిని చూస్తూనే నేను భయపడ్డాను. అంతలో వాటిలో ఒకటి కోపంగా నా మీదకు వచ్చి, నా చేయి పట్టుకొని నోట్లో పెట్టుకొని కొరకబోయింది. నేను 'బాబా!' అని గట్టిగా అరిచాను. దాంతో అది నా చేయి వదిలేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది.

"పిలిస్తే పలుకుతాను" అన్న బాబా మాటను నా చిన్నప్పటినుండి విన్నాను, చదివాను. ఆ మాట ఎంత అక్షరసత్యమో నేను అనుభవిస్తున్నాను. కలలోనే కాకుండా నిజజీవితంలో కూడా ఆ అనుభూతిని పొందుతున్నాను. "బాబా! నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే, మీ సన్నిహిత భక్తులైన మహల్సాపతి, తాత్యాపాటిల్ ల అంతటి గొప్ప స్థానాన్ని కాకపోయినా మీ పాదాల చెంత చిన్న ప్రాణిగా అయినా స్థానాన్ని ప్రసాదించండి దేవా, సాయినాథా!"

సాయిబాబాను విశ్వసిస్తే, ఆయన ఖచ్చితంగా సమస్యను పరిష్కరిస్తారు

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

ఓం సాయిరామ్! ఈమధ్యకాలంలో ఒకరాత్రి హఠాత్తుగా నా కొడుకుకి తీవ్రమైన జ్వరం వచ్చింది. తను మందులను వేసుకోవడానికి నిరాకరిస్తుండేవాడు. బలవంతంగా మందులు ఇవ్వడానికి ప్రయత్నిస్తే, ఉమ్మేసి వాంతి చేసుకునేవాడు. కనీసం తడిగుడ్డతో తన శరీరాన్ని తుడిచే ప్రయత్నం చేసినా కూడా తను అవకాశమివ్వక తీవ్రంగా ఏడుస్తుండేవాడు. మేము చాలా ఆందోళన చెందాము. మరుసటిరోజు ఉదయం మేము తనని ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. తనని పరీక్షించిన డాక్టర్, తన గొంతులో కొంత ఇన్ఫెక్షన్ ఉందని, టాన్సిల్స్ విస్తరించాయని చెప్పి, 5 రోజులు యాంటీబయాటిక్స్ వాడమని చెప్పారు. అక్కడినుండి ఇంటికి వెళ్ళాక జ్వర తీవ్రత ఇంకా ఎక్కువ అయింది. మరుసటిరోజు కూడా అదే పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా రాత్రిపూట జ్వరం చాలా ఎక్కువగా ఉంటుండేది. అందువలన తను ఏడుస్తూ ఉంటే మాకు చాలా ఆందోళనగా ఉండేది. మరుసటిరోజు మేము తనని తీసుకుని మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాము. ఈసారి డాక్టర్ రక్తపరీక్ష చేయించారు. రిపోర్టులు సాధారణంగా రావడంతో మునుపటి మందులే మరో రెండురోజులు కొనసాగించమని చెప్పారు. కానీ ఆరోజు రాత్రి కూడా అదే పరిస్థితి. నేను డాక్టరుకి పరిస్థితిని వివరిస్తూ ఒక మెయిల్ పంపాను. అందుకతను 5 రోజుల తరువాత కూడా ఈ మందులవల్ల ఎటువంటి స్పందనా లేకపోతే, ఐ.వి. ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మాట వింటూనే నేను చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆ రాత్రి నేను సాయిబాబాను ప్రార్థించడం ప్రారంభించాను. బ్లాగులో అనుభవాలు చదువుతూ, నా బిడ్డకు జ్వరం మళ్లీ రాకూడదని పదేపదే బాబాను ప్రార్ధిస్తూ ఉన్నాను. బాబా రూపాన్ని చూస్తూ నేను కన్నీళ్ల పర్యంతమయ్యాను. నిజానికి నేను నా ఇంటర్మీడియట్ నుండి సాయిబాబా భక్తురాలిని. కానీ గత 5 రోజులలో నేను నా బిడ్డ జ్వరాన్ని తగ్గించమని బాబాను అస్సలు ప్రార్థించలేదు. ఆ రాత్రే సహాయం చేయమని బాబాను అర్థించాను. అద్భుతం! బాబా దయ చూపారు. మరుసటిరోజు ఉదయానికల్లా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చింది. "సాయిబాబా! చాలా చాలా కృతజ్ఞతలు. నేను ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను  క్షమించండి". మనం సాయిబాబాను విశ్వసిస్తే, ఆయన ఖచ్చితంగా మన సమస్యను పరిష్కరిస్తారు. "లవ్ యు సాయిబాబా!"

source:http://www.shirdisaibabaexperiences.org/2019/11/shirdi-sai-baba-miracles-part-2543.html


6 comments:

  1. Sadhguru sainadh maharaj ki jai👏👏🙏🙏

    ReplyDelete
  2. Baba!Bless me with Job,🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. ఓం సాయిరాం...🌹🙏🏻🌹
    సాయి రామ్ నాకు ప్రమోషన్ వస్తే నా అనుభవాన్ని బ్లాగ్లో పంచుకుంటాను సాయి తండ్రి ప్లీజ్ బాబా కరుణించు చాలా కష్టాల్లో ఉన్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  4. నేను ఉన్న పరిస్థితుల్లో ప్రమోషన్ రావడం చాలా కష్టం కానీ మీ దయవల్ల వస్తుందనే నమ్మకం బాబు మీరు ఏదో ఒకటి అద్భుతం చేసి ఇ నాకు ప్రమోషన్ ఇప్పించండి ప్లీజ్ బాబా, 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  5. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo