సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కేసర్ బాయి జయకర్


కేసర్ బాయి జయకర్ ప్రఖ్యాత శ్యామారావ్ జయకర్ గారి కుమార్తె. ఆమెను బాబా ఎంతగానో ఇష్టపడేవారు. ఆమె తనకు ఏడేళ్ల వయస్సున్నప్పుడు మొదటిసారి శిరిడీ దర్శించింది. అప్పటి తన అనుభవం గురించి ఆమె ఇలా చెప్పింది:

మేము శిరిడీ సందర్శించినప్పుడు చలికాలం కావడంతో తీవ్రమైన చలిగా ఉంది. నాకు జామకాయలంటే చాలా ఇష్టం. చాలామంది అమ్మకందారులు వాటిని బుట్టలో పెట్టుకొని ద్వారకామాయికి వస్తుండేవాళ్లు. అయితే దురదృష్టవశాత్తు ఆ సమయంలో నాకు జలుబు, దగ్గు పట్టుకున్నాయి. మా తాతగారు దాని గురించి దిగులుపడుతూ జలుబు ఎక్కువవుతుందని నన్ను జామపళ్ళను తినవద్దని కఠినంగా హెచ్చరించారు. 

ఆరతి అనంతరం భక్తులందరూ  ఇండ్లకు వెళ్ళిపోయాక బాబా నన్ను పిలిచారు. నేను పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళాను. అప్పుడు బాబా నా కోటు జేబులో ఒక జామపండు పెట్టి, మరో పండును నా చేతికిచ్చి, "త్వరగా తిను" అన్నారు. బాబా కూర్చున్న రాయి వెనుక గోనెసంచితో చేసిన ఒక పరదా ఉండేది. ఆ పరదా వెనకాల ఏమున్నదో తెలుసుకోవాలని నాకు ఆత్రుతగా ఉండేది. బాబాకు అన్నీ తెలుసు. ఆయన నెమ్మదిగా నాతో, "వెళ్లి ఆ పరదా వెనకాల కూర్చొని జామపండ్లు తిను. అలా చేస్తే మీ తాతకు నువ్వు కనపడవు. అతడు చూస్తే దగ్గు ఎక్కువవుతుందని నీ మీద కోప్పడతాడు" అన్నారు. నేను ఆనందంతో పరదా వెనక్కి వెళ్ళి జామపండ్లను కరకరా కొరుక్కుంటూ నమిలి తినేశాను. అయితే, 'గదిలో మా తాత నాతో చెప్పింది బాబాకు ఎలా తెలిసింద'ని చాలా ఆశ్చర్యం వేసింది".

సమాప్తం.

Ref: Sai Prasad Magazine, Deepavali issue, 1999.
Source: Baba’s Divine Manifestations compiled by Vinny Chitluri,

3 comments:

  1. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo