రామచంద్ర సీతారామ్ దేవ్ మరాఠీ మాధ్యమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ప్రతిరోజూ రాత్రి అతనికి కలలో ఒక ఫకీరు కనిపించి, “కనీసం ఒక్కసారైనా వచ్చి నన్ను కలుసుకో!” అని చెప్తుండేవాడు. పదేపదే అదే కల వస్తుండటంతో ఆ ఫకీరు ఎవరో తెలుసుకోవాలని దేవ్ చాలా ఆరాటపడ్డాడు. తనకు కలలో కనిపించే ఫకీరు గురించి వివరంగా వర్ణించి మరీ చాలామందిని ఆ ఫకీరు గురించి అడిగాడు. కానీ ఏ ఒక్కరూ ఆ ఫకీరు గురించి ఏమీ చెప్పలేకపోయారు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లని కఫ్నీ ధరించి, తల చుట్టూ ఒక వస్త్రాన్ని కట్టుకొని ఉన్న ఒక ఫకీరు భిక్షాటన చేస్తూ దేవ్ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి, “బిడ్డా! తినడానికి కొంచెం ఆహారమివ్వు, నేను సంవత్సరకాలంగా ఏమీ తినలేదు” అని అరిచాడు. అది వింటూనే దేవ్, “అప్పుడు మీరెలా ఈ భూమిపై జీవించి ఉన్నారు?” అని ప్రశ్నించాడు. అందుకు ఆ ఫకీరు, “నా స్వగ్రామమైన శిరిడీకి రా, నా జీవిత రహస్యం నీకు తెలుస్తుంది” అని సమాధానమిచ్చాడు. అంతట దేవ్ ఆ ఫకీరును తన ఇంటిలోకి ఆహ్వానించి, కూర్చోమని అర్థించాడు. అప్పుడు వారివురి మధ్య సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. ఫకీరును దేవ్ ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆ ఫకీరు ఎంతో ఓర్పుగా సమాధానాలిచ్చాడు. తరువాత హఠాత్తుగా ఆ ఫకీరు అదృశ్యమయ్యాడు. అదే మొదటిసారి దేవ్ శిరిడీ గురించి వినడం. చాలామందిని విచారించి మొత్తానికి శిరిడీ ఎలా వెళ్లాలో తెలుసుకొన్నాడు. తరువాత ఒకరోజు అతను శిరిడీ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. కానీ, అతని సంపాదన కేవలం నెలకు 5 రూపాయలే. అందువల్ల అతను కొంతమంది స్నేహితుల వద్దనుండి అప్పుగా 20 రూపాయలు సేకరించి శిరిడీ ప్రయాణమయ్యాడు.
దేవ్ మసీదులో అడుగుపెడుతుండగానే బాబా అతనితో, “నా సందేశం అందిందా?” అని అడిగారు. బాబా మాటలతో తన ఇంటికి వచ్చిన ఫకీరు బాబానేనని గ్రహించిన దేవ్ ఆశ్చర్యపోయాడు. బాబా అతనిని పదిరోజులు శిరిడీలో ఉంచి, తరువాత తిరుగు ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. కానీ, అతని వద్ద ఉన్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, “టికెట్ తీసుకోకు! ఎందుకంటే, నిన్ను ఎవరూ దానిగురించి అడగరు” అని అన్నారు బాబా. ఆయన చెప్పినట్లే ఎటువంటి సమస్యా లేకుండా అతను క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. కానీ, ఎన్నో ఆశలతో శిరిడీ వెళ్ళిన తనను బాబా ఒట్టిచేతులతో ఇంటికి పంపారని చాలా నిరాశచెందాడు. ఆరోజు అతనికి కలలో బాబా కనిపించి, “అరె! 5 రూపాయల జీతంతో నువ్వెంత కాలం జీవిస్తావు? ఇక నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను” అని భరోసా ఇచ్చారు. అప్పటినుండి అతనికి ప్రతిచోటా సంపాదన లభిస్తుండేది. త్వరలోనే అతను గొప్ప ధనవంతుడయ్యాడు. బాబాకు దేవ్ గొప్ప భక్తుడయ్యుంటాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
source : శ్రీసాయిప్రసాద్ పత్రిక, 1994 దీపావళి సంచిక (బాబా'స్ డివైన్ సింఫనీ బై విన్నీ చిట్లూరి)
ఓం సాయిరాం🙏💐🙏
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om sai baba. I want your blessings🙏🙏🙏🙏
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, baba intlo, alage ofce lo situations anni bagunde la chusukondi tandri anni vishayallo manashanti ni evvandi, amma nannalani nannu andarni ayur arogyalatho ashtaishwaryalatho kapadandi tandri, Amma nannala, alage shiva purti badyata meede tandri.
ReplyDelete