- సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు
- సాయిని నమ్ముకుంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారు
సాయిబాబా ఎన్నడూ మనల్ని విడిచిపెట్టరు
హైదరాబాద్ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! నేను సాయిభక్తురాలిని. సాయే నా దైవం, గురువు, సంరక్షకుడు. ఆయనే నాకు మంచి స్నేహితుడు. సాయి మన జీవితంలోకి వచ్చాక ప్రతీదీ మంచిగా మారుతుంది. అపారమైన విశ్వాసం, సహనం భక్తులను సరైన మార్గంలో నడిపిస్తాయి. “బాబా! ఈ అనుభవాన్ని వివరించడంలో ఏవైనా తప్పులు దొర్లితే దయచేసి నన్ను క్షమించండి”.
గత కొన్ని సంవత్సరాలుగా నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాలా తీవ్రమైనవి కూడా ఉన్నాయి. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. మా నాన్నగారికి క్యాన్సర్ మందులు ఇవ్వడం కోసం ‘పిక్ లైన్’ అనే పరికరం వేశారు. కానీ సమస్య ఏమిటంటే, రెండు రోజులకి ఒకసారి పిక్ లైన్ డ్రెస్సింగ్ చేయాలి. మొదటి సైకిల్ బాగానే వుంది. రెండవ సైకిల్ నుంచి ఇబ్బందిపెట్టడం మొదలుపెట్టింది. 2020, నవంబరు 3వ తేదీ, మంగళవారంనాడు నాన్నగారికి పిక్ లైన్ డ్రెస్సింగ్ చేస్తుంటే బ్లాక్ అయ్యింది. నేను నాకున్న అనుభవంతో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం రాత్రి ఈ సమస్యను పరిష్కరించమని బాబాను ప్రార్థించి, సమస్య పరిష్కారమైతే నా అనుభవాన్ని మన ‘సాయి మహరాజ్ సన్నిధి’ బ్లాగులో పంచుకుంటానని బాబాకు మ్రొక్కుకున్నాను. గురువారం ఉదయం బాబా చరిత్ర పారాయణ చేసిన తరువాత మా నాన్నగారి దగ్గరకు వెళ్లి డ్రెస్సింగ్ చేయాలని ప్రయత్నం చేశాను. ఆశ్చర్యకరంగా బాబా ఆశీస్సులతో సమస్య పరిష్కారం అయింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!” బ్లాగులో నా అనుభవాన్ని పంచుకోవాలంటే ఏ విధంగా వ్రాయాలో ముందు నాకు అసలు తెలియలేదు. అలాంటిది బాబానే నాకు దారి చూపించారు. అలా నేను ఈరోజు మీ ముందు నా అనుభవాన్ని పంచుకోగలిగాను. ఇంకా కొన్ని కోరికలు తీర్చమని బాబాకు మ్రొక్కుకొని ఉన్నాను. అవి నెరవేరిన తరువాత మరలా బ్లాగులో కలుసుకుంటాను.
నేను చెప్పేది నమ్మండి, అనారోగ్యానికి గురైనప్పుడు, బాధలో ఉన్నప్పుడు సాయి మాతో ఉన్నారని మేము ఆయనపై విశ్వాసం ఉంచాము. ఈ పరీక్షలు మన కర్మల వల్లనే. ప్రతీదీ ఒక కారణం చేత జరుగుతుందని మేము నిజంగా నమ్మాము. కాబట్టి సాయిబాబా యందు విశ్వాసం, సహనం చెదరకుండా ఉంచుకోవాలి. మనం మంచి కర్మలు చేయటంలో దృష్టి పెడితే తదుపరి జన్మలో ఇలాంటి పరీక్షలు ఎదుర్కోకుండా ఉంటాము. మనం అంతటా సాయిని చూడాలి, మంచి జరగడం కోసం ఆయన బోధలను ఆచరించాలి. ఏ పని చేస్తున్నా సాయిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. “బాబా! మీ భక్తులందరినీ ఆశీర్వదించండి. మా సమస్యలకు ముగింపు ఇవ్వండి. దయచేసి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని వదిలిపెట్టకండి”.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!
సాయిని నమ్ముకుంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారు
సాయిభక్తుడు మోహన్ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. నా పేరు మోహన్. నేను నా కుటుంబంతో తిరుపతిలో నివసిస్తున్నాను. నేను ఇంతకుముందు ఒక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకోబోతున్నాను.
24-10-2020, విజయదశమి ముందురోజున నేను, నా భార్య, మా బాబు కలిసి తిరుపతిలో మురుగస్వామిగారు నిర్మించిన సాయిబాబా గుడికి వెళ్ళి బాబాను దర్శించుకుని, దక్షిణ సమర్పించి, ఇంటికి తిరిగి బయలుదేరాం. దారిలో స్కూటీకి పెట్రోల్ కొట్టించాము. నాది పాత స్కూటీ కావడం వల్ల దానికి సెల్ఫ్ స్టార్టర్ సమస్య వుంది. దానికి వెల్డింగ్ చేయించాల్సివుంది. అందువల్ల ముగ్గురం వెల్డింగ్ షాపుకి వెళ్ళాము. నేను, నా భార్య స్కూటీ దిగాము. మా బాబు స్కూటీ మీద ముందువైపు నిల్చొని వున్నాడు. స్కూటీ ఇంజన్ ఆన్ లోనే ఉంది. స్కూటీలో ఉన్న సమస్యేమిటో అక్కడి మెకానిక్కి చూపించాను. అంతలో బాబు స్కూటీ ఇంజన్ రైజ్ చేశాడు. మేము ఎంతో కంగారుపడ్డాం కానీ, ఏమీ చేయలేని పరిస్థితి. స్కూటీ కాస్త ముందుకు వెళ్ళి ముందున్న రెండు బైక్ల మధ్యలో ఆగింది. స్కూటీ డామేజ్ అయింది. జరిగిన సంఘటన చూసి చుట్టూ జనం చేరారు. బాబుకి ఏమైనా అయుంటుందేమోనని నా భార్య ఏడుస్తోంది. కానీ, బాబా దయవల్ల మా బాబుకి చిన్న గాయం కూడా కాలేదు. శ్రీసాయి మా బిడ్డను కాపాడారు. సాయిని నమ్ముకుంటే ఆయన మనతోనే ఉండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారు.
మరుసటిరోజు విజయదశమి. బాబా మందిరానికి వెళ్ళి బాబాను దర్శించి, బాబును కాపాడినందుకు మనసారా బాబాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అక్కడే బాబా ప్రసాదం స్వీకరించి (భోజనం చేసి) ఇంటికి తిరిగి వచ్చాము. మేము 2021లో శిరిడీ వెళ్ళాలనుకుంటున్నాము. మమ్మల్ని శిరిడీకి పిలిపించుకుని వారి దర్శనాన్ని అనుగ్రహించమని బాబాను మనసారా ప్రార్థిస్తున్నాను.
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDelete🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.
ReplyDeleteఓం సాయిరామ్!
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
574 days
ReplyDeletesairam
Om Sai ram
ReplyDeleteSaima always be with my family🙏🙏 please give peace sai ram. I believe you. I surrounded my self at your louts feet
ReplyDeleteBaba please baba ma mother problem cure cheyi thandri nenne namukuna mamalini vadilipetaku sai kapadu thandri
ReplyDelete