సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 613వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:
  1. గురూజీ ఆజ్ఞను ఉల్లంఘించకుండా చూసిన బాబా
  2. కోజాగిరి పౌర్ణమినాడు బాబా కృప
  3. నీటి సమస్యను తీర్చేసిన బాబా

సాయిభక్తురాలు సుజాత మరికొన్ని అనుభవాలు మనతో పంచుకుంటున్నారు:

గురూజీ ఆజ్ఞను ఉల్లంఘించకుండా చూసిన బాబా

2020, అక్టోబరు 31 ఉదయం నేను ఆన్‌లైన్‌లో లెవెల్-2 ధ్యాన తరగతికి హాజరయ్యాను. నేను మా ఇంటి బయట కుర్చీలో కూర్చుని, నా కాళ్ళు ఒక సిమెంట్ బల్లమీద పెట్టుకుని క్లాసు వింటున్నాను. గురూజీ ధ్యానం గురించి కొంత వివరణ ఇచ్చిన తరువాత, “అందరూ కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యండి. నేను చెప్పేవరకూ ఎవరూ కళ్లు తెరువవద్దు” అని చెప్పారు. చాలా సమయం గడిచాక నేను సరిగా కూర్చోనందువల్ల నా కాళ్లు బాగా నొప్పిపుట్టసాగాయి. దాంతో నేను ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను. గురువుగారు “నేను చెప్పేవరకు కళ్ళు తెరవవద్దు” అన్నారు. గురువు మాట మీరకూడదు కదా! ‘ఇప్పుడెలా?’ అని ఆందోళన చెందాను. వెంటనే మన తండ్రి సాయిని తలచుకుని, “బాబా! ధ్యాన శిక్షణ ఇస్తున్న గురూజీ ఆజ్ఞను ఉల్లంఘించలేను. అలాగని ఈ నొప్పిని  భరించలేకపోతున్నాను. దయ చూపు తండ్రీ!” అని మనస్ఫూర్తిగా ప్రార్థించి కళ్లు తెరిచి ఫోన్ వైపు చూశాను. ఆశ్చర్యం! ఫోన్లో నెట్‌వర్క్ డిస్కనెక్ట్ అయి, ‘Error Preparing to connect’ అని కనిపించింది. వెంటనే మళ్ళీ కనెక్ట్ అయ్యేసరికి గురూజీ తిరిగి సందేశం ఇస్తున్నారు. అంటే, నేను కళ్లు తెరవడం, గురూజీ ధ్యానాన్ని ఆపుచేయడం సుమారుగా ఒకే సమయంలో జరిగాయి. ఆ విధంగా బాబా నేను గురువాజ్ఞను అతిక్రమించకుండా చూసుకున్నారు. బాబా తన బిడ్డల ప్రతి కదలికను ఎంతో శ్రద్ధగా కనిపెట్టుకుని ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఒక్కటే, మన జీవిత పగ్గాలు ఆయనకు అప్పగించడమే. మన తండ్రి సాయి కృప అందరిపై నిరంతరం ప్రసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

కోజాగిరి పౌర్ణమినాడు బాబా కృప

ఒకరోజు మన సంస్కృతి-సాంప్రదాయాలు అనే గ్రూపులో, “కోజాగిరి పౌర్ణమి జరుపుకుంటే మానసిక స్థిరత్వం లభిస్తుందనీ, ఇంటిల్లిపాదికీ సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందనీ, పౌర్ణమినాటి రాత్రి లక్ష్మీదేవిని తులసికోట వద్ద పూజించి, పరమాన్నం నైవేద్యంగా పెట్టాలనీ, ఆ నైవేద్యంపై రాత్రంతా చంద్రకాంతి ప్రసరించేలా ఉంచి, తెల్లవారిన తర్వాత దాన్ని స్వీకరించాల”నీ పోస్ట్ చేశారు.  ఆరోజే కోజాగిరి పౌర్ణమి! కానీ మా ఇంట్లో తులసికోట ఉన్న ప్రదేశంలో ఎలుకలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అందువలన నేను, “బాబా! ఈరోజు ఎలుకలు రాకుండా చేసి ప్రసాదాన్ని సంరక్షించు. నీ దయచూపు తండ్రీ!” అని వేడుకున్నాను. నిజంగా బాబా దయ అపారమైనది. ఆరోజు ఒక్క ఎలుక కూడా రాలేదు. మరుసటిరోజు తెల్లవారాక బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, అందరమూ ప్రసాదం స్వీకరించాము. ఆరోజు రాత్రి ఎప్పటిలానే ఎలుకలు తులసికోట వద్ద కనిపించాయి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతగా ప్రార్థిస్తే అంతలా జాగ్రత్తగా కాపాడుతారనే విషయం ఎఱుకలోకి వచ్చేలా చేస్తున్నారు నా తండ్రి సాయి. “థాంక్యూ బాబా!”

నీటి సమస్యను తీర్చేసిన బాబా

రోజు విడిచి రోజు మాకు వేకువఝామున 4:30 గంటలకే నీళ్లు వస్తాయి. 2020, అక్టోబరు 29న వేకువనే మెలకువ వచ్చి, లేచి మోటార్ వేస్తే మోటారు తిరగలేదు. సౌండ్ తేడాగా వస్తుంది. చూస్తే, మోటారుకున్న రబ్బరు బెల్ట్ తెగిపోయివుంది. అంత పొద్దున్నే ఏమి చేయడానికీ పాలుపోక బట్టలు ఆరేసుకునే ప్లాస్టిక్ వైర్ కట్టాను. అయినా మోటార్ తిరగలేదు. అప్పుడు మా నాన్నగారి పాత చొక్కాను అక్క, నేను చెరొక ప్రక్క పట్టుకుని మెలిపెట్టి మోటారు రెండు చక్రాలకు కట్టాము. కొద్దిసేపు మెల్లగా మోటార్ తిరిగింది, కానీ ట్యాంకులోకి నీళ్లు వెళ్ళలేదు. ఇక చేసేదిలేక మూడు డ్రమ్ములు, ఒక గంగాళం, బక్కెట్లల్లో నీళ్ళు పట్టుకుని వాడుకుందాంలే అనుకున్నాం. అవి పట్టుకునేసరికి మోటార్ ఆగిపోయింది. తెల్లవారాక మా తమ్ముడు వెళ్లి రబ్బరు బెల్టు కొనితెచ్చి ఫిట్ చేసి మోటార్ వేసినా నీళ్లు రాలేదు. మా ఇంట్లో మొత్తం తొమ్మిదిమంది సభ్యులం. ఆరోజు ఉదయం నుండి రాత్రి వరకు నీళ్లు వాడుకునేసరికి మూడు డ్రమ్ముల్లో కొంచెం కొంచెం నీళ్లు మిగిలాయి. దాంతో నేను, “ఇప్పుడెలా బాబా? రేపు నీళ్లు రావు కదా! నువ్వే ఏదైనా మార్గం చూపి మాకు సహాయం చేయి” అని మనసులోనే బాబాను వేడుకున్నాను. ఆ వెంటనే నాకు సాయి సచ్చరిత్రలో ‘ఆహారపదార్థాల మీద బాబా ఊదీ చల్లి, మూతలు పూర్తిగా తీయకుండా వడ్డించడం’ అనే లీల గుర్తుకొచ్చింది. అంతేకాకుండా, ఉప్పునీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచినీరుగా మార్చిన లీల కూడా గుర్తుకొచ్చింది. మరుసటిరోజు వేకువఝామున గం.3:30 నిమిషాలకు నేను నిద్రలేచి బాబా ఊదీ తీసుకుని వెళ్లి “పరమం పవిత్రం బాబా విభూతిం” అనే మంత్రాన్ని స్మరిస్తూ అన్ని డ్రమ్ములలో కొంచెం కొంచెం వేసి, “బాబా! వీటిలో నుండి ఎన్ని నీళ్లు తీస్తే మరలా అన్ని నీళ్లు వచ్చి చేరేలా చేయి తండ్రీ! ఈ రోజంతా నీళ్ళు రావు, కాబట్టి నీదే భారం” అని మనసులోనే బాబాకు చెప్పుకుని వెళ్లి పడుకున్నాను. మళ్ళీ 4:20కే మెలకువ వచ్చింది. లేచి కాలకృత్యాలు తీర్చుకునేసరికి ఒక డ్రమ్ములో నీళ్లు అయిపోయాయి. అప్పుడు, “బాబా! మీరు బావిలో కదా పువ్వులు వేశారు. నేను మరీ ఎక్కువ ఆశిస్తున్నాను” అని మనసులోనే అనుకుని సాయితండ్రికి క్షమాపణలు చెప్పుకుని, “ఈ నీటి సమస్యను మాత్రం ఏదో విధంగా తీర్చండి” అని మస్ఫూర్తిగా వేడుకున్నాను. తర్వాత మా ప్రక్కింటివాళ్ళని నీళ్లు అడిగాము. వాళ్లు సరేనని నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత 10, 11 గంటల సమయంలో మా ఇంటి పక్కన రెండో ఇంట్లో ఉండే లక్ష్మీగారు తనంతతానే మా అక్కను పిలిచి నీళ్లు తీసుకుని వెళ్ళమని చెప్పారు. దాంతో మా సమస్య కొంతవరకు తీరింది. సాయంత్రం వరకు ఇక ఇబ్బంది లేదులే అనుకున్నాం. కానీ బాబా ప్రేమను చూడండి! నెలరోజులలో ఒక్కసారి కూడా సాయంత్రంపూట రాని నీళ్లు ఆరోజు సాయంత్రం ఆరు గంటలకు వచ్చాయి. అంతేకాదు, బాబా దయవల్ల మోటర్ కూడా పనిచేసింది. ఆ విధంగా బాబా మా నీటి సమస్యను తీర్చారు. మనం ఆ తండ్రిని ఎంతలా తలచుకుంటామో, ప్రార్థిస్తామో, సర్వస్యశరణాగతి చెందుతామో అంతలా ఆయన మనకు తోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా నేను బాబా మీద పూర్తిగా ఆధారపడతాను. ఆయన మాకు తోడునీడై మమ్మల్ని సంరక్షిస్తున్నారు. బాబా రక్షణను నేను స్పష్టంగా అనుభూతి చెందుతున్నాను. “బాబా! మీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. నా కుటుంబ బాధ్యతను మీకే అప్పగిస్తున్నాను తండ్రీ. మీరు సదా మాతోనే ఉండాలని కోరుకుంటున్నాను తండ్రీ!”


8 comments:

  1. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  2. 🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister.

    ReplyDelete
  3. Om sai ram baba amma ki infection taggipovali problem cure avali thandri sai

    ReplyDelete
  4. Baba santosh ki day shift ravali elagyinadaya daya chupinchu thandri

    ReplyDelete
  5. 🌷🌼🌷🙏🙏🙏🙏🙏🌷🌼🌺Om Sri Sai Ram 🌷🌼🌺🌼🌷

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo