సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 624వ భాగం.....


ఈ భాగంలో అనుభవాలు:

  1. సమస్య ఏదైనా బాబా అనుగ్రహంతో మాయం 
  2. ఊదీతీర్థంతో నెలసరి సమస్య పరిష్కారం


సమస్య ఏదైనా బాబా అనుగ్రహంతో మాయం 

సాయిభక్తురాలు శ్రీమతి ప్రశాంతి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. నా పేరు ప్రశాంతి. నేను UKలో నివసిస్తున్నాను. బాబా నాకు ప్రసాదించిన అనుభవాలలో కొన్నిటిని ఈరోజు మీతో పంచుకుంటాను. 

మొదటి అనుభవం:

2020, మే నెలలో మా పాపకి చేతులపైన, కాళ్ళపైన దద్దుర్లు లాగా వచ్చాయి. దద్దుర్లతో పాప చాలా ఇబ్బందిపడేది. డాక్టరుకి ఫోన్ చేసి విషయం వివరిస్తే, అది ఎగ్జిమా అని చెప్పి, ఒక క్రీం సూచించి ప్రతిరోజూ ఆ దద్దుర్లపై రాయమని చెప్పారు. నాకు తెలిసినవాళ్ళ పాపకి కూడా అలానే వచ్చింది. తను డాక్టర్ ఇచ్చిన క్రీం వాడుతున్నప్పటికీ ఏం ప్రయోజనం కనపడలేదు. అందువల్ల నేను ప్రతిరోజూ నా తండ్రి బాబాకు పూజ చేసి, పాపకి దద్దుర్లు తగ్గించమని ప్రార్థించి, బాబా ఊదీని ఆ దద్దుర్లపై రాస్తూ ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్ర ఒక అధ్యాయం చదువుతుండేదాన్ని. వీలున్నప్పుడు బాబా ఆరతి వింటుండేదాన్ని. రెండు వారాల తరువాత బాబా అనుగ్రహంతో దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయాయి. అసలు ఎగ్జిమా అంత త్వరగా తగ్గదని విన్నాను. కానీ మన సాయిబాబా దయవల్ల మా పాపకి త్వరగా తగ్గిపోయింది. “థాంక్యూ బాబా!” 

రెండవ అనుభవం:

ఆగస్టు నెలలో నాకు చంకలో చిన్న గడ్డలాగా వచ్చింది. నాకు చాలా భయమేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. నన్ను పరీక్షించిన డాక్టర్, “ఇది గడ్డలాగా ఉంది. కొన్నిసార్లు హార్మోన్ సమస్య వలన కూడా గడ్డలు వస్తాయి. రెండు వారాలు వేచి చూద్దాం, గడ్డ పరిమాణం పెరిగితే అప్పుడు స్కానింగ్ చేద్దామ”ని చెప్పారు. నేను ఇంటికి తిరిగి వచ్చాక నాకొచ్చిన సమస్య గురించి గూగుల్‌లో వెతకటం ప్రారంభించాను. అందులో, బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒక్కోసారి ఇలా గడ్డలాగా మొదలవుతుందని ఉంది. దాంతో నాకు ఇంకా భయమేసి బాబా దగ్గర కూర్చుని, “ప్లీజ్ బాబా, ఈ గడ్డ రెండు వారాల్లో పూర్తిగా తగ్గిపోయేలా అనుగ్రహించండి” అని కన్నీళ్ళతో బాబాను ఆర్తిగా ప్రార్థించాను. తరువాత ప్రతిరోజూ బాబాను స్మరించుకుంటూ ఆ గడ్డపై ఊదీ రాసేదాన్ని. అలాగే ప్రతిరోజూ బాబా చరిత్ర పారాయణ చేసేదాన్ని. సరిగ్గా రెండు వారాల తర్వాత పరీశీలించుకుంటే గడ్డ లేదు, పూర్తిగా మానిపోయింది. బాబా చూపిన కరుణకు చాలా ఏడుపొచ్చింది, అలాగే చాలా సంతోషంగా అనిపించింది. “బాబా! నేను ఎప్పుడు నిన్ను తలచినా నాతో ఉండి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. థాంక్యూ బాబా!” 

మూడవ అనుభవం:

ఇటీవల ఎందుకో రోజూ తలనొప్పి వస్తోందని మావారికి చెప్తే, ‘డయాబెటిక్ వచ్చిందేమో’ అన్నారు తను. దాంతో నాకు చాలా భయమేసి డాక్టరుకి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకుని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. తరువాత బాబాకు నమస్కరించుకుని, “తండ్రీ, ప్లీజ్! నాకు డయాబెటిక్ లేకుండా అనుగ్రహించండి. రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉండాలి. కావాలంటే ఐరన్ లోపమో, లేకపోతే విటమిన్-డి లోపమో ఉందని రిపోర్టు రావాలి, ప్లీజ్ బాబా! రిపోర్టులన్నీ నార్మల్ వస్తే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని ప్రార్థించాను. అప్పటినుండి ప్రతిరోజూ బాబాను ప్రార్థిస్తూ, బాబా చరిత్ర, బాబా అష్టోత్తర శతనామావళి, బాబా స్తవనమంజరి చదువుకుంటూ మనసులో బాబాను ధ్యానిస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ఉదయం మహాపారాయణ చేస్తుంటే డాక్టర్ నాకు ఫోన్ చేసి, “రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయి. కేవలం ఐరన్, విటమిన్-డి, విటమిన్-బి12 తక్కువగా ఉన్నాయి” అని చెప్పింది. ఆ మాట వినగానే సంతోషంతో ఏడుపొచ్చేసింది. “థాంక్యూ బాబా, థాంక్యూ సో మచ్!” బాబాకు మ్రొక్కుకున్నట్లుగా ఇప్పుడు ఆ అనుభవాన్ని మీతో పంచుకున్నాను. 

 జై సాయిరాం!


ఊదీతీర్థంతో నెలసరి సమస్య పరిష్కారం 

కర్నూలు నుండి సాయిభక్తురాలు శ్రీమతి శ్యామల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. 

సాయిభక్తులకు నా నమస్కారాలు. నా పేరు శ్యామల. మాది కర్నూలు. బాబా ఊదీ మహిమను తెలిపే ఒక చిన్న అనుభవాన్ని నా సాటి సాయిభక్తులతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి ఈ బ్లాగులో ప్రచురించిన సాయిభక్తుల అనుభవాలలో, బాబా ఊదీతీర్థం ఒక స్త్రీ నెలసరి సమస్యను ఎలా పరిష్కరించిందో చదివాను. నాకు కూడా నెలసరి సక్రమంగా వచ్చేది కాదు. దాంతో నా సమస్య పరిష్కారానికి నేను కూడా ఆ అనుభవంలో చెప్పినట్లు ఒకసారి ప్రయత్నం చేద్దామనుకుని, బాబాను ప్రార్థించి ఊదీతీర్థాన్ని సేవించాను. ఇంకా నా సమస్య పరిష్కారమైతే ఈ బ్లాగ్ ద్వారా సాటి సాయిభక్తులతో నా అనుభవాన్ని పంచుకుంటానని అనుకున్నాను. బాబా అనుగ్రహంతో ఆ మరుసటిరోజే నా నెలసరి సమస్య తీరింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలాంటి సమస్య మా పాపకు కూడా ఉంది. నాకు కలిగిన అనుభవంతో తనను కూడా బాబా ఊదీతీర్థాన్ని సేవించమని చెప్పాను. తను కూడా బాబాను ప్రార్థించి ఊదీతీర్థాన్ని సేవించింది. ఊదీతీర్థంతో మా పాపకు కూడా నెలసరి సమస్య తీరింది. “చాలా చాలా ధన్యవాదాలు బాబా!



4 comments:

  1. 🙏💐🙏💐🙏💐🙏💐🙏
    మునిగణ వందిత సాయిరాం
    పతితపావన సాయిరాం

    ReplyDelete
  2. Baba please help me sai

    ReplyDelete
  3. Sai plz help me save me immediately from my problem I can't bear this pain

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo