- ప్రార్థించినంతనే అనుగ్రహవర్షం కురిపించే సాయితండ్రి
- బాబాను ప్రార్థించినంతనే సమస్యలు తీరుతాయి
ప్రార్థించినంతనే అనుగ్రహవర్షం కురిపించే సాయితండ్రి
ఓం శ్రీ సాయి లీలానుగ్రహప్రదాయ నమః. అందరికీ సాయిరాం! ఈమధ్య బాబా నాపై చూపిన లీలానుగ్రహాలను మీతో పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. ముందుగా మన సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. మీరు చేసే సాయిసేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. మన బాబా తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలిపే అనుభవాలను అందరితో పంచుకునే గొప్ప అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎప్పటికీ మనం ఇలా ఒకరితో ఒకరం సాయి ప్రేమను పంచుకుంటూ ఆనందంగా ఉండాలని బాబాను కోరుకుంటున్నాను.
ఇక, బాబా నాకు చూపిన లీల గురించి చెప్తాను. ఈమధ్య నేను ఒక వాట్సాప్ గ్రూపులో ఒక మెసేజ్ చూశాను. అది సాయి కష్టనివారణ మంత్రం గురించిన గ్రూప్ లింక్. అసలు అలాంటి మంత్రం ఒకటుంటుందని కూడా నాకు తెలీదు. వెంటనే గూగుల్ చేసి చూసి ఆ మంత్రాన్ని రాసుకున్నాను. తరువాత ఆ గ్రూపులో చేరాను. ఆ గ్రూపులోని సభ్యులు కనీసం రోజుకి ఒకసారి అయినా ఆ మంత్రాన్ని చదివి ఆ గ్రూపులో రిపోర్ట్ పెట్టాలి. మొదటిరోజు నేను మూడుసార్లు ఆ మంత్రాన్ని చదివి గ్రూపులో రిపోర్ట్ పెట్టాను. కాసేపటికి ఆ గ్రూపు అడ్మిన్ వాళ్ళు అన్ని భాషల్లో ఆ మంత్రం యొక్క pdf ఫైల్, యూట్యూబ్ లింక్ పెట్టారు. నేను pdf సేవ్ చేసుకుందామని డౌన్లోడ్ చేసి చూస్తే, అది నేను అంతకుముందు గూగుల్ చేసి చదివింది కాదు, పూర్తిగా వేరేగా ఉంది. నాకు ఏం చేయాలో తోచలేదు. మొదటిరోజే ఇలా అయిందేమిటి అనిపించింది. అసలు ఆ pdf లో ఉన్నది అర్థం కావటం లేదు. తెలుగులోనే ఉంది, కానీ స్పష్టంగా లేదు. దాంతో మళ్ళీ గూగుల్ చేశాను. అన్ని వెబ్సైట్లలోనూ నేను చదివిన మంత్రమే ఉంది. గ్రూపువాళ్ళు pdf లో ఇచ్చిన మంత్రం ఎక్కడా లేదు. తరువాత వాళ్ళు ఇచ్చిన యూట్యూబ్ లింక్ చూస్తే అక్కడ నేను చదివిందే ఉంది. నాకు చాలా అయోమయంగా అనిపించింది. గ్రూపువాళ్ళే రెండు రకాలుగా ఇచ్చారు. ఏది చదవాలి? ఏది సరైంది? నేను అంతకుముందు చదివి రిపోర్ట్ పెట్టిన మంత్రాన్నే కొనసాగిద్దామని అనుకున్నాను. కానీ అంతలోనే మళ్ళీ సందేహం, రెండిట్లో ఏది అసలైంది అని. దాంతో నేను గ్రూపు నుండి బయటకు వచ్చేద్దామని కూడా అనుకున్నాను. అంతలోనే, “మీకు ఏ సందేహాలు ఉన్నా నన్ను అడగండి” అని సచ్చరిత్రలో బాబా చెప్పిన మాట గుర్తుకొచ్చింది. వెంటనే నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! ఆ రెండు మంత్రాల్లో నేను ఏది చదవాలో నువ్వే చెప్పు. అప్పటివరకు నేను ఏ మంత్రమూ చదవను” అని చెప్పుకున్నాను. పిలిచినంతనే పలికే నా సాయి ఆ మర్నాడే నా సందేహానికి సమాధానం ఇచ్చేశారు. ఆ మర్నాడు నేను మన బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదవటానికి లింక్ ఓపెన్ చేశాను. అందులో ప్రచురించిన మొదటి అనుభవంలోనే ఉంది నా సాయి ఇచ్చిన సమాధానం. నేను ముందురోజు ఏదైతే చదివి రిపోర్ట్ పెట్టానో ఆ మంత్రమే ఆ అనుభవంలో ఉంది. ఇంతకుముందెప్పుడూ నేను ఆ మంత్రాన్ని మన బ్లాగులో చూడలేదు. అలాంటిది నేను బాబాను అడిగిన మర్నాడే బ్లాగులో వచ్చింది. అంటే, “నువ్వు చదివిందే కొనసాగించు” అని బాబా నాకు సమాధానమిచ్చారు. చాలా సంతోషంగా అనిపించి బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా నేను ఆ మంత్రాన్ని చదివేలా చేసిన నా సాయి లీల చూశారా! ఇలాంటివి మనందరికీ నిత్యానుభవాలే కదా! ఇలా అడగగానే అలా సమాధానం ఇచ్చేస్తారు మన సాయి. “లవ్ యు సాయీ!”
ఇక బాబా చూపిన మరో అనుగ్రహం గురించి చెప్తాను. ఈమధ్య మా మేనకోడలి విషయంలో బాబా అనుగ్రహం చూపించారు. మా మేనకోడలు ఈమధ్య వ్యాయామం చేయటం మొదలుపెట్టింది. వ్యాయామం ప్రారంభించిన రెండు రోజులకు తనకు జ్వరం వచ్చేసింది. అది వ్యాయామం వల్ల వచ్చిన జ్వరమే. కానీ, ఈ కరోనా రోజుల్లో జ్వరం వస్తే ఎంత టెన్షన్ పడుతున్నామో మీ అందరికీ తెలుసు. నేను బాబాకు నమస్కరించుకుని, మా మేనకోడలి జ్వరం చాలా త్వరగా తగ్గించమని ప్రార్థించి, తనకు త్వరగా జ్వరం తగ్గిపోతే ఈ అనుభవాన్ని మన సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటానని బాబాతో చెప్పుకున్నాను. అదేరోజు పోస్టులో శిరిడీ నుంచి బాబా ఊదీ, ప్రసాదం వచ్చాయి. వెంటనే బాబా ఊదీని మా మేనకోడలికి పెట్టి, ప్రసాదం ఇచ్చాము. బాబా అనుగ్రహంతో మర్నాటికల్లా తన జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. ప్రార్థించినంతనే అనుగ్రహవర్షం కురిపించే సాయితండ్రికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఆయన బిడ్డగా బాబా పేరు నిలబెట్టేలా బ్రతికితే చాలు. “మేము అలా బ్రతకాలన్నా కూడా నీ అనుగ్రహమే కావాలి బాబా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించు సాయీ!”
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు!
శుభం భవతు!
ఓం సాయిరాం!
బాబాను ప్రార్థించినంతనే సమస్యలు తీరుతాయి
సాయిభక్తుడు రవి తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరామ్! నా పేరు రవి. నేను ఎప్పుడు బాబాను ప్రార్థించినా బాబా వెంటనే నా సమస్యలను తీరుస్తారు. బాబా అనుగ్రహంతో ఇటీవల జరిగిన రెండు అనుభవాలను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
మొదటి అనుభవం:
ఒకరోజు అర్థరాత్రిపూట నాకు అకస్మాత్తుగా గుండెల్లో దడ మొదలైంది. నేను బాబాను స్మరించుకుని, నీళ్ళలో కొద్దిగా బాబా ఊదీని కలుపుకుని త్రాగి, ‘ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః’ అనే నామాన్ని జపించసాగాను. బాబా అనుగ్రహంతో కేవలం 5 నిమిషాలలో గుండె దడ తగ్గిపోయింది. ఎంతో సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
రెండవ అనుభవం:
నాకు ఆస్త్మా ఉంది. ఒకరోజు ఉదయాన్నే కఫంతోను, దగ్గుతోను బాగా ఇబ్బందిపడ్డాను. బాబాను ప్రార్థించి, “ఈ ఆస్త్మా సమస్యను వెంటనే తగ్గించండి బాబా. మీ దయవల్ల ఈ ఆస్త్మా తగ్గితే నా ఈ అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకుని, బాబాను స్మరించుకుంటూ వేడినీళ్ళు నోట్లో పోసుకుని పుక్కిలించాను. బాబా దయవల్ల కాసేపటికి ఆస్త్మా నుండి ఉపశమనం కలిగింది. “థాంక్యూ బాబా! ఇంత ఆలస్యంగా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా. ఐ లవ్యూ బాబా. క్రొత్తగా కిరాణా స్టోర్ పెట్టాను బాబా! దయచేసి ఈ వ్యాపారం మంచి లాభాల్లో నడిచేలా అనుగ్రహించండి. నాకున్న అప్పులు కూడా వీలైనంత త్వరలో తీర్చేలా ఆశీర్వదించండి బాబా. నాకున్న ఆరోగ్య సమస్యలన్నీ పూర్తిగా తగ్గేలా అనుగ్రహించండి బాబా!”
Sai kadta nivarana mantram link pampandi
ReplyDeleteOm sai ram
Please cure my husband asma. Be with us and bless🙏🙏🙏
ReplyDeleteOm sai ram be with me.
ReplyDeleteఓం సాయిరాం!
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
584 days
ReplyDeletesairam
sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai sai
జై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteBaba please baba amma ki problem cure cheyi thandri tondarga nenne namukunanu sai thandri
ReplyDelete