సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 623వ భాగం.....



ఈ భాగంలో అనుభవాలు:
  1.  ఊహ నిజమైతే నరకం - ఆ వ్యధకి బాబా ఇచ్చిన ఊరట
  2. నా తోడు-నీడ బాబానే

ఊహ నిజమైతే నరకం - ఆ వ్యధకి బాబా ఇచ్చిన ఊరట

సాయిబంధువులకు నమస్కారం. బాబా లీలలను అందరికీ తెలియజేసే ఇటువంటి బ్లాగ్ ప్రారంభించిన సాయికి నా ధన్యవాదాలు. ఈ బ్లాగ్ చదువుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నా జీవితంలో జరిగిన అద్భుతాన్ని గురించి సాటి సాయిభక్తులతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా పేరు చెప్పలేను.


కొంతకాలం క్రితం, నాకు జరుగుతున్నదేమిటో నాకే అర్థంకాని సంఘటనలు జరిగేవి. నాకు మా మేనత్త అంటే చాలా ఇష్టం. హఠాత్తుగా తను అనారోగ్యానికి గురైనట్లు, చనిపోతున్నట్లు నాకు ఊహ వచ్చేది. “ఏంటి, ఇలాంటి ఊహ వస్తోంది?” అని అనుకునేదాన్ని. మళ్లీ అంతలోనే, ‘అలాంటిదేమీ జరగదులే’ అని మనసుకి సర్దిచెప్పుకునేదాన్ని. కానీ, కొన్నాళ్ళకి నిజంగానే మా మేనత్త మరణించారు. నాకెంతో ఇష్టమైన మేనత్త మరణాన్ని తట్టుకోలేకపోయాను.


కొన్ని సంవత్సరాల తరువాత మా పెదనాన్నగారి గురించి కూడా నాకు అలాంటి ఊహే రావడం మొదలైంది. అలాంటి ఊహ రాకూడదని ఎంత అనుకున్నా అలాగే వచ్చేది. దాంతో నాకు చాలా భయం వేసేది. అది ఎవరికీ చెప్పుకోలేని నరకం. అయినవాళ్ళ గురించి మనసులో ఇలాంటి ఊహతో నరకం అనుభవించేదాన్ని. కొన్నాళ్ళకి నేను భయపడినట్లే మా పెదనాన్నగారు కూడా మరణించారు. నా ఊహ నిజమవటంతో నేనెంతో బాధపడ్డాను. ‘అసలు ఇలా కూడా జరుగుతుందా? అయినా నాకే ఎందుకిలా జరుగుతోంది? నా దురదృష్టం కాకపోతే?” అని చాలా మధనపడ్డాను. మళ్ళీ ఎవరి గురించి నాకు అలాంటి ఊహ వస్తుందోనని చాలా భయమేసేది. నా బాధను, భయాన్ని ఎవరికీ చెప్పుకోలేను. అయినా ఎలా చెప్పుకోగలను?


కొన్నాళ్ల తరువాత నాకు మా చిన్నాన్న గురించి అలాంటి ఊహ రావటం మొదలైంది. ఆలోచనలు మళ్ళించుకుందామని ఎంతగా ప్రయత్నించినా ఆ ఊహే వచ్చేది. నాకు చాలా భయం వేసేది. “నేను చనిపోతే ఈ నరకం తప్పుతుంది కదా” అనిపించేది. “చిన్నాన్నకి కూడా ఏదైనా అయితే ఇంక నేను తట్టుకోలేను, ఆయనకి ఏమీ కాకూడదు. పిల్లలు చిన్నవాళ్ళు. ఆయనకేమైనా అయితే వాళ్ళేమైపోతారు?” అని బాధపడేదాన్ని. “దేవుడా, ఎందుకు నాకీ నరకం?” అనుకునేదాన్ని. తరువాత కొన్ని రోజులకి కరోనా మొదలైంది. నా భయం ఇంకా ఎక్కువైంది. సరిగ్గా అప్పుడే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాబాకు సంబంధించిన పోస్టులు వచ్చేవి. అవి చదివితే మనసుకు ప్రశాంతంగా ఉండేది. అలా నెమ్మదిగా నేను బాబాకు భక్తురాలినయ్యాను. ఒకరోజు రాత్రి ఎంతో బాధపడుతూనా బాధనంతా బాబాతో చెప్పుకుని, బాబా! ఇలాంటి నరకం శత్రువులకు కూడా రాకూడదు. మా చిన్నాన్నకి ఏమీ కాకూడదు. ఇకపై నాకు ఇలాంటి ఊహలేమీ రాకుండా అనుగ్రహించండి బాబా” అని ఎంతో ఏడ్చాను.


నేను భయపడినట్లే కొద్ది రోజుల తరువాత మా చిన్నాన్నకి కరోనా వచ్చింది. కరోనా ప్రభావం చిన్నాన్నపై కొంచెం ఎక్కువగా ఉండటంతో ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. “చిన్నాన్నకు ఏమీ కాకూడదుఆయన ఆరోగ్యంగా ఉండాల”ని నేను బాబాను వేడుకున్నాను. తరువాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ వచ్చింది. “Already the situation is changed from worst to better” (ప్రమాదకర స్థితి నుండి మెరుగైన స్థితికి పరిస్థితి మారింది) అని. కొన్నిరోజులకి చిన్నాన్న పూర్తిగా కోలుకున్నారు. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇది పూర్తిగా బాబా అనుగ్రహమే. “బాబా! నీకు శతకోటి ధన్యవాదాలు. ఒక తండ్రిలా నా బాధనిసమస్యని దూరం చేశావు. నీ అనుగ్రహంతో ఇంక భవిష్యత్తులో నాకు అలాంటి ఊహలు రావని నమ్మకం వచ్చింది. నీ కృప ఎల్లప్పుడూ మా అందరి మీద ఉండేలా చూడు తండ్రీ!”

ఓం సాయిరాం!


నా తోడు-నీడ బాబానే

సాయిభక్తురాలు అర్చన తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! నా పేరు అర్చన. నా జీవితంలో నాకు తోడు నీడగా ఉన్న బాబాకు పాదాభివందనం. బాబా నాకు ఒక ఆత్మీయ సాయిబంధువుని పరిచయం చేశారు. బాబాకు సంబంధించిన చాలా విషయాల్లో సందేహనివృత్తి చేయటంలో, బాబాకు దగ్గరవటంలో ఆ సాయిబంధువు నాకు చాలా సహాయపడ్డారు. అలాగే ఎన్నో సమస్యలతో అలసిపోయిన నాకు ధైర్యవచనాలు చెప్పారు. “థాంక్యూ, సాయిరాం సాయీ!”

ఇకపోతే బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. గత కొంతకాలంగా నేను కుటుంబసమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. మానసిక ప్రశాంతత కోసం ఒకసారి నేను మా అమ్మావాళ్ళింటికి వచ్చాను. ఒకరోజు గుంటూరులో పనివుండి నేను, మా అమ్మ, నాన్న మా ఊరినుండి బయలుదేరాము. సగం దూరం ప్రయాణించాక మా నాన్న మాస్క్ మర్చిపోయారని గ్రహించాము. గుంటూరు వెళ్ళగానే మాస్క్ కొనుక్కోవచ్చని అనుకున్నాము. గుంటూరు చేరాక మాస్క్ కొనుక్కోవటానికి ఒక షాపుకి వెళ్ళాము. మా అమ్మ తన మాస్క్ మా నాన్నకు ఇచ్చి తాను ముఖానికి కర్చీఫ్ అడ్డం పెట్టుకుంది. కాసేపయ్యాక మేము గమనించాము, ఆ షాపులోని సేల్స్‌మాన్‌కి జలుబు, దగ్గు ఉందని. ఆ విషయం మొదట్లో మేము గమనించలేదు. దాంతో నాకు చాలా భయం వేసింది. అప్పటికే మేము అతనికి దగ్గరగా నిల్చుని మాట్లాడాము. ఆ తరువాత మా పనులు చూసుకుని ఇంటికి తిరిగి వచ్చాము. ఇంటికి వచ్చాక అమ్మ తనకు ఒళ్లునొప్పులుగా ఉందని చెప్పింది. నాకు భయం వేసి బాబాను ప్రార్థించి, “మేమంతా ఆరోగ్యంగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని అనుకున్నాను. బాబా దయవల్ల అందరం ఆరోగ్యంగా ఉన్నాము. “థాంక్యూ సో మచ్ బాబా!”

నాకు గత 11 సంవత్సరాల నించి ఒక సమస్య ఉంది. దానివల్ల నేను మానసిక ప్రశాంతతను కోల్పోయాను. అయినప్పటికీ నేను బాబానే నమ్ముకున్నాను. ఆయనెప్పుడూ నాకు తమ సందేశాలను ఏదో ఒక రూపంలో అందిస్తూ 'నేనున్నా'నని భరోసా ఇస్తున్నారు. “కానీ, నేను చాలా అలసిపోయాను బాబా! నాకు ఈ బాధనించి త్వరగా విముక్తి ప్రసాదించు తండ్రీ! ప్రతి కష్టసమయంలోనూ నీ పారాయణ, నీ పూజ క్రమం తప్పకుండా చేస్తున్నాను. కానీ, నాకు ఓపిక సరిపోవడం లేదు సాయీ. నన్ను త్వరగా ఆశీర్వదించమని కన్నీటితో వేడుకుంటున్నాను బాబా!”


11 comments:

  1. Very nice sai leelas. Please baba cure my problem. Be with us. Give long life to them. No harm to them. Please change my thoughts. I am in hell. Please tandri help me. Every day I read these experience s with out fail. Give that death to me. Please save them from my thoughts. Take care of them. I am using babas udhi in all eating iteams. Please cure me saima I want their longevity life🙏🙏🙏 I am useing medicine s to this problem. I am devotee in maha parayan. Om sai ram om sai ma. I love you❤

    ReplyDelete
    Replies
    1. No problem baba will save ur life.nodoubt atall.i assure

      Delete
    2. Don't think negative .Be positive.Baba will definitely help you.

      Delete
  2. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  3. ఓం సాయిరాం🙏💐🙏

    ReplyDelete
  4. Baba please help me baba baba ma mother ki problem cure avali thandri santosh healthy ga vundali thandri nenne namukuna thandri kapadu thandri na bada ni ardam chesuko thandri pleaseeeee sai sai sai sai

    ReplyDelete
  5. ఓం సాయిరాం!

    ReplyDelete
  6. నేను చాలా అలసిపోయాను బాబా! నాకు ఈ బాధనించి త్వరగా విముక్తి ప్రసాదించు తండ్రీ!
    ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete
  7. బాబా మీ బాధను ఖచ్చితంగా తొలగిస్తారు

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo