- నా సాయి కృపాభిక్ష - నా ఉద్యోగం
- సాయి దివ్యపూజ మహిమ
నా సాయి కృపాభిక్ష - నా ఉద్యోగం
యు.ఎస్.ఏ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
“oms‘AIR’am” ఈ మూడు పదాలు నా ప్రపంచంలో చాలా ఆనందాన్ని తీసుకుని వచ్చాయి. ఆ పదాలే(AIR) నా శ్వాస. కోవిడ్-19 కారణంగా 2020, మే నెలలో నేను ఉద్యోగం కోల్పోయాను. నేను కాంట్రాక్టు ఉద్యోగినిగా పనిచేస్తుండటంవలన సంస్థ యాజమాన్యం నన్ను ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉంది. అందుచేత వాళ్ళు నన్ను ఉద్యోగం నుండి హఠాత్తుగా తొలగించారు. తరువాత నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూ ఎంతగానో ప్రయత్నించాను. కానీ, పదేళ్ల నా వృత్తిజీవితంలో మొదటిసారి నేను పెట్టుకున్న దరఖాస్తు ఎంపికకాని పరిస్థితిని చూశాను. అదివరకు నా రెజ్యూమ్ దాదాపు అన్ని జాబ్ డిస్క్రిప్షన్స్‌కి ఎంపిక చేయబడేది. కానీ ఈసారి నా దరఖాస్తులు ఎంపిక కాలేదు, కాబట్టి ఇంటర్వ్యూలు లేవు, ఉద్యోగమూ లేదు. ఈ పరిస్థితికి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. నేను మాస్టర్స్ పూర్తిచేసి అమెరికాలో నివాసముంటున్నాను. నేను ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి, లేకుంటే 90 రోజుల్లో నేను అమెరికా విడిచి వెళ్ళాలి. నా భర్త, పిల్లలు ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దూరంగా నేను ఎలా వెళ్ళగలను? అయితే ఉద్యోగం కోసం కొన్ని నెలల పాటు వేచి చూసినా ఉపయోగం లేకపోవడంతో నాకేమి చేయాలో తెలియక కాస్త ఆందోళన చెందసాగాను. చివరికి, “ఒక నెలలోపు నాకు ఉద్యోగం వచ్చినట్లైతే నా అనుభవాన్ని వెబ్‌సైట్‌లో పంచుకుంటాన”ని బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆపై తల్లిగా, భార్యగా నా పనులు, బాధ్యతలన్నింటినీ విడిచిపెట్టి అంకితభావంతో ఒక గదిలో కూర్చుని ఉద్యోగాలకోసం దరఖాస్తు చేస్తూ ఇంటర్వ్యూలకు సన్నద్ధమయ్యాను. కొన్ని వారాల తరువాత నాకు కొన్ని పర్మినెంట్ ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఆయా సంస్థలు ముందుగా నేను ఎంపిక అయ్యానని చెప్పిన తరువాత కూడా చివరిక్షణంలో నన్ను ఉద్యోగంలోకి తీసుకోలేదు. COVID-19 కాలంలో ఉద్యోగం సంపాదించడమే చాలా కష్టంగా మారింది. పలుమార్లు ఇంటర్వ్యూ చేసి, ఎంపిక అయ్యారని చెప్పిన తరువాత, ఆఫర్ లెటర్ పంపే బదులు, “మేము వేరే అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాము” అని కంపెనీలు చెప్తున్నాయి. మొదట్లో నా దరఖాస్తులు ఎంపిక కాకపోవడం, ఇంటర్వ్యూ కాల్స్ లేకపోవడంతో పోలిస్తే ఇప్పుడు కనీసం కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ వస్తున్నాయి, కానీ చివరికి కంపెనీలు అలా చెప్తుండటంతో నేను ఆశలు కోల్పోయాను. నేను మళ్ళీ బాబాను ప్రార్థించి, “నా జీవితంలో ఏమి జరుగుతోందో నాకు అర్థం కావట్లేదు బాబా. దయచేసి నాకు ఉద్యోగాన్ని ప్రసాదించండి” అని కోరుకున్నాను. తరువాత ఆ నెలాఖరులో బాబా దయవలన నాకు మంచి జీతంతో ఒక శాశ్వత ఉద్యోగం, చాలా తక్కువ జీతంతో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగం వచ్చాయి.
నేను శాశ్వత ఉద్యోగంలో చేరాను. అయితే ఒక నెలరోజులు పనిచేసిన తరువాత వ్యక్తిగత కారణాల వల్ల నేను ఆ ఉద్యోగాన్ని వదిలి కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. ఇది కేవలం నా సాయి కృపాభిక్ష. ఈ కరోనా కాలంలో కూడా ఉద్యోగాన్ని ప్రసాదించి బాబా నన్ను ఆశీర్వదించారు. కానీ కాంట్రాక్ట్ ఉద్యోగం కేవలం 3 నెలలు మాత్రమే. పైగా ఇక్కడ పని ఆఫ్‌షోర్ కో-ఆర్డినేటర్స్‌కి ఆన్‌సైట్ లాంటిది, నా టీమ్‌లోని అందరూ ఆఫ్‌షోర్‌లో ఉంటే, నేను ఒక్కదాన్నే ఆన్‌సైట్‌లో ఉండాలి. అందువలన ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుండి నాకు సరైన నిద్ర, ఆహారం లేకుండా పోయాయి. నా భవిష్యత్తుకు సంబంధించి తదుపరి దశ ఏమిటో ఖచ్చితంగా తెలియని స్థితిలో నేను మూగబోయాను. బాబా మాత్రమే నాకు సరైన మార్గాన్ని చూపించగలరని నమ్మకంతో ఉన్నాను. “బాబా! నా ప్రస్తుత ఉద్యోగ పరిస్థితులు, నా మేనేజర్ సృష్టించే సమస్యల కారణంగా నేను మనశ్శాంతిని కోల్పోయాను. అందువలన ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి బాబా”.
ప్రియమైన సాయి కుటుంబసభ్యులారా! దయచేసి నాకు త్వరలో ఉద్యోగం రావాలని, నేను నా కుటుంబంతో కలిసి ఉండాలని బాబాను ప్రార్థించండి. బాబాను పూర్తిగా నమ్మండి, ఆయనను చివరివరకు గట్టిగా పట్టుకోండి. హృదయపూర్వకంగా బాబాను ప్రార్థించి, మీ అభ్యర్థనను తెలియజేయండి, తదనుగుణంగా పనిచేయండి. బాబా చెప్పినట్లు ఆచరిస్తూ మిగిలినవాటిని ఆయన పాదాలకు సమర్పించి ఫలితం కోసం వేచి ఉండండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అందుకుంటారు. అదీ సాయి అంటే! “బాబా! నా హృదయస్పందన ఆగేవరకు దయచేసి ఎప్పటికీ నా చేయి వదలకండి. ఒక తల్లిగా, భార్యగా నాకు బాధ్యతలున్నాయి. అదే సమయంలో నేను నా వృత్తిని వదులుకోవాలనుకోవడం లేదు. నేను ఇతరులపై ఆధారపడలేను. కాబట్టి నన్ను ఆశీర్వదించండి బాబా. శతకోటి ప్రణామాలు బాబా”.
ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
సాయి దివ్యపూజ మహిమ
సాయిభక్తురాలు శ్రేయ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! ఓం సద్గురు సాయినాథాయ నమః. సాయిబంధువులందరికీ నా నమస్కారములు. సద్గురు సాయి దివ్యపాదాలకు నమస్కరిస్తూ బాబా ప్రసాదించిన ఒక అనుభవాన్ని సాయిభక్తులందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సాయికి నా నమస్కారములు.
మా నాన్నగారు ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. అన్ని సంస్థల్లో 58 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటే, మా నాన్నగారు పనిచేసే సంస్థలో 55 సంవత్సరాలకే ఉంది. మా నాన్నగారి సర్వీసు త్వరలో ముగియనుంది. కానీ ఆయనకి ఇంకా సర్వీస్ చేయాలని ఉంది. ఆ విషయమై ఆయన తన సర్వీసు పెంచమని కోరుతూ సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ సంస్థవారు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు మా అమ్మ ఈ సమస్య గురించి బాబాకు చెప్పుకొని ‘సాయి దివ్యపూజ’ మొదలుపెట్టింది. సాయి దివ్యపూజ పూర్తిచేసిన 5వ వారంనాడు ఆశ్చర్యకరంగా మా నాన్నగారికి ఆ సంస్థవాళ్లు ఫోన్ చేసి, కాంట్రాక్ట్ బేసిస్ మీద అదివరకు ఇచ్చిన జీతానికే ఆయనను ఉద్యోగంలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. మేమంతా ఎంతో సంతోషించాము. ఇది సాయిబాబా మాపై చూపిన ప్రేమ అని మా దృఢనమ్మకం. ఈ కాంట్రాక్టు సంవత్సరంపాటు కొనసాగాలని మేము సాయిబాబాను వేడుకుంటున్నాము. “థాంక్యూ సో మచ్ బాబా!”
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
🙏🙏🙏 Om srisairam Om srisairam Om srisairam thankyou sister
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteom sai ram om sai ram
ReplyDeletejai sairam
ReplyDelete🙏🙏🙏
Jai Sai nadh
ReplyDeleteBaba na pyna daya chupinchayya ne kosam edduru chustunamu thandri rakshinchu thandri sai sai sai
ReplyDeleteOm sai ram
ReplyDeleteఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDeleteఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
ReplyDeleteOm sai sri sai Jaya Jaya sai
ReplyDeleteబాబా నాకూ మీరే దిక్కు, నా సమస్యలు అన్నీ తీరితే నేను కూడా ఈ యొక్క బ్లాగ్ లో నా యొక్క అనుభవాలను త్వరగా పంచుకుంటాను. నాకు నా కుటుంబానికి మీరే దిక్కు సాయి🙏🙏🙏🙏🙏
ReplyDeleteఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏🙏💐💐
నా బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుంది, తనకు మీ ఆశీస్సులను ప్రసాదించండి తండ్రీ! తను తొందరగా అనారోగ్యం నుండి కొలుకున్నట్టుగా ఐతే ఈ అనుభవాన్ని కూడా బ్లాగ్ లో share చేసుకుంటాను. 🙏🙏🙏🙏