సద్గురు సాయి సమాధానం
యు.ఎస్.ఏ నుండి ఒక సాయి భక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
ఓం సాయిరామ్! సాయి లీలలను మనం మన దైనందిన జీవితంలో ఏదో ఒక విధంగా అనుభవిస్తూ ఉంటాం. వాటిలో కొన్నింటిని నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను.
నేను యు.ఎస్.ఏ లో నివాసముంటున్నాను. నా సోదరి వివాహం 2020, మార్చి 19న జరపడానికి పెద్దలు నిశ్చయించారు. నా భర్త, పిల్లలని వదిలి నేను వెళితే, వాళ్ళు తమ పనులు నిర్వహించుకోలేరు. ఇలా కొన్ని కారణాల వలన నేను వివాహానికి వెళ్ళాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డాను. నేను ఏ నిర్ణయం తీసుకోలేక ఫిబ్రవరి నెల చివరివరకు వేచి చూసి, 'ఎస్', 'నో' అని రెండు చీటీలు వ్రాసి, "బాబా! నేను వివాహానికి 'వెళ్లాలా? వద్దా?' మీ నిర్ణయం ఏమిటో చెప్పండి" అని ప్రార్థించి ఒక చీటీ తీసాను. బాబా సమాధానం 'వెళ్లొద్దు'అని వచ్చింది. ఇక్కడ మీకో విషయం చెప్పాలి, ఇలా చీటీల ద్వారా బాబాను అడిగిన సందర్భాలలో నాకు నచ్చని విధంగా బాబా సమాధానం వచ్చిన ప్రతిసారి నేను నాకు నచ్చినట్లు చేసేదాన్ని. అలాంటిది నాకు ఏ ప్రేరణ కలిగిందోగాని మొట్టమొదటిసారిగా నేను నా మనసు మార్చుకుని, బాబా సమాధానానికి కట్టుబడి నా భర్త, పిల్లలు, ఇంకా ప్రతి ఒక్కరితో వివాహానికి వెళ్ళనని చెప్పాను.
తరువాత కోవిడ్ 19 కారణంగా మార్చినెలలో ఏమి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ వివాహమైన మరుసటిరోజే నా పెద్ద కూతురు యుక్తవయస్సుకు వచ్చింది. మార్చి 23 నుండి అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి. విమానాల రాకపోకలు ప్రారంభించడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ వివాహానికి వెళ్లి ఉంటే, నేను భారతదేశంలో చిక్కుకుపోయేదాన్ని. అవసరమైన సమయంలో నేను లేకపోవడంవలన, జాగ్రత్తగా చూసుకోవడానికి వేరెవరూ లేనందున నా కూతురుకి చాలా కష్టంగా ఉండేది. జరపవలసిన కార్యక్రమాలు చేయలేకపోయేవాళ్ళం. ఇటు నా కుటుంబం, అటు నేను ఎంతో బాధ పడేవాళ్ళం. బాబా చెప్పినట్లు నడుచుకోవడం వల్ల ఎంతో మేలు జరిగింది. ఈ అనుభవం నుండి బాబా సమాధానం ప్రతికూలంగా వస్తే, మనం ఓపికగా ఉండాలని, అలా చేయడం వల్ల ఎంతో మేలు పొందుతామని, ఆయన లీలని చూస్తామని నేను తెలుసుకున్నాను.
"సాయి తండ్రి! మీరు కాకుండా ఇంతలా మాకు రక్షణనివ్వడానికి ఎవరు ఉన్నారు? కోటి కోటి ప్రణామాలు తండ్రి. నేను అన్నింటినీ మీకే వదిలి పెడుతున్నాను, ఏది మంచో, ఏది చెడో మీకు తెలుసు. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. పనిలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు రావడానికి, సకాలంలో పనులు పూర్తి చేయడానికి సహాయం చేస్తున్న మీకు ధన్యవాదాలు సాయి. కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో మేము ధైర్యంగా ఉండేలా అనుగ్రహించండి. కఠినమైన సమస్యలను అధిగమించడానికి మీ దైవిక నామాన్ని జపించేలా ఆశీర్వదించండి. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి దయచేసి మాకు ఒక మార్గాన్ని చూపించండి".
మరో చిన్న అనుభవం:
నేను చాలాకాలంగా సచ్చరిత్ర సప్తాహ పారాయణ చేయడం మొదలుపెట్టి, "కోవిడ్ 19 మహమ్మారి నుండి కాపాడమ"ని బాబాను కోరుకున్నాను. రెండుసార్లు పారాయణ చేసిన తరువాత నేను, "ఈ మహమ్మారి నుండి ఎందుకు మమ్మల్ని బయటపడేయడం లేద"ని బాబాను అడిగాను. అదేరోజు నేను చూస్తున్న న్యూస్ ఛానెల్‌లో, "శిరిడీలో కోవిడ్ 19 కేసు ఒక్కటి కూడా లేద"ని చూసాను. దాంతో నేను, 'ఈ మహమ్మారి నుండి బాబా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారని, ఇది త్వరలోనే ముగుస్తుంద'ని నేను అనుకున్నాను. "బాబా! దయచేసి గోధుమపిండితో కలరాను నిర్ములించిన విధంగా ఈ కోవిడ్ 19ని ఏదోఒకటి చేసి తొలగించండి. మీరు మాత్రమే ఈ మహమ్మారి నుండి మమ్మల్ని రక్షించగలరు".
శ్రీసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.
స్వీయ అనుభవం:
నేను, నా స్నేహితుడు 2020, మే 16 రాత్రి ఫోన్ లో మాట్లాడుకుంటున్నాము. మాటల సందర్భంలో ఈ కరోనా కారణంగా శిరిడీ వెళ్లి బాబాను దర్శించలేకపోతున్నామని, మళ్ళీ ఎప్పటికి భక్తులకి ఆ అవకాశం వస్తుందో అని చాలా బాధపడ్డాం. భక్తుల ప్రేమకోసం తప్పించే బాబా తమ బిడ్డలని ఎందుకిలా దూరంగా ఉంచారో అని కూడా అనుకున్నాము. చాలారోజులుగా మా మనసులో ఉన్న బాధ ఇదే. అయితే ఆ మాటల్లో "శిరిడీలో కరోనా కేసులున్నాయా?" అని నా స్నేహితుడు ఒక ప్రశ్న వేసాడు. "ఏమో! దాని గురించి తెలీదు. ఒకవేళ నమోదై ఉన్నాఇప్పుడు లేకపోయి ఉండొచ్చు" అని నేను అన్నాను. బాబా దానికి సమాధానం ఎలా ఇచ్చారో చూడండి. రెండురోజుల తరువాత నేను ఇంగ్లీష్ బ్లాగులోని భక్తుల అనుభవాలు చదువుతుండగా పై భక్తురాలి అనుభవం కనిపించింది. అది చదివి బాబా ఇచ్చిన సమాధానానికి ఆనందాశ్చర్యాలకి లోనయ్యాను. వెంటనే నా స్నేహితుడికి మెసేజ్ చేశాను. అది చూసి తను హ్యాపీగా, "నేను చాలా వెతికాను. కానీ ఎక్కడా ఆ సమాచారం దొరకలేదు. అందుకే నిన్ను అడిగాను. నేను కోవిడ్ 19 డేటా పూర్తిగా చూసాను. మహారాష్ట్ర సమాచారం ఉంది కానీ, ఎక్కడా శిరిడీ గురించి లేదు. థాంక్స్ నా సందేహం క్లియర్ అయ్యింది" అని అన్నాడు. నిజంగా మన బాబా చాలా గ్రేట్. ఆయన తన భక్తులను సదా కనిపెట్టుకొని ఉంటారు. మనం అడగకపోయినా అవసరమైనది చేస్తూ ఉంటారు. "థాంక్యూ సో మచ్ బాబా!".
Om sai ram🙏🙏🙏
ReplyDeleteVery nice experience. I liked it. I will share to my family members. Om sai ram. Baba cured my health also. I suffer d with icing full body rash. With baba blessings sai cured my health. My son is corona Dr. He gave treatment to many people. With baba blessings he became doctor. Thank you saima🙏🙏🙏🙏
ReplyDeleteశ్రీసద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
590 days
ReplyDeletesairam
Jai sairam
ReplyDeleteOm sai ram
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOm sai ram baba pleaseeee ma amma ki problem cure cheyi thandri tanu arogyanga vundela chudu thandri neku shatakoti vandanalu thandri kapadu sai
ReplyDelete🌼🌷🙏🙏OM Sri Sairam🙏🙏🌷🌼
ReplyDeleteOm sai ram
ReplyDelete