ఈ భాగంలో అనుభవాలు:
- కాపాడుతున్నది బాబానే
- తీవ్రమైన నొప్పి నుంచి బాబా కాపాడారు
కాపాడుతున్నది బాబానే
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటనున్నారు:
సాయిబంధువులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇంతకుముందు ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకోవాలని అనుకుంటున్నాను.
సెప్టెంబరు నెలలో మా నాన్నగారికి కరోనా పాజిటివ్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం నాన్నను హాస్పిటల్లో జాయిన్ చేశాము. అంతకు కొన్ని రోజుల మునుపు మేము క్రొత్త ఇంటికి మారాము. నాన్నను హాస్పిటల్లో జాయిన్ చేసిన ఐదు రోజుల తర్వాత మా ఇంటికి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మావారి పేరు చెప్పి మా అమ్మ చేతికి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయారు. మా అమ్మ మా వద్దకు వచ్చి, ‘ఎవరో వచ్చి ప్రసాదమిచ్చి వెళ్ళార’ని చెప్పింది. మేము ఆ ఇంటికి క్రొత్తగా రావడంతో మాకు చుట్టుప్రక్కలవారితో పరిచయం లేనందువల్ల ఆ ప్రసాదం ఎవరు ఇచ్చి వెళ్లారో మాకు తెలియలేదు. ఆ మరుసటిరోజు హాస్పిటల్ నుండి మా నాన్నకి కరోనా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. మా నాన్నను అనుగ్రహించటానికి బాబానే వచ్చి ఆ ప్రసాదాన్ని మాకు ఇచ్చి వెళ్లారని నా నమ్మకం. “బాబా! మమ్మల్ని ఇలాగే ఎల్లప్పుడూ కాపాడు తండ్రీ!”
మా నాన్న డిశ్చార్జ్ అయ్యాక మావారికి జ్వరం వచ్చింది. బాబా దయతో 5 రోజుల్లోనే తనకు జ్వరం తగ్గిపోయింది. ఆ తర్వాత నాకు కూడా జ్వరం వచ్చింది. డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతూ, ప్రతిరోజూ బాబాను ప్రార్థించి బాబా ఊదీని పెట్టుకునేదాన్ని. బాబా అనుగ్రహంతో నా జ్వరం తగ్గిపోయింది. “ధన్యవాదాలు బాబా! మీరు కాపాడకపోతే మమ్మల్ని ఇంకెవరు కాపాడతారు తండ్రీ?”
ఇటీవల నేను ఒకరి కోసం ఆన్లైన్లో ఒక వస్తువును ఆర్డర్ చేశాను. వారం రోజులైనా ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏ ప్రతిస్పందనా లేదు. నేను బాబాను ప్రార్థించి, “నేను ఆర్డర్ చేసిన వస్తువును త్వరగా ఆ వ్యక్తికి చేరేలా చెయ్యి బాబా. నేను నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. రెండు రోజుల తర్వాత ఆ వ్యక్తి తనకు ఆ వస్తువు చేరినట్లు బిల్లు రశీదు నాకు పంపించారు. “చాలా చాలా ధన్యవాదాలు బాబా! నా అనుభవాలను ఇంత ఆలస్యంగా పంచుకుంటున్నందుకు నన్ను క్షమించు బాబా!” ఇలాంటి బాబా లీలలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
తీవ్రమైన నొప్పి నుంచి బాబా కాపాడారు
సాయిభక్తురాలు సుమ తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
ఓం సాయిరాం! నా పేరు సుమ. నేను ఒక చిన్న అనుభవాన్ని సాటి సాయిబంధువులతో పంచుకోవాలనుకుంటున్నాను. గత మూడు సంవత్సరాలుగా నాకు అప్పుడప్పుడు భుజం దగ్గర, మెడభాగంలో విపరీతంగా నొప్పి వస్తూ ఉండేది. అలా నొప్పి వచ్చినప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతూ ఉండేది. అయితే ఇటీవల మేము తిరుమలకి వెళ్ళివచ్చేటప్పుడు లగేజీని, హ్యాండ్బ్యాగ్ని మోయడం వల్ల భుజంనొప్పి, మెడనొప్పి నన్ను విపరీతంగా బాధించాయి. ఇంతకుముందెప్పుడూ నాకు భుజంనొప్పి అంత తీవ్రంగా రాలేదు. నొప్పి తగ్గటానికి మందులు వేసుకున్నప్పటికీ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా నొప్పి తగ్గలేదు. దాంతో హాస్పిటల్కి వెళ్ళి డాక్టరుకి చూపించుకున్నాను. డాక్టర్ నన్ను పరీక్షించి, నొప్పి తగ్గటానికి మందులిచ్చి, ఆ మందులు వాడినా నొప్పి తగ్గకపోతే స్కానింగ్ తీస్తామని చెప్పారు. నాకు చాలా భయమేసింది. నేను బాబాకు నమస్కరించుకుని, నా భుజంనొప్పిని తగ్గించమని ప్రార్థించి, మరునాడు ప్రొద్దునకల్లా నా నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటానని చెప్పుకున్నాను. బాబా దయతో మరుసటిరోజుకి నా నొప్పి తగ్గిపోయింది. నిజానికి నొప్పి తగ్గటానికి నేను ఎన్నో మందులు వాడాను. అయినప్పటికీ నా నొప్పి తగ్గలేదు. అంతటి తీవ్రమైన నొప్పి నుంచి బాబా నన్ను కాపాడారు. “థాంక్యూ సో మచ్ బాబా!”
జై సాయిరాం!
Om sai ram please remove my pain. Cure me tandri
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteజై సాయిరాం! జై గురుదత్త!
ReplyDeleteOn sai ram baba ma mother ki fever taggipovali problem cure Avali sai thandri
ReplyDeleteOm sai ram
ReplyDeleteOm sai ram
ReplyDeleteఅఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
ReplyDelete