సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుడు బి. లగాటే


బి. లగాటే మాజీ సబ్ జడ్జి. అతడు బ్రాహ్మణ కులస్థుడు. అతడు పూణేలోని శనివార్‌పేట్ లో నివాసముండేవాడు. ఒకసారి అతనిపై లంచం తీసుకున్నాడనే నేరారోపణ చేయబడింది. ఆ విషయమై కొన్నాళ్లపాటు క్రిమినల్ కోర్టులో కేసు నడిచింది. చివరికి కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించి భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధించింది. ఆ శిక్షపై అతడు అప్పీలుకి వెళ్ళాడు. అప్పటికే శ్రీసాయిబాబా గురించి వినివున్న అతను వారి ఆశీస్సులు పొందితే తన కష్టాలు తీరిపోతాయని ఆశించాడు. ఆ ఉద్దేశ్యంతో తాను వేసిన అప్పీలు పెండింగులో ఉన్న సమయంలో అతను బాబా ఆశీస్సులకొరకు 1913-1914 లో మొదటిసారి శిరిడీ వెళ్ళాడు. ద్వారకామాయిలో ఉన్న బాబా వద్దకు అతను వెళ్ళినప్పుడు, వారు అతన్ని దక్షిణ అడిగారు. అతడు దక్షిణ సమర్పించుకున్నాడు. వెనువెంటనే అతడేమీ మాట్లాడకముందే బాబా తమంతట తాముగా అతనితో, "వేప విత్తనం నాటు, తరువాత ఆ చెట్టును నరికివేయి" అని చెప్పారు. బాబా మాటల్లోని అంతరార్థం అతనికి అవగతం కాలేదు. తాను ఆశించిన ఆశీస్సులు మాత్రం అవికావని అతనికి అర్థమై పూర్తి నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. తరువాత  మూడు సంవత్సరాలపాటు సాయిబాబా యొక్క సన్నిహిత భక్తుడైన హరిసీతారాం దీక్షిత్‌తో కలిసి ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడూ బాబాను దర్శించలేదు.

అయితే బాబా అతనితో, "వేప విత్తనం నాటు, తరువాత ఆ చెట్టును నరికివేయి" అన్న మాటలు కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తాయి. చేదు విత్తనాన్ని నాటినట్లయితే, ఖచ్చితంగా ఫలితం చేదుగానే ఉంటుంది. అందువల్ల చేసిన తప్పులకు తగిన మూల్యం చెల్లించి, ఆ కర్మసంచితాన్ని నిర్మూలించుకోవడమే ఉత్తమమని, తద్వారా నేర్చుకున్న గుణపాఠంతో భవిష్యత్తులో ఉన్నతిని పొందాలనేది బాబా అభిప్రాయం.

సమాప్తం.

Source: Devotees' Experiences of Sri Sai Baba Part III by Sri.B.V.Narasimha Swamiji

4 comments:

  1. om sai ram leelas are beautiful.baba made my desireto come thruth.i went siridi and had good darshan.baba be with us.bless us.om ram om sai ram

    ReplyDelete
  2. ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  3. ఓం సాయిరామ్🙏💐🙏

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo