సాయిభక్తుడు దివంగత శ్రీబడేబాబా అలియాస్ ఫకీర్ పీర్ మహమ్మద్ గురించిన ప్రస్తావన శ్రీసాయిసచ్చరిత్ర 23వ అధ్యాయంలో ఉంది. అతనికి సంబంధించిన మరిన్ని వివరాలను శ్రీ సాయిబాబా సంస్థాన్ నడుపుతున్న శ్రీసాయిలీల పత్రికలో ప్రచురించబడ్డాయి. వాటి తెలుగు అనువాదం మీ ముందు ఉంచుతున్నాము.
సాయి కథలు అమృతం కన్నా మధురమైనవి. ఎన్నిసార్లు చదివినా తనివితీరనివి. ప్రతిసారి ఏదో ఒక బోధ అందిస్తూనే ఉంటాయి. కాబట్టి, మన అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ముందుగా ఒకసారి సాయిసచ్చరిత్రలోని కథనాన్ని మననం చేసుకుందాం.
ఒకప్పుడెవరో ఒక కృశించిన ముసలి మేకను మసీదుకు తీసుకుని వచ్చారు. అది మరణించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అక్కడే ఉన్నారు. సాయిబాబా దానిని ఒక్క కత్తివ్రేటుతో నరికి, బలివేయుమని అతనితో చెప్పారు. ఈ బడేబాబాకు అతిథి స్థానమిచ్చి సాయిబాబా ఎంతగానో గౌరవించేవారు. అలాంటిదతను సాయిబాబా మేకను నరకమనగా, 'అనవసరముగా దానిని చంపడం ఎందుక'ని అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా శ్యామాను ఆ పని చేయమన్నారు. అతడు రాధాకృష్ణమాయి వద్దకు వెళ్లి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు బాబా కత్తిని తెప్పించారో తెలుసుకున్న రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నది. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా వెళ్లి తిరిగి రాలేదు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. అతడు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి మేకను నరకమని బాబా అతనిని ఆజ్ఞాపించారు. అతడు సాఠేవాడాకు వెళ్లి కత్తిని తెచ్చి బాబా అనుమతించగానే దానిని నరుకుటకు సిద్ధంగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి, చంపుట అనునది ఎరుగని వాడు, హింసించు పనులను చేయుటయందు ఇష్టమే లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యెను. మహమ్మదీయుడైన బడేబాబాయే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచున్నాడని అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా బాబా, “ఏమి ఆలోచిస్తున్నావు, మేకను నరుకు” అని ఆజ్ఞాపించారు. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నున్న సమయంలో బాబా ‘ఆగు, ఆగు’ అని, “ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవై మేకను చంపెదవా?” అన్నారు. వెంటనే దీక్షిత్ కత్తిని పక్కనపెట్టి బాబాతో, “అమృతమువంటి మీ పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమి తెలియదు. మిమ్మల్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనెదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటిస్తాము. అవి ఉచితమా? అనుచితమా? అనునది మాకు తెలియదు. దాని గురించి మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాలించుటయే మా విధి, మా ధర్మము" అని అన్నాడు. తరువాత ఆ మేకను ‘తకియా’ అనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికునిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.
సాయిలీలా మ్యాగజైన్‌లోని సమాచారం:
శ్రీసాయిబాబా ద్వారకమాయిలో అనేకమంది భక్తులకు ఆశ్రయమిచ్చారు. ఆయన దర్బారులో అలా ఆశ్రయం పొందిన భక్తులలో బడేబాబా ప్రత్యేకించి చెప్పుకోదగ్గ వ్యక్తి. బాబా, ''నీవు ఒకటి ఇచ్చినట్లయితే నేను నీకు వంద ఇస్తాను!'' అని చెప్పేవారు. అయితే, భగవంతుడిచ్చేవి ప్రత్యేకమైనవి. వారి దీవెనలు పొందడానికి భక్తులు ధర్మపరులై అర్హత కలిగి ఉండాలి. బడేబాబా జీవితాన్ని గమనించినట్లైతే, బాబా అతన్ని ఎంతగానో అనుగ్రహించినప్పటికీ, అతనికి ఆ అనుగ్రహాన్ని స్వీకరించేటంత ఆధ్యాత్మిక పరిపక్వత లేదని అర్థమవుతుంది.
బడేబాబాను మాలేగాఁవ్ కు చెందిన 'ఫకీర్ పీర్ మహమ్మద్' అని కూడా పిలుస్తారు. వృత్తిపరంగా ఫకీరయినందున అతనిని 'ఫకీర్ బాబా' అనే పేరుతో కూడా పిలిచేవారు. 1909వ సంవత్సరంలో అతడు మొదటిసారి శిరిడీ వచ్చాడు. అప్పటినుండి అతడు బాబా సమాధి చెందేవరకు స్థిరంగా శిరిడీలోనే ఉండిపోయాడు. ప్రారంభంలో బాబా అతనిని ద్వారకమాయి లోపలికి అనుమతించలేదు. అందువలన అతను చావడిలో నివాసముంటుండేవాడు. బాబాతో చనువుగా ఉండే మహల్సాపతి వంటి భక్తులు అతనిని ద్వారకామాయి లోపలికి అనుమతించమని బాబాను అభ్యర్థించారు. కానీ, బాబా అనుమతించక అతనిని చావడిలో కూర్చుని ఖురాన్ చదవమని చెప్పారు. కొంతమంది భక్తుల ఆధ్యాత్మిక పురోగతి కోసం బాబా అలాంటి వింతైన మార్గాలను అవలంభించేవారు. అలా కొన్ని నెలలు గడిచిన తరువాత, ద్వారకమాయిలో ప్రవేశించడానికి అతనిని బాబా అనుమతించారు. అప్పటినుండి అతడు శిరిడీలో ప్రముఖవ్యక్తి అయ్యాడు. దీనికి కారణం కూడా ప్రత్యేకమైనది.
బాబా తమకోసం భక్తులు తీసుకొచ్చే నైవేద్యాలనుండి ప్రేమతో కొద్దిభాగమైనా తీసుకునేవారు. వాటిలో మాంసాహార వంటకాలు ఉన్నా కూడా ఆయన తినేవారు. ఆయన దృష్టిలో అంతా పరబ్రహ్మ స్వరూపమే. ఆయన కులమతాల భేదభావం చూపేవారు కాదు. 'ఇతరులను తాకడం ద్వారా అపవిత్రమైపోతాము' వంటి వాటికి అస్సలు విలువ ఇచ్చేవారు కాదు. అదే సమయంలో భక్తులు తమ తమ మతాలకు కట్టుబడి ఉండాలని చెప్పేవారు. సర్వమానవ సమానత్వాన్ని ఉద్భోదించే శ్రీసాయి తన భక్తులకు "మతం మార్చుకోవడం అనవసరం" అని చెప్పి మతమార్పిడిని తీవ్రంగా నిరసించారు.
ఒకసారి బడేబాబా ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చి శ్రీసాయి వద్దకు తీసుకువచ్చి, తాను చేసిన ఘనకార్యాన్ని గురించి వివరించాడు. అప్పుడు శ్రీసాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగిలేలా కొట్టి, "నీ అబ్బను(తండ్రి) మార్చుకున్నావట్రా!" అని కేకలేశారు. మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబా అభిప్రాయం.
బాబా ఇస్లాంలోని కొన్ని తీవ్రమైన ఆచారాలను సమర్థించేవారు కాదు, వాటిని అనుసరించేందుకు ఒప్పుకునేవారు కాదు. ఉదాహరణకు, ఒకసారి ఆయన ఆచారాలపట్ల కఠినంగా ఉండే ముస్లింభక్తులను శిరిడీ పొలిమేరలు దాటివెళ్లి ఖుత్బా ప్రార్థనలు చేయమని చెప్పారు, కానీ వాటిలో తాము స్వయంగా పాల్గొనలేదు. ఇంకో సందర్భంలో మసీదులో నమాజ్ చేయడానికి అనుమతించారు గానీ తాము పాల్గొనలేదు.
ఒకసారి బాబా భక్తుడు శ్రీరఘువీర్ భాస్కర్ పురంధరే తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాడు. ఆ బాధ వలన రాత్రంతా అతనికి విశ్రాంతి లేదు. అదే స్థితిలో అతను బాబా వద్దకు వెళ్ళాడు. బాబాకు సమీపంలో కూర్చుని వున్న బడేబాబా మర్యాద లేకుండా కఠినంగా బాబాతో, 'పురంధరే తీవ్రమైన తలనొప్పితో రాత్రంతా బాధపడ్డాడు. అతన్ని చూడండి. అతన్ని ఇంకా అనారోగ్యానికి గురిచేయకండి" అని అన్నాడు. మరోసారి పురంధరే వలన బాబా కలత చెందారు. అందువలన అతడు ప్రత్యేకంగా తీసుకువచ్చిన సువాసన వెదజల్లే పూలమొక్కలను నాటడానికి బాబా అనుమతించలేదు. అది గమనించిన బడేబాబా పరుషంగా బాబాతో, ''పురంధరేపై మీరెందుకు కోపం తెచ్చుకుంటున్నారు? అతను మీకోసం రాత్రి-పగలు శ్రమిస్తున్నాడు. మీ సేవలో అతను అన్నపానీయాలు మరచిపోతాడు. మీరు కూడా అతనిని ఎప్పుడూ తలచుకుంటూ ఉంటారు. కానీ, అతను మీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మీరు కలత చెందుతున్నట్లుగా వ్యవహరిస్తారు. ఈ వింత ప్రవర్తన ఏమిటి?'' అన్నాడు.
ప్రతిరోజూ బడేబాబా తన భోజనం పూర్తైన తరువాత వెళ్లిపోవడానికి సిద్ధమయ్యేవాడు. అప్పుడు బాబా కొంతదూరం వరకు అతనితో నడిచి వెళ్లి మరీ సాగనంపేవారు. అయితే అతనిలో గర్వం పెరిగిన తరువాత, "అచ్ఛా! నేను వెళ్తున్నాను. మీరు రాబోతున్నారా, లేదా?'" అని గట్టిగా గదమాయిస్తున్నట్లు అనేవాడు. బాబా మాత్రం అతని మాటలను తప్పుపట్టకుండా నిశ్శబ్దంగా లేచి అతనిని చూసేవారు.
మొదట్లో భక్తులు ఆరతికి సన్నాహాలు మొదలుపెట్టగానే బడేబాబా లేచి క్రింద సభామండపంలోకి వెళ్ళిపోయేవాడు. ఆరతిలో అతడు పాల్గొనేవాడు కాదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ నచ్చజెప్పడంతో అతడు సభామండపానికి వెళ్ళేవాడు కాదుగాని, ఆరతిలో మాత్రం పాల్గొనేవాడు కాదు. చాలామంది హిందూ భక్తులకు అతని పద్ధతి నచ్చేది కాదు. కానీ కాకాసాహెబ్ వాళ్లతో, 'సాయిబాబా అతనిని తమవానిగా అంగీకరించారు. అంటే అతను మనలో ఒకడు. అలాంటప్పుడు అతనిపట్ల వివక్షత ఎందుకు తలెత్తుతుంది? కాబట్టి అతని ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయమ"ని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. కానీ బడేబాబాలో పెరిగిన అహం కారణంగా భక్తులు అతనిపట్ల విసుగుచెంది, అతన్ని ద్వేషించసాగారు. అందువల్ల వాళ్ళు బడేబాబా బసచేయడానికి తమ గదులను ఇచ్చేవారు కాదు. పరిస్థితి ఇలా ఉండటంతో అతనికి రక్షణనివ్వడానికి కాకాసాహెబ్ దీక్షిత్ తన వాడాలోని ఒక గదిలో ఉండటానికి అతన్ని అనుమతించారు. కాకాసాహెబ్, "బాబా తనవారిగా అంగీకరించిన ప్రతి ఒక్కరినీ మనలో ఒకరిగా చూడాలి" అని చెప్పేవాడు.
సత్పురుషులతో సమయాన్ని గడపగలిగేవారు మాత్రమే అదృష్టవంతులు. కానీ, వారు తమ అహాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. బడేబాబా ఆ ప్రయత్నం అస్సలు చేయలేదు. బాబా తమ ప్రియమైన వానిలో ఒకనిగా అతనిని చూశారు. అతిథులకు, స్నేహితులకి ఇచ్చే గౌరవం అతనికి ఇచ్చారు. తమ ప్రక్కన స్థానాన్ని అతనికోసం ఎల్లప్పుడూ బాబా ఉంచారు. రోజూ అధికమొత్తం అతనికి దానంగా ఇచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు బాబా ఎప్పుడూ, ''ఈ డబ్బు అల్లాహ్ కి చెందినది. తిను, వృధాచేయవద్దు" అని హెచ్చరించేవారు. సాయిబాబా ఇచ్చిన డబ్బులు స్వప్రయోజనాలకోసం ఉపయోగించకూడదు. ఇతరుల మేలుకోసం దానిని ఉపయోగించినవారు శ్రేయస్సును పొందారు.
బాబా ఇచ్చిన ధనాన్ని తన కుటుంబం కోసం ఉపయోగించిన బడేబాబాకు బాబా సమాధి చెందిన రెండు నెలల తరువాత పూర్తిగా ధనం లేకుండా పోయింది. దానితో అతను గ్రామగ్రామాలు తిరుగుతూ యాచించుకోవాల్సి వచ్చింది. అతడు 1926, జనవరి నెలలో నాగపూరులో మరణించాడు. ఆత్మోన్నతికోసం అతనికి అనేక అవకాశాలు బాబా ఇచ్చారు. కానీ, అతడు తన అహం కారణంగా అన్ని అవకాశాలను వృధా చేసుకున్నాడు.
బాబా బడేబాబాను తమ బోధనకు ఒక మాధ్యమంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. దానిద్వారా భక్తులు పాఠం నేర్చుకోవచ్చు. ఈ విషయమే అప్పట్లో శ్రీసాయిలీల పత్రికకు సంపాదకుడుగా ఉన్న శ్రీకాకాసాహెబ్ మహాజని తన వ్యాసంలో - "మహారాజ్ బోధనలకు కొన్ని ప్రత్యేక మార్గాలున్నాయి. అటువంటివే ఫకీరు బాబా(బడేబాబా) శిరిడీ నివాసం, అతనితో బాబా ప్రవర్తన. ఈ ఉదాహరణ ద్వారా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు'' అని వ్రాశారు.
సాయి కథలు అమృతం కన్నా మధురమైనవి. ఎన్నిసార్లు చదివినా తనివితీరనివి. ప్రతిసారి ఏదో ఒక బోధ అందిస్తూనే ఉంటాయి. కాబట్టి, మన అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ ముందుగా ఒకసారి సాయిసచ్చరిత్రలోని కథనాన్ని మననం చేసుకుందాం.
ఒకప్పుడెవరో ఒక కృశించిన ముసలి మేకను మసీదుకు తీసుకుని వచ్చారు. అది మరణించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ సమయమున మాలేగాం ఫకీరు పీర్ మహమ్మద్ ఉరఫ్ బడేబాబా అక్కడే ఉన్నారు. సాయిబాబా దానిని ఒక్క కత్తివ్రేటుతో నరికి, బలివేయుమని అతనితో చెప్పారు. ఈ బడేబాబాకు అతిథి స్థానమిచ్చి సాయిబాబా ఎంతగానో గౌరవించేవారు. అలాంటిదతను సాయిబాబా మేకను నరకమనగా, 'అనవసరముగా దానిని చంపడం ఎందుక'ని అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పుడు బాబా శ్యామాను ఆ పని చేయమన్నారు. అతడు రాధాకృష్ణమాయి వద్దకు వెళ్లి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు బాబా కత్తిని తెప్పించారో తెలుసుకున్న రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నది. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా వెళ్లి తిరిగి రాలేదు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చింది. అతడు మేలిమి బంగారమే కాని, దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి మేకను నరకమని బాబా అతనిని ఆజ్ఞాపించారు. అతడు సాఠేవాడాకు వెళ్లి కత్తిని తెచ్చి బాబా అనుమతించగానే దానిని నరుకుటకు సిద్ధంగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబములో పుట్టి, చంపుట అనునది ఎరుగని వాడు, హింసించు పనులను చేయుటయందు ఇష్టమే లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యెను. మహమ్మదీయుడైన బడేబాబాయే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడేల సిద్ధపడుచున్నాడని అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా బాబా, “ఏమి ఆలోచిస్తున్నావు, మేకను నరుకు” అని ఆజ్ఞాపించారు. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధముగా నున్న సమయంలో బాబా ‘ఆగు, ఆగు’ అని, “ఎంతటి కఠినాత్ముడవు? బ్రాహ్మణుడవై మేకను చంపెదవా?” అన్నారు. వెంటనే దీక్షిత్ కత్తిని పక్కనపెట్టి బాబాతో, “అమృతమువంటి మీ పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమి తెలియదు. మిమ్మల్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుంచుకొనెదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటిస్తాము. అవి ఉచితమా? అనుచితమా? అనునది మాకు తెలియదు. దాని గురించి మేము విచారింపము. అది సరియైనదా? కాదా? యని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాలించుటయే మా విధి, మా ధర్మము" అని అన్నాడు. తరువాత ఆ మేకను ‘తకియా’ అనుచోట చంపుటకు నిశ్చయించిరి. ఇది ఫకీరులు కూర్చొను స్థలము. అచటకు దానిని తీసికునిపోవునపుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను.
సాయిలీలా మ్యాగజైన్‌లోని సమాచారం:
శ్రీసాయిబాబా ద్వారకమాయిలో అనేకమంది భక్తులకు ఆశ్రయమిచ్చారు. ఆయన దర్బారులో అలా ఆశ్రయం పొందిన భక్తులలో బడేబాబా ప్రత్యేకించి చెప్పుకోదగ్గ వ్యక్తి. బాబా, ''నీవు ఒకటి ఇచ్చినట్లయితే నేను నీకు వంద ఇస్తాను!'' అని చెప్పేవారు. అయితే, భగవంతుడిచ్చేవి ప్రత్యేకమైనవి. వారి దీవెనలు పొందడానికి భక్తులు ధర్మపరులై అర్హత కలిగి ఉండాలి. బడేబాబా జీవితాన్ని గమనించినట్లైతే, బాబా అతన్ని ఎంతగానో అనుగ్రహించినప్పటికీ, అతనికి ఆ అనుగ్రహాన్ని స్వీకరించేటంత ఆధ్యాత్మిక పరిపక్వత లేదని అర్థమవుతుంది.
బడేబాబాను మాలేగాఁవ్ కు చెందిన 'ఫకీర్ పీర్ మహమ్మద్' అని కూడా పిలుస్తారు. వృత్తిపరంగా ఫకీరయినందున అతనిని 'ఫకీర్ బాబా' అనే పేరుతో కూడా పిలిచేవారు. 1909వ సంవత్సరంలో అతడు మొదటిసారి శిరిడీ వచ్చాడు. అప్పటినుండి అతడు బాబా సమాధి చెందేవరకు స్థిరంగా శిరిడీలోనే ఉండిపోయాడు. ప్రారంభంలో బాబా అతనిని ద్వారకమాయి లోపలికి అనుమతించలేదు. అందువలన అతను చావడిలో నివాసముంటుండేవాడు. బాబాతో చనువుగా ఉండే మహల్సాపతి వంటి భక్తులు అతనిని ద్వారకామాయి లోపలికి అనుమతించమని బాబాను అభ్యర్థించారు. కానీ, బాబా అనుమతించక అతనిని చావడిలో కూర్చుని ఖురాన్ చదవమని చెప్పారు. కొంతమంది భక్తుల ఆధ్యాత్మిక పురోగతి కోసం బాబా అలాంటి వింతైన మార్గాలను అవలంభించేవారు. అలా కొన్ని నెలలు గడిచిన తరువాత, ద్వారకమాయిలో ప్రవేశించడానికి అతనిని బాబా అనుమతించారు. అప్పటినుండి అతడు శిరిడీలో ప్రముఖవ్యక్తి అయ్యాడు. దీనికి కారణం కూడా ప్రత్యేకమైనది.
అతిథి దేవోభవ
సాయిబాబా బడేబాబాను చాలా ప్రేమగా 'బడేమియా' అని పిలుస్తూ, అతి గారాబం చేస్తూ అతడిని అతిథిలా గౌరవించేవారు. 'అతిథి దేవోభవ' అన్నట్లు అతనికి బాబా దర్బారులో అతిథిగా చాలా గౌరవం దక్కేది. అతడు ఉదయం అల్పాహార సమయం నుండి మధ్యాహ్నం భోజనవేళ వరకు మసీదులోనే ఉండేవాడు. కుడివైపున తమ ప్రక్కనే బాబా అతన్ని కూర్చుండబెట్టుకుని, తమ స్వహస్తాలతో ఆహారాన్ని వడ్డన చేసేవారు. అంతేకాదు, 'ఇంకొంచం, ఇంకొంచెం తిను' అంటూ అతన్ని ప్రేమగా బుజ్జగించేవారు. భక్తులు ఆహారపదార్థాలను తెచ్చి బాబాకు సమర్పించేవారు. బాబా వాటినుండి కొంతభాగాన్ని తీసుకుని ముందుగా బడేబాబాకు ఇచ్చాకనే మిగిలిన భక్తులకు పంపిణీ చేసేవారు. అతడు ప్రతిరోజూ భోజన సమయానికి కాస్త ముందుగా సభామండపం దిగువభాగంలో కూర్చునేవాడు. 'బడేమియా' అన్న బాబా పిలుపు వినగానే అతడు మశీదు మెట్లెక్కి బాబాకు కుడివైపున తనకోసం ఉంచబడిన భోజనపళ్ళెం ముందు కూర్చునేవాడు. ముందుగా అతడు భుజించనిదే, బాబా తాము భోజనం చేయడం మొదలుపెట్టేవారు కాదు. అతడు చిలిం పీల్చిన తరువాతే సాయిబాబా పీల్చేవారు, ఆ తరువాతే ఇతరులకిచ్చేవారు. అతిథిగా బాబా అతనికి ఇచ్చే ఈ ప్రాముఖ్యత కారణంగా దురదృష్టవశాత్తూ అతనిలో అహం చోటుచేసుకుంది. అందువల్లే ఇతరభక్తులు అతని ప్రవర్తనను ఇష్టపడేవారుకాదు.
ఒక దీపావళి పండుగరోజు ఏవో కారణాలవల్ల బడేబాబా మానసికస్థితి నిరాశకు గురైంది. అందువలన అతడు ఆరోజు సభామండపానికి రాలేదు. పండుగరోజు కావడంతో చాలామంది భక్తులు రకరకాల స్వీట్లు, పలురకాల పిండివంటలు తీసుకుని వచ్చారు. వడ్డన పూర్తైన తరువాత బాబా బడేబాబాను పిలిచారు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. అతను లేకపోవడంతో బాబా తాము భోజనం చేయడానికి నిరాకరించారు. ఆయన తినకపోవడంతో మిగిలిన భక్తులు కూడా భోజనం చేయకుండా వేచి చూడసాగారు. చివరికి ఒక భక్తుడు బడేబాబా ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి, అతన్ని మసీదుకు తీసుకుని వచ్చి, బాబాకు కుడివైపున అతని స్థానంలో కూర్చుండబెట్టాడు. అప్పుడు అందరూ భోజనాలు చేశారు. ఆహారాన్ని అవమానించిన వ్యక్తికి అంతటి ప్రాముఖ్యతనివ్వడమేమిటని అందరికీ విడ్డురంగా అనిపించవచ్చు. కానీ బాబా తన భక్తులను ఆదరించే పద్ధతులు ప్రత్యేకమైనవి.
తరువాతి కాలంలో శిరిడీ వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజూ 100 నుండి 125 రకాల వంటకాలు శిరిడీ, ఇతర ప్రాంతాల నుండి భక్తులు తీసుకువచ్చేవారు. ఆ వంటకాలలో ఉన్న చపాతీలను, భాకరీలను ముక్కలు చేసి వాటినన్నింటిని కలపమని కొన్నిసార్లు బాబా బడేబాబాను ఆదేశించేవారు. అలా కలిపిన దానిని ప్రసాదంగా బాబా భక్తులకు ఇచ్చేవారు. అది ఎంతో మధురంగా ఉండేది. భక్తులు ఎంతో ఇష్టంగా తినేవారు. అటువంటి కొన్ని సందర్భాలలో బాబా భక్తులను తిట్టి, "బడేబాబా చేత ముట్టబడిన ఈ ఆహారాన్ని మీరు ఎలా తిన్నారు? అతడు ముస్లిం కదా!" అని అనేవారు. అప్పుడు భక్తులు, ''బాబా! ఈ స్థలం, ఈ ఆహారం సర్వశక్తిమంతుడైన భగవంతునికి చెందినవి'' అని అనేవారు. దానికి బదులుగా బాబా, "అవును, ఈ స్థలం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమంతా అతనికి చెందినదే. అందువల్ల, మీరెప్పుడూ మతాలు, కులాల ప్రాతిపదికగా భేదభావం చూపకూడదు'' అని చెప్పేవారు. సృష్టి స్థితి లయ కారకుడైన భగవంతుడొక్కడే సందర్భానుసారంగా వివిధ కాలాలలో వివిధ రూపాలను ధరించి తన అవతారకార్యం గావించాడు. అన్నిమతాలు ఆ భగవంతుడిని చేరడానికే సృష్టింపబడ్డాయి.

దేవుడు అంతటా కలడు
బాబావంటి యోగుల దృష్టిలో, ప్రపంచములో దేనియందు భేదబావం ఉండదు. వారు అంతటినీ ఒకటిగా చూస్తారు. వారి ప్రతి చర్య ఒక సందేశాన్ని ఇస్తుంది. మనం వాటిని అర్థం చేసుకుని అనుసరించాలి. ఒకసారి బాబా భోజనం చేస్తున్నారు. ప్రక్కనే ఒక మట్టికుండలో మజ్జిగ ఉంది. అకస్మాత్తుగా ఒక కుక్క మసీదులో ప్రవేశించి ఆ మజ్జిగకుండలో నోరు పెట్టింది. సమీపంలో కూర్చుని ఉన్న బడేబాబా అది చూసి, ఆ మజ్జిగను బయట పారవేయమని ఒక పిల్లవాడితో చెప్పాడు. అప్పుడు బాబా, "ఏమి జరిగింది?" అని ప్రశ్నించారు. బడేబాబా జరిగింది చెప్పగా బాబా, "ఆ మజ్జిగలో ఏ దోషమూ లేదు. అది మంచిదే. దానిని ఇంటికి తీసుకువెళ్ళి, దానితో మజ్జిగపులుసు తయారుచేసి తీసుకుని రా! ఇద్దరం సేవిద్దాం" అన్నారు. అతడు దాన్ని తీసుకుని వెళ్లి మజ్జిగపులుసు తయారుచేసి తీసుకువచ్చాడు. కానీ అతడు దానిని తాకనైనా తాకలేదు. బాబా మాత్రం హృదయపూర్వకంగా దానిని త్రాగారు. యోగులు, సాయిబాబా వంటి సద్గురువులు వారి భక్తుల మనస్సులలో ఉండే సంకల్ప, వికల్పాలను(ఆలోచనలు) నిర్మూలిస్తారు. పై సంఘటన అటువంటిదే. ఆయన అతడి మనస్సునందున్న అటువంటి ఆలోచనలను అరికట్టే ప్రయత్నం చేశారు. కానీ అతడు ఎంతోకాలంగా బాబాతో ఉంటూ కూడా ఆయన సందేశాన్ని గ్రహించలేకపోయాడు.
ఒకసారి బడేబాబా ఒక హిందూ యువకుడిని ముస్లింగా మార్చి శ్రీసాయి వద్దకు తీసుకువచ్చి, తాను చేసిన ఘనకార్యాన్ని గురించి వివరించాడు. అప్పుడు శ్రీసాయి ఉగ్రులై ఆ యువకుని చెంప పగిలేలా కొట్టి, "నీ అబ్బను(తండ్రి) మార్చుకున్నావట్రా!" అని కేకలేశారు. మతాన్ని మార్చుకోవడం తండ్రిని మార్చుకున్నంత పాపమని బాబా అభిప్రాయం.
బాబా ఇస్లాంలోని కొన్ని తీవ్రమైన ఆచారాలను సమర్థించేవారు కాదు, వాటిని అనుసరించేందుకు ఒప్పుకునేవారు కాదు. ఉదాహరణకు, ఒకసారి ఆయన ఆచారాలపట్ల కఠినంగా ఉండే ముస్లింభక్తులను శిరిడీ పొలిమేరలు దాటివెళ్లి ఖుత్బా ప్రార్థనలు చేయమని చెప్పారు, కానీ వాటిలో తాము స్వయంగా పాల్గొనలేదు. ఇంకో సందర్భంలో మసీదులో నమాజ్ చేయడానికి అనుమతించారు గానీ తాము పాల్గొనలేదు.
గరిష్ఠ మొత్తాన్ని పొందే గౌరవం
ప్రతిరోజూ భక్తులు బాబాకు సమర్పించే దక్షిణ రూ. 400/- నుండి రూ. 500/- వరకు ఉండేవి. ఆ మొత్తాన్ని భక్తులకు పంచేసి, సాయంత్రానికల్లా ఆయన పేద ఫకీరులానే ఉండేవారు. ఆయన లెక్కపెట్టకుండా జేబులో చేయిపెట్టి చేతికొచ్చినంత ఇచ్చివేస్తున్నా ప్రతిభక్తునికి ఎప్పుడూ ఒకే మొత్తం ముట్టేది. నిత్యం దాదాకేల్కర్, బడేబాబా, సుందరీబాయి, లక్ష్మీబాయి, తాత్యాపాటిల్, భాగోజీ మొదలైన భక్తులకు బాబా కొంత మొత్తాన్ని ఇచ్చేవారు. అయితే, గరిష్ఠ మొత్తాన్ని పొందే గౌరవం మాత్రం (రూ. 30 నుండి రూ. 55) బడేబాబాకే దక్కింది. (పవిత్ర శ్రీసాయి సచ్చరిత్ర ప్రకారం బడేబాబాకి రోజుకు 50 రూపాయలు ముట్టేది). 'బాబా నుండి అంత పెద్ద మొత్తాన్ని పొందే ఫకీరైన బడేబాబా ఏమి చేసుకుంటాడు?' అనే ప్రశ్న శిరిడీవాసుల మనసులో తలెత్తింది. దాంతో వాళ్ళు బాగా అలోచించి గ్రామ ప్రవేశద్వార నిర్మాణం కోసమని డబ్బులు ఇమ్మని బడేబాబాను అడిగారు. వారి అభ్యర్థనను అతడు తిరస్కరించాడు. అందువల్ల, గ్రామస్తులు అతడిని గ్రామంలోనికి రాకుండా నిషేధించారు. దాంతో అతను వెళ్ళి నీంగాఁవ్‌లో ఉండసాగాడు. ఆ కారణంగా బాబా ప్రతిరోజూ నల్లా ఏటిఒడ్డున అతనిని కలుసుకుని, అతనికి రోజూ తాము ఇచ్చే డబ్బులు అందజేసేవారు. ఆవిధంగా బాబాను చాలా అసౌకర్యానికి గురిచేస్తున్నామని గ్రహించిన గ్రామస్తులు ఆ ఆంక్షను తొలగించి బడేబాబాను శిరిడీ గ్రామం లోపలికి రప్పించారు.
బడేబాబా ప్రవర్తన
బాబాను చాలా అసౌకర్యానికి గురిచేస్తున్నామని గ్రహించిన గ్రామస్తులు ఆ ఆంక్షను తొలగించి బడేబాబాను శిరిడీ గ్రామం లోపలికి రప్పించారు. బాబాపట్ల ప్రేమతో బడేబాబా విషయంలో గ్రామస్తులు తలఒగ్గినా, అతడు మాత్రం గ్రామస్తులు తన దగ్గరకు చేతులు కట్టుకుని వచ్చి తిరిగి గ్రామంలోకి ఆహ్వానించారని తలచాడు. ఆ కారణంగా అతనిలో గర్వం మరింత పెరిగింది. అయినా బాబా అవేమీ పట్టించుకోకుండా అతన్ని గౌరవంగా చూస్తుండేవారు. దాంతో అతడు ఆధిపత్యధోరణితో తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ప్రారంభించాడు. చివరికి బాబా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటుండేవాడు. దానితో భక్తులలో అసహనం రేగింది. కనీసం బాబాతో మాట్లాడేటప్పుడైనా అతడు చక్కటి పదజాలం ఉపయోగిస్తూ మర్యాదగా మాట్లాడితే బాగుంటుందని వాళ్ళు భావించారు. కానీ, అహంకారంతో అతని పదజాలం హద్దులు దాటింది.
అతని ఆ అప్రవర్తనకు సంబంధించిన కొన్ని సంఘటనలను పరీశీలిద్దాం.
ప్రతిరోజూ బడేబాబా తన భోజనం పూర్తైన తరువాత వెళ్లిపోవడానికి సిద్ధమయ్యేవాడు. అప్పుడు బాబా కొంతదూరం వరకు అతనితో నడిచి వెళ్లి మరీ సాగనంపేవారు. అయితే అతనిలో గర్వం పెరిగిన తరువాత, "అచ్ఛా! నేను వెళ్తున్నాను. మీరు రాబోతున్నారా, లేదా?'" అని గట్టిగా గదమాయిస్తున్నట్లు అనేవాడు. బాబా మాత్రం అతని మాటలను తప్పుపట్టకుండా నిశ్శబ్దంగా లేచి అతనిని చూసేవారు.
మొదట్లో భక్తులు ఆరతికి సన్నాహాలు మొదలుపెట్టగానే బడేబాబా లేచి క్రింద సభామండపంలోకి వెళ్ళిపోయేవాడు. ఆరతిలో అతడు పాల్గొనేవాడు కాదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ నచ్చజెప్పడంతో అతడు సభామండపానికి వెళ్ళేవాడు కాదుగాని, ఆరతిలో మాత్రం పాల్గొనేవాడు కాదు. చాలామంది హిందూ భక్తులకు అతని పద్ధతి నచ్చేది కాదు. కానీ కాకాసాహెబ్ వాళ్లతో, 'సాయిబాబా అతనిని తమవానిగా అంగీకరించారు. అంటే అతను మనలో ఒకడు. అలాంటప్పుడు అతనిపట్ల వివక్షత ఎందుకు తలెత్తుతుంది? కాబట్టి అతని ప్రవర్తనను చూసీచూడనట్లు వదిలివేయమ"ని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేసాడు. కానీ బడేబాబాలో పెరిగిన అహం కారణంగా భక్తులు అతనిపట్ల విసుగుచెంది, అతన్ని ద్వేషించసాగారు. అందువల్ల వాళ్ళు బడేబాబా బసచేయడానికి తమ గదులను ఇచ్చేవారు కాదు. పరిస్థితి ఇలా ఉండటంతో అతనికి రక్షణనివ్వడానికి కాకాసాహెబ్ దీక్షిత్ తన వాడాలోని ఒక గదిలో ఉండటానికి అతన్ని అనుమతించారు. కాకాసాహెబ్, "బాబా తనవారిగా అంగీకరించిన ప్రతి ఒక్కరినీ మనలో ఒకరిగా చూడాలి" అని చెప్పేవాడు.
సత్పురుషులతో సమయాన్ని గడపగలిగేవారు మాత్రమే అదృష్టవంతులు. కానీ, వారు తమ అహాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. బడేబాబా ఆ ప్రయత్నం అస్సలు చేయలేదు. బాబా తమ ప్రియమైన వానిలో ఒకనిగా అతనిని చూశారు. అతిథులకు, స్నేహితులకి ఇచ్చే గౌరవం అతనికి ఇచ్చారు. తమ ప్రక్కన స్థానాన్ని అతనికోసం ఎల్లప్పుడూ బాబా ఉంచారు. రోజూ అధికమొత్తం అతనికి దానంగా ఇచ్చారు. డబ్బులు ఇచ్చేటప్పుడు బాబా ఎప్పుడూ, ''ఈ డబ్బు అల్లాహ్ కి చెందినది. తిను, వృధాచేయవద్దు" అని హెచ్చరించేవారు. సాయిబాబా ఇచ్చిన డబ్బులు స్వప్రయోజనాలకోసం ఉపయోగించకూడదు. ఇతరుల మేలుకోసం దానిని ఉపయోగించినవారు శ్రేయస్సును పొందారు.
బాబా ఇచ్చిన ధనాన్ని తన కుటుంబం కోసం ఉపయోగించిన బడేబాబాకు బాబా సమాధి చెందిన రెండు నెలల తరువాత పూర్తిగా ధనం లేకుండా పోయింది. దానితో అతను గ్రామగ్రామాలు తిరుగుతూ యాచించుకోవాల్సి వచ్చింది. అతడు 1926, జనవరి నెలలో నాగపూరులో మరణించాడు. ఆత్మోన్నతికోసం అతనికి అనేక అవకాశాలు బాబా ఇచ్చారు. కానీ, అతడు తన అహం కారణంగా అన్ని అవకాశాలను వృధా చేసుకున్నాడు.
బాబా బడేబాబాను తమ బోధనకు ఒక మాధ్యమంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. దానిద్వారా భక్తులు పాఠం నేర్చుకోవచ్చు. ఈ విషయమే అప్పట్లో శ్రీసాయిలీల పత్రికకు సంపాదకుడుగా ఉన్న శ్రీకాకాసాహెబ్ మహాజని తన వ్యాసంలో - "మహారాజ్ బోధనలకు కొన్ని ప్రత్యేక మార్గాలున్నాయి. అటువంటివే ఫకీరు బాబా(బడేబాబా) శిరిడీ నివాసం, అతనితో బాబా ప్రవర్తన. ఈ ఉదాహరణ ద్వారా చాలా పాఠాలు నేర్చుకోవచ్చు'' అని వ్రాశారు.
Source: Shri Sai Satcharitra Chapter 23
Shri Sai Leela Magazine September-October 2008 and November-December 2008
om sai ram.om sai ram om sai ram
ReplyDeleteOm Sairam ��
ReplyDeleteOm Samardha Sadguru Sree Sai Nadhaya Namaha ❤🙏😊🕉
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDeleteOmsairam
ReplyDeleteOM Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sai ram, na manasuki nachakunda yedi jaragakunda chudandi tandri pls, amma nannalani kshamam ga chudandi vaalla badyata meede tandri, ofce lo anta bagunde la chesi na manasulo anukunna korika neravere la chayandi tandri pls.
ReplyDelete