ఈ భాగంలో అనుభవాలు:
1. శరణన్న వారిని తప్పక కాపాడే బాబా
2. ఇష్టమైన ఆహారం వదిలేయడంతో లభించిన బాబా కరుణ
3. శాంతించేలా చేసిన బాబా
శరణన్న వారిని తప్పక కాపాడే బాబా
సాయి బంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నా జీవితంలో నా తండ్రి సాయినాథుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉందంటే ఆ తండ్రి పెట్టిన భిక్షే. ఇక నా భార్య విషయంలో బాబా చేసిన సహాయాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. నా భార్య పద్మావతి బొప్పుడి గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో టీచర్(SGT)గా పనిచేస్తుంది. ప్రభుత్వం వారు ఆ స్కూలులో ఎక్కువమంది పనిచేస్తున్నారని, నా భార్యది అదనపు పోస్టుగా పరిగణించి ఆమెను వేరే స్కూలుకు పంపుతామన్నారు. అదీకాక మండల స్థాయిలో ఖాళీలు లేనందున డివిజన్ స్థాయిలో మారుస్తామని చెప్పారు. డివిజన్ స్థాయిలో ఖాళీలు అన్ని 80 కిలోమీటర్ల పై దూరంలో అనగా వినుకొండ, శావల్యపురం, నూజెండ్ల వంటి దూరమండలలలో ఉన్నాయి. ఒకవేళ ఆ మండలాలకు నా భార్యను మారిస్తే గుంటూరులో నివాసముండే మేము చాలా ఇబ్బందిపడవలసి వస్తుంది. అసలే తన ఆరోగ్యం సరిగా ఉండదు. అందువల్ల నేను, నా భార్య చాలా టెన్షన్ పడి నా తండ్రి బాబాను, "ఈ ఇబ్బంది నుండి కాపాడమ"ని వేడుకున్నాము. బాబా "నేను ఉన్నాను. మీకు ఏ ఇబ్బందీ కలగనీయను" అని సూచనలు ఇస్తూ వచ్చారు. బాబా దయవల్ల నా భార్య కన్నా ముందున్న వారితో ఖాళీలన్నీ భర్తీ అయిపోవడంతో తనని ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లోనే ఉంచారు. గత సంవత్సరం కూడా ఇలానే ఇబ్బంది అయితే, బాబా దయతో ఏ ఆటంకం లేకుండా కాపాడారు. బాబాను శరణువేడితే తప్పక కాపాడుతారు. "ధన్యవాదాలు బాబా. మా పిల్లలు చదువులో బాగా రాణించి మంచిగా జీవితంలో స్థిరపడాలని, వారికి మంచి బుద్ధినిచ్చి పలువురికి సహాయం చేసే బుద్ధిని ఇవ్వమని, అలాగే మా కుటుంబంపై నీ చల్లని చూపు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నీ పాదాల చెంత శరణు వేడుతున్నాము బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
ఇష్టమైన ఆహారం వదిలేయడంతో లభించిన బాబా కరుణ
సాయి భక్తులందరికీ నమస్కారాలు. నా పేరు రమాదేవి. నేను 10 ఏళ్ల వయసు నుంచి సాయి భక్తురాలిని. నేను నాకేం కావాలన్నా సాయినే అడుగుతాను. ఆయన ఎంతో ప్రేమగా అనుగ్రహిస్తారు. నేను ప్రభుత్వోద్యోగం కోసం చాలా ప్రయత్నించాను కానీ, నాకు ఆ ఉద్యోగం రాలేదు. అప్పుడు నేను సచ్చరిత్ర చదివిన తర్వాత నాకు ఉద్యోగం రావాలని ఒక సంవత్సరం నాకు ఇష్టమైన చికెన్ తిననని ప్రమాణం చేసాను. బాబా దయవల్ల సంవత్సరం పూర్తయ్యేలోపే నాకు ఉద్యోగం వచ్చింది. అయినా నేను ముందుగా అనుకున్నట్లు ఒక సంవత్సరం చికెన్ తినలేదు. ఇకపోతే, నాకు వచ్చిన ఉద్యోగం వల్ల నేను, నా భర్త వేర్వేరు ప్రదేశాల్లో ఉండాల్సి వచ్చింది. అలా 5 ఏళ్ళు గడిచాక 2023, ఆగస్టులో నా భర్త నేను ఉన్న చోటుకి రావాలని మళ్ళీ ఒక సంవత్సరం చికెన్ తినని అనుకున్నాను. 2024, ఫిబ్రవరిలో నా భర్తకి నేనున్న చోటుకి దగ్గర్లో ఉన్న ప్రదేశానికి బదిలీ అయింది. కానీ ఆడిట్ కారణంగా నా భర్త అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే సరిగ్గా నేను అనుకున్నట్లు సంవత్సరం పూర్తయ్యేసరికి 2024, ఆగస్టు నెలలో నా భర్త నేను ఉన్న చోటుకి వచ్చారు. ఇదంతా ఆ సాయినాథుని దయ. మనకి ఏదైనా మంచి జరగాలంటే ఇష్టమైన ఆహారం వదిలేస్తే జరుగుతుందని నా నమ్మకం. అయితే ఆహారం వదిలేయడమే కాకుండా సాయి సచ్చరిత్ర రోజూ చదవాలి. నేను అలానే చేసాను. ఆ బాబా కరుణించారు. "థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".
శాంతించేలా చేసిన బాబా
సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నివాసిని. బాబా నా జీవితంలోకి వచ్చాక చాలా అద్భుతాలు చూపించారు. మేము 6 సంవత్సరాలుగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాము. మా ఓనర్ చాలా కోపిష్టి, చాలా గర్విష్టి. అందుకని అపార్ట్మెంట్‌లో ఉన్న మేము చాలా జాగ్రత్తగా ఉంటుంటాము. కానీ ఈమధ్య 2024, ఆగస్టు నెలాఖరులో మేము పొరపాటున మెట్లపై డస్ట్ బిన్ పెట్టాము. ఆరోజు మా ఓనర్ మా ఫ్లోర్‌కి వచ్చి మెట్లపై ఉన్న డస్ట్ బిన్ చూసి, 'దీన్ని ఇక్కడెందుకు పెట్టార'ని పెద్ద గొడవ చేసి, "సెప్టెంబర్ 1కి ఇల్లు ఖాళీ చేయమ"ని గట్టిగా చెప్పి వెళ్ళాడు. కేవలం పది రోజుల్లో వేరే ఇల్లు దొరకడం చాలా కష్టమని మాకు ఒకటే టెన్షన్ పట్టుకుంది. అందుకని నేను రోజూ రాత్రి, "అతనిని శాంతపరచమ"ని బాబాకి మొక్కుకుంటూ ఉండేదాన్ని. అతను మళ్ళీ వచ్చి, "ఖాళీ చేయమన్నాను కదా!" అని అన్నాడుగాని మళ్ళీ అంతలోనే బాబా దయవల్ల, "ఖాళీ చేయమంటే 1000 రూపాయలు అద్దె పెంచి ఉండండి" అని అన్నాడు. మేము, "సరే, 1000 రూపాయలు ఇస్తామ"ని చెప్పాము. దాంతో.అతను వెళ్ళిపోయాడు. అతను అలా శాంతించడం నిజంగా బాబా అద్భుతం. "థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా".
Om Sairam!! Baba meere nannu na kutumbanni kapadali thandri!!
ReplyDeleteOm Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family members forever 🙏🙏💐💐
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
Om Sri Sai nathaya namaha
ReplyDeleteOm Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Baba nanu memalini antagano namutanu Naku a kastam vachina sukam vachina bada vachina bayam vadina mimalina taluchukunta miru vunaru ani namakam daryanan .kani miru na job gurunchi anduku nanu Asrada chastunaru baba plss Sai e mi biddani kapadu Sai nada. Om Sai Ram 🙏
ReplyDeleteOm Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏👌
ReplyDelete