ఈ భాగంలో అనుభవాలు:
1. ప్రణాళిక ప్రకారం మంచి ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
2. పిలిచినంతనే పలికే బాబా ఉండగా భయమెందుకు?
ప్రణాళిక ప్రకారం మంచి ఉద్యోగాన్ని ప్రసాదించిన బాబా
నేను సాయిబాబా మరియు వెంకటేశ్వరస్వాముల భక్తుడిని. నేను 2 సంవత్సరాలకు పైగా మహాపారాయణ గ్రూపులో సభ్యుడిని. బాబా అనేక విధాల నాకు సహాయం చేశారని, చాలా కష్టాల నుండి నన్ను రక్షించారని నేను గట్టిగా నమ్ముతాను. నేను USలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసాను. 2024, మేలో గ్రాడ్యుయేట్‌నయ్యాను. ఆ సమయంలో US జాబ్ మార్కెట్ చాలా చెడ్డ స్థితిలో ఉంది. ఒక సంవత్సరకాలంగా చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు. అటువంటి స్థితిలో నేను ఉద్యోగం సంపాదించాను. అది నిజంగా సాయి చేసిన అద్భుతం. US జాబ్ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా 2024, జూన్‌లో నేను కన్సల్టెన్సీలో చేరాలనుకున్నాను(USలోని కన్సల్టెన్సీలు తరచుగా నకిలీ అనుభవాన్ని సృష్టించి ఉద్యోగాలు సంపాదించడంలో సహాయం చేస్తాయి. అందుకుగానూ సదరు కన్సల్టెన్సీ మాకొచ్చే జీతం నుండి 20 నుండి 30 శాతం వసూలు చేస్తాయి). ఒక కన్సల్టేన్సీ నన్ను తీసుకుంటానని హామీ ఇచ్చింది. కానీ నా జాయినింగ్ తేదీని వాయిదా వేస్తూ పోయింది. ఆలోగా నేను నా స్వంత ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలకు దరఖాస్తు పెడుతుండేవాడిని. అలా 45 రోజులు గడిచాయి. అయినప్పటికీ సదరు కన్సల్టెన్సీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో నేను ఇంకో కన్సల్టెన్సీ కోసం వెతికి అందులో చేరాలనుకున్నాను. అయితే అందులో చేరడానికి ముందే నాకు ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. బాబా దయవల్ల నేను 2 రౌండ్ల ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసాను. కానీ చివరి క్లయింట్ రౌండ్ ఇంటర్వ్యూ కొరకు నాకు కాల్ రాలేదు. వాళ్ళు ఆ రౌండ్ వాయిదా వేస్తూ పోయారు. నేను బాధతో నిరుత్సాహానికి గురయ్యాను. అయినప్పటికీ బాబాయందు విశ్వాసముంచి ఆయన నాకు ఒక మార్గం చూపిస్తారని నమ్మాను.
ఒక వారంలో మరొక కంపెనీ అదే క్లయింట్, అదే స్థాయి ఉద్యోగం కోసం నన్ను సంప్రదించింది. నేను అక్కడ కూడా మొదటి రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తి చేసాను. అద్భుతాలలో కెల్లా అద్భుతం ఏమిటంటే, నేను మొదటి రౌండ్ ఇంటర్వ్యూకోసం ఏ వెబ్‌సైట్‌లోని ప్రశ్నలైతే చదివానో ఇంటర్వ్యూ చేసినవారు అదే సైట్‌లోని ప్రశ్నలే నన్ను అడిగారు. ఆ కంపెనీ క్లయింట్ రౌండ్‌ను ఏర్పాటు చేయగలిగింది. నేను ఆ రౌండ్‌ని కూడా విజయవంతంగా పూర్తి చేసాను. ఆ కంపెనీ మొదటి కంపెనీ కంటే 24% ఎక్కువ జీతం నాకు ఆఫర్ చేసింది. బాబా, వెంకటేశ్వరస్వాముల ఆశీస్సులతో నాకు ఉద్యోగం వచ్చింది. కన్సల్టెన్సీలో చేరడం వాయిదా పడేలా చేసి, స్వయంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా చేసింది బాబాయే. ఆయన నాకు ఏదైనా మంచి చేయాలనుకున్నందున మొదటి కంపెనీ క్లయింట్ రౌండ్‌ను ఏర్పాటు చేయలేకపోయింది. అదికాక నేను మే నెలలోనే కన్సల్టెన్సీలో చేరి ఉంటే నాకై నేను ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోయేవాడిని, ఈ ఉద్యోగ అవకాశాలను కోల్పోయేవాడిని.
నేను ఆ ఉద్యోగంలో చేరడానికి వేరే రాష్ట్రానికి వెళ్లాను. అక్కడ నేను ఉండటానికి ఒక వ్యక్తితో మాట్లాడి వసతి ఏర్పాట్లు చేసుకున్నాను. అయితే, నేను అక్కడికి వెళ్ళడానికి కేవలం 2 గంటల ముందు వ్యక్తిగత కారణాల వల్ల ఆ వ్యక్తి నా వసతిని రద్దు చేశాడు. దాంతో నాకు ఉండడానికి చోటు లేకుండా పోయింది. నా దగ్గర డబ్బు కూడా తక్కువగా ఉంది. అయితే బాబా నా పక్షాన్ని వదలలేదు. 2 గంటలలోపు మునుపటి దానికంటే మెరుగైన ఇల్లు నా వసతికోసం దొరికింది. 2 గంటలలోపు వసతి లభించడం, అదికూడా USలోని వేరే రాష్ట్రంలో. ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు.
ఈ అనుభవం దేవునిపై విశ్వాసం ఉంచాలని, మంచి-చెడు కాలాల్లో ఆయనను ప్రార్థించాలని, ఆయనను ఎన్నటికీ మరువకూడదని, పరిస్థితులు మనకి అనుకూలంగా జరగనప్పటికీ, ఆయన మనకోసం మెరుగైన ప్రణాళికలు కలిగి ఉన్నారని అర్థం చేసుకోవాలని నేను తెలుసుకున్నాను. నేను సచ్చరిత్ర చదవమని సిఫార్సు చేస్తున్నాను; అది నాకు బాబా గురించి, ఆయన బోధనల గురించి చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది.
పిలిచినంతనే పలికే బాబా ఉండగా భయమెందుకు?
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన సాయినాథ్ మహరాజ్ కి శతకోటి వందనాలు. సాయి బంధువులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. 2024, సెప్టెంబర్ 7, వినాయకచవితి రోజు సాయంత్రం నేను 5 సంవత్సరాల మా బాబుకి స్నానం చేశాను. ఒక గంట తర్వాత బాబు రెండు చెంపల మీద దద్దుర్లులా వచ్చాయి. పైగా అవి దురద పెడుతూండటం వల్ల బాబు వేళ్లతో గీరుకోసాగాడు. హాస్పిటల్‌కి వెళదామంటే పండగ రోజు. పైగా రాత్రి. నాకు భయమేసి, "బాబా! ఉదయానికల్లా ఆ దద్దుర్లు తగ్గిపోయేలా చూడు స్వామి" అని బాబాను ప్రార్థించాను. పిలిచినంతనే పలికే బాబా ఉండగా మనకి భయమెందుకు? బాబా దయవల్ల ఉదయానికి ఆ దద్దుర్లు తగ్గిపోయాయి. "ధన్యవాదాలు బాబా".
Om Sai Ram please 🙏🙏 bless my family.Be with us.you gave happy moments to me.With your blessings tuff things came easy.That is your power.If we trust him he takes care of us.Thank u baba
ReplyDeleteOm Sai Ram you can do any thing impossible 🙏🙏 things with your blessings turned 🙏🙏 into possible.your power is very great.If we trust him he takes care of us
ReplyDeleteOn sai ram, ofce lo na team ki oka dedicated resource manchiga work chese vaallani evvandi baba pls, ye tension lekunda chudandi baba pls, na health vishayam intlo vaallaki cheppe dairyanni evvandi vaallu badha padakunda ardam chesukune la chayandi tandri pls. Anta manchiga unde la chayandi tandri.
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku satha koti vandanalu vadini bless cheyandi house construction complete cheyandi pl manchivarini rent ki pampandi
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandri pl meku
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
ఓం శ్రీ సాయి రామ్
ReplyDeleteOm Sai Ram
ReplyDeleteOm sri sainathaya namaha. Naa jeevitham antha baba pettina bikesharing. Ayana leelalu ennani cheppagalanu.
ReplyDeleteIkkada oka leela my vrastunnanu.
Oka roju anukokunda maa paapa YouTube channel delete chesesanu. Tarvata malli recover chesanu gaani papa videos raaledu.
Adi papa ki teliste chala upset avutundi ani nenu chala tension padani. Oka 2 days wait chesanu complete ga videos anni vastayi ani. Kaani raaledu nenu chala tension ayyi baba ki pray chesanu.
Papa channel malli back ki ravali. Ala jarigithe baba leela nu ee blog lo share chesukuni baba gudi Hindi lo kontha money vestanu ani .
Apudu ascharyam ga Guruvaram morning ki channel antha back ki vachindi . Tana videos anni kanipinchayi.
Baba prati chinna vishayam lo nu help chestaru. Tanani nammina vaaru tho last varaku undi nadipistaru.
Om sai ram .
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai 🙏🙏🙏🙏
ReplyDeleteBaba, provide peace and wellness to my parents 💐💐💐💐
ReplyDeleteOm Sai Sri Sai Jaya Jaya Sai. Sarve Jana Sukhino Bhavanthu 🙏🙏
ReplyDeleteI am totally surrendering myself at your lotus feet. I am experiencing your omnipresence. Continue your blessings on our family forever 🙏🙏💐💐
ReplyDeleteOm Sai Ram, Baba nenu telisi teliyaka chesina tappulanu manninchi naa rakshinchu tandri, nenu chesina tappuku nenu anubhavistunna ee badalanu tattukolekapotunnanu tandri, dayachesi nannu kshaminchandi tandri. nannu manchinchi naa appulanu teerchukone margam choopinchandi tandri. naa valana naa kutumbam badalu padutundi tandri. meere naaku ippudu dikku tandri. om sai ram om sai ram om sai ram
ReplyDeleteOm Sri Sai nathaya namaha
ReplyDeleteOm Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai nathaya namaha
Om Sri Sai Raksha 🙏🙏🙏
ReplyDeleteSri Sachchidananda sadguru Sai nath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏
ReplyDelete